మార్క్సిజాన్ని గొప్ప కళగా మార్చడమే లెనిన్ మానవాళికి చేసిన మహోపకారం. నేడు ఆ మహాశయుడి వర్థంతి సందర్భంగా ఘన నివాళి.
శాంతి శ్రీ
మార్క్సిస్టు సిద్ధాంతాన్ని నిర్ధిష్ట పరిస్థితుల్లో నిర్ధిష్టంగా అమలుచేయడం ఎలాగో కార్మిక వర్గానికి బోధించాడు లెనిన్. అందుకే మార్క్స్ - ఏంగెల్స్ తర్వాత మార్క్సిస్టు మహామహోపాధ్యాయునిగా చరిత్రలో చిరస్థాయి స్థానం సంపాదించుకున్నాడు.
మార్క్సిజం అనే శాస్త్రీయ సిద్ధాంతాన్నిమరో మెట్టు పైకి తీసుకుపోయి దాన్ని ఒక కళగా మార్చాడు లెనిన్.
అందుకే లెనిన్ తర్వాత మార్క్స్-ఏంగెల్స్ సిద్ధాంతం మార్క్సిజంగా కాక ‘మార్క్సిజం-లెనినిజం’గా మారింది.
సిద్ధాంతానికీ, ఆచరణకూ మధ్య ఉన్న గతితార్కిక సంబంధాన్ని ఆచరణలో చూపించడం ద్వారా అక్టోబర్ విప్లవం సాధించాడు లెనిన్.
”మా సిద్ధాంతం పిడివాదం కాదు, అది ఆచరణకు కరదీపిక” అన్నారు మార్క్స్- ఎంగెల్స్.
సిద్ధాంతానికీ, ఆచరణకూ మధ్య ఉన్న గతితార్కిక సంబంధాన్ని ఆచరణలో చూపించడం ద్వారా అక్టోబర్ విప్లవం సాధించాడు లెనిన్.
మార్క్సిజం సిద్ధాంతంగా ఉంటే అది ఒక శాస్త్రంగా (సైన్సుగా) మిగిలిపోతుంది. కానీ అది ఆచరణకు మార్గదర్శిగా మారినప్పుడు ఒక కళగా మారుతుంది.
సైన్సు ఉనికిలో ఉన్నదాన్ని గురించి చెబుతుంది. కళ ఎలా పనిచేయాలో చెబుతుంది.
మార్క్సిజాన్ని గొప్ప కళగా మార్చడమే లెనిన్ మానవాళికి చేసిన మహోపకారం.