Editorial

Monday, December 23, 2024
ఆనందంTrekking : ఇందుకోసమే నేను పర్వతాలు ఎక్కుతూ ఉంటాను! - విజయ నాదెళ్ళ 

Trekking : ఇందుకోసమే నేను పర్వతాలు ఎక్కుతూ ఉంటాను! – విజయ నాదెళ్ళ 

నా ట్రెక్కింగ్ అనుభవాలు కొన్ని పంచుకుంటాను ఈ వేళ. నిజానికి కరోనా తర్వాత ట్రెక్ కి వెళ్ళాలా వద్దా అనుకుంటూనే వెళ్ళాను. అక్కడ ఎదురుపడిన వారిని చూసి నేనెంత అల్పురాలిని అనిపించింది. చాలా అరుదైన మనుషులు వీళ్ళు.

విజయ నాదెళ్ళ 

నేను వెళ్ళే ట్రేక్స్ రాను బోను 3 నుంచి 5 మైళ్ళు ఉంటాయి. కొంచెం నిటారుగా, రాళ్ళు నిండి ఉంటాయి. ఇటు ‘లో’ కాదు అటు ‘హై’ కాదు. మీడియం అన్నమాట. ఈ ట్రెక్కింగ్ అనుభవాల్లో ఈ మధ్య నాకు ఎదురైన వ్యక్తుల్లో ఒక నలుగురి గురించి చెప్పాలనిపించింది.

ఒకామె అరవయ్యవ ఏడులో ఉందేమో. మోకాలు ఆపెరేషన్ అయ్యి అది మెరుగుపడిన తరువాత ఒక్కరే ట్రెక్ కి వచ్చారు. నా లాగే ఆవిడ కూడా ప్రొఫెషనల్ కాదు. కానీ ఆవిడ మాకన్నా త్వరగా ఎక్కటం చూసి ఆశ్చర్య పోయాను. నేను ఓక్కదాన్నే వెళుతుంటాను. కానీ ఎక్కువగా ఫ్రెండ్స్ తో ఏదైనా చేయటానికి ఇష్టపడతాను.

ఆ తరువాత చాలా ఉబకాయం ఉన్న ఒక అమ్మాయి, చాలా శరీర ధారుఢ్యం ఉన్న గుంపుతో వచ్చింది. చిత్రమేమిటంటే, ఆ గుంపులో అందరినీ వదిలేసి ఈ అమ్మాయి ముందు గబగబా ఎక్కటం చూస్తే మళ్ళీ ఆశ్చర్యం వేసింది.

వృద్ధాప్యం లో ఉన్న ఒక యురోపియన్ మహిళ చాలా వడివడిగా దిగిరావటం చూసి ఇంకా ఆశ్చర్యం కలిగింది.

“ఎందుకు మూడు గంటల ట్రెక్ కి అంత పెద్ద లగేజీ మొస్తున్నావు” అని ఆపేశాను. అప్పుడు చెప్పింది తను.

అందరికన్నా ఇంకా ఆశ్చర్యం, కాలేజీ చదువు అయిపోయిన ఒక గుంపులో వెనక పడిపోయి నడుస్తున్న ఒక అమ్మాయి. “ఎందుకు మూడు గంటల ట్రెక్ కి అంత పెద్ద లగేజీ మొస్తున్నావు” అని ఆపేశాను. అప్పుడు చెప్పింది తను.

జార్జియా స్టేట్ నుంచి మెయిన్ అనే స్టేట్ వరకు మొత్తం 14 రాష్ట్రాలకి పర్వత శ్రేణి విస్తరించి ఉంటుంది. ఆ మొత్తం దారిని పర్వతాల మీదుగానే వాళ్ళు నడిచి వెళుతున్నారట. అలా నడుస్తూ ఇప్పుడు మా రాష్ట్రంలో మేము ఎక్కిన పర్వతం ఎక్కారని చెప్పింది. అప్పటికి 76 రోజులైంది. మొత్తం పర్వత శ్రేణిని పూర్తి కావటానికి 140 రోజులు పడుతుందంది. రోజు 30 మైళ్ళు అంటే 48 కిలో మీటర్లు నడుస్తామని చెప్పింది. పొద్దున్న ఏడు గంటలకు మొదలెట్టి సాయత్రం నాలుగు దాకా…ఆ నాలుగు రోజులు మౌంటైన్స్ లోనే ఉంటారు. నాలుగో రోజు దిగి, షెల్టర్ హోమ్ లు ఎక్కడున్నాయో చూసుకుని, స్నానాలు చేసుకుని మరో నాలుగు రోజులకు ఫుడ్ ప్యాక్ చేసుకుని, ఫోన్ ఛార్జింగ్ చేసుకుని, ఆ పూట అక్కడే విశ్రమించి, పొద్దున్నే ఎక్కుతారట.

చాలా అరుదైన మనుషులు వీళ్ళు. వీళ్ళందరిని కలవటం నాకు ఎంతో ఆనందం.

ఆ మాట చెప్పి అలా పర్వతాలకేసి సాగిపాయిందా అమ్మాయి. చూస్తుండగానే గుంపు విడిపోయి ఎవరి వేగంతో వారే నడుస్తున్నారు. మౌంటైన్స్ లో మ్యాప్ పెట్టుకుని, గుర్తులు చూసుకుంటూ ముందుకు సాగుతున్నారు. దారి తప్పుతామన్న భయం లేదు. ఎలుగుబంట్లు బానే తిరుగుతున్నాయి. ఐనా ఎటువంటి భయం లేదు.

చాలా అరుదైన మనుషులు వీళ్ళు. వీళ్ళందరిని కలవటం నాకు ఎంతో ఆనందం. ఇలాంటి అనుభవాల కోసం, ఇంకా సహజమైన ప్రకృతి కోసమే నేను పర్వతాలు ఎక్కుతూ ఉంటాను.

అమెరికాలో నివసిస్తున్న విజయ నాదెళ్ళ ఓరుగల్లు బిడ్డ. మేనేజ్ మెంట్ నిపుణురాలు. తెలుపు ప్రచురించిన ఇటీవలి వారి రచన Happy Doctors Day.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article