Editorial

Monday, December 23, 2024
స్మరణఈ విశ్వంలో అత్యంత విలువైనది ఏమిటి? – సౌదా తెలుపు

ఈ విశ్వంలో అత్యంత విలువైనది ఏమిటి? – సౌదా తెలుపు

సరిగ్గా ఇరవై ఆరేళ్ళ క్రితం. పూనే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్.
ఆ రోజు ప్రశ్నలు అడుగుతున్నాం.
ఈ ప్రపంచంలో ముఖ్యమైంది ఏమిటీ? అని అడిగాను బుద్ధా దేవ్ దాస్ గుప్తా గారిని.
ఈ ప్లానెట్ లో అత్యంత విలువైనది ఏమిటి? అని అడిగాను. చాలా గొప్పగా మీరు భావించేది ఏమిటో చెబుతారా? అని వినమ్రంగా అడిగాను. అది మనిషి హృదయమా, మేధస్సా? ఏమిటి అని కుతూహలంతో అడిగాను.
అవి కాదు, ఈ ప్రపంచంలో ముఖ్యమైంది ‘ముఖం’ అన్నారాయన.అది విని నేను ఎంతటి విస్మయానికి గురయ్యానూ అంటే అప్పటిదాకా ఉన్న నా ఆలోచనలు ఒక్కసారి మారిపోయాయి.
ఆ ప్రశ్న అడగడానికి ముందు జరిగిన ఒక సంఘటన చెప్పాలి మీకు….

buddadeb das gupthaజూన్ పదవ తేదీన మరణించిన ప్రముఖ సినీ దర్శకులు, నిర్మాత, కవి బుద్ధదేవ్ దాస్‌ గుప్తాపై కవి, నాటక కర్త, దర్శకులు సౌదాతో రచయిత మారసాని విజయ్ బాబు జరిపిన సంభాషణ ఆధారంగా రాసిన ఆత్మీయ నీరాజనం ఇది. మొదటి భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి. ఇది చివరి భాగం.

వ్యాసకర్త సౌదా – తన జీవన సహచరి అరుణతో …

పూనే ఇన్స్టిట్యూట్ లో మా కోర్సు ఆ వారం ముగుస్తుంది. అపుడు వచ్చారు బుద్ధా దేవ్ దాస్ గుప్తా.

కనిమొలి, నేనూ వారితో ఆ వారం రోజులు తిరుగుతూ ఉన్నాము.

మధ్యాహ్నాలు పూనే ఫిలిం ఇన్స్టిట్యూట్ ఎదురుగా ఉండే ఒకరింట్లో భోజనానికి వెళ్ళేవాళ్ళం.

భోజనానికి వెళితే అక్కడికి మాతో పాటు శ్రీలంక నుంచి వచ్చిన ఒక వ్యక్తి వచ్చేవాడు. కొంచెం నలుపు వాటంతో ఉండేవాడు. చామన ఛాయ కంటే నలుపన్న మాట. మహాభారత్ లో కృష్ణుడి కేరెక్టర్ నితిన్ భరద్వాజ్ ఎలా ఉండేవాడు. ఆ టైప్ లో ఉండేవాడు…నల్లగా. అట్లా.

మేం మాటల సందర్భంలో భోజనం చేస్తూ మీరేం చేస్తారూ అంటే నేను శ్రీలంకలో హీరో నండి అన్నాడు. నా పక్కన నాతో పాటు ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన ధర్మారెడ్డి అనే వాడుండేవాడు. అతడన్నాడు, మనకేమన్న చెవులో పువ్వులున్నయా…అని.

విషయం తెలుసా. అతడు మరుసటి రోజు పేపర్ తెచ్చాడు. దాంట్లో ఏముందో తెలుసా? సిరిమాను గుణ కనక అన్న పేరేదో ఉంది. అల్లు అర్జున్ యాక్టింగ్ కోర్సుకు హాలివుడ్ కి వెళ్ళాడంటే మన పత్రికలూ ఎట్లా రాస్తాయో అట్లా అయన యాక్టింగ్ కోర్సు కోసం ఇండియా వెళ్ళాడని అక్కడి పత్రికలూ మొదటి పేజిలో న్యూస్ రాశాయి. అతడు అది చూపించాక ధర్మారెడ్డి… వీడు మామూలోడు కాదు బాబూ అన్నాడు. అంటూనే…అతడు మామూలోడు అవునా కాదా తెలీదు గానీ నువ్వు మాత్రం ఎదవ్వి అని చెప్పాడు.
అతడేమో నేను హీరో అని చెబుతున్నాడు. ఇతడేమో వాడు హీరో ఏంటి అని నమ్మకం కుదరక నన్ను నిందిస్తున్నాడు.

అదేంటి? అతడు మనతో పాటు అన్నం తినేస్తే హీరో కాకుండా పోతాడా? మనతో పాటు హవాయి చెప్పులు వెసుకుని నడిచినంత మాత్రాన బుద్ధ దేవ్ దాస్ గుప్తా తాను కాకుండా పోతాడా? కనిమొలి కరుణానిధి కూతురు కాకుండా పోతుందా? అన్నాను నేను.

నిజమే. మనం సామాన్యులం కదా. గొప్పవాళ్ళతో మనం నిజంగా ఉన్నామా? లేక వాళ్ళు నిజంగానే గొప్పవాళ్ళా? సందేహం వస్తుంది.

ఐతే పూనే ఫిలిం ఇన్స్టిట్యూట్ అందరినీ సమంగా చూసే ఒక అద్భుతమైన సంస్థ. దానికి తర తమ చిన్నా పెద్దా అన్న భేదం లేదు. ఆ ఇన్స్టిట్యూట్ ఒక తల్లి అనుకో. ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళయినా ఆ తల్లికి అందరూ బిడ్డలే. నల్లగా ఉన్నా తెల్లగా ఉన్నా పొట్టిగా ఉన్న పొడవుగా ఉన్నా అందరూ సమానమే.

శ్రీలంకలో అతను హీరో. నాకు తెలిసి అతడు అందగానే ఉన్నాడు. తర్వాత అతడు మంచి రైటర్ కూడా అని తెలిసింది. ఆ రోజంతా బుద్ధా దేవ్ దాస్ గుప్తా, కళిమొని, ధర్మారెడ్డి, నేనూ…చాలా మంది ఉంటాం కదా స్టూడెంట్స్…మేం అట్లా సన్నిహితంగా గడిపాం. ఆ వాతావరణం చూసి నేనక్కడ ఆరు నెలలు అక్కడే ఉండిపోయాను. రాబుద్ది కాలేదు. ఇంకా వేస్టు. మళ్ళీ వెళ్లి పత్రికలో చేరడం ఏమిటి అని అనిపించింది. అట్లా నన్ను ప్రభావితం చేసిన వాళ్ళలో బుద్ధా దేవ్ దాస్ గుప్తా ఒకరు.

తనని చూస్తుంటేనే నాకు అనిపించేది. మనవంటి సామాన్యులకు కూడా సినిమా అనేది ఒక ఆర్ట్ ఫాం మాత్రమే. అదేదో అందుకోలేని, సంపన్నులకు మాత్రమే సంభందించిన బిజినెస్ కాదని. ఆ సంగతి అయన ముఖమే నాకు అట్లా తెలియజేసింది. ముఖం. అవును ముఖం.

మాకు క్లాసులు జరుగుతుంటే నేనప్పుడగాను. అత్యంత ముఖ్యమైనది ఈ ప్లానెట్ మీద ఏమిటండీ అని అడిగాను. చాలా గొప్పదని దేన్ని భావిస్తారూ అని అడిగాను. హృదయమా, మేధస్సా ఏదని అడిగాను.

మాకు క్లాసులు జరుగుతుంటే నేనప్పుడగాను. అత్యంత ముఖ్యమైనది ఈ ప్లానెట్ మీద ఏమిటండీ అని అడిగాను. చాలా గొప్పదని దేన్ని భావిస్తారూ అని అడిగాను. హృదయమా, మేధస్సా ఏదని అడిగాను. కాదు, మనిషి ముఖం అన్నారాయన.

ఎందుకంటే, వాడి మేధస్సేమిటో మనకు కనపడదు. వాడి హృదయం ఏంటో మనకు కనపడదు. మనకు కనపడేది ముఖం. దీనికన్నా విలువైనది ఉంకోటి ఉందని నేను అనుకోను అని చెప్పారాయన.

మనిషి ముఖం కన్నా విలువైనదేదీ లేదన్నరాయన.

ఇదంతా ఎప్పుడు? ఫేస్ బుక్ అనేది భూమ్మీద అవతరించక ముందు మాట అది. అంటే, మనిషి ముఖం కన్నా విలువైనదేదీ లేదన్నరాయన. ఇది ఆ తర్వాత తెలుగు యూనివర్సిటిలో స్క్రీన్ ప్లే క్లాసులు చెప్పేటప్పుడు చెప్పాను. వాటీజ్ స్క్రీన్ ప్లే అన్నప్పుడు బుద్ధా దేవ్ దాస్ గుప్తా చెప్పిందే చెప్పాను.

స్క్రీన్ ప్లే అంటే చాలా మంది రకరకాలుగా చెబుతారు. నేను ముఖం అని చెప్పాను. పరుచూరి గోపాలకృష్ణ ఆ పక్కనే ఉన్నారు. ఆయనతో పాటే నేను క్లాసులు చెప్పాను. ముఖ మేమిటి వీడి ముఖం… అనుకున్నారు. నేను ఉదాహరణతో చెప్పాను.

మాయాబజార్ సినిమా ఉంది. అందులోఎన్టీఆర్ కాకుండా మరొకరిని…కృష్ణుడిగా కాంతారావు, సత్యనారాయణ – ఇంకెవరినైనా పెట్టి తెస్తే ఆడేదా? అప్పుడు ఆ స్క్రీన్ ప్లే సంగతి ఏమిటి? నిజంగా నువ్వు స్క్రిప్ట్ లో రాసుకున్నావు కదా స్క్రీన్ ప్లే. అదే కదా. నటుడితో నిమిత్తం లేకుండా రాసుకున్నావు కదా. మరి అదే గ్రేట్ అయితే ఎవరితో తీసినా సినిమా ఆడాలి కదా..

అందుకే చెప్పడం…సినిమా అంటే బౌండ్ స్క్రిప్ట్ లో ఉండే కథ కాదు, ముఖం.

నవలకైతే ముఖం లేదు. నీ ఇష్టమొచ్చినట్టు రాసుకో. కానీ నువ్వు తెరమీద చూపిస్తున్నప్పుడు అది వేరు.

ఉదాహరణకు ఇదారేళ్ళ పిల్లవాడు…పక్షి చనిపోతే… వాడు తాతను గుర్తు చేసుకొని తాను మామిడి టెంకె నాటితే పండ్ల చెట్టు రావడం గుర్తు చేసుకొని తాను ఆ పక్షిని పూడ్చి రోజూ నీళ్ళు పోస్తే చిలకల చెట్టు వస్తుందని అనుకుంటాడు.

ఉదాహరణకు ఇదారేళ్ళ పిల్లవాడు…పక్షి చనిపోతే… వాడు తాతను గుర్తు చేసుకొని తాను మామిడి టెంకె నాటితే పండ్ల చెట్టు రావడం గుర్తు చేసుకొని తాను ఆ పక్షిని పూడ్చి రోజూ నీళ్ళు పోస్తే చిలకల చెట్టు వస్తుందని అనుకుంటాడు.

ఇదారేళ్ళ పిల్లవాడి పాత్ర అది. ఆ పాత్ర ఏ విధంగా ఉండాలో దానికి సరిపోయే వయస్కుడు నాటితే బావుంటుంది. వాడికి బదులు యే ముప్పయ్ ఏళ్ల వ్యక్తినో పెట్టి తీస్తే నప్పుతుందా? నప్పుదు. అప్పుడు మరి నీ స్క్రీన్ ప్లే సంగతి ఏమిటి?

ఆయన ముఖం అన్నాడు. ఆ పిక్చర్ లో ఆ పిల్లవాడి ముఖమే స్క్రీన్ ప్లే …ఆ కథకు ఆ ముఖాన్ని నేను ఎన్నుకోవడంతోనే నా పని ఐపోయింది అన్నాడు.

నేను ఆ ముఖంతో తప్పా వేరే ముఖంతో ఆ కథను చెప్పలేను అని కూడా… నొక్కి చెప్పాడు.

చిత్రమైనదేమిటంటే, ఆ ముఖం ప్రభావాన్ని కనిపెట్టడానికి చాలా తెలివి కావాలి.

ముఖం స్క్రీన్ ప్లే అనడానికి కూడా చాలా సాహసం కావాలి.
ఫేస్.
ముఖం.
అవును. ఆయన ముఖం కూడా.

రోజంతా పిచ్చాపాటి… ఏవేవో మాట్లాడుకునేవాళ్ళం. అట్లా మాట్లాడుకుంటుండగా … భయపడొద్దు బాబూ… సినిమా అంటే… అని ఒదార్చినట్టుగా ఉంటుంది అయన ముఖం.

ఎవరైనా సినిమా ఫీల్డ్ లోకి కొత్తగా రావాలనుకో….బుద్ధ దేవ్ దాస్ గుప్తా వంటి వారితో ఒకరోజు తిరిగితే వారికి అన్ని భయాలు వోదిలిపోతాయి.

సినిమా ఫీల్డ్ కూడా ఒక ఆర్ట్ ఫీల్దే. ఇదేమీ అందుకోలేని, చేరరాని, ధనవంతుల మహల్ కాదు అని అనిపిస్తుంది. అంతటి నమ్మకాన్ని ఇచ్చిన ముఖం అయన. ఎప్పటకీ మరచిపోలేను.

ఇదంతా నేను కళ్ళు మూసుకొని ఫిలిం ఇన్స్టిట్యూట్ లో తిరుగుతూ ఉన్నట్టు, నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుని చెప్పాను. 

 

More articles

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article