Editorial

Thursday, November 21, 2024
సినిమాతెలుగువారని చులకనా? మంత్రిత్వ శాఖ వెబ్ సైట్ లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీతల ఫోటోలు...

తెలుగువారని చులకనా? మంత్రిత్వ శాఖ వెబ్ సైట్ లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీతల ఫోటోలు వేరు!

సినీ రంగంలో అత్యుత్తమ పురస్కారమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు ఎంపికైన ఆ ఇద్దరు మహనీయుల ఫోటోలు ఎందుకు వాళ్ళవి పెట్టలేదు. ఇది తెలుగు వారిపట్ల చులకన భావం అనుకోవాలా లేక పొరబాటని సర్డుకోవాలా? కేంద్ర సమాచార, పౌర సంబంధాల మంత్రిత్వ శాఖ వారు ఈ తప్పిదాన్ని సరిద్దిదేదాకాషేర్ చేయండి.

కందుకూరి రమేష్ బాబు 

కేంద్ర సమాచార, పౌర సంబంధాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నడిచే వెబ్ సైట్ లో డైరెక్టరేట్ ఆఫ్ ఫిలిమ్స్ డివిజన్ విభాగంలో దాదాసాహెబ్ ఫాల్కే పురస్కార గ్రహీతల గురించి అధికారికంగా పెట్టిన వివరాలు చూశారా ఎప్పుడైనా? లేకపోతే ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడు చూడండి. తెలుగువారంటే వారికి ఎంత చులకనో తెలుస్తుంది.

సినీ రంగంలో అత్యుత్తమ పురస్కారమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు ఇప్పటిదాకా ఎంపికైన తెలుగు వాళ్ళలో కె.విశ్వనాథ్ గారు (2016), రామానాయుడు గారు (2009), శ్యాం బెనగల్ గారు (2005) గారు, అక్కినేని నాగేశ్వర రావు (1990) గార్లతో సహా బి. నాగిరెడ్డి గారు, బి. ఎన్ రెడ్డి గార్లు మరి ఇద్దరు.

ప్రసిద్ద నిర్మాత ఐన శ్రీ బి నాగిరెడ్డి గారు ఉన్నతమైన ప్రమాణాలతో పండితపామర జనరంజకంగా సినిమాలు తీసిన విజయా సంస్థ వ్యవస్థాపకుల్లో ఒకరు. ఆ సంస్థ తెలుగు సినిమా చరిత్రలో ఒక సువర్ణాధ్యాయాన్ని సృష్టించిన సంగతి తెలిసిందే. షావుకారు, గుండమ్మ కథ, పాతాళభైరవి వంటివి ప్రజల మనస్సులో ఎన్నటికీ చెరిగిపోని చలన చిత్రాలు. వారు 1986లో ఈ పురస్కారాన్ని అందుకోగా సినీ దర్శక నిర్మాత, మల్లీశ్వరి వంటి చిత్ర రాజాన్ని నిర్మించిన బిఎన్ రెడ్డి గారికి 1974లో ఈ  పురస్కారం వచ్చింది. వీరు ఈ అవార్డు పొందిన తొలి దక్షిణ భారతీయుడు. ఐతే, ప్రభుత్వ సమాచార మంత్రిత్వ శాఖా వెబ్సైట్లో ఎందుకోగానీ వీరిద్దరి ఫోటోలు వాళ్ళవి కావు. కావాలంటే ఈ లింక్ క్లిక్ చేసి వెబ్సైట్ చూడండి.

చిత్రమేమిటంటే ఆ ఇద్దరి ఫోటోలు ఒక్కరివే పెట్టారు. ఆ ఒక్కరు కూడా రావి కొండలరావు గారని  తెలుగు సినీ రచయిత, నటులు, దర్శకులు, పాత్రికేయులు కూడా. వారు రెండేళ్ళ కింద మృతి చెందారు.

నిజానికి ఆ మహనీయులు ఇద్దరూ అగ్రగణ్యులు. వారి ఫోటోలు అందరికీ అందుబాటులో ఉన్నాయి కూడా.

ఇది తెలుగు వారిపట్ల చులకన భావం అనుకోవాలా లేక పొరబాటు అనుకోవాలా అన్నది వేరే విషయం. కానీ ఇంత పొరబాటును ఎట్లా చేశారో అర్థం కాదు.

ఈ సంగతి తెలుపడం ధర్మం కనుక తెలుపు ఆ సంగతి వెల్లడిస్తోంది. వారికి తెలిసేదాకా, పొరబాటు సరిద్దిద్దే దాకా షేర్ చేయండి.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article