Editorial

Monday, December 23, 2024
వ్యాసాలుఆ రెండు వానలు : కొండపొలం, లవ్ స్టోరీ

ఆ రెండు వానలు : కొండపొలం, లవ్ స్టోరీ

ఇటీవల థియేటర్లలో విడుదలైన రెండు సినిమాలు, అందులోని రెండు వానల గురించి చెప్పుకోవాలి. అవి రెండూ వాస్తవికతకు దగ్గ్గరగా వచ్చిన సినిమాలు కావడం, రెండు సినిమాల్లోనూ ఆ రెండు వాన సీన్లు మొత్తం కథలో అత్యంత కీలకం కూడా అవడం చెప్పాలి. ఒకటి, ఒక అమ్మాయి కలల గురించి తాను తాను గొప్ప ఆత్మవిశ్వాసంతో  నిలబెట్టుకునే సన్నివేశం. రెండవది రాయలసీమ ఎండిన గుండెలను తడిపే వాన. తడసిన కాపరి కల.

కందుకూరి రమేష్ బాబు 

ఈ మధ్య వచ్చిన రెండు సినిమాలు రెండు అద్భుతాలు. ఒకటి Love story. ఇది నిజానికి పాప్యులర్ సినిమా పరంగా కుల వివక్ష, లింగ వివక్షల గురించి గొప్పగా హృదయాలను సూటిగా ప్రశ్నించే సినిమా. రెండవ సినిమా ‘Konda Polam’. రాయలసీమ కన్నీటి వ్యధను ఇంత హృద్యంగా చెప్పిన సినిమా మరొకటి లేదు. ఇది కరువు కారణంగా గొర్రెల కాపరుల జీవన పోరాటం గురించి చెబితే లవ్ స్టోరీ చిన్న వయసులోనే లైంగిక అణిచివేతకు గురై వయసొచ్చాక కుల వివక్షకూ గురై రెండు విధాలా మనసూ శరీరం విలవిలలాడే అమ్మాయి కథ. నిజానికి ఈ రెండు సినిమాలలో మూడు సామాజిక సమస్యలను అధ్బుతంగా తడిమి  మనుషులను నిండుగా శుభ్రం చేసి ముత్యాల్లా మార్చి ఆనంద పారవశ్యులను చేసిన వాన గురించి తప్పక చెప్పాలి. ఆ రెండు వానలు ఎంతకాలమైనా మరచిపోలేని అద్భుత అనుభవాలు. కథల కథలు.

Shekar Kamuula దర్శకత్వంలో వచ్చిన లవ్ స్టోరీలో వాన పాట మైదానంలో విరిసిన ఒక గొప్ప దృశ్యం కావ్యమైతే,మరో అద్భుత దర్శకులు Krish దర్శకత్వంలో వచ్చిన కొండపొలం – అడవిలో విరిసిన ఒక అపురూపమైన జానపద గేయం గొర్ల కాపరై తడవడం వంటిది.

మొదటిది చదువు సంధ్యలు గల అమ్మాయి సుతరంగా ఎగిసిన వైనం, అది ఒక గొప్ప హృద్యమైన భావావేషాన్ని కలిగిస్తుంది. ఆ సన్నివేశం డ్యాన్స్ క్యీన్ గా Sai Pallavi నట జీవితంలో మకుటాయమానంగా నిలుస్తుంది. రెండవది Rakul Preeth Singh. నింగి నుంచి కురిసే వర్షం చినుకు తనను ముద్దాడుతుంటే ఆమె ధరణి పులకరించినట్లు పులకరించడం, మొత్తం రాయలసీమ నృత్యం చేసినట్లే అనిపిస్తుంది. ఒకటి ఎగియడమైతే రెండవది స్వీకారం. ఒకటి మనసైతే రెండు తనవు.

నింగి నుంచి కురిసే వర్షం చినుకు తనను ముద్దాడుతుంటే ఆమె ధరణి పులకరించినట్లు పులకరించడం, మొత్తం రాయలసీమ నృత్యం చేసినట్లే అనిపిస్తుంది. ఒకటి ఎగియడమైతే రెండవది స్వీకారం. ఒకటి మనసైతే రెండు తనవు.

లవ్ స్టోరీలో “నీకేమీ చేతగాదన్న” మాటను పదే పదే వింటూ ఎంతో ఆత్మ న్యూనతకు గురయ్యే అమ్మాయి సాయి పల్లవి. ఆవిడ ఒక్క సారిగా పతాకంగా ఎగిసే దృశ్యం ఆశ్చర్యచకితంగా ఆవిష్కరిస్తారు దర్శకులు. ఏదోలా ఇంజినీర్ చదివినప్పటికీ ఇంటి పరిస్థితుల కారణంగా ఉద్యోగం తెచుకునే స్థితి లేని నిస్సహాయ అమ్మాయి తాను. రోజు రోజుకూ ముడుచుకుపోతున్న ఆ అమ్మాయి చివరకు నీకేదీ చేతగాదని డ్యాన్సర్ ఐన హీరో కూడా అనేసరికి ఆమె రోషంతో ఒక్కపరి చున్నీ వదిలి రెండు అంగల్లో ఆకాశంలోకి ఇంద్ర ధనసులా విరిసి నృత్యం అంటే ఏమిటో చూపిస్తుంది. అపార విశ్వాసంతో ఆమె నింగీ నేలా ఎకమైనట్టు మనసూ శరీరం ఒక్కటై ఆడి పాడుతుంది.

చూడవలసింది ఆమెను. వర్షంలా కురుస్తుంది ఆమె దుఖం. వర్షంలా విరుస్తుంది ఆమె హర్షం. “ఏవో ఏవో కలలే” అంటూ “నన్నే నేనే గెలిచే” అని కూడా అంటూ “రంపం తరరంపం” అంటూ హోరేత్తుతుంది.

ఆమె నృత్యానికి డ్యాన్సర్ కూడా ఐన హీరో విస్మయంతో చూస్తూ ఉండిపోతాడు, ఆమె ఎనర్జీకి. ఆమె ఎక్స్ ప్రెషన్ కి. మీది మిక్కిలి ఆ అపురూప నృత్య విలాసానికి తాను ఫిదా ఐ కలిసి నర్తిస్తాడు.

చూడవలసింది ఆమెను. వర్షంలా కురుస్తుంది ఆమె దుఖం. వర్షంలా విరుస్తుంది ఆమె హర్షం. “ఏవో ఏవో కలలే” అంటూ “నన్నే నేనే గెలిచే” అని కూడా అంటూ “రంపం తరరంపం” అంటూ హోరేత్తుతుంది.

తానేమిటి చెప్పేందుకు, తన అంతరంగం ఎంతటి నర్తనమో చెప్పేందుకు ఆ అమ్మాయికి వేరే మాటలు, సన్నివేశాలు ఇవేమీ పెట్టకుండా ఒక్క నృత్య్యమే పెడతాడు దర్శకుడు. అదీ వానలో చిత్రీకరిస్తాడు. ( పాట కోసం ఈ లింక్ క్లిక్ చేయండి )

కరోనా కారణంగా ముడుచుకు పోయిన ప్రేక్షకులకు అది రిలీఫ్ మాత్రమే కాదు, ముందే చెప్పినట్టు లైంగికంగా వేధింపులకు గురైన శరీరం అమెది.

బిల్డింగ్ టెర్రాస్ పై మొత్తం చిత్రం చిత్రీకరించడానికి ఒక కారణం ఈ డ్యాన్స్ సన్నివేశం అనే అనుకుంటాను నేను. ఎందుకంటే పాట సాగుతుండగా వర్షం నీళ్ళు కిందికి పోకుండా పైపులను అలవోకగా మూసేయడం మరో మనోహరమైన ప్రస్తవా. అలా నిండిన వాన నీటిలో హీరో హీరోయిన్లు చేపల్లా నర్తిస్తారు. అద్భుతమైన ఆ పాటను చూసి పరవశించకుండా ఉండలేం. అలాగే అందులో అప్పటిదాకా బేలగా ఉన్న ఆ స్త్రీ వ్యక్తిత్వం రెబెల్ గా ఎగయడానికి కూడా దర్శకుడు ఆ సీన్ ను వాడుకోవడంలో ఎంతో దర్శానికత ఉంది. అంతే కాదు, వర్షంలో ఎగిసిన ఆ తార ఇక మిగితా సినిమా మొత్తంలో డ్యాన్సర్ గా హీరోకు సమవుజ్జీగా కూడా కాదు, అతడిని ద్వితీయం చేస్తూ పోటా పోటీగా నిలబెట్టేందుకు కూడా దర్శకుడు ఎంతో రిస్క్ తీసుకుని ఈ పాటను రమణీయంగా కల్పించిన వాన సన్నివేశం అది.

ఆ వాన… ఓల్గా స్వేఛ్చ నవలలోని కవర్ పేజీ బొమ్మలా గొప్ప వ్యక్తిత్వం వికాసానికి ప్రతీక. శేఖర్ కమ్ముల తాలూకు స్త్రీ పాత్రల ఉనికిని చెప్పే ఒక ఆహ్లాదమైన విప్లవీకరణ.

తర్వాత హీరో అంటాడు, వానలో నెమలిలా చేశావు డ్యాన్స్ అని. ఆ అభినందన కూడా మన మనసులోని మాటలా అద్భుతంగా  ఉంటుంది. ఒక్క మాటలో ముడుచుకున్న పక్షి రెక్కలల్లార్చి పంజరాన్ని తన్ని  నింగిలోకి స్వేచ్ఛగా ఎగరడం ఆ వానతో మొదలైతే, తర్వాత దశలో రోజు రోజుకూ చస్తూ బతకడం నా వల్ల కాదంటూ ఇక కుల గోడల్ని డీకోనేందుకు స్ఫూర్తి నింపే స్థాయికి వెళుతుంది ఆ పాత్ర. అందుకే అనడం, ఆ వాన… ఓల్గా స్వేఛ్చ నవలలోని కవర్ పేజీ బొమ్మలా గొప్ప వ్యక్తిత్వం వికాసానికి ప్రతీక. శేఖర్ కమ్ముల తాలూకు స్త్రీ పాత్రల ఉనికిని చెప్పే ఒక ఆహ్లాదమైన విప్లవీకరణ.

ఈ మధ్య విడుదలైన రెండు సినిమాల్లో ఇక రెండో వానకు రకుల్ ప్రీత్ సింగ్ నాయకి.

ఈ మధ్య విడుదలైన రెండు సినిమాల్లో ఇక రెండో వానకు రకుల్ ప్రీత్ సింగ్ నాయకి. ఆమె ఎంత అద్భుతంగా వానను చూస్తుందీ అంటే రెండు రోజులుగా వందకు పైగా మూగ జీవాలు నీళ్ళు లేక బిక్కు బిక్కు మంటూ జీవచ్చవాలుగా వేలాడుతుంటే హీరో తండ్రి కంట తడిపెడతాడు. అంతేకాదు, ఆ జీవాలు అతడి దగ్గరకు వెళ్లి మూగగా నీళ్ళకోసం ప్రాధేయ పూర్వకంగా అతడిని కుమ్ముతై. ఆగ్రహిస్తాడు. విదిలించుకుంటాడు. తరిమేస్తాడు. నీళ్ళు ఎక్కడి నుంచి తేవాలని ఆవేశంతో అరుస్తాడు. కన్నీటి పర్యంతం అవుతాం ప్రేక్షకులం. హీరో ప్రేయసి, గొర్రెల కాపరి ఐన ఓబులమ్మ అప్పుడు ఆకాశం కేసి చూస్తుంది. మేఘమాలలు విచ్చుకుంటుటై. అనూహ్యంగా వర్షం పడబోతోంది.

ఇది కూడా ఒక కల్పన. కథగమనంలో అసలు సారాంశం చెప్పడానికి ప్రతీకాత్మకంగా శేఖర్ కమ్ముల మాదిరే క్రిష్ ఎంచుకున్న సన్నివేశం.

మేఘాలు కరిగి వర్షం కురియబోతుండగా ఆ అమ్మాయి భావావేశం, అనుభూతి. ఆత్మ బీడు బారిన రాయలసీమ కరువును కరిగించే ప్రాకృతిక గానంగా పాట పెట్టలేదు గానీ వాన పడటమే పాటగా మన ఎదల్ని హత్తుకుంటుంది.

కొన్ని క్షణాలే కావొచ్చు. కానే ఆమె వర్షానికి ఆహ్వానం పలుకుతూ చేసిన అభినయం హృద్యం, రమణీయం. అంతకన్నా కూడా కొండపొలం చేసుకునే నిలువుగాళ్ళ జీతగాళ్ళ బతుకులు మూగ జీవులతో ముడివడ్డ వైనంలో పాట వానై కురియడంలో ఆమె తాదత్మత మరచిపోలేని అనుభవం.

రకుల్ ప్రీత్ సింగ్ వర్షానికి ఆహ్వానం పలికితే, వర్షం కురుస్తుండగా కొండపొలానికి మార్గం చూపిన హీరో తండ్రిగా నటించిన సాయి చంద్ …అతడి అభినయం, వర్షంలో తడిసిన నీటిని చేతుల్లోకి తీసుకుని మెల్లగా మట్టి నీళ్ళతో ముఖం తడుపుకుంటూ ఆ తర్వాత ఆ నీళ్ళ దోసిలితోనే వాన దేవుడికి చేతులెత్తి నమస్కరించడం మరో మరచిపోలేని సన్నివేశం.

చూడండి. ఈ వానలు ఎంత గొప్పవో. ఆ సన్నివేశాలు ఎంత మహాత్తరమైనవో. అవి వ్యవసాయదారులు, వృత్తి దారుల వలస గురించే. ఇద్దరికీ కావలసింది వానలే.

చూడండి. ఈ వానలు ఎంత గొప్పవో. ఆ సన్నివేశాలు ఎంత మహాత్తరమైనవో. అవి వ్యవసాయదారులు, వృత్తి దారుల వలస గురించే. ఇద్దరికీ కావలసింది వానలే.

నిజానికి కొండపొలం నవల రాసిన సన్నపురెడ్డి వెంకట రామిరెడ్డి గారు ఈ నవల ముందు మాటలో చివరి పంక్తులు కూడా కరువు గురించి వలస గురించే చెబుతాయి. తన ఆకాంక్ష కూడా దాదాపు అదే. వాన.

“జననం నుంచి పయనమై వస్తున్న నేను వ్యవసాయ దారుల కాలిబాటలోనే నడుస్తున్నప్పటికీ, అప్పుడప్పుడూ దారిపక్కనే సమాంతరంగా దుమ్ము రేపుకుంటూ వెళ్ళే గొర్ల కాపరుల అడుగుజాడల్ని కూడా తొక్కుతూ వచ్చ్చాను. రాను రాను రెండు దారులూ కలిసిపోయే కరువుబాట ఒకటి ఏర్పడి అది కాస్తా రహదారిగా మారి నగరాల కేసి వెళుతూ ఉండటాన్ని నిస్సహాయంగా చూస్తున్నాను”

దర్శకుడు క్రిష్ ఆ ఆత్మను పట్టుకోవడం ఎంత అద్భుతంగా ఉందీ అంటే ఈ ఒక్క దృశ్యం చాలు అతడి ఆర్తి తెలుపడానికి.

దర్శకుడు క్రిష్ ఆ ఆత్మను పట్టుకోవడం ఎంత అద్భుతంగా ఉందీ అంటే ఈ ఒక్క దృశ్యం చాలు అతడి ఆర్తి తెలుపడానికి.

నగర జీవులు, పట్న వాసులు, గ్రామాల్లోని వారు కూడా ఫక్తు వినోదానికి మరుగుతున్న వేళ ఈ ఇద్దరు దర్శకులు అత్యంత మౌలికమైన అంశాలతో చక్కటి సినిమాలు తీసి అలోచింపజేశారు. నిజానికి ఎంతో భరువైన ఇతివృత్తాలతో కథలు నడిపారు. అంతటి భారాన్ని ఈ రెండు వాన సన్నివేశాలు ఒక్కపరి ఆహ్లాదం చేస్తాయి.

చూసారో లేదో గానీ, చూడవలసిన వానలు.

దర్శకులకు హృదయపూర్వక అభివాదాలతో…చూడమని ఆ రెండు వానలు తెలుపు ఈ  సంపాదకీయం.

 

 

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article