Editorial

Monday, December 23, 2024
కథనాలు'బంగారు తెలంగాణ'లో 'అకుపచ్చ' ప్రశ్నలు : ఇఫ్తార్ నహీ....రోజ్ గార్ చాహియే! - కేసీఆర్ కు...

‘బంగారు తెలంగాణ’లో ‘అకుపచ్చ’ ప్రశ్నలు : ఇఫ్తార్ నహీ….రోజ్ గార్ చాహియే! – కేసీఆర్ కు ముస్లిం సంఘాల డిమాండ్

నిన్న అంటే ఆదివారం 27 మార్చి రోజున సుందరయ్య విజ్ఞాన కేంద్రలో తెలంగాణ ముస్లిం సంఘాల జాక్  రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి తమకు ఒక్క పూట దావత్ కాదు, బతుకు దెరువుకు ఉపాధి కావాలంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ ముస్లింలకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయనే ప్రశ్నిస్తూ వాటితో పాటు మరికొన్ని ముఖ్యమైన డిమాండ్స్ ప్రభుత్వం ముందుంచారు.

“ఇఫ్తార్ నహీ.. రోజ్ గార్ చాహియే” అని డిమాండ్ చేస్తూ కేసీఆర్ ముస్లింలకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయనే అంశం మీద ముస్లిం సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం నిన్న విజయవంతంగా జరిగింది. నలభై సంఘాల ప్రతినిధుల ఆధ్వర్యంలో పలు తీర్మానాలను ఆమోదించింది. వాటి అమలుకై తగిన కార్యాచరణను రూపొందించి ఒకవైపు రంజాన్ నెలకు తొలి ప్రాధాన్యత నిస్తూ, దావతే ఇఫ్తార్లు వద్దు, బడ్జెట్ లో 12 శాతం నిధులు కావాలన్న డిమాండ్ ని రాష్ట్ర ప్రభుత్వాం ముందుంచుతూ మరోవైపు 20కి పైగా జిల్లాలలో కలెక్టర్ లకు మెమరాండంలు కూడా సమర్పించడం విశేషం. వారు సవివరంగా ప్రభుత్వం హామీలను గుర్తు చేస్తూ ఇదివరకే కేసీఆర్ ఇచ్చిన హామీలను అమలు చేయాలనీ డిమాండ్ చేశారు.

సమాజంలోని ఇంత పెద్ద సమూహం వెనుకబడి ఉంటే నెంబర్ వన్ తెలంగాణ ఎలా సాధ్యమని ప్రశ్నిస్తూ ఇచ్చిన హామీల అమలుతో పాటు పలు అంశాలను  రౌండ్ టేబుల్ ప్రభుత్వం దృష్టిలో పెట్టింది. అమలుకై నలభై సంఘాల ప్రతినిధులతో డిమాండ్ చేసింది.

తెలంగాణ రాష్ట్రం అవతరించాక కేసీఆర్ రెండు దఫాల ఎన్నికల్లో ముస్లింలకు ఎన్నో హామీలు ఇచ్చారు. ఇందులో కొన్నే నెరవేర్చారు. తెలంగాణ సమాజంలో అతి పెద్ద సమూహమైన ముస్లింలు బాగుపడకుండా బంగారు తెలంగాణ ఎలా సాధ్యమన్నది ప్రశ్న. సమాజంలోని ఇంత పెద్ద సమూహం వెనుకబడి ఉంటే నెంబర్ వన్ తెలంగాణ ఎలా సాధ్యమని ప్రశ్నిస్తూ ఇచ్చిన హామీల అమలుతో పాటు పలు అంశాలను  రౌండ్ టేబుల్ ప్రభుత్వం ద్రుష్టిలో పెట్టింది.

ఇదివరకు జరిగిన రెండు ఎన్నికల్లోనూ పెద్ద సమూహమైన ముస్లిం కమ్యూనిటీ 14 శాతం ఓట్లలో మెజారిటీ ఓట్లు టీఆర్ఎస్ కే వేసి గెలిచేందుకు దోహదపడిన విషయాన్ని గుర్తు చేస్తూ ముస్లింలకు ఇచ్చిన ముఖ్యమైన హామీలు నెరవేర్చవలసిన బాధ్యత సీఏం కేసీఆర్ పై ఉన్నదని సమావేశం ఏకగ్రీవంగా అభిప్రాయ పడింది. అలాగే తానుగా వేసిన సుధీర్ కమిటీ రిపోర్టు చేసిన సిఫార్సులు అమలు చేయవలసిన అవసరం ఉన్నదని గుర్తు చేసింది. త్వరలో మూడవ దఫా ఎన్నికలు సమీపిస్తున్న ఈ సమయంలో సీఏం కేసీఆర్ తక్షణం ఇచ్చిన హామీలపై స్పందించాలని, అలాగే రాష్ట్రంలో అత్యంత వెనుకబడివున్న ముస్లింల పురోభివృద్ధి కోసం ఈ కింది చర్యలు తీసుకోవాలని రౌండ్ టేబుల్ ఎక్గ్రవాంగా తీర్మానించింది.

రెండు దఫాల ఎన్నికల్లో 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ఇచ్చిన హామీ ఇప్పటికీ అమలుకు నోచుకోలేదు. కేవలం అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి చేతులు దులుపుకుంటే ఈ ఎనిమిదేళ్లుగా నష్టపోయిన అగాధాన్ని ఎలా పూడుస్తారని సమావేశం ప్రశ్నించింది.

ఈ సంవత్సరం రంజాన్‌ నెలలో ఇఫ్తార్ విందుల కోసం ప్రభుత్వం రూ. 8 కోట్లు కేటాయించింది. అలాగే రంజాన్ తోఫాల కోసం రూ. 21 కోట్లు కేటాయించింది. ఈ ఇఫ్తార్ విందుల, తోఫాల ఖర్చులను మైనారిటీ బడ్జెట్ లోంచి కేటాయించడం మానుకోవాలని సమావేశం డిమాండ్ చేసింది.

రెండు దఫాల ఎన్నికల్లో 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ఇచ్చిన హామీ ఇప్పటికీ అమలుకు నోచుకోలేదు. కేవలం అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి చేతులు దులుపుకుంటే ఈ ఎనిమిదేళ్లుగా నష్టపోయిన అగాధాన్ని ఎలా పూడుస్తారని సమావేశం ప్రశ్నించింది. ఆ నష్టాన్ని పూరించడానికి ఏ ప్రత్యామ్నాయ ప్రయత్నమూ జరగలేదు. 12 శాతం మేరకు ఇతర ప్రాతినిధ్య అవకాశాలు కల్పించాలని కనీస ఆలోచన చేయలేదు. దాంతో ఈ ఎనిమిదేళ్లుగా భర్తీ అయిన ఉద్యోగ నియామకాల్లో ముస్లిం నిరుద్యోగ అభ్యర్థులు పెద్ద ఎత్తున నష్టపోయారని, త్వరలో విడుదలవున్న ఉద్యోగ నోటిఫికేషన్లలో ముస్లింలకు 12% రిజర్వేషన్ కోటా కల్పించాలని సమావేశం డిమాండ్ చేసింది.

2022 – 23 వార్షిక బడ్జెట్ లో మైనార్టీ సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 1740 కోట్లు కేటాయించింది. రాష్ట్రంలో 14% జనాభా ఉన్న మైనార్టీలకు ఇంత తక్కువ బడ్జెట్ కేటాయించడం అన్యాయం. కావున పునర్ సమీక్ష జరిపి మైనార్టీ బడ్జెట్ ని రూ. 5000 కోట్లకు పెంచాలన్నది మరో ముఖ్యమైండ్ డిమాండ్.

గత 8 సంవత్సరాల రాష్ట్ర వార్షిక బడ్జెట్ లో మైనారిటీ సంక్షేమానికి కేటాయించిన బడ్జెట్ లలో ఖర్చు కాకుండా దాదాపు రూ. 4000 వేల కోట్ల మిగిలాయని, ఆ నిధులను క్యారీఫై చేసి ఈ సంవత్సరం తిరిగి ఖర్చు చేయాలని డిమాండ్ చేసింది.

వక్ఫ్ బోర్డుకు జ్యూడీషియల్ పవర్ కల్పించాలని, అలాగే వక్ఫ్ భూముల పరిరక్షణ కొరకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాల్సి ఉందని,  మైనారిటీ కమీషన్, వక్ఫ్ బోర్డు, మైనార్టీ ఫైనాన్స్ కార్పోరేషన్, ఉర్దూ అకాడమీ, హజ్ కమిటీలకు పూర్తి స్థాయి పాలక మండళ్లను వెంటనే నియమించాల్సి ఉందని రౌండ్ టేబుల్ డిమాండ్ చేసింది.

Logoత్వరలో ఖాళీ అవుతున్న మూడు రాజ్యసభ స్థానాలలో ఒక స్థానం ముస్లిం మైనారిటీకి ఇవ్వాలన్నది కూడా వారి డిమాండ్. అలాగే, “మైనారిటీ బంధు” పథకాన్ని అమలు చేయాలన్నది కూడా ప్రధాన డిమాండ్.

సుధీర్ కమీషన్ సూచించిన సమాన అవకాశాల కమిషన్ ఏర్పాటు చేయాలని,  ఆ కమీషన్ సూచించిన మైనారిటీ సబ్ ప్లాన్ ఏర్పాటు చేయాలని కూడా సమావేశం అభిప్రాయపడింది.

త్వరలో ఖాళీ అవుతున్న మూడు రాజ్యసభ స్థానాలలో ఒక స్థానం ముస్లిం మైనారిటీకి ఇవ్వాలన్నది కూడా వారి డిమాండ్. అలాగే, “మైనారిటీ బంధు” పథకాన్ని అమలు చేయాలన్నది కూడా ప్రధాన డిమాండ్.

ఉర్దూ మీడియం స్కూల్స్, కాలేజీలలో ఖాళీగా ఉన్న బ్యాక్ లాగ్ పోస్టులను డీ నోటిఫై చేసి తిరిగి భర్తీ చేయాలి.  TRT – 2017 లో పెండింగ్‌లో ఉన్న 558 ఉర్దూ మీడియం టీచర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి. వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ కొరకు వక్ఫ్ బోర్డులో పర్మనెంట్ సిబ్బందిని నియమించాల్సి ఉంది. TSPSC లో ఒక ముస్లిం మైనారిటీకి అవకాశం ఇవ్వాలి. యూనివర్సిటీలలో ఒక్క వైస్ ఛాన్సలర్ పదవిని కూడా ముస్లిం ప్రొఫెసర్ కు అవకాశం ఇవ్వలేదు. ఇకనైనా రిజిస్ట్రార్లుగా, ఓస్డీలుగా అయినా ముస్లిం ఫ్రొఫెసర్లకు అవకాశం ఇవ్వాలన్నవి ఇతర డిమాండ్లు.

మైనార్టీ నిరుద్యోగుల ఉచిత కోచింగ్, స్టయిఫండ్ కోసం మైనార్టీ స్టడీ సర్కిల్ కోసం రూ.50 కోట్లు కేటాయించాలని, మూసివేయించిన 55 మైనారిటీ కాలేజీలను తిరిగి ప్రారంభించడానికి అనుమతి ఇవ్వాలని కూడా రౌండ్ టేబుల్ ప్రభుత్వాని డిమాండ్ చేసింది.

బ్యాంకులతో సంబంధం లేకుండా నేరుగా మైనార్టీ కార్పోరేషన్ ద్వారా సబ్సిడీ లోన్లు మంజూరు చేయాలని, డబుల్ బెడ్ రూం ఇండ్ల కేటాయింపులో పేద ముస్లింలకు 12% కోటా అమలు చేయాలని, మైనార్టీ నిరుద్యోగుల ఉచిత కోచింగ్, స్టయిఫండ్ కోసం మైనార్టీ స్టడీ సర్కిల్ కోసం రూ.50 కోట్లు కేటాయించాలని, మూసివేయించిన 55 మైనారిటీ కాలేజీలను తిరిగి ప్రారంభించడానికి అనుమతి ఇవ్వాలని కూడా రౌండ్ టేబుల్ ప్రభుత్వాని డిమాండ్ చేసింది.

మైనారిటీ గురుకులాలకు శాశ్వత భవనాలు ఏర్పాటు చేయాలి. అందుకు వీలైన చోట్ల వక్ఫ్ భూముల్లో ఆ భవనాలు నిర్మించాలి. రోడ్ సైడ్ చిన్న సన్న ముస్లిం వ్యాపారులను (పండ్లు, కూరగాయలు అమ్మేవాళ్ళు, చాయ్ డబ్బాలు, మెకానిక్ లు, ఆటో- కార్ డ్రైవర్లు తదితరులు) అసంఘటిత కార్మికులుగా గుర్తించి రూ. 2 లక్షల సబ్సిడి లోన్లు ఇవ్వాలి. బ్యాంకు లింకేజీతో సంబంధం లేకుండా కార్పోరేషన్ ద్వారా రూ. 10 లక్షల సబ్సిడీ రుణాలు మంజూరు చేయాలని సమావేశం డిమాండ్ చేసింది.

40 సంఘాలు ప్రతినిధుల డిమాండ్

తెలంగాణ ముస్లిం సంఘాల జాక్ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి తెలంగాణ వ్యాప్త 40 సంఘాలు ప్రతినిధులు హాజరయ్యారు. అందులో  తెలంగాణ ఉద్యమకారులు, మైనార్టీ హక్కుల నేత, ఓయూ జాక్ నాయకులు సయ్యద్ సలీంపాషా,  కవి, రచయిత, తెలంగాణ ఉద్యమకారులు, ముస్లిం రిజర్వేషన్ పోరాట నాయకులు, చమన్ ముస్లిం పత్రిక ఎడిటర్ స్కైబాబ, ముస్లిం సామాజిక విశ్లేషకులు మహమ్మద్ అబ్బాస్ ,  ఆవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రొ. అన్సారీ, ముస్లిం జాక్ రాష్ట్ర నాయకురాలు షమీమ్ సుల్తానా, TMHPS రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ ఫయాజుద్దీన్ , మైనారిటీ రిజర్వేషన్ జాయింట్ యాక్షన్ కమిటీ బాధ్యులు హనీఫ్ అహ్మద్, SC ST BC ముస్లిం ఫ్రంట్ బాధ్యులు ప్రొ.అన్వర్ ఖాన్, MSO ఓయూ అధ్యక్షులు షేక్ యాకుబ్ తదితరులు హాజరయ్యారు.

సలీం పాషా అరెస్ట్! విడుదలకై జాక్ డిమాండ్

తెలంగాణ ముస్లిం సంఘాల నాయకులు సయ్యద్ సలీమ్ పాషా ను ఉస్మానియా లో పోలీసులు అరెస్ట్ చేశారు. ఇఫ్తార్ నహీ.. రోజ్ గార్ చాహియే అంటూ ముస్లిం సంఘాలు కేసీఆర్ దృష్టికి ముస్లింల డిమాండ్లు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్న విషయం తెలిసిందే. దాంతో ఇవాళ సాయంత్రం ప్రభుత్వం ఇస్తున్న ఇఫ్తార్ పార్టీ లాల్ బహదూర్ స్టేడియంలో ఉన్న నేపథ్యంలో తనను ముందస్తు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఇది సరైన పద్ధతి కాదు. సలీమ్ పాషాను వెంటనే విడుదల చేయాలని తెలంగాణా ముస్లిం సంఘాల జాక్ డిమాండ్ చేస్తోంది.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article