Editorial

Wednesday, January 22, 2025
కథనాలు‘తెలంగాణ' కార్టునిస్టుల ఖజానా --టి. ఏడుకొండలు

‘తెలంగాణ’ కార్టునిస్టుల ఖజానా –టి. ఏడుకొండలు

shekhar

అసమానతలను వ్యతిరేకించే లక్షణమే ఇక్కడి వారిని కార్టూనిస్టులుగా మార్చిందని అనిపిస్తుంది. కాలక్షేపపు చిత్రరచన కాకుండా ప్రయోజనం ఆశించి, ప్రశ్నించే స్వభావం ఉన్న కార్టూన్ రంగాల్ని ఎంచుకోవడమే దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు.

వెనకబడిన తెలంగాణ జిల్లాల నుంచి ఎక్కువ మంది కార్టూనిస్టులు తయారు కావడం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా నేడు వివిధ దిన పత్రికల్లో, మీడియా సంస్థల్లో పనిచేస్తున్న కార్టూనిస్టుల్లో ఎక్కువ శాతం మంది తెలంగాణకు చెందిన వారే అయి ఉండడం, అందరి సామాజిక నేపథ్యాలు కూడా ఇంచు మించు ఒకేలా ఉండడం గమనార్హం.

తెలంగాణా జర్నలిస్టుల ఫోరం ( TJF) ఇరవై ఏళ్ల క్రితం తెచ్చిన ‘తెలంగాణ, మే 31, 2001’ పుస్తకంలోని మూడో వ్యాసం ఇది. తన వ్యంగ్య చిత్రాలతో రాజకీయాలకు భాష్యం చెప్పిన శ్రీ కంభాలపల్లి శేఖర్‌ క్యాన్సర్వ్ వ్యాధితో 2014లో కన్ను మూసిన విషయం మనకు తెలిసిందే. మరణించేనాటికి వారు ఇంటి నుంచే ఆంధ్రజ్యోతికి కార్టూన్లు వేస్తున్న సంగతి మీకు గుర్తుండే ఉంటుంది.

TJF తెచ్చిన ఈ పుస్తకానికి వారే అర్ధవంతమైన ముఖ చిత్రాన్ని అందించారు. అంతేకాదు, అప్పుడున్న పరిస్థితుల్లో నేరుగా తన పేరుతో కాకుండా టి. ఏడుకొండలు అన్న కలం పేరుతో  తెలంగాణా కర్టూనిస్టులను పేరు పేరునా ప్రస్తావిస్తూ ఈ వ్యాసాన్ని రచించి ఇచ్చారు. వారప్పుడు ఆంధ్రప్రభలో పనిచేస్తూ ఉన్నారు.

తెలంగాణ జర్నలిజం చరిత్రలో కార్టూనింగ్ ని ప్రత్యేక దృష్టితో పరిశీలించవలసి ఉంది. అందుకు భూమిక నిచ్చే ఈ వ్యాసం రాసిన శ్రీ శేఖర్ గారిని మరింత ప్రాధాన్యంతో TJF స్మరించుకోవలిసిన అవసరం ఎంతో ఉంది.

అసమానతలు, పీడనకు గురైన తెలంగాణలో పుట్టి పెరగడం మూలాన వీరి ఆలోచనా ధోరణిలో కూడా సామ్యం కనిపిస్తుంది. అసమానతలను వ్యతిరేకించే లక్షణమే వీళ్లందరినీ కార్టూనిస్టులుగా మార్చిందని అనిపిస్తుంది. కాలక్షేపపు చిత్రరచన కాకుండా ప్రయోజనం ఆశించి, ప్రశ్నించే స్వభావం ఉన్న కార్టూన్ రంగాల్ని ఎంచుకోవడమే దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. సాయుధ పోరాటలకు పుట్టిన ఈ గడ్డ మీది కమ్యూనిజపు భావజాలం అందరిలోనూ కనబడటమే దీనికి తార్కాణం.

రాజకీయాలను అర్థం చేసుకోవడంలోగాని, దాన్ని తమ కార్టూన్ల లో శక్తివంతంగా ప్రతి ఫలింప చేయడంలోగాని ఈ కార్టూనిస్టులు జాతీయ స్థాయి కార్టూనిస్టులకు తీసిపోకుండా కృషి చేస్తున్నారు. కాపు రాజయ్య, వైకుంఠం, సుదర్శన్, చంద్ర, ఏలె లక్ష్మణ్ తదితర చిత్రకారులు ఇక్కడ మట్టి వాసినలు పీల్చే చిత్రాలు గీసినా, దశాబ్ద క్రితం వరకు పూర్తిగా అధిక్షేప లక్షణం కలిగిన కార్టూనింగ్ చేసిన వాళ్ళు చాలా తక్కువ. రాష్ట్రంలో నిత్యం లక్షలాది మంది పాఠకులకు ఈనాడు ద్వార పలకరించే కార్టూనిస్టు శ్రీధర్ తెలంగాణ ఆణిముత్యం. మంచి లైనింగ్ ఉండి, మంచి రేఖాపాటవంగల కార్టూనిస్టు శంకర్. హిందూస్థాన్ టైమ్స్ పత్రిక జాతీయ స్థాయి బహుమతి పొంది, ప్రస్తుతం ‘వార్త’ దినపత్రికలో పనిచేస్తున్నారు. ఇదే పత్రికలో కార్టూన్లు వేసే జావేద్, నారు కూడా తెలంగాణ జానాలోని వారే ఆంధ్రప్రభలో కార్టూన్లు వేసే శేఖర్ వామపక్ష భావజాలంతో నల్లగొండ జిల్లా నుంచి వచ్చిన వాడు. ఆంధ్రభూమిలో ప్రతిరోజు పాఠకులను చిలిపిగా పలకరిస్తూనే, నేత కార్మికుల ఆత్మహత్యలపై అద్భుతమైన కార్టూన్లు వేసిన మృత్యుంజయ ఇక్కడివాడే. సియాసత్లో దశాబ్దల తరబడి కార్టూస్టు వేస్తున్న ‘షోయబ్’, ఆంధ్రప్రదేశ్ పత్రికలో వేసే ‘రవినాగ్’, ఇండియా టుడే కార్టూనిస్లు ‘నర్సిమ్’ జి.బి.ఎన్.రెడ్డి, కుముదం గ్రూప్ లో పనిచేస్తున్న ‘సూరి’, అప్పడాల కర్ర కార్టూనిస్టు ఎం.ఐ. కిషన్, రాము, అవినాష్, రవికాంత్, ప్రజాశక్తి దినపత్రికలో వేసే వెంకటేశ్, వెంకట్, రుక్మిణి, ఇంగ్లీష్ లో కార్టూర్లు వేస్తూ అంతర్జాతీయంగా పేరు పొందిన సైలెన్సర్ శ్రీనివాస్, గంగాధర్ ఈ గడ్డవారే. ఇంకా వార పత్రికల్లో వేస్తున్న వాళ్ళలో అనేకులు ఉన్నారు.

వివిధ పత్రికల్లో తమ తమ పరిధిలను పరిమితులను ఎరిగి పనిచేస్తున్న ఈ కార్టూనిస్టులంతా తెలంగాణ మట్టిలో పుట్టిన రత్నాలే. ఇక్కడి వీరి సామాజిక దృక్పథం, మూలాలే వీరిని రాష్ట్రంలో జరిగే అన్ని పోరాటాలకూ ఉసిగొలుపుతున్నాయి.

హిందూస్తాన్ టైమ్స్ పత్రిక కార్టూనిస్టు ‘సుధీర్ తైలంగ్’ పూర్వికులు తెలంగాణాకు చెందిన వారే. అందుకు ఆయన పేరు చివర తెలంగాణని సూచించే ‘తైలంగ్’ అని ఉంటుందని ఆయనే స్వయంగా చెప్పారు. హిందూ పత్రిక కార్టూనిస్టు ‘కేశవ్’ బాల్యం, ప్రాథమిక విద్యాభ్యాసం అంతా హైదరాబాద్ లోనే జరిగింది. ఇంకా విజయన్, ఓ.యు. అబూ అబ్రహం వంటి దిగ్గజాలైన కార్టూనిస్టులు ఈ తెలంగాణ గడ్డతో అనుబంధం పెనవేసుకొని ఉన్నవారే. ఇంకా యానిమేషన్ రంగాల్లో ఇప్పుడిప్పుడే తమ ప్రతిభ చూపుతున్న ఎందరో కార్టూనిస్టులు ఉన్నారు.

వివిధ పత్రికల్లో తమ తమ పరిధిలను పరిమితులను ఎరిగి పనిచేస్తున్న ఈ కార్టూనిస్టులంతా తెలంగాణ మట్టిలో పుట్టిన రత్నాలే. ఇక్కడి వీరి సామాజిక దృక్పథం, మూలాలే వీరిని రాష్ట్రంలో జరిగే అన్ని పోరాటాలకూ ఉసిగొలుపుతున్నాయి. దానికి నిదర్శనం రాష్ట్రంలో ఏ మూల ఏ పోరాటం జరిగిన అది వామపక్షాలే కావచ్చు. తీవ్రవాద రాజకీయ పక్షాలే కావచ్చు. మహిళా సంఘాలే కావచ్చు. హక్కుల సంఘాలనారే కావచ్చు. ఎవరికి ఏదవసరం పడినా తమ వంతు చేయూత అందిస్తూ వస్తున్నారు.

‘తెలంగాణ, మే 31, 2001’ పుస్తకంలోని సంపాదకీయం, తొలి రెండు వ్యాసాలను కింద క్లిక్ చేసి చదవగలరు.

తెలంగాణ, మే 31, 2001 – చారిత్రాత్మక సంపాద‌కీయం 

మన ప్రతాపరెడ్డికి వందనాలు- కె. శ్రీనివాస్ వ్యాసం

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article