Editorial

Wednesday, January 22, 2025
కాల‌మ్‌జ్వాలాముఖ హరివిల్లు - ‘సూరజ్’ కా సాత్వా ఘోడా

జ్వాలాముఖ హరివిల్లు – ‘సూరజ్’ కా సాత్వా ఘోడా

 

అది అగ్నిజ్వాల కాదు! హరివిల్లు అంతకన్నా కాదు! కానీ, దానిపేరు మాత్రం ఫైర్ రైన్బో!

సూరజ్ వి. భరద్వాజ్

ఫైర్ రైన్బో! ఎస్, ఊర్ధ్వభాగం అగ్నిజ్వాలను తలపిస్తూ ఆకాశంలో సప్తవర్ణాలు ఆవిష్కృతం అవుతాయి కనక వాడుకభాషలో దాన్ని ఫైర్ రైన్బో (జ్వాలాముఖ హరివిల్లు) అని సంబోధిస్తూ వస్తున్నాం. కానీ, సైంటిఫిక్ పరిభాషలో అది సర్కంహారిజన్ ఆర్క్! మరి మీరెప్పుడైనా ఈ నేచురల్ వండర్ ఫైర్ రైన్బోను చూశారా? దాని గురించి విన్నారా? అది ఎక్కడ, ఎలా ఏర్పడతుందో మీకు తెలుసా? కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఆవిష్కృతమయ్యే ఈ అరుదైన అద్భుతం గురించి తెలియాలంటే, ముందుగా మీకు, సర్ ఐజాక్ న్యూటన్ విబ్జియార్ (VIBGYOR) కలర్ స్పెక్ట్రమ్ (సప్తవర్ణ శ్రేణి) థియరీపై అవగాహన ఉండాలి! సూర్యునికి అభిముఖంగా నింగిలో ఇంద్రధనుస్సు వెలిసే తీరు తెలియాలి!

ఒకసారి తరచి చూస్తే.! ఈ ప్రకృతిలోని సహజసిద్ధమైన అందాలెన్నో, ఆశ్చర్యం గొలిపే వింతలు, విశేషాలు మరెన్నో, విచిత్ర, విజ్ఞాన సంబంధ అంశాలింకెన్నో మనకు బోధపడతాయి!

ఒక తెల్లని కాంతికిరణాన్ని గాజుపట్టకం (ప్రిజం) ద్వారా ప్రసరింపజేసినప్పుడు అది పరావర్తనం చెంది, వక్రీభవన చర్య ద్వారా ఎదురుగా ఉన్న తెరపై వివిధ తరంగదైర్ఘ్యాలు కలిగిన వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్ బ్యాండ్ సప్తవర్ణ శ్రేణి ఆవిష్కృతం అవుతుంది. ఇది సైన్స్! ఆకాశంలో ఇంద్రధనుస్సు కూడా సేమ్ ఫార్ములాతో ఏర్పడుతుంది! ఇది నేచర్! ఒకసారి తరచి చూస్తే.! ఈ ప్రకృతిలోని సహజసిద్ధమైన అందాలెన్నో, ఆశ్చర్యం గొలిపే వింతలు, విశేషాలు మరెన్నో, విచిత్ర, విజ్ఞాన సంబంధ అంశాలింకెన్నో మనకు బోధపడతాయి! అలాంటిదే హరివిల్లు! భూమిని చేరే క్రమంలో సూర్యకిరణాలు మేఘాల్లోని నీటిబిందువుల గుండా ప్రసరిస్తాయి. కాంతికిరణాలు అక్కడ అంత: పరావర్తనం చెంది, వక్రీభవనకు గురవుతాయి. తద్వారా అర్ధచంద్రాకారంలో ఇంద్రధనుస్సు ఏర్పడుతుంది. నీలాకాశం ఒక స్క్రీన్లా పనిచేసి రంగురంగుల హరివిల్లును ఆవిష్కృతం చేస్తుంది!

వక్రీభవన చర్య ద్వారా ఎదురుగా ఉన్న తెరపై వివిధ తరంగదైర్ఘ్యాలు కలిగిన వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్ బ్యాండ్ సప్తవర్ణ శ్రేణి ఆవిష్కృతం అవుతుంది. ఇది సైన్స్! ఆకాశంలో ఇంద్రధనుస్సు కూడా సేమ్ ఫార్ములాతో ఏర్పడుతుంది! ఇది నేచర్!

ఇంద్రధనుస్సు సరే! మరి ఫైర్ రైన్బో అంటే ఏంటి? అదెలా ఏర్పడుతుంది? అనేగా మీ డౌటు! వస్తున్నా, అక్కడికే వస్తున్నా! సూరీడు 58 ℃, లేదా ఆపైన ఉష్ణోగ్రతలతో భగభగ మండేవేళ, భూవాతావరణంలో అత్యంత ఎత్తులో చుట్ట చుట్టినట్లుండే మేఘాల్లో ఫైర్ రైన్బో ఏర్పడుతుంది! సూర్యచంద్రుల నుంచి వెలువడే కాంతిపుంజం, షట్భుజాకార పళ్లాల మాదిరి ఉండే మంచు స్పటికాల్లోకి నేరుగా ప్రవేశించి అంత: పరావర్తనం చెందుతుంది. అక్కడ కాంతి 90° మేరకు వక్రీభవనానికి గురై సూర్యునికి అభిముఖంగా నింగితెరపై తేజోవంతమైన లేతరంగులను వెదజల్లుతుంది! అలా ఊర్ధ్వభాగంలో నారింజరంగుతో అగ్నిజ్వాలను తలపిస్తూ, ఇంద్రధనస్సులోని ఏడు రంగులతో ఏర్పడే బింబమే ఫైర్ రైన్బో!

అది అగ్నిజ్వాల కాదు! హరివిల్లు అంతకన్నా కాదు! కానీ, దానిపేరు మాత్రం ఫైర్ రైన్బో! కొన్నిసార్లు చంద్రకాంతి వల్ల కూడా ఫైర్ రైన్బో ఏర్పడుతుంది. కానీ చాలా అరుదు! సర్కంహారిజన్ ఆర్క్ ఏర్పడటానికి చంద్రుడి నుంచి వెలువడే కాంతి సరిపోకపోవడమే అందుకు ప్రధాన కారణం! ఐతే, నిండు పున్నమి రోజుల్లో చంద్రకాంతి ఆధారిత ఫైర్ రైన్బో దర్శనమిచ్చే ఛాన్స్ ఉంటుంది! భూమండలంపై ఉత్తర, దక్షిణ అర్ధగోళాల్లోని మధ్య అక్షాంశ ప్రాంతాల్లో సర్కంహారిజన్ ఆర్క్ లు తరచుగా ఏర్పడుతుంటాయి!

ఫైర్ రైన్బోను ప్రస్తావించినప్పుడు ఇరిడిసెంట్ క్లౌడ్ చర్చొస్తుంది! రెంటికి పోలికలుండటమే అందుక్కారణం. ఐతే మొదటిది కాంతిపరావర్తనం వల్ల వక్రీభవనం చెంది ఆవిష్కృతమైతే, రెండోది కాంతివిక్షేపం వల్ల ఏర్పడిందనే తేడా గమనించాలి.

ఫైర్ రైన్బో కూడా ఇంద్రధనుస్సులాంటి దృగ్విషయమే! కాకపోతే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో చోటుచేసునే సంక్లిష్టమైన ప్రక్రియ! అందుకే హరివిల్లులా తరచూ కాకుండా నింగిలో అరుదుగా, తక్కువ ప్రాంతాల్లో మాత్రమే సంభవిస్తుంది! సరైన కోణంలో మంచుస్పటికాలతో కూడిన మేఘాలుండి, వాటిగుండా సూర్యచంద్రుల కాంతిప్రసరణ అత్యంత ఎక్కువగా జరిగితేనే సర్కంహారిజన్ ఆర్క్ సాధ్యమవుతుంది. అందుకే కొన్ని అక్షాంశాల మీదున్న ప్రాంతాల్లోనే ఈ ఫైర్ రైన్బో కనిపిస్తుంది! భూమధ్య రేఖ నుంచి దూరం వెళ్తున్నకొద్దీ వెలుతురు తగ్గుతూ, జ్వాలాముఖ హరివిల్లు ఆవిష్కరణకు ఆస్కారం ఉండకుండా పోతుంది. సూర్యకాంతి తక్కువగా ప్రసరించే ఉత్తరార్ధగోళంలోని 55°, దక్షిణార్ధగోళంలోని 55° మీదుగా వెళ్లే అక్షాంశాల మీదున్న ప్రాంతాలవాళ్లకు సర్కంహారిజన్ ఆర్క్ కనిపించదు! మిగతా అక్షాంశాల్లో వేసవి అయనాంతం (జూన్ 21 – 23 ల మధ్య) లో ఫైర్ రైన్బో కనిపిస్తుంది. ఉత్తర అమెరికాలో వేసవికాలంలో ఈ సర్కంహారిజన్ ఆర్క్ 5 సార్లు అంతకంటే ఎక్కువమార్లు ఆవిష్కృతమయ్యే అవకాశముంది. ఇక ఉత్తరయూరోప్ ఇందుకు భిన్నం. వివిధ కారణాల వల్ల ఇక్కడ ఫైర్ రైన్బో ఆవిష్కారం అరుదు. ఐతే మధ్య అక్షాంశం మీదున్న యూరోపియన్ ప్రాంతాల్లో మాత్రం జ్వాలాముఖ హరివిల్లు ఎప్పుడో ఒకసారి కనిపించే అవకాశముంటుంది.

ఫైర్ రైన్బోను ప్రస్తావించినప్పుడు ఇరిడిసెంట్ క్లౌడ్ చర్చొస్తుంది! రెంటికి పోలికలుండటమే అందుక్కారణం. ఐతే మొదటిది కాంతిపరావర్తనం వల్ల వక్రీభవనం చెంది ఆవిష్కృతమైతే, రెండోది కాంతివిక్షేపం వల్ల ఏర్పడిందనే తేడా గమనించాలి. కానీ, శకలాలుగా విడిపోయినప్పుడు మాత్రం ఈ సర్కంహారిజన్ ఆర్క్, ఒక్కోసారి మెరిసే రంగుల మేఘం (ఇరిడిసెంట్ క్లౌడ్) గా చూపరులను భ్రమింపజేయటం కొసమెరుపు!

‘సూరజ్ వి. భరద్వాజ్ సీనియర్ జర్నలిస్టు. ఉస్మానియాలో విశ్వ విద్యాలయంలో జర్నలిజంలో ఎంసిజె చదివిన ఈ కరీంనగర్ బిడ్డ అనతికాలంలోనే టెలివిజన్ జర్నలిజంలో తనదైన ముద్ర వేశారు. క్రైం  నుంచి పోలిటికల్ రిపోర్టింగ్ వరకు తనది చురుకైన పాత్ర, ప్రవేశం. ప్రస్తుతం టి న్యూస్ బ్యూరోలో  పనిచేస్తున్న తాను ముఖ్యమంత్రి, సచివాలయ కార్యకలాపాలను ప్రజలకు అందజేస్తున్నారు. మంచి వాక్యం రాయగల అరుదైన ఈ టెలివిజన్ జర్నలిస్టు ‘తెలుపు’ కోసం సూరజ్’ కా సాత్వా ఘోడా  పేరిట  మనం చూస్తున్న లోకాన్నే సరికొత్తగా దర్శనం చేయిస్తారు.

More articles

1 COMMENT

  1. ప్రకృతి లో జరిగే అద్భుత,వింత లను సురజ్ క సాత్థ్మ ఘొడ వ్యాసాల ద్వార సైన్స్ ను ప్రకృతి ని చాల అందంగా వివరంగా తెలుపు తున్నారు సార్!
    ఫైర్ రైంబో చాల అధ్భుతం గా ఉంది.👌👌👌

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article