ఇటీవల దళిత జర్నలిస్టుల శిక్షణా తరగతులు విజయవంతం కావడంతో అదే స్పూర్తితో ఈ మాసంలో మహిళా జర్నలిస్టులకు ప్రత్యేక శిక్షణా తరగతులు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఆసక్తి ఉన్నవారు తమ పేర్లను నమోదు చేసుకోవాలని తెలంగాణ మీడియా అకాడమి ఒక పత్రికా ప్రకటనలో తెలియజేసింది.
తెలంగాణ రాష్ట్రంలోని మహిళా జర్నలిస్టుల ప్రత్యేక శిక్షణా తరగతులు ఏప్రిల్ మాసంలో హైదరాబాదులో నిర్వహించనున్నట్లు మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ తెలిపారు. రెండు రోజులపాటు జరిగే శిక్షణా తరగతులలో పాల్గొనదలచినవారు తమ పేర్లను నమోదు చేసుకోవాలని కోరారు. హైదరాబాదులోని మహిళా జర్నలిస్టులు మీడియా అకాడమి మేనేజర్ శ్రీమతి ఏ,వనజ (సెల్ నె.7702526489)ను, జిల్లాలలో పనిచేసేవారు ఆయా జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయాలలో నమోదు చేసుకోవాలని వారు తెలిపారు.
మొదటిరోజు రాష్ట్ర మహిళా మంత్రులు, యంపిలు, ఎమ్మెల్సీలు శాసనసభ్యులు ఈ శిక్షణా తరగాతుల్లో ప్రసంగిస్తారు.
మొదటిరోజు రాష్ట్ర మహిళా మంత్రులు, యంపిలు, ఎమ్మెల్సీలు శాసనసభ్యులు ఈ శిక్షణా తరగాతుల్లో ప్రసంగిస్తారని, రెండవ రోజు జాతీయ స్తాయిలో నిష్ణాతులైన మహిళా జర్నలిస్టులు ప్రసంగిస్తారని ఒక పత్రికా ప్రకటనలో వారు వివరించారు.
ఈ శిక్షణా తరగతులలో మొదటి రోజు “మహిళా జర్నలిస్టులు – ప్రధాన స్రవంతి మీడియా – మహిళల పాత్ర” అనే అంశంపై, ఆ తర్వాత “ పాత్రికేయ రంగంలో మహిళలు – ప్రత్యేక సమస్యలు” అనే అంశంపై ప్రసంగాలు వుంటాయి. రెండవ రోజు “మహిళా అస్తిత్వం – జెన్డర్ సెన్సీటైజేషన్ “ అనే అంశం, “ఫీచర్ జర్నలిజం – మెళకువలు” అంశాలపై ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో నిష్ణాతులైన వారి ప్రసంగాలు వుంటాయి. ఈ తరగతులలో అకాడమీ ప్రచురణలు మహిళా జర్నలిస్టులకు ఇవ్వబడుతాయని వారు తెలియజేశారు.
మార్చి 26, 27 తేదిలలొ మీడియా అకాడమి నిర్వహించిన దళిత జర్నలిస్టుల శిక్షణా తరగతులు విజయవంతంగా జరిగాయని, దాదాపు 2000 దళిత జర్నలిస్టులు రాష్ట్రం నలుమూలల నుండి వచ్చి శ్రద్ధగా తరగతులను విన్నారని ఈ సందర్భంగా చైర్మన్ గుర్తు చేశారు.