Editorial

Monday, December 23, 2024
సంపాద‌కీయంHuzurabad Bypoll Results : ఈటెల గెలుపు తెలుపు : గులాబీ జెండా హక్కు

Huzurabad Bypoll Results : ఈటెల గెలుపు తెలుపు : గులాబీ జెండా హక్కు

ఈ ఎన్నిక ఫలితం – విసిరిన ఈటెల ప్రశ్నకు విజయవంతంగా లభించిన ఒకానొక సమాధానం. హుజూరాబాద్ ప్రజలిచ్చిన సకల జనుల తెలంగాణా అభిప్రాయం.

కందుకూరి రమేష్ బాబు

మొత్తం హుజూరాబాద్ ఎన్నిక ఫలితాలలో ఈటెల గెలుపు అనూహ్యమే. అయితే అది అసాధారణం విజయం. ఈ సందర్భంలో అసలు వివాదానికి కారణం మరచిపోరాదు. అది గులాబీ జెండా ఓనర్ షిప్ అంశం.

ఈటెల వివాదానికి కారణం తన మాట. ఈటెల వంటి ప్రశ్న. దానికి సమాధానం ఈ ఉప ఎన్నిక, ఫలితం.

“మంత్రి పదవి బిక్ష కాదు, మేమూ గులాబీ జెండా ఒనర్లం” అన్న ఈటెల వ్యాఖ్యలతో మొదలైన వివాదం నేడు ఎట్టకేలకు కాషాయం నీడన వారి గెలుపుతో రాటు తేలి అది తెలంగాణాలో గులాబీ అధినేత ఏకచత్రాధిపత్యానికి ప్రశ్నించి గెలిచిన ఈటెలగా మారడంగా చూడటం నేటి అవసరం. అది తెలంగాణా అస్తిత్వ పరిణామాలకు అవశ్యం.

వివరంగా చెప్పాలంటే ఈ ఎన్నిక అంశాలు ఇవేవీ కావు…

ఇది దళిత బంధు అమలు మంచి చెడ్డల అంశం కాదు, వివిధ సంక్షేమ పథకాల అమలు పట్ల తీర్పు కాదు, కేసిఆర్ దించిన నేతల పని తీరుకు నిదర్శనం కాదు, ఎన్నికల ముందు గానీ ఎన్నికల సందర్భంగా గానీ ప్రభుత్వం తలపెట్టి, పూర్తి చేసిన అభివృద్ధి పనుల పట్ల అభిప్రాయం కాదు, కోట్లాది రూపాయలు వెచ్చించి, అధికారాన్ని ఉపయోగించి, నయనా భయానా చేసిన ప్రలోభాల అంశమూ కాదు. కొత్త రేషన్ కార్డులు మొదలు పావలా వడ్డీతో సహా ఇతర సంక్షేమం, అభివృద్ధి తదితర అంశాలు వెతికే ఈ ఎన్నికకు సంబంధం లేదు. అంతేకాదు, అది బిజెపి పార్టీ విజయమా లేక కాంగ్రెస్ పార్టీ లోపాయి వ్యవహారమూ అంటే అవేమీ కాదు. ఒక బిసి అంశమా రెడ్డిల సహకారమా అన్నదీ కాదు. ఇది కేవలం ఈటెల సంధించిన ప్రశ్నకు జరిగిన ఎన్నిక. నేటి ఈ ఫలితం ఆ పదునైన ‘ఈటె’కు హుజూరాబాద్ ప్రజానీకం ఇచ్చిన సున్నితమైన సమాధానంగా చూడాలి.

పార్టీకి ముందు తెలంగాణా ఉద్యమం ఉంది. పార్టీ పెట్టినప్పటి నుంచి ఎందరో కేసేఆర్ తో కలిసి ఉద్యమించిన వారున్నారు. ఎంతోమంది వారితో కలిసి పని చేశారు, మరెందరో వెళ్ళిపోయారు. కానీ ‘పక్కలో బల్లెం’లా ఉన్న ఈటెల ఒక్కరే ఒక ప్రశ్నపెట్టి నిలబడ్డారు.

తెలంగాణ లొంగేది ప్రజాస్వామిక సంస్కృతికి. అది మలి దశ ఉద్యమంలో సకల జనులమూ భాగస్వాములం అన్న స్పిరిట్ కి సంబంధించినది. అది ఉద్యమ వ్యతిరేకులతో ఊరేగుతున్న పార్టీ, ప్రభుత్వానికి స్వీయ రాజకీయ అస్తిత్వం కలిగించే సోయికి సంబంధించినది కూడా. ప్రజలు కేంద్రంగా లేని భివ్రుద్దికి పతక నిదర్శనంగానూ చూడాలి.

పార్టీకి ముందు తెలంగాణా ఉద్యమం ఉంది. పార్టీ పెట్టినప్పటి నుంచి ఎందరో కేసేఆర్ తో కలిసి ఉద్యమించిన వారున్నారు. ఎంతోమంది వారితో కలిసి పని చేశారు, మరెందరో వెళ్ళిపోయారు. కానీ ‘పక్కలో బల్లెం’లా ఉన్న ఈటెల ఒక్కరే ఒక ప్రశ్నపెట్టి నిలబడ్డారు. నిలబడి కలబడి నేడు గెలిచి చూపారు. అందుకు తాను వెనుకపట్టు బట్టకుండా తట్టుకుని నిలబడేందుకు బిజెపిని ఆశ్రయించి ఉండవచ్చు. సొంత పార్టీ పెట్టుకోవడం కన్నా బిజెపితో కలిసి ఎదుర్కోవడం మంచిదనే భావించవచ్చు. ఆ వ్యూహం ఫలించిందని కూడా నేడు తెలుస్తోంది. అది కాదు ముఖ్య విశేషం. అయన నిలబడి గెలవడం. హుజురాబాద్ ఆ కర్వవ్యం తన భుజాన వేసుకోవడం.

నిజానికి “పార్టీ మా అందరిదీ. ఈ తెలంగాణా ఫలితాలు అందరికే దక్కాలి” అన్న దిశలో తొలిసారిగా కేసేఆర్ ని ప్రశ్నించిన ఈటెలను, తాను మత తత్వ పార్టీ ఐన బిజేపే నీడన ఉన్నప్పటికీ, ఆ అనివార్యతను అర్థం చేసుకుని, కేసిఆర్ ఎన్ని విధాలా ఆటంకపరిచినా చివరిదాకా మౌనంగా ఉంటూ నెల విడిచి సాము చేస్తున్న అధినేత అహంకారం తగ్గించాలనుకున్న హుజురాబాద్ ప్రజల విజ్ఞత లోతైనది. విస్తారమైనది.

ప్రశ్నించడంతో బయటకు వెళ్ళగొట్టబడ్డాక శూన్యం కానున్న ఈటెల రాజకీయ భవిశ్వత్తును కాపాడటం తమ విధి అని భావించడం విశిష్టమైనది.

అదే సమయంలో ప్రశ్నించడంతో బయటకు వెళ్ళగొట్టబడ్డాక శూన్యం కానున్న ఈటెల రాజకీయ భవిశ్వత్తును కాపాడటం తమ విధి అని భావించడం విశిష్టమైనది. ముందు ముందు ఎన్ని ఇబ్బందులున్న సరే అనుకుని అతడిని గుండెలకు హత్తుకుని ‘విజయీభవ’ అని నేడు హుజూరాబాద్ కాపాడుకున్నదీ అంటే అది మరింత విశేషమైన సాహసం. అందుకు కారణం, ఈటెల విసిరిన ప్రశ్నకు అక్కడి ప్రజలు అండగా నిలబడటాన్ని చూడాలి. అట్లా హుజురాబాద్ నిలబడటం ఒక విస్మయం. సాహసోపేతం. అందుకే స్వరాష్ట్రం వచ్చాక జరిగిన ఈ ఉప ఎన్నిక, అందులో హుజురాబాద్ ప్రజానీకం ఇచ్చిన తీర్పు మామూలు విషయం కాదు. అందుకే హుజురాబాద్ నేడొక విజేత. ఈటెల వారి సమున్నత హృదయ ప్రతినిధి. రాష్ట్రం మార్పుకు ఇది ఇరుసుగా ఉండటం అన్నది ఇక చూడాలి.

గులాబీ జెండాపై హక్కును ప్రకటించిన ఈటెలనే విజేతగా చూడాలి. అందుకు ఎన్నో ఒత్తిళ్లను ఎదుర్కొని నిక్కచ్చిగా తమ అభిప్రాయం చాటిన హుజురాబాద్ ను అసలు విజేతగా ఎంచాలి.

నిజానికి చూడవలసింది ఇది. రెండు రౌండ్లలో తప్పా అన్ని రౌండ్లలో ఆధిక్యత చూపిస్తూ ఏడో సారి ఈటెల 23, 855 ఓట్ల మెజారిటీతో గెలిచిన తరుణంలో తన అధికత్యా బిజిపే సంబందించి చూడాలా లేక అయన వ్యక్తిగత విజయంగా చూడాలా అని కొంతమంది టెలివిజన్ విశ్లేషకులు అడుగుతున్నారు. కానీ ముందు పేర్కొన్నట్టు ఇది నిజానికి కేసేఆర్ కి వ్యతిరేకంగా వచ్చిన ఫలితం అని, ఈటెలకు నేరుగా వచ్చిన అనుకూల స్పందన అని ఓపెన్ గా మాట్లాడటానికి కొన్ని ఛానల్లు వెనుకాడుతున్నై. కానీ వాస్తవం ఇది. చూడవలసింది ఇది- గులాబీ జెండాపై హక్కును ప్రకటించిన ఈటెలనే విజేతగా చూడాలి. అందుకు ఎన్నో ఒత్తిళ్లను ఎదుర్కొని నిక్కచ్చిగా తమ అభిప్రాయం చాటిన హుజురాబాద్ ను అసలు విజేతగా ఎంచాలి. మొత్తంగా పార్టీపై, పాలనపై ఉద్యమ కారుల హక్కు మూలమా కదా అన్నది ప్రశ్నా – సమధానామూ ఈ ఎన్నిక ఇతివృత్తం..

చిత్రమేమిటంటే, టీఆర్ ఎస్ చేసిన పోల్ మేనేజ్ మెంట్ లో ఇక్కడి మనిషి అద్భుతంగా గెలిచాడు. ప్రభుత్వం, టీఆర్ ఎస్ పార్టీ ఇక్కడి ప్రజలను దళిత బందుతో సహా వివిధ పథకాల లబ్దిదారులుగా మార్చినప్పటికీ వారి ఉద్యమ చైతన్యానికి జోహార్లు.

కాదనలేం. ఇక్కడి దళితులు, ఇతర ఓటర్లు, అక్కడి వివిధ పార్టీల నేతలు అనేక రకాలుగా లబ్ది పొందారనే చెప్పాలి. నిజానికి కేసేఆర్ పోల్ మేనేజ్ మెంట్ కోసం చేసిన ప్రయత్నాలన్నిటినీ హుజురాబాద్ ప్రజలు ఆహ్వానించి, ప్రతో పైసాను సాదరంగా స్వీకరించి తాము పొందవలసిన విధంగా లబ్ది పొంది- తెలంగాణ బిడ్డగా ఈటెల రాజకీయ భవిశ్వత్తు రూపు మాసి పోకుండా కాపాడే ప్రయత్నంలో ప్రజలు గొప్పగా  అసాధారణ వివేకం చూపినట్టే అర్థమవుతోంది.

హుజురాబాద్ తీర్పు విలువను, వారి విజ్ఞతను విశాలంగా అర్థం చేసుకుని తాను హుందాగా ఒక్క హుజురాబాద్ కాదు, తెలంగాణకు ప్రజా ప్రతినిధిగా ఎదగడం ఒక్కటే ఈటెల ముందున్న కర్తవ్యం. మరి అయన ఫలితాలు వచ్చాక ఎం చెబుతారో ఎలా వ్యవహరిస్తారూ అన్నది అయన వ్యక్తిగతం. సామూహిక తీర్పు మాత్రం ఇదే అని తెలుపు సంపాదకీయం ఇది.

నిజానికి తమకు ఏ మాత్రం సంబంధం లేని ఎన్నికలే ఐనప్పటికీ అది ఈటెల రాజకీయ భవిత సమాధి అయ్యే అవకాశం ఉందని గ్రహించిన ప్రజలు, ఆ క్రమంలో కేసేఆర్ ఆధిపత్యం రానున్న రోజుల్లో పార్టీపైనే కాదా సకల జీవన పార్శ్వాలన్నిటా మరింత నిరంకుశంగా మారకుండా చూపవలసిన ఆవశ్యకతనూ ఫీలయ్యారు. ఈ రెండూ వారిని విప్లవాత్మకం చేశాయి. ఈటెలను విజయవంతం చేశాయి. ఇప్పుడు వారి ఫలితం ఈటెల చేతుల్లో ఉంది.

హుజురాబాద్ తీర్పు విలువను, వారి విజ్ఞతను విశాలంగా అర్థం చేసుకుని తాను హుందాగా ఒక్క హుజురాబాద్ కాదు, తెలంగాణకు ప్రజా ప్రతినిధిగా ఎదగడం ఒక్కటే ఈటెల ముందున్న కర్తవ్యం.

మరి అయన ఫలితాలు వచ్చాక ఎం చెబుతారో ఎలా వ్యవహరిస్తారూ అన్నది అయన వ్యక్తిగతం. సామూహిక తీర్పు మాత్రం ఇదే అని తెలుపు సంపాదకీయం ఇది.

ఈటెలకు అభినందనలు. హుజురాబాద్ చూపిన ఉద్యమ చేతనకు అభివాదాలతో…

More articles

2 COMMENTS

  1. రెండు జాతీయ పార్టీల అంతర్గత కలయికే ఈ గెలుపు. ప్రజాస్వామ్యంలో ప్రత్యర్థిని ఎదుర్కోవడానికి వేసిన ఈ ఎత్తుగడ తప్పుకాకపోవచ్చు అని కొందరు అభిప్రాయపడుతున్నప్పటికీ ప్రాంతీయ పార్టీని ఎదుర్కొని నిలబడలేని ఆ పార్టీల నిస్సహాయత సాంకేతికంగా గెలుపు అయినప్పటికీ ప్రత్యక్షంగా తెరాసకు ప్రత్యామ్నాయం కాదని ఈ ఎన్నిక నిరూపించింది.

  2. విశ్లేషణ విపులంగా ఉంది కని సమాజాన్ని ఖండ ఖండాలుగ చీల్చి పీల్చి పిప్పిచేయడంలో పాలకవర్గ పాత్రలో భాగస్తుడనే విషయాన్ని మరువరాదు. ఎన్నికల విలువలు,ప్రజాస్వామ్యం ఇవి పాలకవర్గానికి మాత్రమే. ప్రజల అవసరాలు ఎన్నికలు కానే కావు అలా కల్పించడం పాలకవర్గాల కుట్ర మాత్రమే .వారు కేసిఆర్ ఐన రాజేందర్ ఐనా.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article