విశ్వంలోని సత్యాన్ని సుందరాన్ని మనం చూడకుండానే కాలం చేస్తామేమో అని కాబోలు ఆ భగవంతుడు ఇలాంటి వారిని కూడా కంటారేమో అనిపిస్తుంది!
కందుకూరి రమేష్ బాబు
బండి రాజన్ బాబు గారు రమణీయమైన చాయా చిత్రకారులు. వారిది గొప్ప సౌందర్యాత్మ. తాను తెలంగాణా అరకులోయ. ఆ మహనీయుల పుట్టినరోజు అంటే ఆయన దృశ్య ప్రపంచాన్ని అనుభూతించిన వారికి నిజంగానే పండుగే.
ఆయన చిత్రాలను రెండు రకాలుగా అనుభోవంలోకి తెచ్చుకుని ఆనందించడం పరిపాటి. ఒకటి, అమాయకత్వం, రెండోది అనుభవం. ఈ రెంటి మేలు కలయిక శ్రీ రాజన్ బాబు.
విలియం బ్లేక్ అన్న కవి వలే ఇతడూ కవీ, చిత్రకారుడు. తాను అనుసరించిన మాధ్యమం కారణంగా వారిని LIGHT POET అనడం మంచిది.
బ్లేక్ తన కవిత్వాన్ని songs of innocence అని రాశాడు. వాటీనే songs of experience గా కూడా రాశాడు. రాజాన్ బాబు గారు అమాయకత్వాన్ని, అనుభవాన్ని ఒకే చిత్రంలో ప్రతిపలింపజేసిన గుప్తనిధి. ముఖ్యంగా గిరిజనుల అమాయకత్వాన్ని, వారి ముగ్ధ మనోహర సౌందర్యాత్మను ఆయనలా పట్టుకున్న వారు మరొకరు లేరు. అందుకే అనడం, అయన తెలంగాణాలో వెలుగు నీడలతో పరుచుకున్న అరకులోయ అని. వారి రచనలు బ్లేక్ మాదిరి చరణాలు అని.
ఆయన లేకపోయినా అయన మనకిచ్చిన చిత్రాలున్నవి. వాటిని పదే పదే చూడవలసి ఉన్నది. అలాంటికి చూస్తే గానీ ఒక కవి, చిత్రకారుడు, తాత్వికుడు, గాయకుడూ ఎందుకు తప్పక ప్రతి కాలంలో ఉంటాడో తెలుస్తుంది.
విశ్వంలోని సత్యాన్ని సుందరాన్ని మనం చూడకుండానే కాలం చేస్తామేమో అని కాబోలు ఆ భగవంతుడు ఇలాంటి వారిని కూడా కంటారేమో అనిపిస్తుంది. అంతటి మహనీయులు శ్రీ బండి రాజన్ బాబు.
రాజన్ బాబు గారి యాదిలో నాలుగు మాటలు తెలుపడం మనసుకు ప్రశాంతత. కళకు అలంకారం. అది దివ్యమైన అనుభవం. ప్రకృతిలో తాదాత్మ్యం.
తొలినాళ్ళలో చిత్రకళ వారి అభిరుచి. తర్వాత తాను ఛాయా చిత్రలో ఒదిగారు, ఎదిగారు. ఎంధరికో ఈ రంగంలో స్ఫూర్తి నిచ్చారు.
అధ్యాపకులుగా వారిది తెలుగునాట ఫొటోగ్రఫీలో అద్వితీయమైన పాత్ర.
జే ఎన్ టీయూ కాలేజీ ప్రిన్సిపాల్ శ్రీనివాస రెడ్డి గారు ఇటీవల అన్నారు, “దేశంలోనే డిగ్రీ మాధ్యమంలో ఫోటోగ్రఫీ బోధించే కాలేజీ ఇదొక్కటే” అని. “దానికి రాజన్ బాబు గారు హెడ్ అఫ్ ది డిపార్ట్ మెంట్ గా పనిచేయడం మన అదృష్టం” అని. నిజం.
రాజన్ బాబు గారు నైపుణ్యానికి పరాకాష్ట. చిత్రాలను వెలుగు నీడలతో ఒడుపుగా బంధించడమే కాదు, ఆ చిత్రాన్ని కడగడం, డెవలప్ చేసి అపూర్వంగా ప్రదర్శించడంలో ఆయనకు ఆయనే సాటి. ఒక్కమాటలో వెలుతురు రహస్యం తెలిసిన ‘డార్క్ రూమ్’ అయన.
రాజన్ బాబు గారు నైపుణ్యానికి పరాకాష్ట. చిత్రాలను వెలుగు నీడలతో ఒడుపుగా బంధించడమే కాదు, ఆ చిత్రాన్ని కడగడం, డెవలప్ చేసి అపూర్వంగా ప్రదర్శించడంలో ఆయనకు ఆయనే సాటి. ఒక్కమాటలో వెలుతురు రహస్యం తెలిసిన ‘డార్క్ రూమ్’ అయన.
అయన ఎంత సున్నిత హృదయులో అంత సాహసి. నగ్నత్వం అన్నది అయన మొక్కవోని ప్రదర్శన. అవును మరి. ‘విమెన్ ఇన్ నేచర్’ పేరిట వారు ఆవిష్కరించిన చిత్రాలు అయన సమున్నత ఛాయా చిత్రణంలో కవితా నాయకి అనదగ్గ ప్రయోగం. వాటిని అవకాశం ఉండీ దర్శించకుండా ఉన్నవారు ఐతే అమాయకులు ఐనా కావాలి లేదా మూర్ఖులైనా కావాలి.
విమెన్ ఇన్ నేచర్’ పేరిట వారు ఆవిష్కరించిన చిత్రాలు అయన సమున్నత ఛాయా చిత్రణంలో కవితా నాయకి అనదగ్గ ప్రయోగం.
ఒక కన్ను మూసి ఒక కన్ను తెరిచి సృష్టించిన వారి కళా ఖండాలు బయటి లోకాలను అంతర్లోకాల్లోకి తెచ్చె ప్రకృతి సందేశం.
రాజన్ బాబు గారి మరణానంతరం వారి కుమారుడు రమణ గారు తండ్రి అడుగుజాడల్లో నడుస్తున్నందుకు అభినందనీయం. బంజారాహిల్స్ లో వారు నడుపుతున్న రాజన్ స్కూల్ ఆఫ్ ఫోటోగ్రఫీ అటు బోధనా ఇటు ప్రిటింగ్ రంగానికి చేస్తున్న సేవలపై మరోసారి రాయవలసిందే.
కాగా, రాజన్ బాబు గారి శిష్యులు ఎందరో ఫొటోగ్రఫీలో ఇప్పటికీ నిమగ్నం కావడం విశేషం. ఐతే, వారు గురువును మించిన శిష్యులు కాకపోవడానికి కారణం వీరి ఆశక్తత కాదు, అది వారి గురువుగారి అసాధారణమైన ప్రతిభా పాటవాలు, కఠిన సాధనే కారణం కావొచ్చును. ఏమైనా, ఆ పిల్లలను తల్లి కోడినీ కలిపితేనే రాజన్ బాబు అని కూడా అనిపిస్తుంది. అంతటి మనిషి పుట్టినరోజు తప్పక మనందరికీ పండుగ రోజే.
రాజన్ బాబు గారి యాదిలో నాలుగు మాటలు తెలుపడం మనసుకు ప్రశాంతత. కళకు అలంకారం. అది దివ్యమైన అనుభవం. ప్రకృతిలో తాదాత్మ్యం.