ఒక్క మెతుకు చాలు, అన్నం ఉడికిందో లేదో చెప్పడానికి అన్నట్లు, అట్లా ఈ ఎనిమిది వ్యాసాలు చాలు, పదేళ్ళలో జరిగిందేమిటో పోల్చుకోవడానికి…
కందుకూరి రమేష్ బాబు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తున్న దశాబ్ది ఉత్సవాల ఈ రోజు ముగియనున్నాయి, ఈ సందర్భంగా గత 22 రోజుల్లో ఒక ఇండిపెండెంట్ జర్నలిస్టుగా సామాన్య పౌరుల ప్రయోజనాలే ప్రామాణికంగా పెట్టుకొని కొన్ని ముఖ్యమైన అంశాలను ఉదాహరణీయంగా తీసుకొని రాసిన ఎనిమిది వ్యాసాలివి. ఇవి చదివితే రాష్ట్రం ఎట్లా తప్పుడు పట్టాలపై నడుస్తున్నదో, ఉద్యమ ఆకాంక్షలకు భిన్నమైన ప్రాధాన్యతలతో ఎలా పని చేస్తున్నదో భోధ పడుతుంది.
1. చూడగలరు ‘అమరత్వం’ ఎట్లా ఒక స్మారక చిహ్నం అయిందో…
2. చదవాలి….‘పాట’ ఎట్లా ఉద్యోగం అయిందో …
3. ఉద్యమంలో పని చేసిన మేధావుల అసలు ముఖాలు ఎట్లా కానవస్తున్నాయో చెప్పే వ్యాసం ఇది…
4. పేరుకు ‘తెలంగాణా కోసమే తెలంగాణా జర్నలిస్టులు’. కానీ ఆచరణలో ప్రభుత్వం భజన బృందంగా మారిన పరిణామం….
5. రాష్ట్రానికి మద్యం ఆదాయమే మేటి వనరు ఐన దుస్థితి….
6.గ్రామ పంచాయతీల నిర్వహణకు సర్పంచులు ఖాళీ మద్యం సిసాలు అమ్ముకుంటున్న దుస్థితి…
7. అన్నిటికన్నా ముఖ్యంగా తెలంగాణా తిరిగి భూస్వాముల చేతుల్లోకి వెళ్ళిన తీరు..
మిత్రులారా…మనందరం నిజానికి ఈ ఏడును దశాబ్ది ఉత్సవ సంవత్సరంగా ఎంచి సంవత్సరమంతా రాష్ట్ర అభివృద్దిపై చర్చ చేయవచ్చు. ఆ పని చేయవలసిందే. కాకపోతే, ఒక్క మెతుకు చాలు, అన్నం ఉడికిందో లేదో చెప్పడానికి అన్నట్లు, అట్లా ఈ ఎనిమిది వ్యాసాలు చూసినా చాలు, జరిగిందేమిటో పోల్చుకోవడానికి.
మరి, ఈ పోస్టును మిత్రులు షేరు చేస్తారని, తెలంగాణ సాధించిన ప్రగతిపై మీ అభిప్రాయాలను కూడా నిర్మొహమాటంగా ప్రకటిస్తారని, తద్వార ఒక ప్రజాస్వామిక చర్చకు, అవగాహనకు దోహదపడుతారని ఆశిస్తాను.
కృతజ్ఞతలతో…