Editorial

Tuesday, December 3, 2024
వ్యాసాలువారే లేకపోతే? తెలుపు ఘన నివాళి

వారే లేకపోతే? తెలుపు ఘన నివాళి

సునీల్ జనా గారికి 2012 లో భారత ప్రభుత్వం పద్మ భూషణ్ ఇవ్వడం విశేషం. భరత్ భూషణ్ గారికి పద్మశ్రీ రాక ముందే నేడు తనువు వీడటం దురదృష్టకరం.

కందుకూరి రమేష్ బాబు 

తెలంగాణకు సంభదించి ఇద్దరు గురించి నేడు మరోసారి చెప్పాలి. అందులో ఒకరు మహత్తర తెలంగాణ సాయుధ పోరాటాన్ని ఛాయాచిత్రాల్లో పదిలపరిచిన ఫోటోగ్రాఫర్ శ్రీ సునీల్ జనా గారు. రెండవ వారు మలిదశ తెలంగాణ ఉద్యమానికి పూర్వం చెరగిపోని తెలంగాణ సాంస్కృతిక అస్తిత్వాన్ని బతుకమ్మ రూపంలో పదిల పరిచిన భరత్ భూషణ్ గారు.

ఒకరు పోరాట వారసత్వాన్ని చరిత్రలో పదిలపరిచారు. మరికరు జీవన పోరాటంలో ఎట్టి పరిస్థితుల్లోనూ అడుగంటి పోని మన సంస్కృతిని పదిలపరిచారు.

ఒకరు అమెరికాలో స్థిరపడి అక్కడే మరణించారు. మరొకరు ఇక్కడే ఉండి నానా ఇబ్బందులు పడి నేడు మనల్ని వీదిపోయారు.

సునీల్ జనా గారికి 2012 లో భారత ప్రభుత్వం పద్మ భూషణ్ ఇవ్వడం విశేషం. భరత్ భూషణ్ గారికి పద్మశ్రీ రాక ముందే తనువు వీడటం దురదృష్టకరం.

సునీల్ జనా సాయుధ పోరాట చిత్రాలను వారి కుమారులు అర్జున్ జనా దగ్గరి నుంచి ఒరిజినల్స్ సంపాదించి మనం జాగ్రత్త చేసుకోవాల్సి ఉంది. ఐతే, కొన్నేళ్ళ క్రితం నా ఉత్తరానికి వారు జవాబు రాస్తూ, తానున్న ప్రస్తుత స్థితిలో తండ్రి ఫోటోగ్రాఫ్స్ గురించి అలోచించి మనకు అందించే స్థితిలో లేనని జవాబిచ్చారు. అందుకు గల రెండు మూడు కారణాలను వారు తెలిపారు కూడా.
కాగా, డిల్లీలో ప్రదర్శితమాయ్యాక చిత్రకారులు మోహన్ గారు చొరవ తీసుకుని జిరాక్స్ చేపించి, అట్టలకు అతికించిన A 4 సైజు బొమ్మలు నా దగ్గరే ఉన్నాయి. గ్యాలరీలో భద్రపరిచాను. నేను బతుకమ్మ ఎడిటర్ గా ఉన్నప్పుడు వాటిని స్కాన్ చేసి కొన్ని మాసాలు సీరియలైజ్ చేశాను కూడా. ఈ బొమ్మలనే ప్రజాశక్తి వారు ఒక చిన్న పుస్తకంగా తెచ్చారు.

ఇద్దరినీ ఒక్క చోట చెప్పడం ఎందుకంటే, ఒకరు చరిత్రలో సాయుధ పోరాటం అన్నది కల్పన అని కొట్టిపారేయలేని విధంగా పదిలం చేశారు. మరొకరు చరిత్రలో తెలంగాణ పునరుజ్జీవన సంకేతాన్ని ముందస్తుగా అద్వితీయంగా చిత్రీకరించి పెట్టారు.

ఇక రెండో వ్యక్తి మన భరత్ భూషణ్ గారు.

వారు కాగితం పూల బతుకమ్మలతో పండుగ జరుపుకున్న ఒకనాటి తెలంగాణని మాత్రమే గాక, జాజు సున్నం గోడల మధ్య నుంచి బతుకమ్మతో నడిచి వచ్చే మన అచ్చమైన ఆత్మను ఎంతో గొప్పగా పట్టుకుని ప్రపంచంలోకి శక్తి కొద్ది తెచ్చారు. కొన్ని వందలమందితో ఆ చిత్రాలను తన ఇంట్లోనే చూపించి వారి అభిప్రాయాలను రాయించారు. అవన్నీ వారి చిత్రాలతో గనుక ఒక కాఫీ టబుల్ బుక్ గా వస్తే అది భావితరాలకు గొప్ప కానుకే అవుతుంది.

వారే గనుక బతుకమ్మను అంత చక్కటి ఈస్తటిక్స్ తో గనుక చిత్రించి పెట్టకపోతే ఒక తరం ఆటా పాటా – బొడ్డెమ్మ బతుకమ్మ జీవన లాస్యాన్ని మనం శాశ్వతంగా కోల్పోయేవాళ్ళం.

ఇద్దరినీ ఒక్క చోట చెప్పడం ఎందుకంటే, ఒకరు చరిత్రలో సాయుధ పోరాటం అన్నది కల్పన అని కొట్టిపారేయలేని విధంగా పదిలం చేశారు. మరొకరు చరిత్రలో తెలంగాణ పునరుజ్జీవన సంకేతాన్ని ముందస్తుగా అద్వితీయంగా చిత్రీకరించి పెట్టారు.

వారి ఫొటోలే లేకుంటే తెలంగాణా ఘనమైన సంపద ఎప్పటికీ అర్థం కాకుండా ఉండేది.

ఈ ఫొటోలే లేకుంటే తెలంగాణా ఘనమైన సంపద ఎప్పటికీ అర్థం కాకుండా ఉండేది. సునీల్ జనా ఫోటోలు గనుక కనిపించకుండా పోతే మన ఊహకు కూడా అందదు, నాడు మన పెద్దలు సాయుధ పోరాటం ఎట్లా ఆర్గనైజ్ చేశారూ అన్నది. కేవలం సాహిత్యం మీదే ఆధారపడాల్సిన దుస్థితి వచ్చేది. భరత్ భూషణ్ గారి చేర్పు కూడా అటువంటిదే. అది చరిత్రలో సిసలైన ప్రజా కళను, ఆరు బయటి మన సాహిత్య సంగీత జీవన నృత్య రూపకాన్ని సజీవం చేసి పెట్టింది.

భరత్ భూషణ్ గారి మరో ప్రత్యేకత ఏమిటంటే, కరువు కాటకాలతో విలవిల లాడుతూ, ‘కాపాడే నాథుడు’ లేక వలస పోయిన తెలంగాణను గొళ్ళెం వేసి ఉన్న తలుపులతో చూపెట్టారు. మూసి ఉన్న దర్వాజతో చిత్రీ కరించి చూపారు. అలాగే, కాలం సరిగా లేని రోజుల్లో కూడా బతుకమ్మ ఉన్నదని, ఆదే పునరుజ్జీవనం చెంది, తిరిగి స్వరాష్ట్రం దాక తలుపులు తెరించిందని అనడానికి ఆధారమైన నాటి బతుకమ్మను గొప్పగా నిలబెట్టారు.

వీళ్ళిద్దరూ మన గత చరిత్రకు దాఖలాలు. సెన్సిటివ్ వ్యక్తులు. ఒక సునీల్ జనా తీసిన చిత్రాన్ని ఇంట్లో పెట్టుకోవాలి. ఒక భరత్ భూషణ్ చిత్రాన్ని హాల్లో తప్పక అలంకరించుకోవాలి.

సెలవు భరత్ భూషణ్ అన్నకు.

 

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article