Editorial

Wednesday, January 22, 2025
సామాన్యశాస్త్రంఘట్టాచారి సార్ : తల్లి వంటి గురుదేవులు

ఘట్టాచారి సార్ : తల్లి వంటి గురుదేవులు

పూర్వ విద్యార్థుల సమ్మేళనం రోజున విద్యార్థులం కలిసినప్పుడు పిల్లల కోడిలా దగ్గరకు తీసుకున్నారు సారు. అన్నట్టు, సార్ దగ్గరకు తీసుకుని ఆప్యాయంగా తల నిమురుతున్నది ఈశ్వర్ అని మా క్లాస్ మేట్ ని. ఇట్లా దగ్గరకు తీసుకునే సార్ మా మొత్తం స్కూల్ లో అయన ఒక్కరే అని నాకు గుర్తు. అటువంటి సార్ గత నెల మాకు శాశ్వతంగా దూరమయ్యారు.

కందుకూరి రమేష్ బాబు

చిన్నప్పుడు చదువు చెప్పిన టీచర్లను ఎన్నటికీ మరచిపోలేం, వారు తిట్టినా కొట్టినా, మెచ్చుకున్నా.

పెద్దయ్యాక వారి పట్ల అభిమానం పెరుగుతుందే గానీ గింత గూడా తగ్గదు.

ఎల్లారెడ్డిపేట ప్రాతిమికోన్నత పాఠశాలలో చదువుకున్న అందరం పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరిపుకొన్నప్పుడు సార్లను పిలుచుకున్నాం. అప్పుడు తీసిన ఫోటో ఇది.

ఘట్టాచారి సార్ మాకు ఆంగ్లం భోధించేవారు. అయన మాకు, ఇంకొంతమందికి ట్యూషన్ కూడా చెప్పేవారు. మొదటి సారిగా అరవిందులు, వివేకనందుల వారు, రామకృష్ణ మఠం గురించి వారి దగ్గరే తెలిసింది. ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, వజ్ర సంకల్పం మనసులో నాటుకున్నదీ అంటే అది ఏవో సంస్థల వల్ల కాదు, ఇలాంటి ఉపాధ్యాయుల శిష్యరికం నుంచే.

వారు పితృ సమానులు. ఎంతో ఆప్యాయత చూపేవారు. ఉపాధ్యాయుల స్పర్శ చాలా మందికి ఉండదు. కానీ అయన ఆలింగనం చేసుకునేవారు. అది ఎంతో బాగుండేది. వారి వద్ద ఒక స్మెల్ ఉండేది. పాన్ తలూకుదు కాదనుకుంటాను. పుదీన వాసన లాంటిది ఎదో వేసేది.

వారు పితృ సమానులు. ఎంతో ఆప్యాయత చూపేవారు. ఉపాధ్యాయుల స్పర్శ చాలా మందికి ఉండదు. కానీ అయన ప్రేమగా ఆలింగనం చేసుకునేవారు. అది ఎంతో బాగుండేది. వారి వద్ద ఒక స్మెల్ ఉండేది. పాన్ తలూకుదు కాదనుకుంటాను. పుదీన వాసన లాంటిది ఎదో వేసేది.

గోధుమ వర్ణ దళసరి కళ్ళద్దాలతో అయన, వారి చూపులు బాగా గుర్తు. ఎప్పటికీ మరచిపోలే. ఇంగ్లీషు నేర్పడంలో భాగంగా అయన ఒక్కొక్కరి నోట్ బుక్ లో టెన్సులను పెట్టించేవారు. అప్పట్లో భూత భవిష్యత్ వర్తమాన కాలాలను అట్లా చదువుకునేవాళ్ళం కదా!

ఇంగ్లీష్ నేర్చుకోవడానికి రేడియో వినడం, బీబీసీ వార్తలు ఆలకించడం ఒక మంచి అలవాటఅని వారి దగ్గరే మొట్ట మొదట తెలుసుకోవడం ఒక వికాసం. ఎంఎ ఆంగ్ల సాహిత్యం చదివే రోజుల్లో అయన బాగా గుర్తొచ్చేవారు. వారి గురించి చెప్పాలంటే కవిత్వం కన్నా వచనం అని చెప్పాలి. చిన్న చిన్న పుస్తకాలు మాదిరి రామకృష్ణ మఠం ప్రచురించిన బుక్స్ కూడా వారి దగ్గరే మొదటిసారి చదవడంతో ప్రోజ్ రీడింగ్ కు కూడా వారే తొలి స్ఫూర్తి అని చెప్పాలి.

ఇప్పుడు మేం బండ్ల మీద తిరుగుతుంటే అలా ఎవరైనా నడుస్తుంటే ఆగి, సారే అనుకునే, తాను వెళ్ళేదాకా పక్కకు ఉండటం చాదస్తం అనుకున్నా పర్లేదు గానే అలా పక్కకు ఉండటం కద్దు.

మా బడిని పెద్దబడి అని పిలుస్తాం. బడికి నడుచుకుంటూ వెళ్ళే ఉపాధ్యాయుల్లో వేములవాడ నుంచి వచ్చే మురళీ శర్మ సార్ కాకుండా వేగంగా చిన్న చిన్న అడుగులు వేసుకుంటూ వేగంగా చేతులు ఊపుకుంటూ వెళ్ళే ఘట్టా చారి సార్ ని ఎవరు మరచిపోతారు! ఇప్పుడు మేం బండ్ల మీద తిరుగుతుంటే అలా ఎవరైనా నడుస్తుంటే ఆగి, సారే అనుకునే, తాను వెళ్ళేదాకా పక్కకు ఉండటం చాదస్తం అనుకున్నా పర్లేదు గానే అలా పక్కకు ఉండటం కద్దు.

వారు ఉబ్బసంతో బాధపడేవారు. అయినా క్రమం నిత్యం క్లాసులకు వచ్చేవారు. వారికి ఒక్కతే కూతురు. పాపం, చనిపోయింది మధ్యలో.

సార్ మా నాన్నకు స్నేహితులు కూడా. కాబట్టి వారితో, వారి కుటుంబంతో మాకు చాలా అనుభంధం ఉండేది. నేనే కాదు, మా తమ్ముడు, చెల్లెండ్లు అందరూ సార్ విద్యార్థులమే.

పూర్వ విద్యార్థుల సమ్మేళనం రోజున విద్యార్థులం కలిసినప్పుడు పిల్లల కోడిలా దగ్గరకు తీసుకున్నారు సారు. అన్నట్టు, సార్ దగ్గరకు తీసుకుని ఆప్యాయంగా తల నిమురుతున్నది ఈశ్వర్ అని మా క్లాస్ మేట్ ని. ఇట్లా దగ్గరకు తీసుకునే సారి మా మొత్తం స్కూల్ లో అయన ఒక్కరే అని నాకు గుర్తు. అటువంటి సార్ గత నెల మాకు శాశ్వతంగా దూరమయ్యారని తెలిసింది. అయన మరణ వార్త ఆలస్యంగా చేరింది. వారికీ నివాళిగా ఉపాధ్యాయుల దినోత్సవం రోజున ఈ నాలుగు మాటలు రాస్తూ సార్ పవిత్ర ఆత్మకు వందనాలు తెలియజేసుకోవడం ఒక కనీస తృప్తి.

 

 

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article