Editorial

Monday, December 23, 2024
వ్యాసాలుపుట్టినరోజూ పట్టాభిషేకమూ : తెలుపు సంపాదకీయం

పుట్టినరోజూ పట్టాభిషేకమూ : తెలుపు సంపాదకీయం

నిజానికి ఆయన గమ్యాన్ని ముద్దాడారు. ఉద్యమకారులను దగ్గర చేసుకుంటే రెండు మూడు దశాబ్దాలు సైతం వారిదే అధికారం. కానీ అయన ఆ దిశలో లేరు. గమనించే మూడ్ లో లేరు

కందుకూరి రమేష్ బాబు 

Kandukuri Ramesh Babu
Editor, Teluputv

ముఖ్యమంత్రి కేసిఆర్ గారు తన పుట్టినరోజు వేడుకలకు ఈ సారి అమిత ప్రాధాన్యం ఇవ్వడాన్ని అందరం గమనిస్తూనే ఉన్నాం.

తన పుట్టిన రోజును రైతు దినోత్సవంగా జరపడాన్ని చూస్తున్నాం. అంతే కాదు, పార్టీ శ్రేణులు ఆ వేడుకలను మూడు రోజుల పాటు నిర్వహించాలని కోరడాన్నీ చూశాం.

‘తెలంగాణ జాతిపిత’గా, ‘తెలంగాణా గాంధీ’గా వారు పెద్దరికానికి ఆరాటపడటం కూడా అందరికీ కనిపిస్తోంది. రాష్ట్ర సాధకుడిగా ఉన్న క్రెడిట్ ని మరోసారి ప్రజల ముందు పెడుతూ ఇన్నాళ్ళూ దాని అవసారం అంతగా పడలేదేమో అన్నట్టు వ్యవహరించడమూ చూస్తున్నాం. జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించడం కోసం కూడా దాన్ని మరోసారి తన చుట్టూ ఒక ‘ఆరా’గా నిలుపుకోవడమూ కనిపిస్తోంది.

నిజానికి తనంతత తాను తన కోసం తానిలా చేయడం అవసరమా అన్న సందేహం కలుగుతోంది. అది ఆత్మ విశ్వాసమా లేదా ఆత్మ న్యూనతా? అన్న ప్రశ్న కూడా ఉత్పన్నం అవుతుంది. దానికి సమాధానం  కూడా అందరికీ తెలుసు.

నిజానికి తనయుడు – మంత్రి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఐన కేటిఆర్ ని ముఖ్యమంత్రి చేయడం కోసమే ఇదంతా…ఇవన్నీ పరి పరి విధాలా రక్షణ చర్యలూ అన్న మాటా వినవస్తోంది.

నిజానికి ముఖ్యమంత్రి ఇవేవీ లేకుండా కూడా నేరుగా కేటిఆర్ గారికి ముఖ్యమంత్రిని చేయవచ్చు. తాను విశ్రాంతి తీసుకుంటూ బంగారు తెలంగాణకు కాపలాగా ఉంటానని చెప్పి చాలా సునాయాసంగా ఆ కాగల కార్యం సులభంగా నేరవేర్చవచ్చు. వొద్దనే వారు పార్టీలో లేరు. ఈటెల రాజేందర్ మాదిరి ఇరకాటం కూడా ఇప్పుడు లేదు.

చిత్రమేమిటంటే, ముఖ్యమంత్రి పీఠం నుంచి తాను వైదొలగడం, తన కుమారుడిని ఆ స్థానానికి ప్రమోట్ చేయడం కోసం తాను మరింత గంభీరమైన కార్యక్రమంలో నిమగ్నం కావలసి ఉంటుందని అయన భావిస్తున్నట్టు కనిపిస్తోంది. అందుకు కావలసిన పెద్దరికం తాలూకు ఇమేజీ కోసమే వారు ఈ పుట్టినరోజును అతగా వాడుకోవడం మనం గమనించవచ్చు. వారిపై రాసిన పాటల రిలీజ్ కార్యక్రమాలు కూడా అంతే ఘనంగా నిర్వహించేలా జాగ్రత్త పడుతున్నారు. ఇవన్నీ కాకుండా గత కొన్ని వారాలుగా మరింత పరుషంగా బిజెపిపై విరుచుకు పడుతూ ముఖ్యమంత్రిగారు రాజకీయాలను స్వయానా వేడెక్కించడాన్ని  కూడా చూశాం. ఆ లొల్లి ప్రేమికుల గొడవగా  ఉందని, ఎప్పుడు వారిద్దరూ కలిసిపోతారో ఏమో అన్న మాటలూ వినవచ్చాయి. అదలా ఉంచితే, నిజానికి ముఖ్యమంత్రి ఇవేవీ లేకుండా కూడా నేరుగా కేటిఆర్ గారికి ముఖ్యమంత్రిని చేయవచ్చు. తాను విశ్రాంతి తీసుకుంటూ బంగారు తెలంగాణకు కాపలాగా ఉంటానని చెప్పి చాలా సునాయాసంగా ఆ కాగల కార్యం సులభంగా నేరవేర్చవచ్చు. వొద్దనే వారు పార్టీలో లేరు. ఈటెల రాజేందర్ మాదిరి ఇరకాటం కూడా ఇప్పుడు లేదు. కానీ కెసిఆర్ చాలా జాగ్రత్త పడుతున్నారు. ముఖ్యమంత్రి పదవి కుమారుడికి కట్ట బెడితే తాను రాష్ట్ర రాజకీయాలు దాటి దేశ రాజకీయాలలో క్రియా శీలకం కావలసిందే అన్నట్టు పరిస్థితులను మలుస్తున్నారు. రాజ్యాంగం మార్చాలన్న మాటల నుంచి దేశం కోసం నవీన రాజకీయ సమీకరణలకోసం నడుం కడుతానని శపథం కూడా తీసుకోనున్నారు. ఐతే, దశాబ్దాల అణచివేత, పీడన నుంచి ఎదిగి వచ్చిన తెలంగాణా ఉద్యమంలో అయన ఒక అద్వితీయ నేతగా  ఎదగడం ఒక చారత్రిక విజయం. అందులో వ్యూహాలు ఉండవచ్చు గాక. కానీ ఆకాంక్ష అందరిదీ. సఫలమయ్యారు.  ఇప్పుడు తన ఆకాంక్షే అందరిది చేయాలంటే అందుకు కుమారుడు, కుమార్తె, అల్లుడు, మేనల్లుడు, నేను -నాది అన్నధోరణితో బలపడే మనిషికి సాధ్యం కాదు. వదులుకున్నప్పుడు తెలంగాణా గాంధీ అవుతారు గానీ పట్టుకుని వేలాడినప్పుడు కారు.

ఎస్. నేను సమర్థమైన నాయకుడికి రాష్ట్రాన్ని అప్పగిస్తున్నాను. ఆరు నూరైనా అతడే నా వారసుడు. ఇక నుంచి  దేశం కోసం నా వంతు ప్రయత్నాలు చేస్తాను. మీ ఆశీర్వాదాలు కావాలి అంటే మరీ మంచిగుంటుంది. కేటిఆర్ గారికి సైతం అదే శ్రేయస్కరం కూడా.

నిజానికి ఆయన గమ్యాన్ని ముద్దాడారు. ఉద్యమకారులను దగ్గర చేసుకుంటే రెండు మూడు దశాబ్దాలు సైతం వారిదే అధికారం. కానీ అయన ఆ దిశలో లేరు. గమనించే మూడ్ లో లేరు.

విషాదం ఏమిటంటే, కృతిమ ప్రొజెక్షన్. అది తెలిసిపోతున్నది.

నిజానికి దేశం కోసమే తాను రాష్ట్రాన్ని వదులుతున్నట్టు నమ్మించ దల్చుకుంటే అది పెద్దగా ప్రయోజనం ఉండదని వారు గమనించాలి. ఒకవేళ ఉంటె గింటే …ఎస్. నేను సమర్థమైన నాయకుడికి రాష్ట్రాన్ని అప్పగిస్తున్నాను. ఆరు నూరైనా అతడే నా వారసుడు. ఇక నుంచి  దేశం కోసం నా వంతు ప్రయత్నాలు చేస్తాను. మీ ఆశీర్వాదాలు కావాలి అంటే మరీ మంచిగుంటుంది. కేటిఆర్ గారికి సైతం అదే శ్రేయస్కరం కూడా.

ప్రజలు వాస్తవాలు గమనిస్తున్నారు. తన సన్నిహితులు, దగ్గరివారు, మంత్రులు, శాసన సభ్యులు – సొంత మీడియా, వీరికి మాత్రమే రాజుగారి వస్త్రాలు కనిపిస్తున్నాయి.

ప్రజలకు వాస్తవాలు కనిపిస్తున్నై.

క్షమించాలి. శుభాకాంక్షలు చెప్పడం మరిచాము. గులాబీ నేతకు తెలుపు శుభాకాంక్షలు.

 

More articles

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article