ఈ రోజు గురు పౌర్ణిమ. వ్యాస పూర్ణిమ కూడా. పిల్లల అక్షరాభ్యాసానికై బాసర వెళ్ళడం కూడా ఈ నాటి ఆనవాయితి. అక్కడ వ్యాస మహర్శి తపస్సు చేసుకున్న గుహ ఉండటమే అందుకు కారణం.
కందుకూరి రమేష్ బాబు
ఈ రోజు దివ్యమైన రోజు. చాలా ప్రత్యేకతమైన రోజు. హిందువులు, బౌద్ధులు, జైనులు- ఈ మూడు మతాలకు చెందినా వారికీ విశిష్టమైన రోజు. తమ మహోపాధ్యాయులను, గురుదేవులను మనసారా తలుచుకుని జీవనయానంలో నిండు విశ్వాసంతో, మరింత వివేకంతో మునుముందుకు వెళ్ళే రోజు.
హిందువులకు సంబంధించినంత వరకు సనాతన ధర్మానికి తొలి ఆచార్యులని చెప్పుకునే వ్యాస మహర్షి జన్మదినం ఇది. అందుకే ఈ రోజు ‘గురు పౌర్ణమి’ మాత్రమే కాదు, ‘వ్యాస పౌర్ణమి’ కూడా.
అయన ఛామన ఛాయలో ఉంటారని ‘కృష్ణ ద్వైపాయణుడు’ అని కూడా పేరు. తాను విష్ణు దేవుడి ప్రతిరూపమని కూడా చెబుతారు.
ఆ పవిత్ర కర్తవ్యాన్ని ఈ రోజే పూర్తి చేసినందువల్ల కూడా ఈ రోజు తన జన్మదినమే కాక వేదాలకు పుట్టినరోజుగా భావించే యోగ దినం.
పంచమ వేదంగా ప్రశస్తి పొందిన మహాభారతాన్ని విరచించింది వ్యాస మహర్షుల వారే. అంతే కాదు, వారు వేద వ్యాసులు. అవును. వేదాలను అపౌరుశేయాలు అంటారు. అటువంటి వాటిని ఋగ్వేద, యజుర్వేద, సామ, అధర్వణ వేదాలుగా విభజించి అందుబాటులోకి తెచ్చిన గురు సంపాదకులు వారు. ఆ పవిత్ర కర్తవ్యాన్ని ఈ రోజే పూర్తి చేసినందువల్ల కూడా ఈ రోజు తన జన్మదినమే కాక వేదాలకు పుట్టినరోజుగా భావించే యోగ దినం.
మహాభారతానికి ‘పంచమ వేదం’ అని పేరు రావడానికి కారణం వీరు నాలుగు వేదాలతో పాటు ఈ పురాణాన్ని అంతే పవిత్రంగా అందించడం వల్లే అంటారు. మరో విషయం. జనసామాన్యానికి లేదా పామరులకు మహాభారతంలోని భగవద్గీత ఎంత దగ్గరో తెలిసిందే. ఐతే, ఆ మహనీయులు ‘బ్రహ్మసూత్ర’ పేరిట హిందూ తాత్వికతపై ఒక సైద్దాంతిక గ్రంథాన్ని కూడా రచించారు. ఇది పండితులలో బహుళ ప్రచారంలో ఉన్నదంటారు.
కాగా, ఈ మహర్షికి మరణం లేదని, తాను ‘చిరంజీవి’ అని చెబుతారు. అందుకే వారు ఎక్కడో ఒకచోట ఇప్పటికీ జీవించి ఉన్నరనే విశ్వాసం మెండు. వ్యాస పౌర్ణమి సందర్భంగా ఆ మహనీయుడు తలంపే ఒక ఆశీస్సు అన్న విశ్వాసం ఉన్నది.
బాసరలో వ్యాస గుహ
తెలంగాణంలోని బాసర పుణ్యక్షేత్రంలో వారు తపస్సు చేసుకున్న స్థలం ఉందని అంటారు. బాసర జ్ఞాస సరస్వతి దర్శనం చేసుకున్న భక్తులు ఆలయం పక్కనే ఉన్న ఈ వ్యాస గుహలోకి అతి కష్టంగా వెళ్లి, ఆ మహార్శి తపస్సు చేసుకున్న స్థలంలో కొన్ని క్షణాలు ప్రణమిల్లి ఒకానొక దివ్యానుభూతితో తిరిగి రావడం కద్దు.
గోదావరి ఒడ్డున
బాసర, తెలంగాణలో నిర్మల్ జిల్లాలోని పుణ్యక్షేత్రం. ఇది నిజామాబాదు పట్టణానికి 35 కి.మీ దూరంలో గోదావరి నది ఒడ్డున ఉన్నది. హైదరాబాదుకు సుమారు 200 కి.మీ. దూరం.
అక్షరాభ్యాసం
బాసర సరస్వతి అమ్మవారి క్షేత్రము. భారత దేశంలో గల రెండే రెండు సరస్వతీ దేవాలయాల్లో ఒకటి కాశ్మీరులో ఉండగా, రెండవది ఇక్కడే ఉన్నది. బాసరలో జ్ఞాన సరస్వతి అమ్మవారు మహాలక్ష్మి, మహాకాళి సమేతులై కొలువు తీరి ఉన్నారు.
పెద్దలు తమ పిల్లలకు మొదటిసారి అక్షరాలను నేర్పించే కార్యక్రమాన్ని ఒక వేడుకలాగా ఇక్కడ నిర్వహిస్తారు. అక్షర జ్ఞానాన్ని ప్రసాదించే దేవత సరస్వతి కాబట్టి తల్లిదండ్రులు గురు ప పౌర్ణమి రోజున తమ పిల్లలకు బాసరలో ఉన్న శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానంలో అక్షరాభ్యాసం చేపిస్తుంటారు.
పిల్లలు, పెద్దలు అక్షరాభ్యాసం పూర్తయాక అక్కడే ఉన్న వ్యాస గుహను సందర్శించుకుంటూ ఉంటారు.