పక్షి కన్ను విశాలం. దాని రెక్క విస్తారం. దాని జీవన చక్రం సంపూర్ణం. అదొక విశ్వభాష. అది చాపినంత మేరా దాని సహజ ఉనికే. వాటి ఇల్లే.
సైబీరియన్ పక్షులు మన తీరాలకు రావడం ‘వలస’ అనుకునే మనిషి హ్రస్వ దృష్టి తెలుపు వ్యాసం ఇది.
ఆనందం ఆరోగ్యం సంపదను పంచే జీవావరణ వ్యవస్థలో పక్షి కోణంలో చెప్పే వ్యాస పరంపరలో ఈ కథనం World Migratory Bird Day ప్రత్యేకం.
కందుకూరి రమేష్ బాబు
వాలస పక్షుల గురించి మనిషి ద్రుష్టి కోణం గురించి ఎంత సంకుచితమో చెప్పే ముందు కొంత మాట్లాడుకుందాం.
వేల కిలోమీటర్లు ప్రయాణించి, ఖండాంతరాలు దాటి వచ్చే సైబీరియన్ పక్షులు మన భారత్‌లోని పలు తీర ప్రాంత రాష్ట్రాల్లో దాదాపు ఆరు మాసాలు సందడి చేస్తాయని మీకు తెలుసు. వాటి ఆగమనంతో ఆ పక్షుల కిలకిలారావాలతో వాతావరణం ఒక్కసారిగా ఆహ్లాదకంగా మారడం చెప్పనలవి కాని విశేషమనీ అందరూ ఎరిగినదే.
సైబీరియా రష్యా నుంచి ఈ పక్షులు (Siberian Cranes or snow cranes ) ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ తీరానికి కూడా చేరుతాయి. అక్కడి త్రివేణి సంగమం వద్ద, తీర ప్రాంతాల ఘాట్లు వద్దా వేలాది సైబీరియన్ కొంగలు సందడి చేస్తుంటే చూసేందుకు రెండు కళ్లు చాలవు.
ఆ పక్షులు మన దగ్గరకు ‘అతిథులు’గా ‘వలస’ రావడం గురించి ఎంతో హృద్యంగా చెప్పుకుంటూనే ఉన్నాం. వాటి రాకడ నిజంగా ‘వలస’ అన్న అర్థంలో చూడవచ్చా అన్న ప్రశ్న వేసుకునేముందు మరి కొంత మాట్లాడుకుందాం.
శ్రీకాకుళం జిల్లాలోని తేలినీలాపురం ఎప్పటి నుంచో ఈ విదేశీ పక్షులకు కేంద్రంగా ఉన్నది. అలాగే కొల్లేరు సరస్సు, పులికాట్ సరస్సు, నేలపట్టు తదితర ప్రదేశాలు కూడా ఈ పక్షులకు విడిదిగా ఉండటం దశాబ్దాలుగా మనం చూస్తున్నదే. ఏటా వేలాది పక్షులు ఇక్కడకు వచ్చి స్థానికంగా ఉన్న చింత చెట్లపై నివాసం ఏర్పరుచుకుని కనువిందు చేయడం గురించి పత్రికలలోనూ టీవిల్లోనూ అనేక కథనాలను మనం చదువుతుంటాం. చూస్తూనే ఉంటాం? ఆ పక్షులు మన దగ్గరకు ‘అతిథులు’గా ‘వలస’ రావడం గురించి ఎంతో హృద్యంగా చెప్పుకుంటూనే ఉన్నాం. వాటి రాకడ నిజంగా ‘వలస’ అన్న అర్థంలో చూడవచ్చా అన్న ప్రశ్న వేసుకునేముందు మరి కొంత మాట్లాడుకుందాం.
తెలంగాణలోని ఖమ్మం జిల్లా చింతపల్లి కూడా ఈ పక్షులకు మరొక విడిది. దాదాపు అయిదు వేల కిలోమీటర్ల దూరం నుంచి ఏటా తమ గ్రామానికి వచ్చే సైబీరియా పక్షులను (ఒకలాంటి కొంగలు) వాళ్లు బంధువుల్లా చూస్తారు. ఒంటరిగా వచ్చే ఈ పక్షులు గుడ్లు పెట్టి పిల్లలతోపాటే తిరిగి సైబీరియా వెళ్లిపోతాయని గ్రామస్థులు చెబుతారు.
నీటి అలలపై కనిపించే చేపల్ని పసిగట్టి, ఒడుపుగా వాటిని ముక్కున కరుచుకుని గూటికి తీసుకొస్తాయి. వాటిని పిల్లలకు ఆహారంగ ఇచ్చే దృశ్యం ఒక చూట ముచ్చట.
డిసెంబరు మూడో వారం లేదా నాలుగో వారంలో మొదలయ్యే సైబీరియన్ పక్షులు సంక్రాంతి నాటికి దాదాపు రెండు వేల నుంచి మూడు వేల వరకు చేరుకుంటాయి. ఒక గూడులో జంట పక్షులుంటాయి, గుడ్లు పెట్టి పిల్లలను చేసిన తర్వాత వాటి సంరక్షణ మగపక్షి చూసుకుంటుంటే ఆడకొంగలు బయటకు వెళ్లి చెరువుల్లో వేటాడి చేపలు, నీళ్లు తీసుకొచ్చి పిల్లలకు అందిస్తాయి.
అవి ఆహారాన్ని సేకరించే తీరు అత్యద్భుతం అనే చెప్పాలి. నీటి అలలపై కనిపించే చేపల్ని పసిగట్టి, ఒడుపుగా వాటిని ముక్కున కరుచుకుని గూటికి తీసుకొస్తాయి. వాటిని పిల్లలకు ఆహారంగ ఇచ్చే దృశ్యం ఒక చూట ముచ్చట.
“ఈ కొంగలు సైబీరియాలో ఏడాదిలో ఐదు నెలలే ఉంటాయని, కానీ చింతపల్లిలో ఏడు నెలలు ఉంటాయని, అందుకే ఇవంటే తమకు ప్రత్యేక అభిమానమని” గ్రామస్తులు చెప్పడం విశేషం.
ఈ పక్షుల తమ జీవితంలో అతి ముఖ్యమైన పునరుత్పత్పత్తి దశని పూర్తి చేసుకునేందుకు వచ్చే ఈ తీర ప్రాంతపు ఆవాసాన్ని ‘వలస కేంద్రం’గా చూడటం సబబేనా?
తెల్లవి అలాగే ముచ్చట గొలిపే వన్నెలు, మిరుమిట్లు పంచె అందాలతో హొయలు పోయే ఆ సైబెరియన్ పక్షులు వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం బూరుగుమళ్ళ గ్రామానికి కూడా వస్తున్నాయి. బహుదూరపు బాటసారులైన ఈ పక్షులు చెట్లపై నివాసాలు ఏర్పాటు చేసుకుని గుడ్లు పెట్టి పొదగడం, పిల్లలు పెద్దవై ఎగిరే దశకు చేరుకున్నాకే తిరిగి వచ్చిన చోటుకు తిరిగి వెలుతాయని అందరూ చెప్పే నిజం. వీటిని చూడటానికి పర్యాటకులు, స్థానికులు తరలి రావడం కూడా మామూలే.
దాదాపుగా ఆరు నెలలు. సాధారణంగా సెప్టెంబరు నుండి మార్చి నెల వరకు అనుకోవచ్చు. ఏడాదిలో ఆరు మాసాల పాటు ఇక్కడకు వచ్చి తిరిగి స్వస్థాలాలకు వెళ్లి అక్కడ మరో ఆరు మాసాలు గడిపే సైబీరియన్ పక్షులను మనం వలస పక్షులని అంటున్నాం. నిజానికి వాటిని ‘వలస పక్షి’ అనడం సమంజసమేనా?
ఈ పక్షుల తమ జీవితంలో అతి ముఖ్యమైన పునరుత్పత్పత్తి దశని పూర్తి చేసుకునేందుకు వచ్చే ఈ తీర ప్రాంతపు ఆవాసాన్ని ‘వలస కేంద్రం’గా చూడటం సబబేనా?
అసలు అవి వలస రావడం ఎట్లవుతుందీ అన్నది ప్రశ్న.
ముఖ్యంగా రెండు రకాలు…ప్రధానంగా ఫెలికాన్, పెంటైడ్ స్టార్క్స్ అనే పక్షులు అతి ఉష్ణ ప్రాంతాల ను వీడి శీతల ప్రాంతంగా భావించే ఇక్కడికి వలస రావడం అత్యంత సహజ ప్రక్రియ. వాటి యధేచ్చగా సాగుతున్న వాటి జీవశక్తికి తార్కాణం.
తన అనుభవంతో పక్షి స్థితిని మానవుడు భేరీజు వేసుకొని చెబుతున్నదే తప్పా అతడిది హ్రస్వద్రుష్టి కాకా మరేమిటి?
కొన్ని వేల కిలోమీటర్ల పరిధిలో వాటి మనుగడ నిర్దేశితమై ఉన్నప్పుడు వాటి జీవన విస్తీర్ణం విశాలం అన్న ఎరుక కదా మనకు ఉండవలసింది. దానికి భిన్నంగా స్థానికులు, పర్యటకులు, పాత్రికేయులే కాదు శాస్త్రవేత్తలు సైతం వాటిని Migratory Birds అని పేర్కొనడం ఒక పరిమిత దృష్టే అనవలసి రాదా?
వాస్తవానికి మన రెండు కాళ్ళ నడకా – జీవిక కోసం పొట్ట చేత బట్టుకుని ప్రవాసం పోవడం అన్న వలస జీవితపు అనుభవంతో… నింగిలో వేల యోజనాలు అలుపు సొలుపు లేకుండా దాటే ఈ పక్షులతో, తన సంతతి మనుగడ కోసం ఎంత దూరాలకైనా పయనం సాగించే శక్తిగల ఈ సైబెరియన్ పక్షులను పోల్చుతున్నాడే తప్పా.. తన అనుభవంతో పక్షి స్థితిని మానవుడు భేరీజు వేసుకొని చెబుతున్నదే తప్పా అతడిది హ్రస్వద్రుష్టి కాకా మరేమిటి?
నిజానికి ఇక్కడే పుట్టి అక్కడకు ఎగిరి వెళ్ళే పక్షుల స్వస్థలం ఈ తీర ప్రాతమే అనుకుంటే.. తల్లిబిడ్డలు ఇక్కడు నుంచి తిరిగి సైబీరియాకు వెళ్ళడం అన్నది ఎంతమాత్రం వలస అని అనలేం.
రెక్కలున్న పక్షి తాలూకు విశాల జీవితాన్ని పరిగణలోకి తీసుకోకుండా వాటిని వలస పక్షి అనడం ఎంత విచిత్రం!
మనిషి తన పరిధిని తాను కుదించుకుంటూ మొత్తం సృష్టిని సైతం పరిమిత దృష్టితో చూస్తున్నాడనడానికి ఈ దృక్కోణం ఒక మంచి ఉదాహరణ.
నిజానికి అసలు సమష్య అది కాదు. పక్షుల జీవన క్రమం, వాటి జీవిత చక్రం ఒక విశ్వ భాష. దాని ప్రాంతీయత మనిషి పరిధి కన్నా విశాలం అని మరచిపోవడమే అసలు సమస్య.
అంతేకాదు, మనిషి తన పరిధిని తాను కుదించుకుంటూ మొత్తం సృష్టిని సైతం పరిమిత దృష్టితో చూస్తున్నాడనడానికి ఈ దృక్కోణం ఒక మంచి ఉదాహరణ.
సైబీరియన్ పక్షి నుంచి మనిషి బోధపర్చుకునేది ఒకటే కావాలి. నిజానికి అవి అంతరించిపోతున్న పక్షులు. మనుగడ కోసం విస్తారంగా రెక్క చాపిన పక్షులు. అందుకే అవి జీవించే చోటుకోసం ఎంత దూరం పోతే అంత జాగా వాటిదే. ఎంత విశాలంగా రెక్క చాపితే అంత పరిధి వాటిదవుతుంది. మన కన్ను చిన్నది. Birds eye view భిన్నం. అలా వెళ్ళడం అనివార్య స్తితి అని, అది మనుగడ కోసం పోరాడుతున్నది అని మానవుడు అనవచ్చు. విశ్లేచించవచ్చు. కానీ వాటికి అది సహజ ప్రక్రియ.
మన దూరతీరాలు…మన ఊరు వాడా ..ఇల్లూ వాకిలి …చెట్టూ చేమా కన్నా ఎక్కువ చూడగలిగే శక్తి వాటిది. మన నింగి నేలా …చేపా చెరువూ వాటికి తెలిసినంత మనకు తెలియదనడానికి దశాబ్దాలుగా మన తీరాలు వాటి ఇండ్లు కావడమే చెబుతున్నాయి.
వాటి స్వస్థలంలో మనమూ తలదాచుకుంటున్నాం అని కూడా అనొద్దు. మన ఇద్దరి ఇల్లూ ప్రకృతే… ఒకటే. అదే ఆనందం, ఆరోగ్యం, సంపద.
A Good article…on migrated birds.congrats