Editorial

Saturday, January 11, 2025
ఆరోగ్యంవినాయక చవితి : 21 విధాలా ఆరోగ్యం

వినాయక చవితి : 21 విధాలా ఆరోగ్యం

వినాయక చవితి పండుగ రోజున విఘ్నేశ్వరుడిని 21 రకాల ఆకులతో పూజిస్తాము. ఆ ఏకవింశతి పత్రాలకు అనేక విధాలా ఔషద, ఆయుర్వేద ప్రయోజనాలున్నాయి.

గణపతి అంటే పృద్వి తత్వము. ఈ పృథ్విలో లభించిన ముఖ్యమైన ఔషధాలను సేకరించి మంత్రోచ్చారణతో గణపతి పూజించడంతో మానవులకు మంచి ఆరోగ్యం మానసిక ఉల్లాసం కలుగుతాయి. గణపతి పూజా కార్యక్రమంలో అతి ముఖ్యమైన ఘట్టం ఇది.

గణపతికి ఎంతో ప్రీతిపాత్రమైన 21 ద్రవ్యములు ఉత్తమమైన ఔషధ గుణాలు కలిగి ఉంటాయి. వాటిని తాకడం లేదా సేకరించడం, వాటిని యుక్తంగా వాడడం వల్ల ఎన్నో రుగ్మతలు, వ్యాధులు తగ్గడానికి అవకాశం ఉంటుంది.

ఆ ప్రయోజనాలు ఇవే…

1. మాచీ పత్రం (దవనం) : వివిధ చర్మవ్యాధులు, వాత సంబంధ రోగాలు తగ్గిస్తుంది. ఉత్తేజం కలిగిస్తుంది
2. బృహతీ పత్రం (వాకుడు.) : శ్వాస సంబంధ వ్యాధులు, దగ్గు మలబద్ధకంలను నివారిస్తుంది.
3. బిల్వపత్రం (మారేడు) : ఉదర సంబంధ వ్యాధులు అతిసారము గ్రహాని గ్రహాన్ని నివారిస్తుంది, నీటిని శుద్ధిచేస్తుంది.
4. దూర్వా పత్రం ( గరిక) : రక్తసంబంధం వ్యాధులు, రక్తం గడ్డ కట్టడానికి, రక్తవృద్ధికి, రక్తం శుద్ధి చేయడానికి ఉపకరిస్తుంది. చర్మ వ్యాధులను పోగొడుతుంది. కాలేయానికి హితము.
5. దత్తూర పత్రం ( ఉమ్మెత్త) : శ్వాస రోగాలు కీళ్ళ వ్యాధులను, చర్మ సంబంధ వ్యాధులను, వెంట్రుకలు రాలకుండా చేయడంలోనూ ఉపయోగపడుతుంది. ఉదరసంబంధ వ్యాధులకు కూడా బాగా పనిచేస్తుంది.
6. బదరీ పత్రం.( రేగు) : జీర్ణసంబంధ వ్యాధులు – వ్రణాలు రక్ష రక్తశుద్ధికి, వెంట్రుకలు వృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది.
7. అపామార్గ పత్రం (ఉత్తరేణి) : విషాహారం – జీర్ణకోశ వ్యాధులను తగ్గిస్తుంది. అధిక ఆకలిని ఉపయోగపడుతుంది.
8. తులసీ పత్రం ( తులసి) విచారము జీర్ణకోశ వ్యాధులు, ఊబకాయము తగ్గించదానికి ఉపయోగపడుతుంది. అధిక ఆకలిని తగ్గిస్తుంది.
9. చూత పత్రం ( మామిడి) : మధుమేహ వ్యాధిని తగ్గిస్తుంది, విరిగిన కీళ్లకు ఉపయోగం పడుతుంది వాతావరణంలో ఉన్న విష ప్రభావాన్ని తగ్గిస్తుంది.
10. కరవీర పత్రం (గన్నేరు) : చర్మ వ్యాధులను నివారిస్తుంది. కుష్టు వ్యాధి లక్షణాలు, వ్రణాలను తగ్గిస్తుంది. వెంట్రుకలు రాలకుండా కాపాడుతుంది.
11. విష్ణుక్రాంత పత్రం : వాత సంబంధ వ్యాధులకు ఉపయోగం. మూర్ఛ వ్యాధిని తగ్గిస్తుంది. జ్ఞాపక శక్తికి ఉపయోగపడుతుంది. నరాలకు బలం చేకూరుస్తుంది.
12. దాడిమీ పత్రం (దానిమ్మ) : ఉదర సంబంధ వ్యాధులను తగ్గిస్తుంది. రక్త వృద్ధికి దోహదపడుతుంది. అజీర్ణము మంట లాంటి వికారాలను తగ్గిస్తుంది.
13. దేవదారు పత్రం ( దేవదారు) : మేధో వ్యాధులను తగ్గిస్తుంది. చర్మ వ్యాధులు తగ్గిస్తుంది. అలాగే దీర్ఘకాలిక పుండ్లను తగ్గిస్తుంది.
14. మరువక పత్రం : హృదయ సంబంధ వ్యాధులు, చర్మ వ్యాధులు నందు కీళ్ళ వ్యాధులకు ఉపయోగం.
15. సింధూర పత్రం (వావిలి) : వాత సంబంధ వ్యాధులను తగ్గిస్తుంది. విషాహార ద్రవ్యంగా ఉపయోగపడుతుంది. కీళ్ళ వ్యాధులు, శ్వాస సంబంధ వ్యాధులకు ఉపయోగపడుతుంది.
16. జాజి పత్రం : నోటికి సంబంధించిన వ్యాధులు, ఉదర వ్యాధులు మొదలైన వ్యాధులను తగ్గిస్తుంది. ఉత్తేజాన్నిస్తుంది.
17. గండకీ పత్రం (దేవకాంచనం) : హృదయ సంబంధ వ్యాధులు, చర్మవ్యాధులకు ఉపయోగపడుతుంది. రక్తాన్ని శుద్ధి చేస్తుంది.
18. షమీ పత్రము (జమ్మి) : వాతావరణ శుద్ధికి ఉపయోగం. శ్వాస సంబంధ వ్యాధులను తగ్గిస్తుంది.
19. అశ్వత్థ పత్రం (రావి) సంతాన కరము అంటారు. అలాగే నీటిని శుద్ధి చేస్తుంది.
20. అర్జున పత్రం (మద్ది) : హృదయ సంబంధ వ్యాధులకు ఉపయోగం. దీర్ఘకాలిక గాయాలను తగ్గిస్తుంది. కీళ్ళ వ్యాధులను తగ్గిస్తుంది
21. అర్క పత్రం (జిల్లేడు) : విష చర్మ వ్యాధులు, కుష్టు వ్యాధి నివారణకు ఉపయోగ పడుతుంది. దీర్ఘకాలిక గాయాలను, కీళ్ళ వ్యాధులను తగ్గిస్తుంది.

ఈ 21 పత్రాల ఉపయోగం ఇవి.

ఈ పండుగ సందర్భంగా చేసే ఉండ్రాళ్ళు పాయసం, బెల్లం, తుమ్మికూర  మన పొట్టలో ఉండే క్రిముల నివారణకు దోహదపడుతాయి.

చవితి రోజున ఎదో రకంగా వీటిని వాడకం అన్నది ఒక శాస్త్రీయ విజ్ఞానం లో భాగమే. ఇవే కాదు, ముఖ్యంగా వర్షాకాలంలో వచ్చే అనేక రకాల వ్యాధులను ఈ పండుగ సందర్భంగా చేసే ఉండ్రాళ్ళు పాయసం, బెల్లం, తుమ్మికూర  మన పొట్టలో ఉండే క్రిముల నివారణకు దోహదపడుతాయి.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article