Editorial

Monday, December 23, 2024
ఏడేళ్ళ తెలంగాణ"నా USA ప్రయాణం సోదరుడి సమాధి నుండి మొదలయ్యింది - సయ్యద్ షాదుల్లా

“నా USA ప్రయాణం సోదరుడి సమాధి నుండి మొదలయ్యింది – సయ్యద్ షాదుల్లా

 

జీవితం కొందరికి వడ్డించిన విస్తరి అయితే మరి కొందరికి సమస్యల సమాహారం. అవకాశాలు ఇస్తూనే వెంట వెంట సమస్యలనూ తెస్తుంది. అలాంటిదే నాకూ జరిగింది.

సయ్యద్ షాదుల్లా

అవి సౌదీ అరేబియాలో నేను పని చేసే రోజులు. 2010 జనవరిలో పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీలో ఓ పది రోజుల కోర్స్, ఆపై బెలాయిట్, విస్కాన్సిస్ స్టేట్, సెడార్ రాపిడ్స్- అయోవా స్టేట్ లలో బిజినెస్ మీటింగులు. మూడు వారాల ప్రోగ్రామ్.

అంతా సెట్ అయ్యింది. విమానాలు, హోటల్లు, ఫీజులు అన్నీ అయిపోయాయి.

ఉద్వేగం, ఉత్కంఠత.

జీవితంలో అమెరికా సందర్శించాలన్న నా చిరకాల కోరిక నెరవేరబోతుంది. హైదరాబాద్ – బాంబే-ఫ్రాంక్ ఫర్ట్ ఫ్లైట్ టికెట్ కూడా నేనే బుక్ చేసుకున్నాను. ఈ ఏయిర్ పోర్ట్ చాలా బాగుంటుందని నా ఫ్రెండ్ చెప్పడం, ఒక్క సారయినా జర్మనీని సందర్శించాలని నా ప్రగాఢమైన కోరిక కూడా ఉండటం, – నివార్క్ (న్యూ జెర్సీ) – ఫిలడెల్ఫియా- యూనివర్సిటీ పార్క్ – ఇలా ఐదు ఫ్లయిట్లతో అతి సుదీర్ఘ ప్రయాణాన్ని ఎంచుకున్నాను.

జీవితాంతం ఆ ప్రయాణం ఒక గొప్ప జ్ఞాపకంగా గుర్తుండి పోతుందనుకున్నాను. కాని ఆసాంతం కన్నీళ్ళతో బరువెక్కిన గుండెలతో సాగి, నా చిరకాల స్వప్నమైన అమెరికా భూతల స్వర్గాన్ని కన్నీటి తెరల మధ్య చూస్తానని ఏ కోశానా ఊహించలేదు.

నా భార్యను నా కొడుకును మా అమ్మా నాన్నల దగ్గర విడిచి నేను ఒంటరిగా అమెరికా వెళ్లాలని నా ప్లాను.

గోరే మియా

తల్లిదండ్రులకు చేతి కర్రగా ఉండాల్సిన కొడుకు కొయ్యబారి పోవడంతో వారు విచలితులయ్యారు. వారిని ఓదార్చడం నా వల్ల కావడం లేదు.

రేపు సాయంత్రం నా ప్రయాణం.

ఈరోజు రాత్రి నా తమ్ముడి ఆకస్మిక మరణం.

చిన్నప్పట్నుండి నాతో కలిసి పెరిగిన నా సహోదరుడు నిశ్చలంగా నిర్వేదంగా నా ముందు పడి ఉన్నాడు.

గుండెలు పగిలేలా మౌనంగా రోదించాను.

వాడి ఒక్కో జ్ఞాపకం నన్ను శూలంగా గుచ్చుతుంది.

ముసలి తల్లిదండ్రులకు చేతి కర్రగా ఉండాల్సిన కొడుకు కొయ్యబారి పోవడంతో వారు విచలితులయ్యారు. వారిని ఓదార్చడం నా వల్ల కావడం లేదు.

“జరిగింది దైవఘటన. మనం నిమిత్తమాత్రులం. ఇక్కడితో నీ జీవితం ఆగదు సయ్యద్, ముందుకు వెళ్ళడమే నీ తక్షణ కర్తవ్యం”.

ఆఫీస్ నుండి ఫోన్. “అంతా ఓకేనా?”….

జరిగింది వివరించాను.

అటువేపునుండి ఓ భారీ నిట్టూర్పు.

కాసేపు మౌనం.

“జరిగింది దైవఘటన. మనం నిమిత్తమాత్రులం. ఇక్కడితో నీ జీవితం ఆగదు సయ్యద్, ముందుకు వెళ్ళడమే నీ తక్షణ కర్తవ్యం”. మా సంస్థ నా కోసం వెచ్చించిన డాలర్లు వారితో ఇలా మాట్లాడించాయి.

అమ్మా నాన్న ఇద్దరు చెరోవైపు నన్ను గట్టిగా పట్టుకుని ఉన్నారు. మరుసటిరోజు అంత్యక్రియలు జరిగాయి. నేను వెళ్ళడం నా కుటుంబ సభ్యులకు ఎవరికీ ఇష్టంలేదు. కాని ఉద్యోగ బాధ్యత. అతి కష్టంగా వారిని సముదాయించి అలాగే ఏయిర్ పోర్ట్ కి బయలుదేరాను.

Penn State University లో నా Introduction లో చెప్పాను “నా USA ప్రయాణం నా సోదరుడి సమాధి నుండి మొదలయ్యింది” అని. “My journey to USA started from grave of my brother.”

సిరిసిల్లా జిల్లా నారాయణపురం గ్రామానికి చెందిన సయ్యద్ షాదుల్లా కలలు గన్న మనిషి. వాటిని సాకారం చేసుకోవడానికి ఎదురీదిన వ్యక్తి. ఆ ఎదురీతను ఎక్కడ ఆపాలో కూడా తెలిసిన మనిషి. తాను డైరీ టెక్నాలజీ చదివాక దేశ విదేశాల్లో దాదాపు మూడు దశాబ్దాలు వివిధ సంస్థల్లో వేరు వేరు హోదాల్లో పనిచేశారు. చివరకు స్వదేశంలో ఉంటూనే తన వృత్తి నైపుణ్యాలకు పని చెప్పాలని నిర్ణయించుకున్నాక నాలుగేళ్ల క్రితం సౌది అరేబియా నుంచి తిరిగి భారత్ వచ్చేశారు. అప్పటి నుంచి కన్సల్టెంట్ గా వివిధ దేశ విదేశీ సంస్థలకు సేవలు అందిస్తూ షాద్ నగర్ లో ప్రశాంత జీవనం గడుపుతున్నారు. సాహిత్యం, సంగీతం వారి అభిరుచులు.

More articles

6 COMMENTS

  1. మరచిపోలేని జ్ఞాపకాలు..అవి వెంటాడుతూనే ఉంటాయి………నమస్కారం

    • నమస్కారం అశోక్ గారు.
      మీ స్పందనకు నా సహృదయ కృతజ్ఞతలు 🙏.
      ధన్యవాదాలు.

  2. Dear Shadulla Saheb,
    Your affection towards your village is well narrated. Your bonvoyage to USA under very much grieved conditions, due to the sad demise of your beloved brother, indicates your duty mindness and loyalty to your organisation.
    We all wish you all the best.
    Keep going well with your informative articles.

    • Sir, your inspiration and blessings are always there with me to go ahead. Thank you for your comments sir. They mean a lot for me. Thank you.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article