తెలుగు జాతి చరిత్రపై చేసిన పరిశోధనల ఆధారంగా రచించిన ‘జగమునేలిన తెలుగు’ నవలకు గాను పాత్రికేయురాలు డి.పి.అనురాధకు తాపీ ధర్మారావు పురస్కారం. ఈ నెల పన్నెండున జరిగే పురస్కార సభలో ఆ నవల ఆవిష్కరణ.
చరిత్రలోకి అన్వేషణగా సాగే ఈ నవల వేల ఏళ్ళనాడు ఆగ్నేయాసియాలో అజరామరమైన తెలుగు ఖ్యాతికి అక్షర రూపం. రచయిత్రికి అభినందనలు తెలుపు.
ఆగ్నేయాసియాలోని తెలుగు అడుగు జాడలను పరిశోధించి, మూలాలను తన రచనలతో వెలికితెచ్చిన పాత్రికేయురాలు శ్రీమతి డి.పి.అనురాధకు 2021 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మకమైన తాపీ ధర్మారావు పురస్కారాన్ని ప్రకటిస్తున్నట్లు ఆ వేదిక కన్వీనర్ డా.సామల రమేష్ బాబు ఒక ప్రకటనలో తెలియజేశారు.
2009 నుంచి ఇప్పటిదాకా తొమ్మిది మంది పాత్రికేయులు ఈ పురస్కారాన్ని పొందారని, ఆ ఒరవడిలో డి.పి.అనురాధ తన పరిశోధనల ఫలితాలను ‘జగము నేలిన తెలుగు : గోదావరి నుంచి జావా దాకా’ పేరిట నవలా రూపంలో రచించినందుకు గాను ఈ పురస్కారాన్ని ప్రకటిస్తున్నట్టు వారు తెలిపారు.
ఈ నవలలో కథ కంటే ఇతివృత్తం ప్రధానంగా ఉందని, తాను తెలుగు జాతిపై చేసిన పరిశోధనల ఆధారంగా చరిత్రలోకి అన్వేషణగా ఆ నవలను చిత్రించారని వారు వివరించారు. తన పరిశోధనలకు ప్రశంసగా, తోటి యువ పరిశోధకులకు ఆదర్శంగా నిలిచినందుకు అభినందనగా ఈ పురస్కారాన్ని డి.పి.అనురాధకు ప్రకటిస్తున్నట్టు వారు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
పురస్కార సభలో నవల ఆవిష్కరణ
ఈ పురస్కార సభలోనే రచయిత్రి రాసిన ‘జగము నేలిన తెలుగు : గోదావరి నుంచి జావా దాకా’ అన్న నవల అవిష్కరణ కూడా ఉంటుందని, ఈ నెల 12 ఆదివారం ఉదయం పది గంటలకు ఖైరతాబాద్ లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ కామర్స్ కాలేజీలో జరిగే ఆ సభకు తాపీ అభిమానులు, కవులు, రచయితలు, పాత్రికేయులు, సామాజిక ఉద్యమ కారులు పాల్దోన వలసిందిగా కూడా డా. రమేష్ బాబు ఆహ్వ్వానించారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విశ్రాంత న్యాయవాదులు జస్టిస్ రామలింగేశ్వర రావు ఈ పుస్తకాన్ని అవిష్కరిస్తుండగా శ్రీ జయధీర్ తిరుమల రావు సభాధ్యక్షులుగా, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జి.రాధారాణి ముఖ్య అతిథిగా, డా. కె శ్రీనివాస్ విశిష్ట అతిథిగా హజరవుతున్నట్లు వారు తెలిపారు.
రచయిత్రి పాలమూరు బిడ్డ
దుర్గి పాండురంగ అనురాధ స్వస్థలం మహబూబ్ నగర్. వారు ఎల్ ఎల్ బి చదివారు. ఆ తర్వాత ఈనాడు పాత్రికేయ పాఠశాలలో శిక్షణ పొంది జర్నలిస్టుగా స్థిరపడ్డారు. గత పాతికేళ్ళుగా ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాల్లో పని చేశారు. ప్రస్తుతం ఆంధ్రజ్యోతి దిన పత్రికలో ఆదివారం అనుభందంలో చీఫ్ సబ్ ఎడిటర్ గా విధులు నిర్వహిస్తున్నారు.
వృత్తి రిత్యా అనేక రచనలు చేస్తూనే దేశవిదేశాల్లో మరుగు పడిన తెలుగు అడుగు జాడలను, వాటి మూలాలను స్పృశించి చెప్పడం పట్ల వారు ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఇందుకోసం వ్యక్తిగత స్థాయిలో వారు అనేక దేశాలు పర్యటించడం విశేషం. శ్రీలంక, మయన్మార్, థాయిలాండ్, మలేషియా, వియత్నాం, ఇండోనేషియా, నేపాల్, టిబెట్ లలో పర్యటించి, తాను తెలుసుకొన్న పరిశోధనా ఫలితాలను అందరితో ఆసక్తిగా చదివించేలా ‘జగము నేలిన తెలుగు’ పేరిట నవల రూపంలో రాసినట్లు వారు తెలిపారు.
‘చరిత్రపై తెలుగు సంతకం’
ఇది రచయిత్రి తొలి నవల. కాగా పాఠకులతో పాటు శ్రోతలను ఉద్దేశించి ‘చరిత్రపై తెలుగు సంతకం’ పేరిట అనురాధ గారు 26 భాగాల Podcastలు ప్రసారం చేయడం మరో విశేషం. ఈ లింక్ క్లిక్ చేసి వాటిని కూడా వినవచ్చు.
ఆవిష్కరణ సభలో విశిష్ట అతిథులు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విశ్రాంత న్యాయవాదులు జస్టిస్ రామలింగేశ్వర రావు ఈ పుస్తకాన్ని అవిష్కరిస్తుండగా శ్రీ జయధీర్ తిరుమల రావు సభాధ్యక్షులుగా, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జి.రాధారాణి ముఖ్య అతిథిగా, డా. కె శ్రీనివాస్ విశిష్ట అతిథిగా హజరవుతున్నారు.
అన్ని విషయాలతో ఇంత చక్కని నవల అందించిన చిరంజీవి అనురాధ కు శుభాశీస్సులు.
అభినందనలు అనూ. నువ్వు ఇంకా ఎన్నో గొప్ప పురస్కారాలు అందుకోవాలి. పుట్టిన ఊరుకు, కన్న తల్లిదండ్రులకు, మెట్టినింటికి, గౌరవాన్ని గొప్పపేరును తీసుకురావాలి. నువ్వు చేసిన పరిశోధన అనితర సాధ్యమైనది. ప్రోత్సాహం అందించిన మీ శ్రీవారికి ధన్యవాదములు.
జగము నేలిన తెలుగు రచయిత్రికి అభినంధన లు. తెలగు మూలలు వెదకడము గొప్ప కృషి
ఇంకా ఇలా మట్టిలో మాణిక్యాలు ఎన్నో వున్నా యి. ఇలాటివే మన ఇంటి పేర్లు.2000 సం/ పైగా ఉంది.ఉధా. ఆంధ్రమహావిష్ణువు, కుంతల శాతకర్ణి వగైరా.
విశ్ఠిష్ట ఆచార్య మేడపాటి వెంకటరెడ్డి,
పూర్వ సంచాలకులు, ప్రభుత్వ వేమన యోగ పరిశోథనా సంస్థ,
how to purchase this book ?