Editorial

Monday, December 23, 2024
సంపాద‌కీయంబీరయ్య మరణం - రైతుల ఆందోళనకు ప్రతీక

బీరయ్య మరణం – రైతుల ఆందోళనకు ప్రతీక

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్లా తక్కువ కొనుగోలు కేంద్రాలు తెరవడం, కొనుగోళ్లలో జాప్యం జరగడంతో ఒక్క బీరయ్య మాత్రమే కాదు, లక్షలాది రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. చివరకు ఒక వరి కుప్పపైనే ప్రాణాలు కోల్పోవడాన్ని బట్టి రైతుల ఎంత మానసిక ఒత్తిడికి గురవుతున్నారో ఆలోచించాలి. ప్రభుత్వం ఉదాసీనతను కలిసికట్టుగా ఎండగట్టాలి.

కామారెడ్డి జిల్లా లింగంపేట మండల కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఐలాపూర్‌ గ్రామానికి చెందిన రైతు మామిడి బీరయ్య (57) గుండె పోటుతో మృతి చెందడం తెలంగాణ రైతాంగం దుస్థితికి అద్దం  పడుతోంది. వైద్యులు గుండెపోటు అని అన్నప్పటికీ ధాన్యం కొనుగోళ్లలో జాప్యమే ఈ రైతు మృతికి కారణమైందని తెలుస్తోంది. ఒక్క కొనుగోళ్ళలో జాప్యమే కాదు, కొనుగోలు కేంద్రాలు తక్కువ ఉండటం, రోజుల తరబడి ధాన్యాన్ని కాపాడుకోవడం రైతాంగానికి తీవ్ర ఇబ్బందిగా మారినట్లుంది.

బీరయ్య విషయమే తీసుకుంటే అయన తన ధాన్యం కుప్ప వద్ద కాపలాగా దాదాపు తొమ్మిది రోజులుగా ఉన్నట్టు తెలిసింది. చలిగా ఉన్న కూడా ప్రతి రోజూ రాత్రుల్లు ఆ కుప్పపైనే నిద్రించినట్లు తెలిసింది. రెండు రోజులుగా కురిసిన అకాల వర్షానికి ధాన్యం తడవడంతో ఆరబెడుతూ అనేక అవస్థలు పడ్డాడని రైతులు చెప్పారు. ఇదే క్రమంలో గురువారం సాయంత్రం ఇంటికి వెళ్లి భోజనం చేసి వచ్చి తన వడ్ల కుప్పపై పడుకున్నాడని, శుక్రవారం ఉదయం గమనించే సరికి చనిపోయి ఉన్నాడని రైతులుచెప్పారు. “కొనుగోళ్లలో జాప్యమే అతడి మరణానికి కారణం” అని రైతులు ఆరోపించారు.

వరి నాట్లు వేయొద్దన్న ప్రభుత్వం, పలు చోట్ల వరి కోతలకు కూడా అడ్డు పడుతోంది. అలాగే ధాన్యం కొనుగోళ్ళపై కూడా నిర్లక్ష్యం చూపుతోంది. ఫలితంగా రైతాంగం అనేక రకాలుగా ఒత్తిడికి గురవుతోంది. ‘బీరయ్య గుండెపోటు’ ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాల ఫలితమే అనుకోకుండా ఉండలేం.

ఇటీవల కోతలు పూర్తి చేసిన బీరయ్య గత నెల 27న లింగంపేట కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకు రాగా అక్కడున్న సిబ్బంది తన సీరియల్ నంబర్ 70 గా రాసిచ్చారు. ఐతే, తనలాగే లింగంపేట కేంద్రానికి మొత్తం 207 మంది రైతులు ధాన్యం తీసుకురాగా అందులో వారం రోజుల నుంచి కేవలం 23 మందివి మాత్రమే తూకం వేయడం బీరయ్య గమనించాడు. తన నంబర్ ఎప్పుడు వస్తుందో అన్న ఆందోళనలో ఉన్న బీరయ్యకు రెండు రోజులుగా వర్షాలు కురవడం, చలిలో ధాన్యాన్ని కాపాడుకోవాల్సి రావడం మరింత ఇబ్బంది పెట్టింది. దానికి తోడు దీపావళి కారణంగా మూడు రోజులు కాంటా బంద్‌ ఉండటంతో మానసికంగా మరింత ఒత్తిడికు గుయినట్టు తెలుస్తోంది. వీటన్నిటి కారణంగా గురువారం అర్ధరాత్రి అయన గుండెనొప్పితో ఆ కుప్పపైనే కన్ను మూయడం విషాదం.

బీరయ్యకు ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉంది. భార్య పోశవ్వ ఆతడి మృతికి కారణం “ధాన్యం కొనుగోళ్లలో ఆలస్యమే” అని రోదిస్తూ చెప్పింది.

కాగా, కామారెడ్డి జిల్లాలో 34 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినప్పటికీ అవి స్వల్పమే అని చెప్పాలి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్లా తక్కువ కొనుగోలు కేంద్రాలు తెరవడం, కొనుగోళ్లలో జాప్యం జరగడంతో ఒక్క బీరయ్య మాత్రమే కాదు, లక్షలాది రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. రేపేం అవుతుందో తెలియని స్థితి.

వరి నాట్లు వేయొద్దన్న ప్రభుత్వం, పలు చోట్ల వరి కోతలకు కూడా అడ్డు పడుతోంది. అలాగే ధాన్యం కొనుగోళ్ళపై కూడా నిర్లక్ష్యం చూపుతోంది. ఫలితంగా రైతాంగం అనేక రకాలుగా ఒత్తిడికి గురవుతోంది. ‘బీరయ్య గుండెపోటు’ ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాల ఫలితమే అనుకోకుండా ఉండలేం.

 

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article