Editorial

Monday, December 23, 2024
వ్యాసాలుసంక్రాంతి కథనం : ప్రయోజనకారిగా 'రైతు బీమా' - రూపశిల్పికి అభినందనలు తెలుపు

సంక్రాంతి కథనం : ప్రయోజనకారిగా ‘రైతు బీమా’ – రూపశిల్పికి అభినందనలు తెలుపు

సంక్రాంతి సందర్భంగా ‘రైతు బంధు’ సంబరాల ఎలా సాగుతున్నా కూడా ఒక అంశంలో ప్రభుత్వ చర్యను అభినందించాలి. అది రైతుల జీవిత బీమా పథకం.  మృతుల కుటుంబాలకు ఇది చీకట్లో చిరు దీపం. రూపశిల్పి కెసిఅర్ కి అభినందనలతో తెలుపు సంపాదకీయం పండుగ ప్రత్యేకం.

కందుకూరి రమేష్ బాబు 

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2018లో ఆరంభించిన రైతు బీమా ఒక ఉదార ప్రయత్బం. Farmers Group Life Insurance Scheme పేరిట రూపొందించిన ఈ పథకం వల్ల గడిచిన మూడున్నరేళ్ళలో దాదాపు 72 వేల రైతులకు పరిహారం అందడం అంటే అది మామూలు విషయం కాదు. ఒక్కో కుటుంబానికి ఇదు లక్షల చొప్పున మొత్తం నిన్నటి వరకు 3618 కోట్ల 55 లక్షల సహాయం పరిహారంగా అందడం నిజంగానే ఒక నిశ్శబ్ద విప్లవం.

ముఖ్యమంత్రి కేసిఆర్ రైతాంగానికి ప్రాధాన్య మిచ్చి రూపొందించిన పథకాల్లో రైతు బీమా పథకం విలక్షణమైనది. విమర్శలకు తావు లేనిది. ప్రభుత్వమే రైతుల తరపున ప్రిమియం చెల్లిస్తూ మూడున్నరేళ్లుగా చేపడుతున్నఈ పథకం దేశంలో మరెక్కడా లేనిది. సకల జనులూ అభినందించ దగిన ఈ పథకం ఆచరణలో విజయవంతమైనది.

18 సంవత్సరాల నుంచి 59 ఏండ్ల మధ్య వయస్కులైన రైతుల కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా Life Insurance Corporation of Indiaతో ఒడంబడిక చేసుకొని ఏర్పాటు చేసిన బీమా సొకర్యం నిరుపేద రైతులకు ఓదార్పుగా ఉన్నది. కేసిఆర్ దూరదృష్టి కారణంగా దు:ఖభారంతో ఉన్న కుటుంబానికి చక్కని అండగా మారింది. దురదృష్టవశాత్తూ ఈ పథకం ప్రారంభించాక రాష్ట్రంలో రైతుల మరణాలు ఎంత పెద్ద సంఖ్యలో జరుగుతున్నాయో స్పష్టంగా తెలుస్తున్నది.

ఒక నాటి తెలంగాణాలో నెలకొన్న జీవన విధ్వంసాన్ని మరచి, ఒక్కపరి రైతాంగం సమస్యలన్నీ రాష్ట్ర ప్రభుత్వం కొలిక్కి తేవాలనుకోవడం, జీవిత బీమా పథకం నేపథ్యంలో వెల్లడైన మరణాల సంఖ్యని బట్టి ముఖ్యమంత్రిపై విమర్శలు చేయడం సహేతుకం కాదు.

ఈ పథకం ఆరంభించినప్పటి నుంచి దాదాపు 75 వేల మంది రైతులు చనిపోయారని తెలుస్తోంది. అందులో అనారోగ్యంతో మృతి చెందిన వారున్నారు. యాక్సిడెంట్ వంటి ప్రమాదాల్లో కన్ను మూసిన వారున్నారు. అలాగే ఆత్మహత్య చేసుకున్న రైతులు కూడా ఉన్నారు. ఈ మరణాలన్నిటినీ ఒకే గాటున కట్టి ఒక నాటి తెలంగాణాలో నెలకొన్న జీవన విధ్వంసాన్ని మరచి, ఒక్కపరి రైతాంగం సమస్లన్నీ స్వరాష్ట్రంలో ఒక కొలిక్కి రాలేదనడం, ఈ మరణాల సంఖ్యని ఎత్తి చూపుతూ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని అనుకోవడం సహేతుకం కాదనే చెప్పాలి.

ఐతే, నిజానికి ప్రభుత్వం గానీ ప్రైవేట్ సంస్థలు గానీ వీరి మరణాలకు గల కారణాలపై లోతైన అధ్యాయం చేస్తే అసలు రైతులు అరవై ఏండ్ల లోపే మరణించడానికి గల కారణాలతో పాటు మరెన్నో విషయాలు వెలుగులోకి వస్తాయి. ఇలా కనీసం ఒక రెండు దశాబ్దాల గణాంకాలు గనుక లభిస్తే ఈ సమస్య లోతుపాతుల పట్ల అంచనా వేసుకోవోచ్చు. స్వరాష్ట్రంలో తీసుకోవలసిన జాగ్రత్తలు కూడా తీసుకోగలం. ఏమైనా ఈ పథకం ఆరంభించిన కారణంగా అరవై ఎండ్ల లోపు రైతుల మరణాల సంఖ్య వ్యవసాయ అధికారుల వద్ద లభించడం ఇదే మొదటిసారి, అది భవిష్యత్తులో ఉపయోగమే అని చెప్పాలి.

కాగా, రాష్ట ప్రభుత్వం 2018 ఆగస్టు 15 రోజున ఈ పథకాన్ని ప్రవేశ పెట్టింది మొదలు మొదటి సంవత్సరం 17, 757 మంది రైతులు మరణించగా రెండో సంవత్సరం 19,102 మంది, మూడో సంవత్సరం అత్యధికంగా 29,126 మంది చనిపోయారు. ఇక, ఈ నిన్నటి వరకు ‘తెలుపు’ తెప్పించుకొన్న గణాంకాల ప్రకారం 9,481 మంది చనిపోయినట్లు తెలుస్తోంది. కాగా, మొత్తం మూడున్నరేళ్లలో మృతుల సంఖ్య 75, 466 ఉండగా ఇన్స్యూరెన్సు  కంపెనీ నుంచి 72,371 కుటుంబాలకు ఐదేసి లక్షల చొప్పున పరిహారం అందింది. ఇంకా 3,095 మందికి అందవలసి ఉన్నది.

ఈ పథకం ద్వారా అత్యధికంగా పరిహారం పొందుతున్న సామాజిక శ్రేణులను పరిశీలిస్తే సహజంగానే వెనుకబడిన తరగతులే ఎక్కువ అని చెప్పాలి. దాదాపు యాభై శాతం రైతులు బిసిలే ఉన్నారు.

కాగా, ఈ పథకం ద్వారా అత్యధికంగా పరిహారం పొందుతున్న సామాజిక శ్రేణులను పరిశీలిస్తే సహజంగానే వెనుకబడిన తరగతులే ఎక్కువ అని చెప్పాలి. దాదాపు యాభై శాతం రైతులు బిసిలే ఉన్నారు. ఆ తర్వాతి స్థానం వరసగా ఎస్సీ, ఎస్టీలది. మొత్తం అందుతున్న పరిహారంలో మైనారిటీలు అందుకుంటున్న భాగం ఒక శాతం మాత్రమే ఉన్నదని కూడా తెలుస్తోంది.

18 నుంచి 59 ఏండ్ల వయో పరిమితి ఉన్న ఈ పథకంలో అందుకుంటున్న పరిహారాలను బట్టి వివిధ వయస్కుల వారు ఎవరూ అని విశ్లేషిస్తే ఈ పథకంలో యాభై ఏండ్లు నిండిన రైతులే అత్యధికంగా మరణిస్తున్నట్లు మన దృష్టికి వస్తోంది. ఆ తర్వాత అత్యధికంగా 39 నుంచి 48 ఏండ్ల మధ్య వయస్కులు మరణిస్తున్నారు. వారే దాదాపు 32 శాతం పరిహారం పొందారు. ఆ తర్వాత 29 నుంచి 38 ఏండ్ల మధ్య వయస్కులు దాదాపు 12 శాతం పరిహారం పొందారు. కాగా, 18 నుంచి 28 వయో పరిమితిలో మరణించిన రైతులు కూడా రెండు శాతం పరిహారం పొందారు.

నిజానికి గత రెండేళ్లుగా మరణాల సంఖ్య పెరగడానికి గల కారణాల్లో కోవిడ్ కూడా భాగమని మనం గమనించవలసి ఉన్నది. విశేషం ఏమిటంటే, ఈ పథకం వల్ల అకస్మాత్తుగా కోవిడ్ బారిన పడి మరణించిన ఎంతో మంది రైతులు ఈ బీమా పథకం ఉన్నందున ఐదు లక్షల సహాయాన్ని పొందగలిగారు.

ఐతే కొన్ని వార్తా పత్రికలూ ఈ జీవిత బీమా పథకం ద్వారా పరిహారం పొందుతున్న మృతుల సంఖ్యను ప్రధానంగా చూపుతూ ఈ పథకం వల్ల జరిగిన ప్రయోజనాన్ని ద్వితీయం చేశారు. నిజానికి గత రెండేళ్లుగా  మరణాల సంఖ్య పెరగడానికి గల కారణాల్లో కోవిడ్ కూడా భాగమని మనం గమనించవలసి ఉన్నది. విశేషం ఏమిటంటే, ఈ పథకం వల్ల అకస్మాత్తుగా కోవిడ్ బారిన పడి మరణించిన ఎంతో మంది రైతులు ఈ బీమా పథకం ఉన్నందున ఐదు లక్షల సహాయాన్ని పొందగలిగారు.

నిజానికి కోవిడ్ బాధితులను ఇముడ్చుకునే ఆరోగ్య బీమా పథకాలేవీ లేని సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఈ  పథకం మృతుల కుటుంబాలకు ఈ విధంగా కలిసి రావడం ఎవరమూ ఊహించలేదు. ఆ లెక్కన కూడా ఈ పథకం మనకు మరింత ప్రయోజనకారిగా మారిందనాలి.

ఇప్పటిదాకా ప్రభుత్వం మొత్తం 3,204 కోట్ల రూపాయలను ఈ పథకానికి వెచ్చించగా ఎల్ ఐ సి రైతులకు పరిహారంగా చెల్లించినది అంతకన్నా ఎక్కువే… నిర్దిష్టంగా చెప్పాలంటే 3618 కోట్ల 55 లక్షల రూపాయలు కావడం విశేషం.

కాగా, ప్రభుత్వం ఈ పథకంపై వెచ్చిస్తున్న డబ్బుల వివరాలకు వస్తే, తొలి ఏడాది తలా 2, 271 రూపాయల చొప్పున 602 కోట్లను ప్రిమియంగా చెల్లించగా రెండో ఏడు మొత్తం 902 కోట్లను ఆ తర్వాత ఏడాది 967 కోట్లను వెచ్చించింది. ఈ ఏడు తలా 4,110కి పెరగగా మొత్తం చెల్లింపు 1, 464 కోట్ల చేరింది. ఈ అర్ధ సంవత్సరానికి గాను అందులో సగం ఇప్పటికే 732 కోట్లు (జి ఎస్ టితో కలిపి ) చెల్లించింది. దీంతో ఇప్పటిదాకా ప్రభుత్వం మొత్తం 3,204 కోట్ల రూపాయలను ఈ పథకానికి వెచ్చించగా ఎల్ ఐ సి రైతులకు పరిహారంగా చెల్లించినది అంతకన్నా ఎక్కువే… నిర్దిష్టంగా చెప్పాలంటే 3618 కోట్ల 55 లక్షల రూపాయలు కావడం విశేషం.

తనదైన శైలిలో, దూరదృష్టితో రైతాంగానికి మేలు చేసే ఈ పథకాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రికి ఈ విషయంలో అభినందనలు చెప్పవలసిందే. వారికి, తెలంగాణా రైతాంగానికి సంక్రాంతి శుభాకాంక్షలతో ఈ కథనం ఒక అభినందనగా తెలుపు…

ప్రభుత్వం ప్రతి ఏటా వేయి కోట్లకు పైగా ఈ పథకంపై ఖర్చు చేయడం నిజానికి భారమే ఐనప్పటికీ వేలాది రైతులకు లభిస్తున్న అండతో పోలిస్తే ఇది చాలా మంచి పనిగా చెప్పుకోవాలి. ఇది తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల్లో అభినందించదగ్గ పథకంగానూ పేర్కొనాలి.

తనదైన శైలిలో, దూరదృష్టితో రైతాంగానికి మేలు చేసే ఈ పథకాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రికి ఈ విషయంలో అభినందనలు చెప్పవలసిందే. వారికి, తెలంగాణా రైతాంగానికి సంక్రాంతి శుభాకాంక్షలతో ఈ కథనం ఒక అభినందన తెలుపు…

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article