Editorial

Wednesday, January 22, 2025
సంపాద‌కీయంరేవంత్ రెడ్డి ఒక ప్రమాణం

రేవంత్ రెడ్డి ఒక ప్రమాణం

నిజానికి కేసీఆర్ ఆశించినట్టు రేవంత్ రవంత కాదు, కొండంత అయ్యాడు. పక్కలో బల్లెమే అయ్యాడు. వోటుకు నోటు అతడికి కలిసొచ్చి మరింత పెద్ద నాయకుడే అయ్యిండు. అసాధ్యం అనుకున్న కాంగ్రెస్ పార్టీకే అధినేత అయ్యాడు. ఇక రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాగలిగే అవకాశాలు తనకి ఎంత దగ్గరగా ఉన్నాయి అంటే కేవలం ఒక్క గెంతు గెంతడమే.

కందుకూరి రమేష్ బాబు 

మీరు నమ్మలేక పోవచ్చు. కానీ రేవంత్ రెడ్డి ఒక ప్రమాణం. ఒక సూచిక. తెలంగాణ దశ దిశలకు సరికొత్త లక్ష్యం. అతడి గమ్యం గమనం రాష్ట్ర ప్రజల జీవితాల్లో మార్పుకు బీజం వేయడం తధ్యం.

అతడి రాకడ కేసీఆర్ పోకడను నిలువరిస్తుందా అంటే, నిలువరించడమే కాదు, అధికార పీఠానికి కేసీఆర్ ని దూరం చేయగలిగే శక్తి, యుక్తి, అవకాశం సంపూర్ణంగా ఉందనడంలో సందేహం లేదు. రాష్ట్రంలో అటువంటి అవకాశం ఉన్న నేతగా రేవంత్ తప్పించి మరొకరు లేరని అంటే అతిశయోక్తి కాదు. ఆ మేరకు అతడి రాక రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు, సమాజంలో… విద్యార్థి, ఉద్యోగ వర్గాలకు ముఖ్యంగా నిరుద్యోగ యువతకూ పెద్ద ఉత్సాహం. అంతేకాదు, దీర్ఘకాలికంగానే కాదు, అతడి రాకడ తక్షణమే కేసిఆర్ పోకడ మారడానికి గొప్ప అవకాశం కూడా.

చాలా చిత్రంగా రేవంత్ రాకతో కాంగ్రెస్ పార్టీ పునరుజ్జీవనంలో పడింది. ఇక కేసీఆర్ గారు తాను ఫాం హౌజ్ నుంచే కాదు, ప్రగతి భవన్ నుంచి కూడా బయటకు వచ్చి ప్రజల్లో కలవకపోతే నడవదు. కలిసినా పెద్ద ఉపయోగం ఉంటుందా అన్నది వేరే విషయం. కానీ కలవడానికి రేవంత్ ఒక అవకాశంగా అరుదెంచడం విశేషమే.

రేవంత్ తన లక్ష్యానికి నేడు అత్యంత చేరువలోకి వచ్చాడని మాట్లాడుకోవడం తొందరేమీ కాదు. అతడి బలబాలాల గురించి సంపాదకీయం రాస్తూ అభినందించడానికి వెనుకాడవలసిన అవసరమూ ఎంతమాత్రం లేదు.

నిజానికి కేసీఆర్ ఆశించినట్టు రేవంత్ రవంత కాదు, కొండంత అయ్యాడు. పక్కలో బల్లెమే అయ్యాడు. వోటుకు నోటు అతడికి కలిసొచ్చి మరింత పెద్ద నాయకుడే అయ్యిండు. అసాధ్యం అనుకున్న కాంగ్రెస్ పార్టీకే అధినేత అయ్యాడు. ఇక రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాగలిగే అవకాశాలు తనకి ఎంత దగ్గరగా ఉన్నాయి అంటే కేవలం ఒక్క గెంతు గెంతడమే. దీనికి రెండున్నర ఏండ్ల సమయం ఉండటం అతడికి అంది వస్తోన్న మరో సువర్ణావకాశం. ఆ మేరకు రేవంత్ తన లక్ష్యానికి నేడు అత్యంత చేరువలోకి వచ్చాడని మాట్లాడుకోవడం తొందరేమీ కాదు. అతడి బలబాలాల గురించి సంపాదకీయం రాస్తూ అభినందించడానికి వెనుకాడవలసిన అవసరమూ ఎంతమాత్రం లేదు.

రేవంత్ ప్రమాణం ఇవ్వాళ పిసిసి చీఫ్ గానే కాదు, భవిష్వత్తులో ముఖ్యమంత్రిగా కూడా నేడు సంతకం చేసినట్లే చేస్తే ఎంతమాత్రం ఆశ్చర్య పోనక్కరలేదు.

నిజానికి ఇంత తొందరగా ఈ రోజు ఒకటి సాకారం కావడం రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి చాలా మంచి పరిణామం. ఎందుకంటే కేసీఆర్ ఎన్నికల మేనేజ్ మెంట్ చేయగలడు, కానీ ప్రజల్లో ఆదరణ పొందడం కష్టం. కానీ రేవంత్ కు ప్రజల్లో పార్టీని పటిష్టం చేసుకుంటూ పోవచ్చు. తన వ్యక్తిగత ఆదరణ పెంచుకుంటూ సాగనూ వచ్చు. అన్నిటికీ మిన్న గత ఏడేళ్ళలో కేసీఆర్ పాలనా విధానాలను సమర్థంగా ఎండగడుతూ ప్రత్యామ్నయ ప్రణాళిక ఒకటి ప్రాచుర్యంలోకి తెస్తూ దీటుగా ఎదుర్కునే అవకాశమూ ఉన్నది. తగిన ఎన్నికల వ్యూహాన్ని రచించుకోవడానికి కావలసినంత సమయమూ ఉండనే ఉన్నది. ప్రతి నియోజక వర్గంలో వంద కోట్లు అయినా ఖర్చు చేస్తే తప్పా గెలుపుకు అవకాశం లేని స్థితికి తెచ్చిన కేసేఆర్ శైలిని గమనించుకుంటూ, ప్రతి ఉప ఎన్నికనూ ఒక సంగ్రామంగా మార్చిన వైనాన్ని గమనంలోకి తీసుకుంటూ, ఆర్థికంగా భారంగా మార్చివేసిన ఎన్నికల సరళిని భేరీజు వేసుకొంటూ ముల్లును ముల్లుతోనే తీయడానికి సిద్డంమూ కావొచ్చు. అందుకు ఆయనకు జాతీయ పార్టీ నేతగా ఉండటం కూడా ఒక కలసి వచ్చిన అంశం అని చెప్పుకోవచ్చు. దీనికి తోడు అదృష్టవశాత్తూ అయనకున్న బలమైన రెడ్డి సామాజిక నేపథ్యాన్ని సానుకూలంగా చూడవచ్చు. అంతకు ముందరి టిడిపి పార్టీతో ఉన్న విస్తృత సంబంధాలు, కమ్మ కులస్థుల అండదండలూ ఆయనకు బలమే అవుతాయి తప్పా ఎంతమాత్రం బలహీనం కాబోవని అర్థం చేసుకోవచ్చు. ఈ కారణంగా నేడు చాలా ముందస్తుగా అయినప్పటికీ, ఒక రకంగా ముఖ్యమంత్రి అభ్యర్ధిగానే అధిష్టానం అతడిని యుద్దరంగంలోకి దింపింది కనుక రేవంత్ ప్రమాణం ఇవ్వాళ పిసిసి చీఫ్ గానే కాదు, భవిష్వత్తులో ముఖ్యమంత్రిగా నేడు సంతకం చేసినట్లే చేస్తే ఎంతమాత్రం ఆశ్చర్య పోనక్కరలేదు.

యావత్ సమాజం కేసీఆర్ ఆధిపత్యాన్ని ప్రశ్నించే అవకాశం ఎంతమాత్రం లేని స్థితిలో రేవంత్ పదునైన ఒక ప్రశ్నించే పదునైన కొడవలి వలే మన ముందు నిలబడటం, ఆన్ని విధాలా పోరాటానికి సిద్దం కావడం, రాజకీయాలకు అతీతంగా, మతతత్వ బిజెపిని నిలువరించాలనుకునే ప్రజాస్వామ్య వాదులకు ఒక ఆశావహ పరిస్థితే.

ఆ లెక్కన పిసిసి చీఫ్ గా తనకు అద్భుతంగా కలిసి వచ్చిన పదవి కారణంగా ఈ రోజుకు రోజుకు చాలా ప్రాధాన్యమే ఉంది. రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన ఈ రోజు నుంచీ తెలంగాణా రాజకీయాలన్నీ అయన రేపిన ఉత్సాహంతో వడివడిగా ముందుకు సాగే అవకాశమూ ఉన్నది.

రేవంత్ రెడ్డి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా ఇతర సినియర్లను కాదని ఎంపిక కావడమే కాదు, వారందరి సమక్షంలోనే పెళ్లి కొడుకులా గాంధీ భవన్ లో నేడు ప్రమాణ స్వీకారం చేయడం, పార్టీ హై కమాండ్ ఆదేశంతో ముఖ్యమైన నేతలే కాకుండా గ్రామ స్థాయి శ్రేణులన్నీ కలిసి కట్టుగా అతడి నాయకత్వాన్ని బలపరచడం, తన వెనుక అండగా ఉంటామని విస్పష్టంగా చెప్పడం నిజానికి మనం అంగీకరించినా అంగీకరించక పోయినా చారిత్రకంగా ఈ రోజును కీలమైన రోజుగా నిలుపుతుంది.

ఇది ఎంత పెద్ద ముందడుగు అంటే పన్నెండుగురు శాసన సభ్యులను తమ పార్టీలోకి చేర్చుకున్నప్పటికీ, ఇక కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయింది అని టీఆర్ ఎస్ అనుకున్నప్పటికే, తానొక్కడే అందరికీ పెట్టు కావడం, ఇకనుంచి రేవంత్ ఆధ్యర్యంలోని కాంగ్రెస్ పార్టీ నడకను బట్టే కేసీఆర్ అడుగులు ముందుకు పడబోవడం అంటే అది మామూలు విషయం కాదు. అది కేసీఆర్ వ్యూహానికే కాదు, కేంద్రంలో బిజేపికి కూడా అన్యాపదేశంగా సవాలే. ఆ పార్టీ సైతం రేవంత్ రాకతో నేడు క్యాబినెట్ పదవుల్లో ఎవరికీ ప్రాధాన్యం ఇవ్వాలో కూడా అలోచించుకొని కిషన్ రెడ్డిని మరింత బలోపేతం చేసుకోక తప్పడం లేదని తెలుస్తూనే ఉన్నది. అంతేకాదు, రాష్ట్ర రాజకీయాల్లోకి షర్మిల వంటి కొత్త పార్టీ కూడా కేసీఆర్ బలహీనతల్లోంచి పుట్టుకొచ్చి, అది కాంగ్రెస్ పార్టీ బలపడకుండా చేయడానికి, బిజెపి కోల్పోయే మతపరమైన ఓట్లను ఆకర్షించడానికీ రేపటి నుంచి తొలి అడుగులు వేయడం కూడా మొదలవుతున్నది. అది కూడా నేటి పరిణామాల బేరీజు తర్వాతే రేపటి నుంచి ఊపందుకోవడం యాదృచ్చికమే అనుకోనక్కరలేదు. ఇవన్నీ కూడా రేవంత్ కు కలిసొచ్చే అవకాశాలకే కాదు, అతడి ఉనికితో రాష్ట్ర రాజకీయాలు పెను మార్పులకు గురవుతున్నాయని అంచనా వేయడానికి కూడా ఆధారం.

మరో విశేషం ఏమిటంటే, కవులు, కళాకారులూ, మేధావులు, అమర వీరుల కుటుంబాలు మొత్తంగా యావత్ సమాజం కేసీఆర్ ఆధిపత్యాన్ని ప్రశ్నించే అవకాశం ఎంతమాత్రం లేని స్థితిలో రేవంత్ పదునైన ఒక ప్రశ్నించే పదునైన కొడవలి వలే మన ముందు నిలబడటం, ఆన్ని విధాలా పోరాటానికి సిద్దం కావడం, రాజకీయాలకు అతీతంగా, మతతత్వ బిజెపిని నిలువరించాలనుకునే ప్రజాస్వామ్య వాదులకు ఒక ఆశావహ పరిస్థితే.

తాజాగా ఈటెల రాజేందర్ కూడా వీగిపోయారు. తానూ ఒక్క నియోజక వర్గానికే పరిమితమయ్యే నేతగా మారిపోవడం, దాంతో రాష్ట్ర రాజకీయాల్లో విశాల ప్రజా రాశుల తరపున నిలబడే నేత మరొకరు లేకపోవడమూ మళ్ళీ రేవంత్ కి కలిసి వచ్చిన మరో ముఖ్యాంశం.

రేవంత్ ఒక బలమైన జాతీయ పార్టీ నుంచి ముక్కు సూటిగా కేసీఆర్ ని ఎదురిస్తూ మాట్లాడటం, గత కొన్నేళ్ళుగా అన్ని విధాలా ఇబ్బంది పడి, తీవ్రమైన కసి, కోపంతో, కొత్తగా వచ్చిన పదవీ, అందరినీ సమన్వయం చేసుకోవాల్సిన ఆవశ్యకతతో ఏర్పడిన మెచ్యూరిటీ, వీటన్నిటితో రేవంత్ కేసీఆర్ నుఎదుర్కొనుండటం, ఇది తెలంగాణాలో బలహీనపడ్డ గొంతులకు మరో మాటలో అవసరమైన ప్రతిపక్షం అన్నది ఎదో స్థాయిలో ఒక్కపరి లేచి నిలబడటానికి, మరెన్నో దిక్కులా నిరసన గళాలు గట్టిగా వినిపించదానికి, స్థూలంగా రాష్ట్రంలోని అన్ని శక్తులకూ ఇంధనంగా ఉపకరించే విషయం. ఒక్క మాటలో రేవంత్ రాకడ కేసేఆర్ పోకడకు ఒక పెద్ద ఇంధనం అని చెప్పవలసిందే. దాన్ని ఎవరో సమర్ధించినా సమర్థించక పోయినా అది అనివార్యంగా జరిగే ప్రస్థానం అని చెప్పక తప్పదు. అందుకే అనడం, ఇంత తొందరగా ఇలాంటి అవకాశం తెలంగాణకు చిక్కడం అదృష్టమే అని.

వై ఎస్. రాజశేఖర్ రెడ్డి తర్వాత మారిన తెలంగాణ రాజకీయాల్లో రేవంత్ మాదిరి నిర్భయత్వం, సాహసం, చురుకుదనం, వాగ్ధాటి, విస్తృతమైన సంబంధాలు, ప్రజల్లో ఆదరణ, బలమైన సామజిక నేపథ్యం, అవసరమైన ఆర్థిక అండదండలు, వెన్నుదన్నుగా ఉండటం మరొకరికి జరగలేదు. ప్రస్తుత పరిస్థితుల్లో జాతీయ పార్టీ ఐన కాంగ్రెస్ కి ఆయనకు స్వేచ్చ ఇవ్వడం అనివార్యం కావడమూ తనకు కలిసి వచ్చింది. దానికి తోడు గ్రామీణ స్థాయిలోకునారిల్లిన పార్టీ నిర్మాణం సమర్థమైన నాయకుడు అందిరాగానే జవసత్వాలతో పటిష్టం అయ్యే అవకాశం ఉండనే ఉన్నది. ఇవన్నీ రేవంత్ కి కలిసి వచ్చే అవకాశం ఉన్నందున ఇంతటి సానుకూల అంశాలు కలిగిన నేత రాష్ట్రంలో మరెవరూ ఇంకే పార్టీలో లేకపోవడం విశేషమే. మరో విషయం. తాజాగా ఈటెల రాజేందర్ కూడా వీగిపోయారు. తాను టీఆర్ఎస్ ని వీడి, బయటకు వచ్చి సొంత పార్టీ పెట్టకుండా కేసీఆర్ ఒత్తిడితో బిజెపిలో చేరడం, తానూ ఒక్క నియోజక వర్గానికే పరిమితమయ్యే నేతగా మారిపోవడం, దాంతో రాష్ట్ర రాజకీయాల్లో విశాల ప్రజా రాశుల తరపున నిలబడే నేత మరొకరు లేకపోవడమూ మళ్ళీ రేవంత్ కి కలిసి వచ్చిన మరో ముఖ్యాంశం.
నిజానికి కేసిఆర్ వ్యూహం గనుక నిజమే ఐతే, రేవంత్- ఈటెల గనుక కలిస్తే ఆయనకు ఇంకా ప్రమాదం ఉండేది. అందుకే కేసీఆర్ ఈటెలను బిజెపి వైపు నేట్టారనే మాట కూడా ఉన్నది. అది నిజమైనా కాకపోయినా ఈటెల బిజెపిలో చేరి తన చారిత్రక పాత్రను విస్మరించడంతో రేవంత్ కి మరో గొప్ప అవకాశం చేజిక్కినట్లయింది.

కేసిఆర్ వ్యూహం గనుక నిజమే ఐతే, రేవంత్- ఈటెల గనుక కలిస్తే ఆయనకు ఇంకా ప్రమాదం ఉండేది. అందుకే కేసీఆర్ ఈటెలను బిజెపి వైపు నేట్టారనే మాట కూడా ఉన్నది. అది నిజమైనా కాకపోయినా ఈటెల బిజెపిలో చేరి తన చారిత్రక పాత్రను విస్మరించడంతో రేవంత్ కి మరో గొప్ప అవకాశం చేజిక్కినట్లయింది.

 

నిజానికి ఈటెల గానీ బండి సంజయ్ గానీ ఎవరికీ లేని ఫాలోయింగ్ రేవంత్ కే ఉంది. అనైక్యత అన్న అంశంలో కాంగ్రెస్ కంటే బిజిపెలో బండి సంజయ్ కే ఎక్కువ ప్రమాదం ఉన్నది. అంతేగాదు. కేసేఆర్ పై బిజేపు నేతలు ఎగురుతారు గానీ, ఇటు ఆ పార్టీ గానీ, అటు ఎం ఎం ఐ గానీ, ఈ రెండు పార్టీ కేసేఆర్ లు చెరో చంకలో ఉన్నది ప్రజలకూ తెలుసు. రాష్ట్రంలో తెలుగుదేశం అన్నది లేనే లేదు గనుక ఆ మేరకు విస్పష్టంగా కేసేఆర్ ని ఎదుర్కొనే ఏకైక పార్టీ కాంగ్రెస్. తాజాగా రేవంత్ దాని చీఫ్. ఇంకేం? కేసీఆర్ ని గద్దె దించే ప్రక్రియలో రేవంత్ కి అడ్డే లేదు. దీంతో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావడం ఖాయం. మున్నెన్నడూ లేనంతటి కొత్త కళను సంతరించుకోవదమూ సులభం. ఒక్క మాటలో రేవంత్ వల్ల చతికిల పడ్డ పార్టీకి నవశఖం మొదలై ‘చేతు గుర్తు’ అన్నది ఇక ఆత్మవిశ్వాస హస్తంగా మారడానికి ఎంతో కాలం పట్టదనడంలో సందేహం లేదు. ఫలితంగా అందరూ అనుకున్నట్టుగా కాకుండా అనూహ్యమైన పరిమాణాలకే రాష్ట్రం వేదిక కానుండటం విశేషమే. ఈ సందర్భంలో రేవంత్ బలాబలాలు, సవాళ్లు, అనుకూలతలపై మరి నాలుగు మాటలు చెప్పవలసిందే. అధ్యక్ష బాధ్యతలు చేబూనిన రేవంత్ రెడ్డిని మనసారా అభినందిస్తూ తెలుప వలసిన అంశాలు చాలానే ఉన్నాయ్.

ఇప్పటికే ఓవర్ లోడ్ ఐన టీఆర్ ఎస్ పార్టీలోంచి తీవ్ర అసంతృప్తితో ఉన్న నాయకులను రేవంత్ లాక్కోవాలని చేస్తున్న ప్రయత్నాలు ఇప్పుడు కాకపోయినా కొద్ది కాలంలోనే సఫలం ఐతే, అది అభద్రతతో ప్రేలాపనలు పోయే కేసీఆర్ కి పెద్ద దెబ్బే కావడం ఖాయం.

2018 ఎన్నికల్లో ముఖ్యమంత్రి క్యాండిడేట్ ఎవరో తెలియనప్పుడే పందొమ్మిది సీట్లను సాధించిన కాంగ్రెస్ పార్టీకి చిచ్చర పిడుగు వంటి బలమైన నాయకుడు అధినేతగా లభించడంతో కాంగ్రెస్ ను వీడిన నాయకులు మల్లి తిరిగి గూటికి రావడం సాధ్యమే. ఆ ప్రయత్నాలు, మైండ్ గేం ఇప్పటికీ ప్రారంభం కావడం చూస్తూనే ఉన్నాం. అలాగే, ఇప్పటికే ఓవర్ లోడ్ ఐన టీఆర్ ఎస్ పార్టీలోంచి తీవ్ర అసంతృప్తితో ఉన్న నాయకులను రేవంత్ లాక్కోవాలని చేస్తున్న ప్రయత్నాలు ఇప్పుడు కాకపోయినా కొద్ది కాలంలోనే సఫలం ఐతే, అది అభద్రతతో ప్రేలాపనలు పోయే కేసీఆర్ కి పెద్ద దెబ్బే కావడం ఖాయం. ఒక్కసారి కేసేఆర్ మనోస్తైర్యం దెబ్బ తింటే అయన తిరోగమన నిర్ణయాలు తీసుకోవడంలో పడిపోతారని వారిని సన్నిహితంగా ఎరిగిన వారు చెబుతారు. ఆ మేరకు రేవంత్ చాలా సులువుగా అధికారానికి దగ్గరగా వెళ్ళగలిగే అవకాశం ఉన్నది. నిజానికి రెండేళ్ళ సమయం చాలా ఆయనకు చాలా ఎక్కువ.

రేవంత్ కు ఉన్న ప్రధాన సమస్య ఏమిటంటే ఆయనపై ఉన్న ఓటుకు నోటు కేసు. నిజానికి ప్రజల్లో దానికి పెద్ద ప్రాముఖ్యత లేకపోవడం ఆయనకు కలిసి వచ్చే మరో అంశం. ఒక రకంగా టీఆర్ ఎస్ పార్టీలో ట్రబుల్ షూటర్ గా పేరున్న హరీష్ రావు చేసేది కూడా అదే అని అందరికీ తెలుసు.

రేవంత్ కు ఉన్న ప్రధాన సమస్య ఏమిటంటే ఆయనపై ఉన్న ఓటుకు నోటు కేసు. నిజానికి ప్రజల్లో దానికి పెద్ద ప్రాముఖ్యత లేకపోవడం ఆయనకు కలిసి వచ్చే మరో అంశం. ఒక రకంగా టీఆర్ ఎస్ పార్టీలో ట్రబుల్ షూటర్ గా పేరున్న హరీష్ రావు చేసేది కూడా అదే అని కార్యశూరులందరికీ తెలుసు. నయానో భయానో నియోజకవర్గాన్ని ఓటు బ్యాంకుగా మార్చడం, దొరకని వారు దోరగా తిరగడం ఉన్నదే. ఆ విషయంలో ఎవరూ సుద్దపూస కాదని, ఆ విషయంలో ఎలా వ్యవహరించాలో రేవంత్ కి అన్ని విధాలా అవగాహన ఉన్నది. గతంలో ఆర్ ఎస్ ఎస్ లో పని చేసిన అనుభవం, తర్వాత టీఆర్ ఎస్ లో హరీష్ రావు వంటి నేతల పని తీరు ఎరిగి ఉండటం, ఆ తర్వాత టిడిపిలో చంద్రబాబు ఎన్నికల వ్యూహ సరళిని చూసి ఉండటం, ఇప్పుడు కాంగ్రెస్ లో ఉంటూ తప్పని సరిగా ఆ పార్టీని అధికారంలోకి తేవాల్సిన అగత్యం కూడా ఉండటం. ఇలా నాలుగు దిక్కులా గడించిన అనుభవం, ఆ నాలుగు పార్టీల్లో తనకున్న అంతర్గత స్నేహాలు, అవన్నీ అతడిని బాగా ఉపయోగపడుతాయని చెప్పక తప్పదు. అంతేకాదు, ఆయనకు రైతు బంధు కారణంగా మధ్యతరగతి రైతులు నోరు మెదపకుండా ఉండటం కూడా తెలుసు. ఉన్నత రైతులను, కౌలు రైతులను ఇద్దరినీ ఆకర్షించే ప్రణాళిక ఎంత అవసరమో తెలుసు. అలాగే అనివార్యంగా కాంగ్రెస్ నుంచి టిఆర్ ఎస్ వైపు షిఫ్ట్ ఐన ముస్లిం ఓటు బ్యాంకును తిరిగి తమ వైపు తిప్పుకోవలసిన ఆవశ్యకతా తెలుసు. అన్నిటినీ మించి భారీ ప్రాజెక్టుల పేరిట కేసీఆర్ ప్రాజెక్టుల వ్యయం పెంచడం, కాంట్రాక్టుల ప్రయోజనాలు కల్పించడం, దుర్వినియోగం అవుతున్న ప్రజాధనం గురించి కూడా తెలుసు. నిర్వాసితులవుతున్న రైతుల కడగండ్లు తెలుసు. వర్షాలతో నీట ముంచే నగరపు అభివృద్దీ తీరు తెన్నులూ అడుగడుగునా తెలుసు. దీనికి తోడు తన పాలమూరు పరిధిలోని పద్నాలుగు నియోజక వర్గాల్లో అత్యధిక స్థానాలలో తన పట్టు పెంచుకుంటూ మొత్తం రాష్ట్రలో కాంగ్రెస్ ను బలోపేతం చేసుకోగలిగితే, ఇంటా బయటా గెలిచే అధినేతగా ఇప్పటి నుంచే కర్యాచారనలోకి దిగడమూ తెలుసు. ఇవన్నీ ఆయనకు అదనపు అస్త్రాలే అవుతాయి తప్పా గుదిబండ కాబోవు. మీది మిక్కిలి తానూ తెలుగుదేశం మనిషి అంటూ, తనతో టిడిపి గాంధీ భవన్ మెట్లు ఎక్కింది అన్న విమర్శ. దాన్ని గనుక సీరియస్ గా చూస్తే, ఇప్పటికే తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ అనధికారికంగా ప్రగతి భవన్ మెట్లు ఎక్కి కేసీఆర్ తో సహా అర్ధ సింహాసనం ఆక్రమించుకొని ఉండటం వారికి బాగా తెలుసు. అందుకే అనేక విధాలా బలహీనంగా ఉన్న కేసేఆర్ పాలనని చాలా శక్తివంతంగా ఎదుర్కోవడానికి అన్ని విధాలా కలిసి వచ్చిన అవకాశం పేరే రేవంత్ అనడం. అతడికి అన్నీ అవకాశాలే.


తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ తిరిగి తెలంగాణాలో అధికారం రావడానికి ఆయనే గొప్ప అవకాశం. బలహీన పడిన కాంగ్రెస్ కార్యకర్తకు బలిమి నిచ్చే సదవకాశామూ అయనే. కేసేఆర్ ఆధిపత్యాన్ని బలహీనం చేసి అధికారానికి దూరం చేయగల సదవకాశామూ ఆయనే. వీటన్నిటినీ కాంగ్రెస్ అధిష్టానం ఎప్పుడో భేరీజు వేసుకుంది. తనకూ చెప్పింది. ఆ పనిలోనే ఉన్న రేవంత్ నేటి నుంచి కీలకమైన రోజు. వాటన్నిటినీ ఈ రోజు మొదలు గమనంలోకి తీసుకొని ఈ రెండున్నరేళ్ళలో తాను సానుకూలమైన విధంగా ప్రతి అడుగూ వేసుకుంటూ వెళితే. అవసరమైన మార్పులు చేసుకుంటూ గనుక ముందుకు సాగితే, అత్యంత సులభంగా కేసీఆర్ అధికార మార్పిడికి ఈ ‘ఒకే ఒక్కడు’, ‘వన్ మ్యాన్ ఆర్మీ’, నేడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతను చేబూనిన ‘ఎనుముల రేవంత్ రెడ్డి’ అనితర సాధ్యమైన విజయం సాధించే అవకాశం ఉంది. ముఖ్యమంత్రిగా సంతకం చేసే అవకాశమూ ఉన్నది.

ఇందుకు మరొక పెద్ద అవకాశం, ఆయుధం, ప్రమాణమూ ఉన్నది. అది కాంగ్రెస్ అధినేత ఆశిస్సులతో చేసే పాదయాత్ర. ఇంకో విశ్వాసనీయమైన అంశం, తనని ఎవరూ అడ్డుకోకుండా చూసుకునే రాహుల్ గాంధీ వెన్నుదన్నూ. ఇంకేం కావాలి.

ఇన్ని కారణాల వలన ప్రజల జీవితాలు మలుపు తిరగడం ఖాయం. అందుకే రేవంత్ రెడ్డి ఒక అవశ్యమైన ప్రమాణం అనడం. తెలుపు అభినందనలు తెలుపు.

 

More articles

2 COMMENTS

  1. ఒక నిఖార్సైన విశ్లేషణ. చాలా బాగా రాశారు అన్నా. పిసిసి కే కాదు రేపటి సీఎం కు సంతకం.
    కేసీఆర్ ఎంత అభివృద్ధి తపించినా, ఎన్ని సంక్షేమ పథకాలు అమలు చేసినా ప్రజల్లో కాస్త అసంతృప్తి ఎక్కువ పాలల్లో ఉంది. ప్రజలే కాకుండా నాయకులు కార్యకర్తలు అసహనం తో ఉన్నారు.
    తెలంగాణా వచ్చాక వ్యక్తి గత స్వేచ్ఛ హరించింది. ప్రశ్నించే వారిపై వేధింపులు. క్రింది స్థాయి క్యాడర్ పూర్తిగా ఆర్థికంగా నాశనం అయ్యారు. ఇక ఉద్యమం లో పనిచేసిన వారి జీవితాలు నిత్యం నరక ప్రాయంగా మారాయి.
    ప్రధానంగా ఆర్టీసీ ఉద్యోగులు, 2012 లో ఎంపికైన గ్రామ రెవెన్యూ అసిస్టెంట్ లు. కొత్త చట్టాలతో సర్పంచులు అందరూ కక్కలేక మింగలేక ఉన్నారు.
    ఇది రేవంత్ కు బాగా కలిసొచ్చే అంశం

    ఇంత పుండు మీద కారం చల్లి న చందంగా విశ్లేషణ రాసారు. కనీసం మీరు నమస్తే తెలంగాణ లో అయినా లేకపోతిరి మిమ్మల్ని తొలగించి సంతోషం పొందుదామంటే

    నిజంగా మీరు అద్భుతం 🤩

  2. తిరుగులేని ఆధిపత్యం…
    ఒకే ఒక్కడి రాకతో
    అతలాకుతలం అవుతోందా?
    అయితే మంచి పరిణామమే.
    కందుకూరి రమేష్ బాబు
    విశ్లేషించిన తీరు
    అద్భుతంగా ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article