Editorial

Monday, December 23, 2024
కాల‌మ్‌ఆదివారం 'మంచి పుస్తకం' - ‘బార్బియానా బడి పిల్లల నుంచి టీచర్లకు ఉత్తరం’

ఆదివారం ‘మంచి పుస్తకం’ – ‘బార్బియానా బడి పిల్లల నుంచి టీచర్లకు ఉత్తరం’

K Suresh ‘మంచి పుస్తకం’ఒక సంపద.
కొసరాజు సురేష్ అందిస్తున్న ఈ శీర్షికలో ‘బార్బియానా బడి పిల్లల నుంచి టీచర్లకు ఉత్తరం’ తొమ్మిదవది.

విద్యా రాజకీయాలకు సంబంధించి ముఖ్యమైన పుస్తకాలలో ‘Letter to a Teacher – From the School of Barbiana’ ఒకటి. దీనికి నండూరి ప్రసాదరావు గారు చేసిన అనువాదాన్ని ‘పంతులమ్మకు లేఖ’ పేరుతో ప్రజాశక్తి బుక్ హౌస్ 1986లో ప్రచురించింది. అయితే, ఇది చాలాకాలంగా అందుబాటులో లేదు. అదీ కాకుండా మూలాన్ని అనువాదం సరిగా పట్టుకోలేదని, మళ్లీ చేయాల్సిన అవసరం ఉందని విజు అని పిలుచుకునే విజయేంద్ర చెపుతుండేవాడు. కొన్ని సంవత్సరాలు నేను దీనిని పట్టించుకోలేదు. చివరికి, 2001లో దీని అనువాదం మొదలుపెట్టినప్పుడు ఈ పుస్తకం నన్ను ఊరుకోనివ్వ లేదు, ఊపిరాడనివ్వ లేదు. బస్టాండులో, ఆఫీసులో ఎక్కడ పది నిమిషాల సమయం దొరికితే అక్కడ అనువాదం చేశాను. ఈ అనువాదాన్ని ‘బార్బియానా బడి పిల్లల నుంచి టీచర్లకు ఉత్తరం’ అన్న పేరుతో ప్రజాశక్తి బుక్ హౌస్ 2001లో ప్రచురించింది. ఈ పుస్తకం ఇప్పటికీ అందుబాటులో ఉంది (134 పేజీలు, 60 రూపాయలు).


అనువాదం అయితే చేశాను కానీ, మూలాన్ని నేను కూడా ఎంతవరకు పట్టుకోగలిగాను, పాఠకులు ఎంతవరకు అర్థం చేసుకోగలిగారన్నది నాకు ఇప్పటికీ అనుమానమే.

ఈ పుస్తకాన్ని అర్థం చేసుకోడానికి ఒకసారి చదివితే సరిపోదు. అంతేకాకుండా, పిల్లలు ఇందులో విశిష్టమయిన వ్యంగ్య శైలిని అవలంబించారు. ఇటలీ పరిస్థితులు, అక్కడి సాంస్కృతిక నేపధ్యం వేరు కాబట్టి మళ్లీ, మళ్లీ చదివితే కాని ఈ పిల్లల ఆవేదన అర్థం కాదు.

ఈ పుస్తకానికి పిల్లలయిన రచయితలు ఇచ్చిన పాద సూచికలతో పాటు, ఇంగ్లీషు అనువాదకులు, తెలుగు అనువాదకుడిగా నేను ఇచ్చిన వివరణలు ఉన్నాయి. వెరసి ఈ పుస్తకాన్ని అర్థం చేసుకోడానికి ఒకసారి చదివితే సరిపోదు. అంతేకాకుండా, పిల్లలు ఇందులో విశిష్టమయిన వ్యంగ్య శైలిని అవలంబించారు. ఇటలీ పరిస్థితులు, అక్కడి సాంస్కృతిక నేపధ్యం వేరు కాబట్టి మళ్లీ, మళ్లీ చదివితే కాని ఈ పిల్లల ఆవేదన అర్థం కాదు.

అనువాదకునిగా నేను ముందు మాట రాసిన ఒకే ఒక పుస్తకం ఇది.

దీనిని ఇటలీ లోని బార్బియానా బడి పిల్లలు రాశారు. పుస్తకం అంతా ప్రథమ పురుష ‘నేను’లో ఉంటుంది. కానీ దీనిని 8 మంది పిల్లలు రాశారు. తమ చదువులో భాగంగా సంవత్సర కాలంలో వాళ్లు చేసిన ప్రాజెక్టు ఇది. ఈ పుస్తకం కోసం ఎంతోమందిని సంప్రదించి అనేక గణాంకాలను సేకరించి, విశ్లేషించారు. అదే విధంగా టీచరుని ఒక వ్యక్తిగా సంభోదించినట్లు ఉంటుంది కానీ అది టీచర్లందరినీ ఉద్దేశించినది.

చదువు అందరికీ సమానంగా లేదని ఈ పిల్లలు ఎన్నో ఉదాహరణలతో, విస్తృత గణాంకాలతో నిరూపించారు.

మత గురువు లరేంజో మిలాని ఇబ్బందులు కలగ చేస్తున్న కారణంగా మతాధికారులు అతనిని 1954లో మారుమూల బార్బియానా చర్చికి బదిలీ చేశారు. మంచి పని చేసేవాళ్లు ఎక్కడున్నా ఊరుకోరు కదా. అక్కడ అతను ఒక బడి ప్రారంభించాడు. ప్రధానంగా పేద పిల్లలు, తప్పటం కారణంగా బడి మానేసిన పిల్లలు ఈ బడికి వచ్చేవాళ్లు. బడి అంటే బడి కాదు. చర్చి ప్రాంగణంలో ఈ పిల్లలు తమంతట తాము చదువుకుంటారు. చిన్న పిల్లలకు పెద్ద పిల్లలు సహాయపడతారు.

ఈ పుస్తకంలో బాగా రాయటానికి సంబంధించిన నియమాలు అంటూ పిల్లలు ఇలా పేర్కొన్నారు – ఏదో ఒకటి ముఖ్యమయినది అందరికీ, లేదా చాలామందికి ఉపయోగపడేది చెప్పటానికి ఉండాలి. అది ఎవరి కోసం రాస్తున్నారో తెలియాలి.

ఇటాలియన్ భాష నుంచి ఈ పుస్తకాన్ని ఇంగ్లీషులోకి నోరా రొస్సి, టామ్ కోల్‌లు 1969లో అనువదించారు. అనువాదకులలో ఒకరు 1968లో బార్బియానా బడిని సందర్శించారు కూడా.

ఈ పుస్తకంలో బాగా రాయటానికి సంబంధించిన నియమాలు అంటూ పిల్లలు ఇలా పేర్కొన్నారు – ఏదో ఒకటి ముఖ్యమయినది అందరికీ, లేదా చాలామందికి ఉపయోగపడేది చెప్పటానికి ఉండాలి. అది ఎవరి కోసం రాస్తున్నారో తెలియాలి. అవసరమైన సమాచారం అంతా సేకరించాలి. వాదనను రూపొందించటానికి దోహద పడే హేతుబద్ధ రూపాన్ని తయారు చేసుకోవాలి. ఉపయోగం లేని ప్రతి ఒక్క మాటనీ తీసివెయ్యాలి. మాట్లాడే భాషలో లేని ప్రతి ఒక్క మాటనీ తీసెయ్యాలి. ఎప్పుడూ కూడా ఇంత సమయంలో ముగించాలన్న నియమం పెట్టుకోవద్దు.

ఈ పుస్తకంలో చిన్న చిన్న పేరాలు, పేరాలకి అందులోని అంశానికి సంబంధించి శీర్షికలు ఉంటాయి. తమ వాదనని వినిపించటానికి పేద విద్యార్థులకు ప్రతీకగా గియాన్నిని, ధనిక విద్యార్థులకు ప్రతీకగా పియెరినోని బార్బియానా బడి పిల్లలు తీసుకున్నారు.

ధనిక పిల్లలకు విద్యా విధానం ఎలా అనుకూలంగా ఉందో తెలియ చేయటానికి 20కి పైగా పేజీలలో గణాంకాలతో సహా పిల్లలు విశ్లేషించారు. ఇటలీకి చెందిన ఈ గణాంకాలను ఉంచాలా, వద్దా అని చర్చించుకుని వీటిని ఇంగ్లీషు అనువాదకులు ఉంచారు. తెలుగులోనూ వాటిని ఉంచాం. మచ్చుక్కి ఈ బొమ్మ చూడండి…

ఈ బొమ్మలో పై భాగం తండ్రుల వృత్తుల బట్టి బడి మొత్తంలో ఎంత మంది పిల్లలు ఉన్నారో తెలుస్తుంది. కింది భాగం బడి మానేసిన పిల్లల శాతాన్ని తెలియ చేస్తుంది.

ఈ బొమ్మలో పై భాగం తండ్రుల వృత్తుల బట్టి బడి మొత్తంలో ఎంత మంది పిల్లలు ఉన్నారో తెలుస్తుంది. కింది భాగం బడి మానేసిన పిల్లల శాతాన్ని తెలియ చేస్తుంది. బడి మానేస్తున్న వాళ్లంల్లో 78.9 శాతం రైతుల పిల్లలు కాగా, 15.8 శాతం కార్మికుల పిల్లలు. అంటే బడి మానేస్తున్న లేదా తప్పుతున్న పిల్లల్లో 94.7 శాతం పేద రైతు, కార్మిక పిల్లలే.

ఈ పిల్లలకి ‘చదువు రాదు’ అని ఎవరైనా అనవచ్చు. మందమతులు, సోమరులను మాత్రమే తప్పిస్తారని చెప్పవచ్చు. అయితే మందమతులు, సోమరులను పేద వాళ్ల ఇళ్లల్లోనే దేవుడు పుట్టించడని, పేదవాళ్లంటే అంత అసహ్యం ఉన్నది టీచర్లకేనని పిల్లలు అంటారు. డబ్బున్నవాళ్లకి కూడా మందమతులు పుడతారని, వాళ్లని ఎలాగో ముందుకు తోసేస్తారన్నది పిల్లల ఆరోపణ.

పేదవాళ్లకి బడుల నుంచి, టీచర్ల నుంచి మద్దతు లేకపోవటమే కాకుండా చర్చి నుంచి, కమ్యునిస్టుల నుంచి కూడా ఎటువంటి మద్దతు లేదని పిల్లలు అంటారు.

సాధారణంగా టీచర్లు బాగా చదివే పిల్లలపై దృష్టి పెడతారు. అదే, ఉత్తీర్ణులయిన పిల్లల సంఖ్య బట్టి టీచర్లకు జీతాలు ఇస్తామంటే అప్పుడు చదువులో వెనకబడిన పిల్లలకు ఎలా చెపితే నేర్చుకుంటారా అని టీచర్లు వాళ్ల గురించి రేయింబవళ్లు ఆలోచించటం మొదలుపెడతారని పిల్లలు అంటారు.

పేదవాళ్లకి బడుల నుంచి, టీచర్ల నుంచి మద్దతు లేకపోవటమే కాకుండా చర్చి నుంచి, కమ్యునిస్టుల నుంచి కూడా ఎటువంటి మద్దతు లేదని పిల్లలు అంటారు.

తాము ఎంత కష్టపడి చదువుకున్నారో, దానికి ఎంత డబ్బు ఖర్చు పెట్టారో కొంత మంది గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. అయితే తమ కోసం వాళ్లు ఖర్చు పెట్టిన దాని కంటే ఎంతో ఎక్కువ ప్రభుత్వం వాళ్ల కోసం ఖర్చు చేస్తుందని పిల్లలు పేర్కొన్నారు. ఉదాహరణకు ఎం.డి. చదివే వ్యక్తిపై ప్రభుత్వానికి 45,86,000 లైర్‌ల ఖర్చు అవుతుంది, అందులో ఆ వ్యక్తి చెల్లించేది 2,44,000 లైర్‌లు మాత్రమే. ఆ విధంగా ప్రభుత్వ (ప్రజా) డబ్బుతో డాక్టరు అయిన వ్యక్తి ఆ తరవాత ప్రభుత్వ వైద్య బీమాని, సామాజిక వైద్య విధానాన్ని వ్యతిరేకిస్తాడు.

ప్రస్తుత విద్య విధానంలోని లోపాలను ఎత్తి చూపటమే కాకుండా విద్యార్థులను తప్పించకూడదనీ, పూర్తి కాలం బోధన ఉండాలని ఈ పిల్లలు ప్రతిపాదించారు.

ప్రత్యక్ష (ఆదాయపు) పన్ను తక్కువగా ఉండి, పరోక్ష (వస్తువులు, సేవలపై) పన్ను ఎక్కువగా ఉండటం వల్ల ధనికులకు లాభం, పేదలకు నష్టం అని పిల్లలు చెపుతారు.

ఫాసిజం, జాతి దురహంకారం, యుద్ధం, నిరుద్యోగం వంటి వాటితో దాడి చెయ్యటానికి ఆధిపత్య వర్గం ఎన్నడూ వెనకాడ లేదు. తమకున్న సౌకర్యాలను, డబ్బును కాపాడుకోటానికి అవసరమైతే వాళ్లు ‘కమ్యునిజాన్ని కూడా వాటేసుకొంటారు,’ అంటారు బార్బియానా బడి పిల్లలు.

ప్రస్తుత విద్య విధానంలోని లోపాలను ఎత్తి చూపటమే కాకుండా విద్యార్థులను తప్పించకూడదనీ, పూర్తి కాలం బోధన ఉండాలని ఈ పిల్లలు ప్రతిపాదించారు. నిజాయితీతో కూడిన లక్ష్యాన్ని తాము కోరుకుంటున్నామని, ఇతరుల కోసం తనను తాను అంకితం చేసుకోవటమే సరైన లక్ష్యమని ఈ పిల్లలు చెపుతున్నారు.

మొత్తం మూడు భాగాలు ఉన్న ఈ పుస్తకంలో 3వ భాగంలో గణాంక పట్టికలు ఉన్నాయి. ఈ పుస్తకాన్ని అర్థం చేసుకోటానికి అంతగా అవసరం లేని గణాంకాలను ఈ భాగంలో చేర్చారు. అయితే విషయాన్ని లోతుగా అర్థం చేసుకోవాలని అనుకునేవాళ్లకు, తమని నమ్మని ‘మిత్రులకు’ ఇవి ఉపయోగపడతాయని పిల్లలు పేర్కొన్నారు.

ఈ పిల్లల ఆవేదన, ఆక్రోశం, ఆవేశాలను అర్థం చేసుకోవాలంటే ఈ పుస్తకాన్ని మళ్లీ మళ్లీ చదవాల్సి ఉంటుంది. ప్రస్తుత చట్టాలు, సామాజిక వ్యవస్థతో ఎటువంటి ఇబ్బందులు లేని వాళ్లం ఆ పని చెయ్యగలమా?

కాలమిస్టు పరిచయం

పాఠకుల అభిరుచికి పెద్దపీట వేయడం కారణంగా కొసరాజు సురేష్ గారు మంచి అనువాద పుస్తకాలు అందించిన ఘనతని మాత్రమే సొంతం చేసుకోలేదు, వారు ‘మంచి పుస్తకం’ ప్రచురణ సంస్థ ట్రస్టీగా వందలాది పుస్తకాల భండాగారాన్ని తెలుగు పాఠకులకు అందించి మనల్ని సంపద్వంతం చేశారు. వారి అనువాదాల్లో గడ్డికపరకతో విప్లవం మొదటిదైతే బాబోయ్:బడి! రెండవది. ‘సందిగ్ధ’ మూడవది. ‘నాకు నేను తెలిసే’ నాలుగవది. సమ్మర్‌హిల్‌ ఐదవది. ఆరవది ‘అనార్కో’. ఏడవది ‘జీవన గీతం’ . ఎనిమిదవది ‘యుద్ధోన్మాది అమెరికా’. చిన్నవి పెద్దవి కలిపి వారువంద పుస్తకాల దాకా తెలుగు పాఠక ప్రపంచానికి అనువదించి ఇచ్చారు, అందులో అత్యధిక ప్రజాదరణ, పలు ముద్రణలు పొందిన పాలో కోయిలో తాత్వక గ్రంథం ‘పరుసవేది’ని మీరు చదివే ఉంటారు. దాంతో పాటు హృదయాలను మండించే పెరుమాళ్ మురుగన్ ‘చితి’ కూడా వారు అనువదించినదే. ‘మంచి పుస్తకం’ శీర్షిక పేరిటే వారు మిగతా పుస్తకాలను కూడా వారానికి ఒకటి మీకు ఇలాగే పరిచయం చేస్తారు. 

Email: kosaraju.suresh@gmail.com
website: https://manchipustakam.in/

More articles

2 COMMENTS

  1. ప్రస్తుత భారత దేశం లోని విద్యా విధానానికి అద్దం పెట్టె ఈ పుస్తకం చదవాల్సిందే

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article