Editorial

Monday, December 23, 2024
స్మరణనివాళిసతత హరిత - అసుర అక్షర నివాళి

సతత హరిత – అసుర అక్షర నివాళి

నిత్య నూతనంగా జీవించిన సతత హరిత కల్పన.

అంబటి సురేంద్రరాజు

దయాల కల్పన బంగారం లాంటి మనిషి. నిలువెల్లా ఉత్సాహం ఉరకలెత్తే మనిషి. కల్పన వ్యక్తిగత జీవితంలోనే కాదు, రోజువారీ సామాజిక, రాజకీయ జీవితంలో కూడా క్రియాశీలి. సాటి మనుషుల మీద ప్రేమ, దయ ఆమె వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దాయి.

మిత్రుడు తడక యాదగిరితో పెళ్ళయిన నాటినుంచి కల్పన నాకు తెలుసు. తన ఆరోగ్య సమస్యలు, పిల్లలిద్దరి ఆరోగ్య సమస్యలు తీర్చే గురుతర బాధ్యత కల్పన నాకు అప్పగించింది. కానీ తనను అనారోగ్యం నుంచి కాపాడటంలో నేను విఫలమయ్యాను.

హృదయం లోలోతుల నుంచి ఉబికివచ్చే ఆనందంతో తొణికిసలాడుతూ, ఆ ఆనందం కలిగించే అనుభూతిని దరహాస చంద్రికలుగా వెదజల్లుతూ, తన చుట్టూ వెలుగు వలయాలను సృష్టించుకుంటూ నిత్య నూతనంగా జీవించిన సతత హరిత కల్పన.

కల్పన ఇంత తొందరగా మనల్ని విడిచి వెళ్ళిపోవడం మన దురదృష్టం.

 

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article