తెలంగాణ మీడియా అకాడమీ నుండి తెలంగాణ మహిళా జర్నలిస్టులందరికీ హృదయపూర్వక ఆహ్వానం.
దశాబ్దానికి పైగా తెలంగాణ రాష్ట్రం కోసం, తెలంగాణ జర్నలిస్టులు గా మన హక్కుల కోసం పోరాడుతూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాల్లో మహిళలు తమ హక్కుల కోసం..అభివృద్ధిలో తమ భాగస్వామ్యం కోసం పోరాడుతున్నారు. ఇప్పుడు మనం ఒక అడుగు ముందుకేసి మీడియాలో మహిళల ప్రాతినిధ్యం, భాగస్వామ్యం పెరగడానికి ఏప్రిల్ 23, 24 తేదీల్లో వర్క్ షాప్ నిర్వహించుకుంటున్నాం. ఇందుకోసం తెలంగాణలో ప్రతి మహిళా జర్నలిస్ట్ పాలుపంచుకోవాలని కోరుకుంటున్నాం.
మనకంటూ ఒక వేదిక కోసం..మనకంటూ ఒక స్పేస్ కోసం.. ప్రభుత్వం నుంచి వృత్తిపరమైన సపోర్ట్ కోసం…
గతంలో కంటే ఈ వర్క్ షాప్ మనందరి భాగస్వామ్యంతో మరింత అర్థవంతంగా నిర్వహించబోతున్నాము. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాలో, ఇండిపెండెంట్ జర్నలిజంలో మహిళా జర్నలిస్టుల సమస్యలు చర్చించుకొని పరిష్కారానికి..మనకంటూ ఒక వేదిక కోసం..మనకంటూ కూర్చొని మాట్లాడుకోగలిగే ఒక స్పేస్ కోసం. తెలంగాణ ప్రభుత్వం నుంచి ఒక వృత్తిపరమైన సపోర్ట్ కోసం ఈ వర్క్ షాప్ వేదిక కాబోతుంది.
ఏప్రిల్ 23, 24 తేదీల్లో హైదరాబాద్ బేగంపేట్ లోని టూరిజం ప్లాజా లో కలుసుకుందాం.
ఒకప్పుడు జిల్లాల్లో మహిళా జర్నలిస్ట్ ల సంఖ్య చాలా తక్కువగా ఉండేది. ఇప్పుడు పెరిగింది. జిల్లాల్లోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిజంలో మహిళల ప్రాతినిధ్యం పెంచుకునే దిశగా జరుగుతున్న ప్రయత్నమే ఈ వర్క్ షాప్. తెలంగాణలో పని చేస్తున్న ప్రతి మహిళా జర్నలిస్ట్ కి ఆహ్వానం పలుకుతున్నాం..
ఏప్రిల్ 23, 24 తేదీల్లో హైదరాబాద్ బేగంపేట్ లోని టూరిజం ప్లాజా లో కలుసుకుందాం.
రెండు రోజుల వర్క్ షాప్ లో మొదటి రోజు కార్యక్రమం
రెండవ రోజు కార్యక్రమం
మరిన్ని వివరాల కోఆర్డి నేషన్ కు సుమబాలకు కాల్ చేయవచ్చు
87909 99243