నిన్న ఈ మహనీయుడి జయంతి. ఈ సందర్భంగా వాట్స్ ప్ సందేశాలలో పలువురిని ఆకర్షించిన స్పూర్తిదాయక నివాళి ఇది.
అది 1935 సంవత్సరం. నెల్లూరుజిల్లా లోని అలగానిపాడు గ్రామం.
14 సంవత్సరాల నూనూగు మీసాల అబ్బాయి తన పెద్దన్నయ్య గారి దగ్గరకు వచ్చి “అన్నయ్యా నేను పబ్లిక్ పరీక్షలలో జిల్లాలో ప్రధముడిగా వచ్చాను”అని సంతోషంగా చెప్పాడు. ఆ మాటలు విని అప్యాయంగా తమ్ముడిని దగ్గరకు తీసుకున్నాడన్నయ్య. తమ్ముడు కళ్ళలోనికి చూస్తుా…తర్వాత ఏమి చదువుతావురా? అడిగాడు అనునయంగా. “అన్నయ్యా నేనూ మీలాగ ఉద్యమంలో పాలుపంచుకుంటాను” అని చిన్న సమాధనం ఇచ్చి అన్నయ్యకళ్ళలోనికి చూసాడు.
“పేదరికం ఒక సంవత్సరమో, పది సంవత్సరాలకో అంతమయ్యేది కాదు. దానిని అంతమొందించాలంటే సామాజిక, ఆర్థిక, విద్య, ఆరోగ్యరంగాలలో ప్రజలను మెరుగుపరచాలి.”
చిన్నగా ఒక నవ్వునవ్విన ఆ అన్న”చూడు తమ్ముడూ …ఉద్యమనేది నిరంతరం సాగేది. కేవలం పోరాటాలే దీనిలో భాగంకాదు. పేదరికం ఒక సంవత్సరమో, పది సంవత్సరాలకో అంతమయ్యేది కాదు. దానిని అంతమొందించాలంటే సామాజిక, ఆర్థిక, విద్య, ఆరోగ్యరంగాలలో ప్రజలను మెరుగుపరచాలి. ఆల్ రెడీ నేను రాజకీయంగా కొన్ని వ్యవస్థల మార్పుకోసం కృషి చేస్తున్నాను. నువ్వు ఆరోగ్యపరమైన వ్యవస్థను మెరుగుపరిచేందుకు డాక్టర్ కోర్సు చదువు నాయానా.. ప్రజలందరికీ ఉచితవైద్యం అందించు- అదే మహా ఉద్యమం” అన్నాడు.
అంతే ఏమనుకున్నాడో ఏమో వెంటనే మద్రాసు మెడికల్ కాలేజ్ లో జాయిన్ అయిపోయాడాబ్బాయి. ఒక ఆశయంతో చదివే చదువులో ఎంతో పట్టుదల వుంటుంది. 20 యేండ్లకే డాక్టర్ కోర్స్ పూర్తిచేసి కావలిలో ఉచిత వైద్యశాలను ప్రారంభించాడు.
భూస్వాముల కుటుంబంలో జన్మించినప్పటికీ తమ యావదాస్థినీ సమాజానికే అంకితంచేసి ప్రజల అభివృద్ధికి పాటుపడిన మహనీయులు. రామచంద్రారెడ్డి హాస్పటల్ అంటే తెలియని నెల్లూరీయుడుండడేమో??
తర్వాత నెల్లూరులోని బృందావనం దగ్గర పెద్ద హాస్పటలను ప్రారంభించారు. ఎంతో మంది కమ్యునిష్టు కార్యకర్తలకు ప్రాధమిక చికిత్సచేయడంలో శిక్షణ ఇచ్చి పల్లెప్రజల వైద్య సేవలకై తర్వాత కావలిలో విశ్వోదయ కళాశాలను మరొక ఔత్సాహికునితో కలిసి స్థాపించారు. ఇది ఎంతోమంది పేదలకు విద్యను అందించినదీ విద్యాలయం.
“ఇంతకీ ఆ అన్నాతమ్ముళ్ళు ఎవరనుకుంటున్నారా??
అన్న- లెజండరీ రాజకీయ నాయకుడు కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారు, తమ్ముడు. డాక్టర్ రాం గా పేరుగాంచిన డాక్టర్ పుచ్చలపల్లి రామచంద్రారెడ్డి గారు.
భూస్వాముల కుటుంబంలో జన్మించినప్పటికీ తమ యావదాస్థినీ సమాజానికే అంకితంచేసి ప్రజల అభివృద్ధికి పాటుపడిన మహనీయులు. రామచంద్రారెడ్డి హాస్పటల్ అంటే తెలియని నెల్లూరీయుడుండడేమో??
వారి స్మృతిలో ఇది హృదయపూర్వక నివాళి.