పాఠశాలల్లో భౌతిక వనరుల లేమికి ప్రధానోపాధ్యాయులను బాధ్యులుగా చేస్తూ క్రమశిక్షణ చర్యలు చేపట్టాడాన్ని టీపీటీయఫ్ ఖండిస్తోంది. నిధులు పెంచకుండా విధులు పెంచడం ఏమిటని, ప్రభుత్వ బాధ్యతారాహిత్యానికి హెచ్ఎంలు బలి చేయడం ఏ విధంగానూ సమంజసం కాదని తక్షణం సర్వీస్ పర్సన్స్ నియామకం చేయమని డిమాండ్ చేస్తోంది.
పాఠశాలలో పారిశుద్ధ్య నిర్వహణ, విద్యార్థుల ఆరోగ్యం, మధ్యాహ్న భోజన నిర్వహణ మొత్తం కూడా ప్రధానోపాధ్యాయుడు బాధ్యత వహించాలని రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేయబోవడాన్ని టీపీటీయఫ్ ఖండిస్తోంది. అంతకంటే ముందు ప్రభుత్వం నిధులు పెంచాలని, సర్వీస్ పర్సన్స్ నియామకం చేపట్టాలని తెలంగాణ ప్రోగ్రెస్సివ్ టీచర్స్ ఫెడరేషన్ (టీపీటీయఫ్ ) రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నది.
మధ్యాహ్న భోజన నిర్వహణలో ఎదో ఒకచోట ఒక సంఘటన జరగగానే మొత్తం ఉపాధ్యాయ వర్గాన్ని కారణంగా చూపుతూ వారిని బలిచేయడం సమంజసం కాదని, అటువంటి నిర్ణయాలను ఉపసంహరించుకోవాలని టీపీటీయఫ్ డిమాండ్ చేస్తోంది.
గత రెండు సంవత్సరాలుగా పాఠశాలలో పారిశుద్ధ్య నిర్వహణకు సర్వీస్ పర్సన్స్ ను నియమించాలని చేస్తున్న ఆందోళనలు, ప్రాతినిధ్యాలు పరిశీలించకుండా ప్రభుత్వం ఎకపక్షంగా పంచాయతీరాజ్ శాఖకు పాఠశాలల పరిశుభ్రత బాధ్యతలు అప్పగించినప్పటికీ క్షేత్ర స్థాయిలో అమలు కాలేదు. దాంతో ప్రధానోపాధ్యాయులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నా మరోవైపు పాఠశాల పరిశుభ్రతను నిర్వహిస్తూనే ఉన్నారు. కానీ మధ్యాహ్న భోజన నిర్వహణలో ఎదో ఒకచోట ఒక సంఘటన జరగగానే మొత్తం ఉపాధ్యాయ వర్గాన్ని కారణంగా చూపుతూ వారిని బలిచేయడం ఒక అలవాటుగా మారింది. అది సమంజసం కాదని, అటువంటి నిర్ణయాలను ఉపసంహరించుకోవాలని టీపీటీయఫ్ డిమాండ్ చేస్తోంది.
ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం అనేక వందల, వేల కోట్లతో పలు పథకాలు అయితే ప్రవేశపెడుతోంది. స్వయానా ముఖ్యమంత్రి ధనిక రాష్ట్రమని చెబుతూనే ఉన్నారు. ఐనా 25 వేల పాఠశాలల్లో సర్వీస్ పర్సన్స్ నియామకం చేపట్టకపోవడంలోని అంతర్యామేమిటి? అని టీపీటీయఫ్ ప్రశ్నిస్తోంది. తక్షణం ఆ దిశగా ఆలోచించి నిధులు పెంచాలని, సర్వీస్ పర్సన్స్ నియామకం చేయాలని డిమాండ్ చేస్తోంది. అదే సమయంలో పాఠశాలల్లో భౌతిక వనరుల లేమికి ప్రధానోపాధ్యాయులను బాధ్యులుగా చేస్తూ క్రమశిక్షణ చర్యలు చేపట్టాడాన్ని టీపీటీయఫ్ తీవ్రంగా ఖండిస్తోంది.
-కె. రమణ, అధ్యక్షులు.
మైస శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శి, టీపీటీయఫ్