Editorial

Wednesday, January 22, 2025
సంపాద‌కీయంప్రాంతం వాడే దోపిడి చేస్తే... : రైతాంగం సాక్షిగా కాంగ్రెస్ ‘వరంగల్ డిక్లరేషన్’

ప్రాంతం వాడే దోపిడి చేస్తే… : రైతాంగం సాక్షిగా కాంగ్రెస్ ‘వరంగల్ డిక్లరేషన్’

కాంగ్రెస్ పార్టీ వరంగల్ లో ఈ సాయంత్రం నిర్వహించిన రైతు సంఘర్షణ సభ అనేక విధాలా కెసిఆర్ కి గట్టి దెబ్బ. రైతాంగాన్ని ఆకర్షించే ఇక్కడి డిక్లరేషన్ ప్రస్తుత పరిపాలన తీరుతెన్నులపై ఖండన. విశ్లేషిస్తే అది ఎంతో లోతైన ప్రాతిపదిక కలిగినది కూడా. అది చాలా  స్పష్టంగా టి ఆర్ ఎస్ ని ఎదుర్కొని కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావడానికి తొలి అడుగు. తమలో తమకు ఎన్ని విభేదాలున్నా సంఘర్షణలను వీడి ఐక్యంగా ముందుకు పోయేందుకు, తగిన మార్గాలను సుగమం చేసిన ఈ సభ రానున్న మరో నాలుగు డిక్లరేషన్స్ కి నాంది కూడా అన్నది కేసిఆర్ మరచిపోరాదు.

కందుకూరి రమేష్ బాబు 

కాంగ్రెస్ పార్టీ తెలంగాణాలో పూర్తి జవసత్వాలు పొందేందుకు రైతాంగాన్ని నమ్ముకోవడమే కాక వారికి వరంగల్ డిక్లేరేషన్ ద్వారా తగిన నమ్మకాన్ని ఇచ్చే దిశలో గట్టి అడుగులే వేసింది. ఇది టి ఆర్ ఎస్ కి పెద్ద దెబ్బే అనాలి.

ధరణి పోర్టల్ రద్దు చేస్తామని ప్రకటించడంతో పాటు మెరుగైన రెవెన్యూ వ్యవస్థను ఏర్పాటు చేయడంతో పాటు రైతు బంధును కౌలు రైతులకు విస్తరిస్తామని, అందరికీ మరింత ఎక్కువ ఆర్ధిక సహాయాన్ని  ఆందజేస్తామని ప్రకటించడం విశేషం. బిజెపి హామీ ఐన పసుపు బోర్డు తమ హయాంలో ఏర్పాటు చేస్తమనడం మరో కొస మెరుపు. మొత్తంగా వరంగల్ డిక్లరేషన్ రైతాంగానికి తక్షణ, దీర్ఘకాలికంగా ప్రయోజనకారిగా ఉంటుందీ అనడంలో సందేహం లేదు. అది ఇక్కడి నెలలకు తగిన వ్యవసాయ విధానాన్ని అమలు చేయడంతో పాటు మద్దతు ధరలు పెంచడం వంటి అంశాల దాకా ఇముడ్చుకోవడాన్ని గమనిస్తే కెసిఆర్ చేసిన పోరబాట్ల నుంచి ఎంతో మెరుగైన ప్రాతిపదికగా ఉండటం విశేషం. చూడండి ఆ డిక్ల రేషన్ వివరాలు.

కాగా, ఈ సభకు ములుగు శాసన సభ్యురాలు సీతక్క అధ్యక్షత వహించడం చాలా మందికి నచ్చింది. ఆమె భవిష్యత్తు కాంగ్రెస్ పార్టీలో మరింత ఆశాజనకంగా ఉంటుందని ఇదివరకే తెలుపు రాసింది. నేటి సభ అందుకు ఉదాహరణంగా నిలవడం విశేషం.

రాహుల్ గాంధీ ప్రసంగంలో సందిగ్ధత లేదు. అయన స్పష్టంగా తెలంగాణలో టిఆర్ ఎస్ తో ఎట్టి పరిస్థితుల్లో కలిసి పని చేసే అవకాశం లేదని కుండ బద్దలు కొడుతూ ప్రసంగించారు.

అలాగే పార్టీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ ప్రసంగానికి ముందే వారి సమక్షంలో డిక్లరేషన్ ప్రకటించడం సభకు హరజైన ప్రజలను ఆకర్షించింది. అయన తర్వాత మాట్లాడటం కూడా సూటిగా సాగింది. ఇది నిజానికి రేవంత్ రెడ్డి పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి అన్న అంశం కాదనలేని స్థితికి ఈ సభలో అయనకు దక్కిన తిరుగులేని ప్రాధాన్యత ఒక ఉదాహరణగా చూడొచ్చు. ఆ పార్టీ స్టార్ క్యాంపేనర్ అయన కోమటి రెడ్డి చివరి నిమిషంలో సభకు రావడం పార్టీ ఐక్య పోరాటానికి ఒక ముందడుగు గానూ చెప్పవచ్చు. ముందే చెప్పినట్టు సీతక్క వంటి మహిళ నేత, గీతారెడ్డి వంటి అనుభవం గల నేత ఒక నిండుదనం.

రాహుల్ గాంధీ ప్రసంగంలో సందిగ్ధత లేదు. అయన తెలంగాణను దోచుకున్నది ఎవరు అన్న మాటలో అనేక ద్వందార్థాలు ఉన్నాయి. తెలంగాణా రాష్ట్రాన్ని కాంగెస్ ఇవ్వడంలోని ‘కల’ వేరు, ‘జరిగినది వేరు’ అని అయన చెప్పడానికి ప్రయత్నించారు. అంతేకాదు, స్పష్టంగా తెలంగాణలో టిఆర్ ఎస్ తో ఎట్టి పరిస్థితుల్లో కలిసి పని చేసే అవకాశం లేదని కుండ బద్దలు కొడుతూ ప్రసంగించారు. ఎవరికైనా అనుమానాలుంటే, కలిసి పని చేస్తుందా అని అడిగినా కూడా ఆ మాట అన్న వ్యక్తి ఎంత పెద్ద నాయకులైనా వారిని పార్టీ బహిష్కరిస్తుందని కూడా చెప్పడం నేటి సభలో మరో ముఖ్య విశేషం.

మరో ఆసక్తికరమైన విశేషం, తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తన ప్రసగంలో కాళోజీ మాటల్ని ఉటంకిస్తూ కెసిఆర్ పాలనపై విమర్శలు చేయడం.

మరో ఆసక్తికరమైన విశేషం, తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తన ప్రసగంలో కాళోజీ మాటల్ని ఉటంకిస్తూ కెసిఆర్ పాలనపై విమర్శలు చేయడం. “దోపిడి చేసే ప్రాంతేతరులను దూరం దాకా తన్ని తరుముతం…ప్రాంతం వాడే దోపిడి చేస్తే ప్రాణంతోనే పాతర వేస్తం” అన్న చరణాలను ఆయన పేర్కొనడం కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ ఒంటరిగా టిఆర్ ఎస్ ను ఎదుర్కోబోతున్న సంకేతాలను వెల్లడి చేసింది. ఎంతో పరిణతితో పాటు అదే సమయంలో చాలా దూకుడుగా కెసిఆర్ ని గద్దె దింపే వ్యూహాలను అన్ని విధాలుగా పదును పెడుతున్నారని అనుకోవచ్చు.

రంగల్ డిక్లేరేషన్ మాదిరే నిరుద్యోగ యువతకు, మహిళలకు, దళితులకు, బహుజనులకు ఇలాంటి మరో నాలుగు డిక్లేరేషన్లను ఇచ్చే యోచనలో ఉందని తెలిసింది. అవి గనుక ఇదే విధంగా ప్రజల్లోకి వెళితే పార్టీ అనూహ్యంగా బలపడటం ఖాయం.

అనైక్యతకు మారుపేరుగా ఉండే కాంగ్రెస్ పార్టీ ఈ సభతో తమలోని సంఘర్షణలకు స్వస్తి చెప్పి అసలు శత్రువు ఎవరో దృష్టి సారించడం విశేషం.

అన్నింటికీ మించి వరంగల్ డిక్లరేషన్ ఒక నాంది. రానున్న ఎన్నికల్లో రాహూల్ గాంధీ తో మరో నాలుగు సమావేశాలను ఆ పార్టీ పెట్టబోతున్నది. ఇది ఆ దిశలో మొదటిది కావడం, అది బాగా జరగడం వారికీ పెద్ద ఉత్సాహం. ఇదే ఒరవడిలో ..ఎలాగైతే రైతులకు స్పష్టమైన హామీలు ఇచ్చే దిశలో ఈ వరంగల్ డిక్లేరేషన్ సాగిందో అదే మాదిరే కాంగ్రెస్ పార్టీ మొదట ఆదివాసీలకు అలాగే తర్వాత నిరుద్యోగ యువతా మహిళలకు, అట్లే దళిత బహుజనులకు ఇలాంటి మరో నాలుగు డిక్లేరేషన్లను ఇచ్చే యోచనలో ఉందని తెలిసింది. అవి గనుక ఇదే విధంగా ప్రజల్లోకి వెళితే పార్టీ అనూహ్యంగా బలపడటం ఖాయం. అందుకే ఈ తెలుపు సంపాదకీయం… హస్త లాఘవానికి తగిన సందర్భం వచ్చిందని చెప్పడం.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article