Editorial

Wednesday, December 25, 2024
సినిమాఎప్పటికీ మారుమోగే "మొహమద్ రెజా” అన్న పిలుపు! - వెంకట్ సిద్దారెడ్డి 

ఎప్పటికీ మారుమోగే “మొహమద్ రెజా” అన్న పిలుపు! – వెంకట్ సిద్దారెడ్డి 

Where is the Friend’s Home : నేను ఈ సినిమా చూసి చాలా ఏళ్ళయింది కానీ, అహ్మద్ తన క్లాస్ మేట్ అయిన మొహమద్ కోసం వెతుకుతూ, “మొహమద్ రెజా,” అని వీధుల్లో పిలిచే అరుపులు ఇప్పటికీ నా చెవుల్లో మారుమ్రోగుతూనే ఉన్నాయి.

వెంకట్ సిద్దారెడ్డి 

ఒక చిన్న పల్లెటూరు. అందులోని ఒక గవర్నమెంట్ స్కూల్. ఆ చుట్టు పక్కల ఉన్న సమీప గ్రామాలన్నింటికీ కలిపి ఇదొక్కటే స్కూల్. ఆ స్కూల్ లో మూడో తరగతి చదివే అహ్మద్ అనే కుర్రాడు. మంచి వాడు. క్రమశిక్షణ కలిగిన వాడు. టీచర్ క్లాస్ లో హోమ్ వర్క్ చూపించమని అడగ్గానే చూపించేస్తాడు.

అదే స్కూల్ లో, అదే మూడో క్లాస్ లో చదివే మరొక పిల్లవాడు మొహమద్ రెజా. ఎప్పటిలాగే టీచర్ క్లాస్ లోకి వచ్చాడు. హోమ్ వర్క్ చూపించమని ఎదురుగా నిలబడ్డాడు. మొహమద్ రెజా ఎప్పటిలానే తెల్లమొహం వేశాడు. ఆ రోజు కూడా హోమ్ వర్క్ చెయ్యకుండా వచ్చినందుకు టీచర్ కి విపరీతమైన కోపం వచ్చింది. ఇంకోసారి ఇలా హోమ్ వర్క్ చెయ్యకుండా క్లాస్ కొస్తే, అసలు స్కూల్ కే రావాల్సిన అవసరం లేదని గట్టిగా కోప్పడ్డాడు.

సాయంత్రమైంది. స్కూల్ బెల్ కొట్టారు. పిల్లలంతా ఆనందంగా గోల చేస్తూ స్కూల్ నుంచి బయటకు పరిగెత్తారు. ఇంటికి పరిగెట్టే హడావుడిలో అహ్మద్ మరియు మొహమద్ గుద్దుకున్నారు. ఈ గుద్దుకోవడంలో వారి పుస్తకాలన్నీ కింద పడిపోయాయి. ఇద్దరూ తమ పుస్తకాలను సర్దుకుని ఇంటికి బయల్దేరారు. కానీ వాళ్లకి అప్పుడు తెలియని విషయం ఏంటంటే, ఈ గందరగోళంలో మొహమద్ హోమ్ వర్క్ నోట్ బుక్ కాస్తా అహ్మద్ బ్యాగ్ లోకి వెళ్లిపోయింది.

అహ్మద్ ఇంటికి చేరుకున్నాడు. ఇంటికి వచ్చి హోమ్ వర్క్ చేద్దామని కూర్చుంటే అతని బ్యాగ్ లో మొహమద్ నోట్ బుక్ కూడా ఉండడం చూసి, అయ్యో అనుకున్నాడు.

అహ్మద్ ఇంటికి చేరుకున్నాడు. ఇంటికి వచ్చి హోమ్ వర్క్ చేద్దామని కూర్చుంటే అతని బ్యాగ్ లో మొహమద్ నోట్ బుక్ కూడా ఉండడం చూసి, అయ్యో అనుకున్నాడు. ఎలాగైనా ఇంట్లోనుంచి బయటకి వెళ్లి మొహమద్ కి నోట్ బుక్ తిరిగివ్వాలనే ఆలోచన అతనికి వచ్చింది కానీ, ఇంట్లో నుంచి సాయంత్రం పూట ఎలా బయటపడడం?

ఇంతలో అతనికి ఆ అవకాశం అమ్మ ద్వారా వచ్చింది. బయట షాప్ కి వెళ్లి బ్రెడ్ కొనుక్కు రమ్మని అమ్మ చెప్పడంతో అదే అవకాశంగా తీసుకుని, మొహమద్ నోట్ బుక్ తీసుకుని ఇంట్లోనుంచి బయటపడ్డాడు అహ్మద్.

అహ్మద్ ఊరి నుంచి పరిగెత్తి పక్కూరికి చేరుకున్నాడు. అక్కడ మొహమద్ గురించి కనిపించిన పెద్ద వాళ్లనందరినీ అడిగి చూశాడు కానీ పిల్లల గురించి పట్టించుకునేంత సమయం ఆ ఊర్లోని పెద్ద వాళ్లకు లేదు.

అహ్మద్ కి తెలిసిందల్లా ఒక్కటే : మొహమద్ తన పక్క ఊరిలో ఉంటాడు; ఎలాగైనా ఆ రాత్రి లోపల నోట్ బుక్ మొహమద్ రెజా కి అందచెయ్యాలి. కానీ అతనికి తెలియని విషయాలు చాలా ఉన్నాయి. మొహమద్ ఇంటికి దారి తెలియదు. కనీసం మొహమద్ తండ్రి పేరు కూడా తెలియదు. అసలు తననుకుంటున్నట్టు మొహమద్ ది ఆ ఊరో కాదో కూడా తెలియదు.

అయినా కూడా తన ఊరి నుంచి పరిగెత్తి పక్కూరికి చేరుకున్నాడు. అక్కడ మొహమద్ గురించి కనిపించిన పెద్ద వాళ్లనందరినీ అడిగి చూశాడు కానీ పిల్లల గురించి పట్టించుకునేంత సమయం ఆ ఊర్లోని పెద్ద వాళ్లకు లేదు.

అదృష్టవశాత్తూ, అహ్మద్ కి ఆ ఊర్లోనే ఉంటున్న తన స్కూల్లో చదివే ఓ పిల్లాడు కనిపించాడు. అతనికి సమస్య చెప్పాడు. ఆ పిల్లాడికి కూడా మొహమద్ ఇల్లు తెలియదు అని చెప్పాడు. కాకపోతే మొహమద్ చుట్టాలబ్బాయి, తమతో పాటు అదే స్కూల్ చదువుకునే హెమ్మతి అనే అబ్బాయి అడ్రెస్ చెప్పాడు. హమ్మయ్యా అనుకుని హెమ్మతి ఇంటికి వెళ్లే సరికి అతనక్కడ లేడు. మరొక పని మీద అతను వేరే ఊరు వెళ్ళాడు.

ఎలాగైనా మొహమద్ రెజా ఇల్లు కనుక్కోవాలని చాలా ప్రయత్నాలు చే్స్తాడు అహ్మద్. ఎంత చేసినా మొహమద్ రెజా అడ్రస్ మాత్రం కనుక్కోలేక పోతాడు. ఇక చేసేదేమీ లేక మళ్లీ తన ఊరికి చేరుకున్నాడు. ఇంటి వైపు బయల్దేరాడు అహ్మద్. ఇంటికి వెళ్లే దారిలో అహ్మద్ కి మరొక క్లూ దొరికింది. ఒక పెద్దాయన తనకు మొహమద్ రెజా ఇల్లు తెలుసని చెప్పడంతో అతనితో కలిసి బయల్దేరాడు. ఆ పెద్దాయనతో చేసిన కాసేపు ప్రయాణంలోనే అహ్మద్ కి ఇదంతా వృధా ప్రయాస అని అర్థమయింది. మొహమద్ రెజా ఇళ్లు కనుక్కుని, అతనికి నోట్ బుక్ ఇవ్వలేకపోయాననే బాధతో ఇంటికి తిరుగుముఖం పట్టాడు అహ్మద్.

టీచర్ కి కోపం రాబోయింది. మరొక పేజీ తిప్పాడు. అందమైన చేతి రాతతో రాసిన హోమ్ వర్క్ చూసి వెరీ గుడ్ అన్నాడు. పేజీల మధ్యలో ఉంచిన ఎప్పటిదో ఒక పువ్వు నవ్వుకుంది.

ఇంటికి చేరుకున్న అహ్మద్ అమ్మ చేతిలో తిట్లు తిన్నాడు. బ్రెడ్ తెమ్మని పంపించిన కొడుకు, మూడు నాలుగు గంటల తర్వాత ఇంటికి తిరిగొస్తే ఏ తల్లికైనా కోపమే రావడం సహజమే. కానీ ఇవన్నీ అహ్మద్ మనసుకి తాకటం లేదు. అతని మనసంతా అతని ఫ్రెండ్ నోట్ బుక్ మీదే ఉంది. దిగులుగా ఒక మూల కూర్చున్నాడు. నాన్న రేడియో ట్యూన్ చేస్తున్నాడు. అమ్మ అన్నం తినడానికి రమ్మంటోంది. అహ్మద్ ఏం మాట్లాడలేదు. మళ్లీ గట్టిగా అడిగింది. తనకి ఆకలి లేదన్నాడు. బాగా రాత్రయింది, వెళ్లి పడుకోమంది అమ్మ. తనకి నిద్ర రావటం లేదని చెప్పాడు. హోమ్ వర్క్ చేసుకోవాలన్నాడు. అహ్మద్ తన స్కూల్ బ్యాగ్ తీసుకుని తన గదిలోకి వెళ్లాడు. హోమ్ వర్క్ చేయడం మొదలు పెట్టాడు.

ఉదయం. క్లాస్ లో పిల్లలంతా కూర్చుని ఉన్నారు. టీచర్ వచ్చి ఒక్కొక్కరి హోమ్ వర్క్ నోట్ బుక్ చెక్ చేస్తున్నాడు. మొహమద్ రెజా ఎప్పటిలానే హోమ్ వర్క్ చెయ్యకుండానే వచ్చాడు. తన హోమ్ వర్క్ నోట్ బుక్ పోయిందని టీచర్ కి ఎలా చెప్పాలో అని టెన్షన్ గా ఉన్నాడు. టీచర్ అతని వెనక్ బెంచి వాళ్ల నోట్ బుక్స్ చెక్ చేస్తున్నాడు. ఇంతలో, మే ఐ కమిన్ సార్ అని వినిపించింది. చూస్తే అహ్మద్. హడావుడిగా వచ్చి మొహమద్ పక్కన కూర్చున్నాడు. టీచర్ నీ హోమ్ వర్క్ చెక్ చేశాడా అని అడిగాడు మొహమద్ ని. లేదని చెప్పాడు. అహ్మద్ తన బ్యాగ్ లో నుంచి మొహమద్ నోట్ బుక్ తీసిచ్చాడు. ఇంతలో మొహమద్ ని హోమ్ వర్క్ చూపించమన్నాడు టీచర్. భయపడుతూనే తన నోట్ బుక్ ఇచ్చాడు మొహమద్. తెరిచి చూస్తే ఖాళీ పేజీలు. టీచర్ కి కోపం రాబోయింది. మరొక పేజీ తిప్పాడు. అందమైన చేతి రాతతో రాసిన హోమ్ వర్క్ చూసి వెరీ గుడ్ అన్నాడు. పేజీల మధ్యలో ఉంచిన ఎప్పటిదో ఒక పువ్వు నవ్వుకుంది.

నాకనిపిస్తుంది: ఇంత సింపుల్ గా ఎవరూ సినిమాలు తీయలేరు అలాగే ఇంత సింపుల్ కథతో మనసును కదిలించే సినిమా మరొకటి లేదు. ఈ చిత్ర దర్శకుడైన అబ్బాస్ కియరోస్తమి గొప్పతనం అదే!

నేను ఈ సినిమా చూసి చాలా ఏళ్ళయింది కానీ, అహ్మద్ తన క్లాస్ మేట్ అయిన మొహమద్ కోసం వెతుకుతూ, “మొహమద్ రెజా,” అని వీధుల్లో పిలిచే అరుపులు ఇప్పటికీ నా చెవుల్లో మారుమ్రోగుతూనే ఉన్నాయి. ఈ సినిమా చూసినప్పుడల్లా నాకనిపిస్తుంది: ఇంత సింపుల్ గా ఎవరూ సినిమాలు తీయలేరు అలాగే ఇంత సింపుల్ కథతో మనసును కదిలించే సినిమా మరొకటి లేదు. ఈ చిత్ర దర్శకుడైన అబ్బాస్ కియరోస్తమి గొప్పతనం అదే!

అబ్బాస్ కియరోస్తమి ఇరాన్ దేశపు అత్యుత్తమ దర్శకుల్లో ఒకరు. ఇరాన్ దేశపు సినిమా యొక్క నవతరంగం దర్శకులుగా భావించే వారిలో ఈయన కుడా ఒకరు. ప్రపంచ దేశాలకు కియరస్తోమి గురించి తెలిసింది తొంభైలలో అయినప్పటికీ అంతకముందు రెండు దశాబ్దాల క్రితం నుంచే ఆయన ఇరాన్ లో చిత్రనిర్మాణం చేస్తూనే ఉన్నారు. చిత్ర నిర్మాణం చేపట్టి ఐదు దశాబ్దాలు దాటుతున్నా నేటికీ అత్యుత్తమ సినిమా దర్శకునిగా ప్రపంచ వ్యాప్తంగా కొనియాడబడుతున్నాడు.

వెంకట్ సిద్దారెడ్డి ఒక ‘నవతరంగం’. తాను రచయితా, సినీ దర్శకులు, ప్రచురణకర్త. ‘సినిమా ఒక ఆల్కెమీ’ తన సుప్రసిద్ధ గ్రంధం. ‘సినిమా సినిమా సినిమా’తో సహా వారి అచ్చైన యితర రచనల కోసం ఈ ఈ లింక్ చూడండి 

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article