Editorial

Wednesday, January 22, 2025
Peopleభారతీయ సంగీతంలో బాహుబలి బాలమురళీ - ఎస్.వి.సూర్యప్రకాశరావు తెలుపు

భారతీయ సంగీతంలో బాహుబలి బాలమురళీ – ఎస్.వి.సూర్యప్రకాశరావు తెలుపు

నేడు శ్రీ మంగళంపల్లి బాలమురళీ కృష్ణ జయంతి. ఈ సందర్భంగా ఇండియా టుడే పూర్వ సహాయ సంపాదకులు శ్రీ ఎస్.వి. సూర్యప్రకాశరావు అందిస్తున్న ‘స్వర యానం’ తెలుపుకు ప్రత్యేకం.

నేను అప్పుడే హైదరాబాద్ నుంచి బెంగళూర్ ఆంధ్రప్రభ కు ట్రాన్స్ర్ అయిన రోజులు.

ఒకరోజు సాయంత్రం 5 గంటలకి మా న్యూస్ ఎడిటర్ పుల్లయ్య గారు వచ్చి ఒక ఇన్విటేషన్ ఇచ్చారు. అది ఒక సంగీత కచేరి ఆహ్వాన పత్రిక. ఆసక్తి ఉంటే వెళ్ళండి. వెళ్లి నాలుగు ముక్కలు రాయండి. ఫోటో వాళ్ళే ఇస్తారు. లేకపోతే ఎక్స్ ప్రెస్ నుంచి తీసుకుందాం అన్నారు. అది ఆధునిక వాగ్గేయకారుడు, భారత దేశం ముఖ్యంగా తెలుగు వారు గర్వించదగ్గ సంగీత విద్వాంసులు శ్రీ మంగళం పల్లి బాలమురళి కృష్ణ కచేరీ. మా ఆఫీస్ కు ఆరు కిలోమీటర్లు దూరంలో శేషాద్రి పురంలో ఆ కచేరీ. ఆరు గంటలకి మొదలవుతుంది. మీరు వెంటనే వెళ్ళండి. శివాజీ నగర్ బస్ స్టాప్ వరకు వెళ్లక్కర్లేదు. మన ఆఫీస్ వెనక కబ్బన్ పార్క్ స్టాప్ లో బస్ వస్తుంది అని దిగవలసిన stop చెప్పారు.

suryaబాలమురళి గారితో నా పరిచయం స్వర యానం అనుకుంటే ఈ ప్రపంచంలో వేలాది మందికి ఆయనతో స్వర యానం అనుభవాలు ఉన్నాయి. శాస్త్రీయ సంగీతాన్ని ప్రేమించిన వారందరూ ఆయనతో ఈ స్వర యానం చేసిన వారే.

నిజానికి సంగీతం గురించి నాకు ఓనమాలు రావు (ఇప్పటికీ కూడా) అయినా నేను బాగా ఆస్వాదిస్తాను. నేను ఎంతగా అందులో లీనం అయిపోతాను అంటే ఒక కీర్తన… ఒక పాట వింటుంటే మధ్యలో ఎవరు మాట్లాడినా… ఇంకేదైనా అంతరాయం వచ్చినా చాలా కోపం వస్తుంది. కొన్ని పాటలు, పద్యాలు, కృతులు కీర్తనలు వింటుంటే అసలు మన జన్మకు సార్థకత ఇదేనేమో అనిపిస్తుంది. నేను పుల్లయ్యగారు చెప్పినట్లు బస్ పట్టుకుని శేషాద్రిపురం బస్ స్టాప్ లో దిగాను. అక్కడనుంచి కచేరీ జరుగుతున్న కాలేజీ ఆవరణకు పది నిమిషాలు నడవాలి అని చెప్పారు. దిగగానే ఒక ఆలాపన వినిపించింది. అది వింటు నడుస్తున్నాను. ఎలా రోడ్ క్రాస్ చేశానో తెలియలేదు. దృష్టి అంతా రసగంగా ప్రవాహంలా సాగుతున్న ఆలాపన మీదనే ఉంది. పద్యాలు పాటలలో నాకిలా ఉంటుంది. నేను 15 నిమిషాలు నడిచి వేదిక దగ్గరకు వచ్చాను. ఆలాపన అయిపోయినట్లే అనిపిస్తూ వివిధ గమకాలతో సాగుతోంది.

కొన్ని పాటలు, పద్యాలు, కృతులు కీర్తనలు వింటుంటే అసలు మన జన్మకు సార్థకత ఇదేనేమో అనిపిస్తుంది.

వందలాది మంది ప్రేక్షకులు తన్మయ త్వంతో ఆస్వాదిస్తూ ఉంటే బాలమురళి కృష్ణ గారు మధ్య మధ్యలో చిరునవ్వు చిందిస్తూ చిద్విలాసంగా తనదైన శైలి లో కచేరీ ప్రారంభించిన క్షణాలు అవి. చిన్నప్పుడు భక్తి రంజనిలో ఏమీ చేతురా లింగా, పా ప్రభో అనే గీతాలు వినడమే. మొదటిసారిగా చూసేసరికి చాలా థ్రిల్లింగ్ అనిపించింది. పత్రికల వారికి కేటాయించిన ముందు వరసలో నన్ను కూర్చోపెట్టా రు. కూర్చున్న ఐదునిమిషాలు కొనసాగిన ఆలాపన 20 నిమిషాలు సాగి నగు మోము అనే పల్లవితో ప్రారంభమైంది.

నా పక్కన సురేష్ అని ఇండియన్ ఎక్స్ ప్రెస్ కన్నడ ప్రభలకు ఫ్రీలాన్స్ గా రాసే సంగీత విమర్శకుడు కూర్చున్నాడు. నన్ను విష్ చేశాడు. నాకు కన్నడ తెలియదు. ఇంగ్లీష్ లోనే పలకరించుకున్నాము. నాకు ఈ కచేరీ గురించి వివరాలు కావాలి అన్నాను. వెంటనే సురేష్ ఒక పాంప్లేట్ ఇచ్చాడు. అందులో ఆరోజు బాల మురళీ పాడే కీర్తనలు – వాటి రాగాలు, తాళం, కృతికర్తల పేర్లు ఉన్నాయి. మనం చాలా కచేరీల వార్తలు తెలుగులో చదువుతుంటాం. ఫలానా సంస్థ అధ్వర్యంలో ఫలానా సంగీత విద్వాంసుడు కచేరీ చేశారు. ఈ ఈ కీర్తనలు పాడారు. రాగం ఇది… తాళం ఇది… వీటిని ఫలానా వాళ్ళు రాశారు. అలాగే అయన సంగీతంలో సాయంత్రం తడిసి ముద్దయింది. పక్క వాయిద్యాలు పోటీ పడ్డాయి… ఇలా పడికట్టు పదాలతో సాగుతుంటాయి. కొందరు ఆ వివరాలు తీసుకుని వెళ్ళిపోతారు మరో కార్యక్రమం ఉందని. నేను అంతకంటే భిన్నంగా రాయాలి అను అనుకున్నాను. కానీ గాన మాధుర్యం అని రాయగలను గానీ ఎందుకు అంత మాధుర్యమో తెలియదు. అంత జ్ఞానం లేదు. సురేష్ నీ అడిగాను, ఇంగ్లీష్ లో బాలమురళి లో నీకు కనిపించిన అనిపించిన వైవిధ్యం ఏమిటి? Why he is alone considered as great అని. అతను చెప్పిన సమాధానాలు నోట్ చేసుకున్నాను. బాలమురళి గారిని ఇది అయాక కలవోచ్చునా అని అడిగాను. Sure. నేను పరిచయం చేస్తాను అని చెప్పాడు. సురేష్ నాకంటే ఒక నాలుగేళ్లు పెద్ద ఉంటాడు. నాలో ఆసక్తి గమనించాడు. తరువాత నాకు ఒక సంగీత నిఘంటువు ఇచ్చాడు.

కచేరీ ముగిసిన తరువాత నన్ను వేదిక వెనక ఉన్న గెస్ట్ రూమ్ లో బాలమురళి గారికి పరిచయం చేశాడు. ఆంధ్రప్రభ అనగానే అయన రండి రండి అని తెలుగులో నవ్వుతూ ఆహ్వానించారు. కచేరీ కవర్ చేయటానికి వచ్చారు అని సురేష్ చెప్పాడు. సంతోషం. ముందునుంచి విన్నారా అని అన్నారు. అప్పుడు చెప్పాను. ఆలాపన వింటూ నేనెలా నన్ను నేను మరిచిపోయింది. దానికి చాలా సంతోషించారు. మనసుకు ఆనందం కలిగించటమే సంగీతం పరమార్థం అన్నారు. అంటూ టైం 9.30 అయింది. భోజనం చేద్దాం లేవండి అని నన్ను సురేష్ ను చూస్తూ అన్నారు. నేను మోహమాట పడ్డాను. లేదు సర్…నేను చాలా దూరం వెళ్ళాలి అన్నాను. ఇంతలో అక్కడ ప్రధాన నిర్వాహకుడు ఫర్వాలేదు సర్.. నేను మిమ్మల్ని డ్రాప్ చేస్తాను అన్నారు. ఆయన పేరు మూర్తీ… పెద్ద ఆడిటర్ అని తరువాత తెలిసింది. నేను పాడింది విన్నారు. నాగురించి ఈ కార్యక్రమం గురించి వివరాలు మీకు ఇచ్చారు. మీ ఫోటోగ్రాఫర్ చాలా snaps తీశాడు. ఇంకా ఎం మాట్లాడతారు? అన్నారు బాల మురళీ కృష్ణ గారు. నేను తెల్ల మొహం వేసాను. ఆయనని ప్రశ్నించే అర్హత జ్ఞానం ఉన్న పెద్ద విమర్శకుడిని కాదు. అంత వయసు అర్హత కూడా లేదు. అయినా ఒక జర్నలిస్ట్ గా మన పరువు నిలుపు కావాలి అనిపించి అంత సేపు ఆలాపన… గమకాలు…మొత్తంగా కచేరీ సామాన్య శ్రోతలలో ఆసక్తిని ఎంతవరకు ఎక్కువ సేపు ఉంచగల్గుతుంది? అని ఒక ప్రశ్న వేసాను. దానికి అయన నవ్వుతూ శాస్త్రీయ సంగీతం గురించి ఎంత తెలుసుకుంటే అంత అసక్తి కరంగా ఎంజాయ్ చెయ్యొచ్చు. సంప్రదాయం అభిరుచి ఇలాంటివి దీనితో కలసి ఉన్నాయి. అసలు మీరు వేసిన ప్రశ్న మీద ఒక పుస్తకమే రాయొచ్చు. మీరు త్యాగరాజ కీర్తనలు సంప్రదాయ సంగీతం అవి విన్నారా అడిగారు.

నిజంగా ఆక్షణంలో తిలక్ అమృతం కురిసిన రాత్రి నా మైండ్ లో లేదు. అలాంటి అమృతం కురిసిన రాత్రి మధురమైన రేయితో బాలమురళి గారితో
నా పరిచయం మొదలైంది

పూర్తిగా ఏ కచేరీ వినలేదు సర్. మీరు ప్రస్తావించినవి రేడియోలో అరకొర వినడమే. అంత శ్రద్ధగా వినలేదు. మీరు పాడిన భక్తప్రహ్లదలో పాటలు నాకు ఇష్టం అన్నాను. Good. నిజం చెప్పాలంటే సినిమా పాటలు పాడటం అంత సులువు కాదు. కచేరీ చేయాలంటే సంగీత జ్ఞానం ప్రాక్టీస్ ఇవన్నీ ఉంటాయి. అక్కడ అవేమీ అంతగా అక్కర్లేదు. మైక్ సెన్స్,ఆ టెక్నిక్ తెలుసుకుని మంచి గొంతు ఉంటే చాలు అన్నారు.

నేనేమీ మాట్లాడలేదు. తర్వాత ఆ రోజు కచేరీలో అంశాల ప్రాముఖ్యత గురించి ఆయనే చెప్పారు. తరువాత సెలవు తీసుకున్నాను. మద్రాసు వస్తె ఫోన్ చేయండి అని నవ్వుతూ అన్నారు. నేను వచ్చేసాను. బెంగళూర్ లో అప్పుడు ఓకె ఒక తెలుగు పేపర్ ఆంధ్రప్రభ .ఇంకేమి లేవు. తెలుగువాళ్ల సాహితీ సంస్థలు కూడా ఉన్నాయి.

మర్నాడు నేను ఆఫీస్ కి వెళ్లి ఒక ఐటెం రాస్తాను అని చెప్పాను. నేను అందరి కంటే వయసులో చిన్నవాడిని. సంగీతం గురించి బాగా తెలిసిన బుద్ధవరపు నాగరాజు గారు మాకు బాస్. ఆయన బాలాంత్రపు రజనీకాంతరావు గారికి బావమరిది. నేను బాలమురళి గారు చెప్పిన అంశాలు కచేరీలో పాడిన కీర్తనలు కృతులు, వాటికి సంబదించిన వివరాలతో న్యూస్ ఐటెంగా కాకుండా
వ్యూస్ ఐటెంగా ఒక బ్యానర్ ఐటెం సైజ్ లో రాసి ఒక వెరైటీగా ఒక హెడ్ లైన్ పెట్టాను. అది అనాలోచితంగా వచ్చిన హెడ్లైన్. అది’ ఆలాపనలో అమృతం కురిసిన రాత్రి ‘. ఇది చూడగానే పుల్లయ్య గారు, మా చీఫ్ సబ్ ఎడిటర్ గుడిపాటి శ్రీ హరికృష్ణ గారు మెచ్చుకున్నారు. అది నాగ రాజు గారి దగ్గరకు వెళ్ళింది. అది చదివి నన్ను.పిలిచారు. ఏమిటి నీకు సంగీతం వచ్చునా అడిగారు.లేదండి అసలు రాదు. మరి ఈ రాగ ఛాయలు, మనోధర్మ్మం , తిల్లాన ఇలాంటి పదాలు న్యూస్ ఇటెంలో తక్కువగా కనిపిస్తాయి. చాలా బాగా రాశారు. కీప్ ఇట్ అప్. బాగా బేసిక్స్ స్టడీ చెయ్ అని సలహా ఇచ్చారు. బాల మురళీ గారిని బాలగంగాధర్ ను కలిపావు అన్నారు. నిజంగా ఆక్షణంలో తిలక్ అమృతం కురిసిన రాత్రి నా మైండ్ లో లేదు. అలాంటి అమృతం కురిసిన రాత్రి మధురమైన రేయితో బాలమురళి గారితో
నా పరిచయం మొదలైంది

బాల మురళీ గారూ నవ్వుముఖంతో రండి అని అన్నారు. మీరు రాసింది నాకు మూర్తీ గారు పంపారు. థాంక్స్ for your overwhelmed and emonotiinal review అని అన్నారు. మీ రాసిన దాంట్లో నాకు sense of involvement కనిపించింది. మీరు మీ వృత్తిలో పైకి రావాలి అని కోరుకుంటున్నాను అన్నారు.

బాలమురళి గారితో నా పరిచయం స్వర యానం అనుకుంటే ఈ ప్రపంచంలో వేలాది మందికి ఆయనతో స్వర యానం అనుభవాలు ఉన్నాయి. శాస్త్రీయ సంగీతాన్ని ప్రేమించిన వారందరూ ఆయనతో ఈ స్వర యానం చేసిన వారే. బెంగళూర్ లో ఉన్నప్పుడు సినిమా వాళ్ళతో కూడా పరిచయం అయింది. అలా పరిచయం అయిన ప్రముఖులలో ఆదిశంకరాచార్య, భగవద్గీత, రామానుజాచార్య చిత్రాలు రూపొందించిన శ్రీ జివి అయ్యర్ ఒకరు. అయన రూపొందించిన శంకరాచార్యకు జాతీయ స్థాయిలో స్వర్ణ పురస్కారం లభించింది. ఆ సందర్భంగా ఆయనను ఇంటర్వ్యూ చేశాను. అప్పుడు ఆయన నన్ను హంస గీతే చిత్రంపై ఒక సదస్సు వుడ్ ల్యాండ్స్ లో వచ్చే శనివారం ఉంది రండి. దానికి సంగీత దర్శకత్వం చేసిన బాల మురళీ కృష్ణ గారు వస్తున్నారు అని చెప్పారు. కొంచెం ముందుగా రండి. బాల మురళీ గారితో విడిగా మాట్లాడొచ్చు అన్నారు అయ్యర్ స్వచ్ఛమైన తెలుగులో. తమిళం తెలుగు కన్నడ సంస్కృతం అనర్గళంగా మాట్లాడే అయ్యర్ మాతృభాష ఏమిటో చెప్పటం కష్టం. అలాగే సర్ వస్తాను అని సెలవు తీసుకుని శనివారం 4.30 కే అక్కడికి చేరుకున్నాను. అయ్యర్ గారికి రిసెప్షన్ నుంచి కాల్ చేస్తే రూం నంబర్ చెప్పి రమ్మన్నాను. నేను రూమ్ కు చేరుకున్నాను. లోపలకీ వెళ్ళగానే సోఫాలో బాల మురళీ గారూ పక్కన అయ్యర్ గారు ఉన్నారు. వెళ్ళగానే నమస్కారం చేశాను. అయ్యర్ నన్ను రండి అన్నారు. అంత పెద్దాయన నన్ను బహువచనంతో మన్నించడం కొంచెం సిగ్గుగా అనిపించింది. నన్ను చూపించి పరిచయం చేశారు. మీ వాళ్ళే అన్నారు. బాల మురళీ గారూ నవ్వుముఖంతో రండి అని అన్నారు. ఆంధ్రప్రభ అని చెప్పారు. అయ్యో నాకెందుకు. తెలియదు. శేషాద్రిపురం కచేరీ కి వచ్చారు కదా. హెచ్ ఎన్ సురేష్ ఫ్రెండ్ కదా అన్నారు. అవును సర్ అన్నాను నేను. మీరు రాసింది నాకు మూర్తీ గారు పంపారు. థాంక్స్ for your overwhelmed and emonotiinal review అని అన్నారు. నేనేమీ మాట్లాడలేదు. మీ రాసిన దాంట్లో నాకు sense of involvement కనిపించింది. మీరు మీ వృత్తిలో పైకి రావాలి అని కోరుకుంటున్నాను అన్నారు. థాంక్స్ సర్. నాకు ఏమాత్రం అవగాహన లేకుండా రాశాను అన్నాను. అవగాహన క్రమంగా వస్తుంది ఎవరికైనా. అనుభవం కావాలి అన్నారు.

శాస్త్రీయ సంగీతం బాగా తెలిసిన కమర్షియల్ సంగీత దర్శకులు చాలా మంది ఉన్నారు కదా. మరి బాల మురళీ గారినే ఎందుకు ఎంచుకున్నారు? అని అయ్యర్ గారిని బాల మురళీ గారి ఎదుటే అడిగాను. అక్కడే అయ్య్యర్ గారి పక్కనే కూర్చున్న అయన కుమార్తె  ఎస్టు ధైర్య నిమగే అన్నట్లు చూసింది.

అన్నట్టు, హంసగీతే కు ఆయనే సంగీతం చేశారని అయ్యర్ గారు చెప్పటం తో నేను అంతకుముందు రోజు ఆ సినిమా చూసాను. అది సెకండ్ రిలీజ్. ఒక గురువు దగ్గర సంగీత విద్య అభ్యసించటానికి ఒక శిష్యుడు పడే శ్రమ, తపన అందులో కనిపిస్తుంది. ఆ తరువాత కన్నడలో పుట్టన్న కనగల్ తీసిన ఉపసానే కూడా సంగీతమే ప్రాణంగా పెరిగిన ఒక యువతికి ఆమె గురువుకు మధ్య పవిత్ర భావనలతో జరిగిన కథ. ఈ చిత్రాలు 75 -78 మధ్య వచ్చాయి. తరువాత శంకరాభరణం శాస్త్రీయ సంగీతం ప్రధాన ఇతివృత్తంగా తెలుగులో విడుదలైంది. ఈ చిత్రానికి బాల మురళీ గారిచేత కూడా పాడిద్దామని ఒక దశలో అనుకున్నారట. శాస్త్రీయ సంగీతం బాగా తెలిసిన కమర్షియల్ సంగీత దర్శకులు చాలా మంది ఉన్నారు కదా. మరి బాల మురళీ గారినే ఎందుకు ఎంచుకున్నారు? అని అయ్యర్ గారిని బాల మురళీ గారి ఎదుటే అడిగాను. అక్కడే అయ్య్యర్ గారి పక్కనే కూర్చున్న అయన కుమార్తె (నా వయసే ఉంటుంది) ఎస్టు ధైర్య నిమగే అన్నట్లు చూసింది. రెండుసార్లు నేను వాళ్ళింటికి వెళ్ళటం వల్ల పరిచయం ఏర్పడింది. నేను ఖాతరు చేయనట్లు అయ్యర్ వైపు చూస్తున్నాను. బాల మురళీ కూడా అయనవైపే నవ్వుతూ చూస్తూన్నారు. I want to depict pure nature of classical music. శాస్త్రీయ సంగీతం మౌలిక రూపం గురించి ప్రేక్షకులు తెలుసుకోవాలి. అనుభవించాలి. అది నా తాపత్రయం అన్నారు అయ్యర్. మరి బాల మురళీ గారు అని పూర్తి చెయ్యకుండానే he is only apt because he is an incarnation of music అని అన్నారు. దానికి నేను ఊరు కోకుండా మీరేమంటారు సర్ అని బాల మురళీ గారిని అడిగాను. అయన వెంటనే why should I deny? ఆయన అభిప్రాయం కాదనే హక్కు నాకు లేదు అని నవ్వుతూ సమాధాన నిచ్చారు.

సంగీతం కోసమే పుట్టి అది తప్ప మరే ధ్యాస లేని బాలమురళి గారి మాటల్లో నాకు అతిశయోక్తి గానీ , గర్వం గానీ కించిత్తు కనిపించలేదు. అది వారి స్వభావం అనిపించింది.

సంగీతం కోసమే పుట్టి అది తప్ప మరే ధ్యాస లేని బాలమురళి గారి మాటల్లో నాకు అతిశయోక్తి గానీ , గర్వం గానీ కించిత్తు కనిపించలేదు. అది వారి స్వభావం అనిపించింది. తరువాత సదస్సులో బాల మురళీ సంగీతం గురించే చాలామంది మాట్లాడారు. సబ్జెక్ట్ నాకు తెలియక పోవటం వల్ల ఆ చర్చను ఆస్వాదించే అదృష్టం లేక పోయింది. ఆ క్షణం లో నాకు నేనే ఒక చెవిటి వాడిలా సంగీతాన్ని మాటల్లో చూపిస్తున్నప్పుడు చూడలేని అందుడిలా అనిపించాను.

కాగా, హంస గీతే సంగీతం గురించి మాట్లాడుకోవటం మేధోపరమైన స్థాయికి చిహ్నంగా మారింది.ఇది తర్వాత చాలా మంది విశ్లేషకుల రాతల్లో కనిపించింది. బాల మురళి గారిని అడిగాను ఇది ఇంటర్వ్యూ అని కాకుండా ఒక జిజ్ఞాసతో అడుగుతున్నాను. హంస గేతేకు మీరు చేసిన ప్రత్యేకమైన కృషి, ప్రయోగం అంటూ ఏమైనా ఉన్నాయా అని. దానికి ఆయన మీకు సంగీతం గురించి తెలిస్తే అర్థం అవుతుంది.అయితే అయ్యర్ గారు కావలసిన మూడ్, ప్రతి సన్నివేశంలో పాటల్లో తెచ్చే ప్రయత్నమే చేశాను. ఆయన కంపోజింగ్ లో వేరే వెర్షన్ లు దర్శకులకు నిర్మాతలు ఓకె చేయటం అంటూ ఉండదు అని విన్నాను. అయ్యర్ గారికి సంగీత విషయ పరిజ్ఞానం ఉంది. చాలా పుస్తకాలు చదివారాట. ఒక అవగాహనతో తన భావాలను బాల మురళీ గారితో చెప్పటం అలవోకగా స్వరకల్పన చేయటం జరిగిపోయాయి.

సారీ సర్…మిమ్మల్ని ఏ ప్రశ్న వేయాలో తెలియని కంగారులో తప్పుగా మాట్లాడే నేమో అన్నాను. ఆయన లేదు.లేదు. మీ ఇంటరెస్ట్ నాకు నచ్చింది. ఇందులో పొరపాటు ఏమీ లేదు అన్నారు. అప్పుడు మనసు కుదుట పడింది.

జన్మతః సంగీతం అబ్బి స్వర సరస్వతి పుత్రుడైన ఆయనను నేను ఇలాంటి ప్రశ్న వేయటం అవివేకం అని తరువాత అనిపించింది. అదే ఆయనతో అన్నాను. సారీ సర్…మిమ్మల్ని ఏ ప్రశ్న వేయాలో తెలియని కంగారులో తప్పుగా మాట్లాడే నేమో అన్నాను. ఆయన లేదు.లేదు. మీ ఇంటరెస్ట్ నాకు నచ్చింది. ఇందులో పొరపాటు ఏమీ లేదు అన్నారు. అప్పుడు మనసు కుదుట పడింది. తరువాత బెంగుళూరులో నాలుగైదు కచేరీ లకు వెళ్లాను గానీ కుశల ప్రశ్నలు వేసుకుని సెలవు తీసుకోవటం జరిగింది

ఒకసారి అయన నుంచి నేను ఆఫీస్ లో ఉన్నప్పుడు ఒక కాల్ వచ్చింది. ఒక కన్నడ దిన పత్రికలో ఒక ఆదివారం సంచికలో అయన గురించి ఒక వ్యాసం వచ్చిందట. ఆ కాపీ పోస్ట్ లో పంపుతారా అని అడిగారు. నేను ప్రజావాణిలో వచ్చిన ఆ వ్యాసాన్ని పోస్ట్ లో పంపించాను. అందుకున్నాక ఫోన్ చేసి థాంక్స్ బాబూ మీకు శ్రమ ఇచ్చాను అన్నారు. నేను అందుకు ఇది నా అదృష్టం సార్ అని అన్నాను
తరువాత చెన్నై వచ్చాక పరిచయం పెరగటానికి కొన్ని ఆసక్తి కరమైన సంఘటనలు జరిగాయి.

(మిగితాది రేపు )

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article