Editorial

Wednesday, January 22, 2025
Photo Featureక్యాతం సంతోష్ కుమార్ - అతడి చిత్రలేఖనం ఒక అభయారణ్యం

క్యాతం సంతోష్ కుమార్ – అతడి చిత్రలేఖనం ఒక అభయారణ్యం

Santosh Kumar

తెలంగాణ పునరుజ్జీవనంలో అందివచ్చిన వన్యప్రాణి ప్రేమికుడతను. తన కెమెరా కంటితో తీసిన అపురూప ఛాయాచిత్రాలతో తానే కృష్ణ జింకల అభయారణ్యం ప్రతిపాదనకు ఆద్యుడిగా మారాడు. అందుకే అనడం, అతడి చిత్రలేఖనమే ఒక అభయారణ్యం అని!

కందుకూరి రమేష్ బాబు

ఒక్క కృష్ణ జింక కూడా లేదనుకునే స్థితిలో అతడు నాలుగు వేల జింకలను చూశాడు. చూసి ఊరుకోకుండా దేశానికి పెద్ద ఎత్తున ప్రకటించాడు. తన ఛాయాచిత్రలతో అతడు అటవీ అధికారులకు సరికొత్త స్ఫూర్తి నిచ్చాడు. దేశంలోనే అతి పెద్ద కృష్ణ జింకల అభయారణ్యం ఏర్పాటుకు బీజం వేశాడు. ఇదంతా చేసింది ఒక ఫోటోగ్రాఫర్. వృత్తి రీత్యా నిజామాబాద్ లో ఒక పాఠశాల నిర్వహిస్తున్న క్యాతం సంతోష్ కుమార్. అతడి బొమ్మల కథనం తెలుపుకి ప్రత్యేకం.

black bucksచిత్రమేమిటంటే, ఇదంతా ఆయన అనుకుని చేసింది కాదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం వచ్చిన మార్పులలో తాను అలవోకగా ఇమిడి పోవడం వల్ల జరిగింది. ఇదొక అధ్బుతం. స్వరాష్ట్రంలో కాళేశ్వరం తెచ్చిన జలకళతో కూడినది. గోదావరీ బ్యాక్ వాటర్స్ ఉప్పొంగడం వలన జరిగిన సుసాధ్యం ఇది. అతడిని అభినందించడం అంటే తెలంగాణ రాష్ట్ర సాధనలో త్యాగాలు చేసిన అందరినీ కొనియాడటమే.

buckనీళ్ళు. నిజంగానే జీవజాలానికి నీరే ప్రాణం. అది నిదానంగా తాను నివసించే నిజామాబాద్ తీరాన సరికొత్త వన్య విప్లవానికి నాంది పలకడం ఎంత ఆహ్లాదకరమో ఈ ఫొటోలే చెబుతాయి.

సంతోష్ కుమార్ ఒక ఉత్సాహవంతమైన వ్యక్తి. నవ్యభారతి గ్లోబల్ స్కూల్ చైర్మన్. విద్యార్థుల తోటిదే తన జీవితం. ప్రవృత్తి సరదాగా ఫోటోలు తీసుకోవడం. కానీ, అది గతం. ఇప్పుడు అయన ప్రొఫెషనల్ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్. అందుకు కారణం నీళ్ళు. నిజంగానే జీవజాలానికి నీరే ప్రాణం. అది నిదానంగా తాను నివసించే నిజామాబాద్ తీరాన సరికొత్త వన్య విప్లవానికి నాంది పలకడం ఎంత ఆహ్లాదకరమో ఈ ఫొటోలే చెబుతాయి.

santosh

ఆ వింతకు నోరెల్లబెట్టకుండా కన్ను తెరిచి ఉంచి, ఆ మార్పును నలుగురికీ తెలిపేందుకు సాక్షీ భూతంగా నిలబడటం ఒక్కటే తాను చేశాడు. అదే తన ప్రత్యేకత.

నీటి వనరులు పెరగడం వల్ల ఫ్లెమింగో వలస పక్షులు మొదలు అంతదాకా అగుపించని కృష్ణ జింకల దాకా తిరిగి పెద్ద ఎత్తున చేరుకోవడం, వాటి జనాభా రోజురోజుకూ పెరిగి పోవడం తన కళ్ళముందే జరిగిన మార్పు. వింత. ఆ వింతకు నోరెల్లబెట్టకుండా కన్ను తెరిచి ఉంచి, ఆ మార్పును నలుగురికీ తెలిపేందుకు సాక్షీ భూతంగా నిలబడటం ఒక్కటే తాను చేశాడు. అదే తన ప్రత్యేకత. ఐతే, ఇందుకోసం తాను అంతకు ముందు కన్నా శ్రద్దగా కెమెరా పట్టుకోవలసి వచ్చింది. అది నిజంగా తెలంగాణకే వరంగా మారింది. ఆ విషయాన్ని పంచుకుంటూ “ముందు నాకు ఛాయాచిత్రకళలో స్ఫూర్తి నిచ్చిన దివంగత బండి రాజన్ బాబు గారికి ఈ సందర్భంగా వందనాలు తెలుపుకోవాలి. మమూలు చిత్రాలు తీయడం కాకుండా శ్రద్దగా పని చేయాల్సిన ఆవశ్యకత వారి చిత్రాలే తెలిపాయి” అన్నారాయన తెలుపుతో.

bucks

ఒకటి కాదు, ఎన్నో పక్షులు, మరెన్నో వన్య జీవులు. తొలిసారిగా వాటి ఊసు సామాన్య ప్రజలకే కాదు, అప్పటిదాకా అలక్ష్యంగా ఉన్న అధికారులకూ తెలిసేలా చేసింది. అది మరో గొప్ప అడుగుకు బీజం వేసింది.

black bukcs

నిజమే. రోజు రోజుకూ అపూర్వంగా కానవస్తున్న వన్య ప్రాణులు, రకరకాల పక్షులు, నెమళ్ళు అతడ్ని సాంకేతికంగా మరింత మంచి ఛాయా చిత్రకారుడిగా మార్చాయి. దాంతో అవసరమైన మెలకువలు నేర్చుకోవడంతో పాటు తగిన ఎక్విప్ మెంట్ కూడా కొనుగోలు చేసుకుని మరింత ధ్యాసతో పనిచేయడం ప్రారంభించాడు. పెద్దగా సమయం పట్టలేదు. అతడి చిత్రాలు రాజ్య సభ సభ్యులు సంతోష్ కుమార్ తో సహా మంత్రి కేటీఆర్ ట్వీట్ చేసేలా చేశాయి. అదీ మొదలు నలుగురి నుంచి అతడి చిత్రాలు పదుగురి దృష్టిలో పడ్డాయి. తెలుగు, ఆంగ్ల పత్రికల్లో అనేక చిత్రాలు అపురూపంగా అచ్చయ్యాయి. అవి లక్షలాది మందికి చేరాయి. ఒకటి కాదు, ఎన్నో పక్షులు, మరెన్నో వన్య జీవులు. తొలిసారిగా వాటి ఊసు సామాన్య ప్రజలకే కాదు, అప్పటిదాకా అలక్ష్యంగా ఉన్న అధికారులకూ తెలిసేలా చేసింది. అది మరో గొప్ప అడుగుకు బీజం వేసింది. ముఖ్యంగా దేశంలో ఇప్పటికే ఉన్న పది కృష్ణ జింకల అభయారణ్యాలతో పోలిస్తే విస్తీర్ణం, సంఖ్య పరంగా అతి పెద్ద అభయారణ్యం ఏర్పాటుకు సరికొత్తగా నిజామాబాద్ అటవీ ప్రాంతం కీలకమని స్వయంగా అధికారులు ప్రతిపాదనలు పంపేలా చేసింది.

bucks black

black

వాళ్ళు ముందు నమ్మలేదు. అవి ఇక్కడ లేవన్నారు. కానీ, తాను ఫోటోలు చూపించాడు. ఒక్కటి రెండు కాదు, పదులు, వందల కృష్ణ జింకలను చూపాడు. వాళ్లకు నమ్మకం కలిగించడానికి స్వయంగా నాలుగు వేల జింకలున్నాయన్న వాస్తవాన్ని వాళ్ళ కళ్ళకు కట్టాడు.

చిత్రమేమిటంటే, తాను నిర్వహించే పాటశాలలో అటవీ అధికారి పిల్లలు చదివేవారు. పిల్లల యోగక్షేమాలు కనుక్కునేందుకు వారు వచ్చినప్పుడు తాను నందిపేట తీరం వద్ద కనిపిస్తున్న కృష్ణ జింకల గురించి చెప్పాడు. వాళ్ళు ముందు నమ్మలేదు. అవి ఇక్కడ లేవన్నారు. కానీ, తాను ఫోటోలు చూపించాడు. ఒక్కటి రెండు కాదు, పదులు, వందల కృష్ణ జింకలను చూపాడు. వాళ్లకు నమ్మకం కలిగించడానికి స్వయంగా నాలుగు వేల జింకలున్నాయన్న వాస్తవాన్ని వాళ్ళ కళ్ళకు కట్టాడు. దాంతో బడికి వచ్చిన ఆ అధికారులు ఈ విద్యాలయం చైర్మన్ మామూలు పని చేయలేదని గ్రహించారు. అతడి ఫోటోగ్రఫీ ఒక నూతన డిస్కవరీకి నాంది పలికిందని భావించారు. అనతికాలంలోనే వారు చొరవ తీసుకుని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. నేడు అనుమతి కోసం ఆత్రుతగా నిరీక్షిస్తున్నారు. “ఇదంతా కలలోలా జరిగింది. సునాయాసంగానూ జరిగింది. గుజరాత్ లోని వెల్వడార్, ఆంధ్రప్రదేశ్ లోని రోళ్ళపాడు కంటే అతి పెద్ద అభాయరణ్యం ఏర్పాటు కాబోతోంది. నా నమ్మకం నిజం కాబోతోంది” సంతోస్శంగా అన్నారు సంతోష్ కుమార్.

buck

beauty

santoshబహుశా ఆ కుతూహలమే అతడిని అంతరించి పోతున్న జీవ వైవిధ్యాన్ని పసిగట్టేలా చేసి చక్కటి ఫోటోగ్రాఫర్ ని చేసినట్టుంది.

అన్నట్టు, సంతోష్ కుమార్ విద్య సంస్థ ప్రారంభించేందుకు ముందు దాదాపు పదేళ్ళు వివిధ సాఫ్ట్ వేర్ కంపెనీల్లో పనిచేశారు. నిజానికి అయన చదివింది ఎంటెక్. రిమోట్ సెన్సింగ్, GIS అప్లికేషన్స్ లో చెప్పుకోదగిన పరిశోధనలు చేశారు. వాహనాలను ట్రాక్ చేసే వ్యవస్థను తొలిసారిగా రూపొందించిన ఘనత కూడా అయన సొంతం. బహుశా ఈ కుతూహలమే అతడిని అంతరించి పోతున్న జీవ వైవిధ్యాన్ని పసిగట్టేలా చేసి చక్కటి ఫోటోగ్రాఫర్ ని చేసినట్టుంది.

మరి చూడండి. సంతోష కుమార్ తీసిన ఫోటోలు చూడటం ఒక గొప్ప సంతోషం. ఆనందం. ఒక టూరిజం. వీలుంటే కళ్ళారా వీటిని చూడటానికి ప్లాన్ చేసుకొండి. కరోనా సమయం వెసులుబాటు ఇవ్వగానే అక్కడకు వెళ్ళిరండి. అతడిని మీ దగ్గరకు ఆహ్వానించి ప్రదర్శనలు కూడా ఏర్పాటు చేయండి. ఆనందం అంటే ఏమిటో ఆస్వాదించండి. తెలంగాణ జీవ వైవిధ్యం ఎంతటిదో అనుభూతి చెందండి. మీ పిల్లకు రాష్ట్ర ఏర్పాటు, తత్పలితంగా జరుగుతున్న మార్పులనూ విశదీకరించండి. కెమెరాతో పెద్ద మార్పు తెస్తున్న ఫోటోగ్రఫీ మాధ్యమం శక్తిని కూడా పనిలో పనిగా బోధపరచండి.

అన్నట్టు, ఈ జింకలతో పాటు అంతరించి పోతున్న దేశీ తోడేళ్ళ గురించి తాను చేసిన పని, తీసిన చిత్రాలు మరో అధ్యాయం. ముఖ్యంగా పక్షుల గురించి చేసిన కృషి మరో గ్రంధం అనే అనాలి. దాదాపు నూటా యాభై అరుదైన పక్షులను అయన గుర్తు పట్టాడు. వాటిని ఛాయా చిత్రాల్లో బంధించి ఒక ఆల్బం తాయారు చేశాడు. ఆ విషయాలను మరోసారి చూద్దాం.ప్రస్తుతం ప్రస్తుతం భయం లేకుండా నందిపేట గోదావరీ తీరమే అరణ్యంగా సయ్యాటలు ఆడుతున్న కృష్ణ జింకలను చూడండి.

సంతోష్ ఇ-మెయిల్:  santhosh_global@yahoo.com. మొబైల్ : 96666 64494

 

 

More articles

7 COMMENTS

  1. Good congratulations Santosh contribution led to great achievement all the best hope continue to do more remarkable

  2. సంతోష్ గారు తన అద్భుతమైన కలలను నిజం చేస్తున్నారు. Great.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article