Editorial

Monday, December 23, 2024
శాసనంనేడు తిరుమల శాసనం తెలుపు -డా. దామరాజు సూర్య కుమార్

నేడు తిరుమల శాసనం తెలుపు -డా. దామరాజు సూర్య కుమార్

Epigraph

నేడు తారీఖు జూన్ 5

నేడు జూన్ 5 వ తారీఖు, తిథి వైశాఖ బహుళ ఏకాదశి, పూర్తిగా నేటి తేదీ, తిథిపై ఎలాంటి తెలుగు శాసనం లభించలేదు కానీ, వైశాఖ బహుళ ఏకాదశి/ద్వాదశి నాటి శాసనం లభించింది.

శక 1435 (క్రీ.శ 1513] శ్రీముఖ నామసంవత్సర వైశాఖ బహుళ ద్వదశి నాటి తిరుమల శాసనంలో శ్రీకృష్ణ దేవరాయలు తిరుమల దర్శించి తిరువేంగడనాథునికి అనేక అమూల్యమైన ఆభరణాలు సమర్పించినట్లుగా చెప్పబడ్డది. ఆభరణాల వివరాలు శాసనంలో చక్కగా వర్ణించబడ్డాయి. రాయలవారికిది రెండవసారి తిరుమల దర్శనమని తి.తి దేవస్థానం వారి గ్రంథంలో రాయబడ్డది. [తి.తి. దేవస్థాన శాసనాలు III, నెం 60]

శీర్షిక నిర్వాహకుల పరిచయం

డా. దామరాజు సూర్య కుమార్ విశ్రాంత చరిత్రోపన్యాసకులు. కీ.శే. బి.ఎన్.శాస్త్రి గారి శిష్యులు. శాసన పరిశోధన ప్రవృత్తి. శ్రీ కృష్ణదేవరాయల తెలుగు శాసనాలు, ఆచంద్రార్కం (తెలంగాణా కొత్త శాసనాలు కొన్ని), తెలంగాణా రెడ్డి రాజుల శాసనాలు – చరిత్ర, ఇప్పటిదాకా వీరు వెలువరించిన మూడు గ్రంధాలు. ప్రస్తుతం భారత ప్రభుత్వం ప్రాజెక్టు చేస్తున్నారు. నివాసం నకిరేకల్, నల్లగొండ జిల్లా.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article