Editorial

Monday, December 23, 2024
కథముంపు : గంగాడి సుధీర్ కథ

ముంపు : గంగాడి సుధీర్ కథ

Illustration by Beera Srinivas

‘ఎవరు మాత్రం ఏం చేస్తారు హైదరాబాద్ మొత్తం బీభత్సంగా వానలు, లోతట్టు ప్రాంతాలన్నీ మునిగాయట’ ‘మనది లోతట్టు కాదు లోచెరువు’ అన్నారు మరికొందరు.‘

గంగాడి సుధీర్

హైదరాబాద్ మహానగరంలో ఇంకా పూర్తిగా కాంక్రీట్ మయం కాని ఆల్వాల్ ప్రాంతం అది. ఎనిమిదేళ్ల క్రితం ఇంటి జాగా కొని మూడేళ్ల క్రితం కట్టుకున్నాడు భూపాల్. తాను ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తూ రూపాయి రూపాయి పోగేసిన డబ్బులతో చవకగా వస్తుందని ఆశపడి ఇక్కడ కొన్నాడు.

నిజానికి అది అల్వాల్ చెరువు శిఖం ఎప్పుడో ఇరవై ఏళ్ల క్రితమే పూడ్చేసి ఇక్కడి రాజకీయ నాయకుల అండతో లేఔట్ వేసుకొని అమ్ముకున్నారు. అలా చేతులు మారుతూ మారుతూ, రూపాలు మార్చుతూ మార్చుతూ ప్రస్థుతం మూడు కాలనీలుగా మారిపోయింది ఆ ప్రాంతం.

రచయిత గంగాడి సుధీర్ పాత్రికేయులు. టెలివిజన్ కార్యక్రమాల రూపశిల్పి. వార్త మొదలు, ఈటివి, టీవీ9, హెచ్ఎంటీవిలలో పనిచేసిన వారు ప్రస్తుతం టి-సాట్లో కొనసాగుతున్నారు. మానేరు నదీ పరివాహక సిరిసిల్లా జిల్లా ఆవునూర్ వారి స్వగ్రామం. ఉద్యోగ రీత్యా  హైదరాబాద్ లో నివాసం. ఈ మెయిలు sudheer.gangadi@gmail.com

ఒకటి గుంతలాంటి చెరువుకు పైభాగం, మరోటి మెయిన్ రోడ్డుకు చెరువుకు మధ్యలోది ఇక మన భూపాల్ తీసుకున్నది పూర్తిగా చెరువుకు కింది భాగం. కానీ మామూలు సమయంలో చూస్తే మూడు కాలనీలు ఒకేరకంగా ఉంటాయి. ఒక్క వర్షం వచ్చినప్పుడు మాత్రమే తెలుస్తుంది ఈ తేడాలు.

కొనడానికి వచ్చినప్పుడే భూపాల్ భార్య రజిత చెరువుకు దగ్గరగా ఉంటే దోమలెక్కువ, వాసన కూడా వస్తుందని వద్దంది. కానీ చిన్న గుంతను పట్టుకొని చెరువంటావా అని కసురుకొని పక్కనే పదిహేనువేలు పోతుంటే ఆపక్కనే తొమ్మిది వేలది కొనని వాడెవ్వడైనా మూర్ఖంగా అని వాదించి మరీ తీసుకున్నాడు. అప్పటికీ ఇంత తక్కువకు ఇస్తున్నారంటే ఏదో లోపం ఉంటుందని భార్య మొత్తుకుంటుంటే మొదట సందేహించినా చివరికి కేవలం పదిహేనేళ్ల డాక్యుమెంట్లు చెక్ చేసి ఇచ్చే బాంకు లోన్ రావడంతో అంతా పక్కా డాక్యుమెంట్స్ అని భార్యని గదమాయించి మరీ కొన్నాడు.

రెండేళ్లు బాగానే గడిచాయి. హాయిగా ప్రశాంత వాతావరణంలో, దూరం దూరంగా ఉండే విశాలమైన ఇండ్ల మధ్యలో కాలుష్యం కాటు పెద్దగా లేని, ముఖ్యంగా ఇన్నాళ్లు అద్దెకున్న వారసీగూడలో లాగా చుట్టూ ఏదో బంధించి బిగుసుకుపోయిన ఇరుకిరుగు గల్లీలు, అగ్గిపెట్ట లాంటి పిట్టగూడు ఇంట్లో నుండి స్వాతంత్ర్యం పొందినట్టుగా హాయిగా అన్పించింది.

ఆఫీస్ కూడా ఇటువైపే మారడంతో దూరం కూడా తగ్గి ట్రాఫిక్ చిక్కులు లేకుండా తొందరగా ఇంటికి చేరుకొని బాల్కనీలో కాలు మీద కాలేసుకొని పేపరు చదువుతూ ఎంజాయ్ చేస్తున్నాడు భూపాల్. అలా ఆనందంగా సాగిపోతున్న కాలంలో గతేడాది నిప్పులు కురిపించింది, కాదు కాదు నీళ్లు గుమ్మరించింది.

పూర్తిగా తడిసిన భూపాల్ కి ఆవిరి పట్టింది రజిత. వర్షంలో తడవడంతో చలి పెరిగి తొందరగా తిని పడుకున్నారు. తెల్లారి లేచి పాల పాకెట్ కోసం బయటికొచ్చిన రజిత ఒక్కసారిగా కెవ్వుమని అరిచింది.

గతేడాది హైదరాబాద్ మహానగరం కనీవినీ ఎరగని వరదతో కకావికలం అయింది. అప్పుడు తెల్సింది తను చేసిన తప్పేంటో…. చిన్నగా వాన మొదలైన ఒకటో రోజు హాయిగా చల్లని తుంపర్లలో శ్రీమతితో వేడి వేడిగా పకోడీలు, బజ్జీలు చేయించుకొని ఇద్దరూ కల్సి తింటూ మల్లీ తొలినాటి పెళ్లి రోజులకు వెళ్ళిపోయారు. రెండో రోజు ముసురు కాస్తా ముదిరింది. ఆ వాతావరణానికి ఆఫీసుకు బంకు కొట్టి హాయిగా ముసుగేసుకుందామనిపించినా… అర్జంట్ పనుండడంతో వెళ్లాడు భూపాల్.

వెళ్తూ, వెళ్తూ సాయంత్రం త్వరగా వస్తాను ఎలాగూ కరోనాతో మూసిన థియేటర్లు తెరవరు కాబట్టి చికెన్ తీసుకొస్తా మాంచి వెరైటీ చేసుకుందాం అని శ్రీమతితో చెప్తూ వెల్లాడు. సాయంత్రం వచ్చేటప్పటికీ వర్షంతో పూర్తిగా తడిసిపోయాడు, మధ్యలో రెండు సార్లు బండి స్కిడ్దయ్యి కిందపడ్డాడు. ఎలాగోలా కిందా మీదా పడి మహానదుల్ని తలపించిన కాలనీ రోడ్లపై సాహసయాత్రను ముగించుకొని ఇంటికి చేరాడు.

పూర్తిగా తడిసిన భూపాల్ కి ఆవిరి పట్టింది రజిత. వర్షంలో తడవడంతో చలి పెరిగి తొందరగా తిని పడుకున్నారు. తెల్లారి లేచి పాల పాకెట్ కోసం బయటికొచ్చిన రజిత ఒక్కసారిగా కెవ్వుమని అరిచింది.

ఆ అరుపుకు మెలకువొచ్చిన భూపాల్ పరుగెత్తుకుంటూ వస్తూనే ‘ఏమైంది, జారి పడ్డావా’ అని కేకేసాడు. బాల్కనీ మొత్తం నీళ్లతో నిండిపోయి ఉండడంతో రజిత ‘అందుకే రాత్రి పూట బోర్ వేయకండి అని చెప్పేది. ఆఫ్ చేయడం మర్చినట్టున్నారు, ఇప్పుడు చూడండి టాంకు నిండి రాత్రంతా బోర్ నడిచి ఇళ్లు చెరువయ్యింది, ఎంత కరెంట్ బిల్లు వస్తుందో ఏమో’ అని గాబరా గాబరాగా మోటార్ స్విచ్ ఆఫ్ చేయడానికి బయటకు రాబోతుంటే చేయి పట్టుకొని ఆపాడు భూపాల్.

‘నీ మొఖం ఇవి మనింటి టాంకు నిండి వచ్చిన నీళ్లు కాదు, నిన్నట్నుండి పైన టాంకుకు చిల్లుపడితే నిండిన వరద‘ అన్నాడు. ఏమీ అర్థం కానట్టు మొఖం పెట్టింది రజిత. ఆ ఎక్స్ ప్రెషన్ అర్థమయ్యి ‘అందుకే పొద్దస్తమానం టీవీ సీరియళ్ళు మాత్రమే చూడకుండా కాస్త బయట ఏం జరుగుతుందో న్యూస్ చూడు లేదా అలా బయటకి వెల్లి తిరిగిరా’ అన్నాడు. మళ్ళీ తనే ‘మొన్న మెదలైన తుఫాన్ ఇప్పుడు తీవ్ర రూపం దాల్చింది, ఆ వర్షం నీళ్లే ఇవి’ అనుకుంటూ ఇద్దరూ జాగ్రత్తగా గేటు బయటకు వచ్చారు.

పరిస్థితి చాలా భయానకంగా ఉంది. ఏది రోడ్డో, ఏది కాలువో అర్థం కాకుండా వీది మొత్తం నీళ్లు నిండిపోయాయి. దూరంగా రామారావు వాళ్లు వీళ్లలాగే బయటకొచ్చి చూస్తున్నారు. ‘రామారావు గారూ ఏమైంది, డ్రైనేజీ బ్లాకయిందా నీళ్లన్నీ ఇలా నిలిచిపోయాయి’ అన్నాడు భూపాల్. ఆ వైపు నుండి అరుస్తున్నట్టుగా ‘డ్రైనేజీ బ్లాకవడం కాదు, వాటితో ఈ చెరువు నిండిపోయింది’ అన్నాడు రామారావు.

ఆ మాటలు సరిగి విన్పించలేదు వీళ్లకు, సరేలే పద ఇంట్లోకెల్దాం అని వెళ్లబోతుంటే పాపం పక్కనే గుడిసెలో ఉంటూ కొత్త ఇళ్లు కట్టడానికి మేస్త్రీ పనిచేసే ఆలూమగలు, వర్షం నీళ్లకు గుడిసె మునిగిపోవడంతో సగం లేసిన మొండిగోడల కొత్త ఇంటి బీష్మీట్ పై పదిహేనేళ్ల కొడుకుతో సహా కవరు కప్పుకొని కూర్చున్నారు.

వాళ్లను చూస్తూనే ‘ఇన్ని నీళ్లు ఎప్పుడొచ్చాయండి’ అన్నాడు భూపాల్.

‘మధ్యరేత్రి నుండే నండి’ అన్నారు వాళ్లు.

అంటే అప్పటినుండి అలా బీమ్ పై కవరు కప్పుకొనే కూర్చున్నారన్నమాట అనుకుంటూ ఇంట్లోకి వెల్లారు రజిత, భూపాల్.

ఇంకా నయం కరెంటు పోలేదు ముందు పోన్లు చార్జింగ్ పెట్టు అని బాత్రూంలో దూరాడు భూపాల్. వంట చేసిన రజిత పాలకోసం ఎదురుచూస్తుంది. ఆపీసుకు ఎలా వెళ్ళాలా అని ఆలోచిస్తూ ఫోన్ తీసుకున్న భూపాల్కి వాట్సప్ ఆఫీస్ గ్రూప్లో విపరీతమైన వర్షాలతో ఆఫీసుకు సెలవు అనే మెసెజీ కనబడడంతో అమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నాడు.

టైం పదవుతుంది టిఫినైతే అయింది కానీ చాయ్ తాగక మైండంతా అదోరకంగా ఉంది. ‘ఇక ఈ పాలోడు రాడులే కానీ నేను అలా షాపు వరకెళ్లి పాలుతెస్తాను, ఇంకా ఏమైనా కావాలా చెప్పు, ఈ వర్షం రెండు మూడ్రోజులు తగ్గేలా లేదు’ అని భార్యకు చెప్పడంతో కావాల్సిన సామాన్ల లిస్ట్ ఇచ్చింది. సామాన్లు తీసుకొని తిరిగొచ్చేసరికి పక్కనే గుడిసెలో ఉండే కుటుంబం తన ఇంటి వసారా నీళ్లలో నిలబడి రజిత ఇచ్చిన ఉప్మా తింటున్నారు.

వడివడిగా ఇంట్లోకెళ్లిన భూపాల్ ‘ఏంటీ వాళ్లు ఇక్కడ తింటున్నారు’ అన్నాడు. ‘పాపం రాత్రినుండి అలాగే ఉన్నారండి, ఆకలౌతుంటుంది కదా, ఇస్తే వర్షంలో తినలేరు కదా… ఇంట్లోకి రమ్మన్నా రాకుండా బాల్కనీలోనే తింటున్నారు’ అంది రజిత.

‘అమ్మా తుఫానంట గదా… ఇంకో రెండు మూడ్రోజులుంటదేమో… ఇంతకు ముందు వరదలొచ్చినప్పుడు గవర్నమెంటోళ్లు బళ్లో ఉంచారండి ఇప్పుడు కూడా ఆడికే బోతామమ్మ’ అన్నది చాయ్ కప్పులు కడుగుతూ.

‘నీకేమైనా బుద్ధుందా ఓవైపు కరోనా మరోవైపు వర్షం ఎన్నిరోజులుంటుందో తెలియదు, ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఉంటారు’ అని కసురుకున్నాడు.

‘అబ్బా కాస్త టిఫిన్ పెట్టిస్తే మనింట్లోనే కాపురముంటారా.. వర్షం తగ్గాక వెల్తారులెండి’ ఉన్నది ఇద్దరమే కదా, వాళ్లూ ముగ్గురే కదా ఆ రూములో ఉంటారు లేండి, ఐనా మెల్లగా మాట్లాడండి వాళ్లు వింటే బాధపడతారు’ అని భూపాల్ని కసురుకుంటూనే చాయ్ పెట్టడానికి వెళ్లిపోయింది.

భూపాల్ కి ఏం చేయాలో అర్థం కాలేదు. చాయ్ తీసుకొని వచ్చిన రజిత తనకొ కప్పు ఇచ్చి వాళ్లకు ఇవ్వడానికి బయటకెళ్ళింది. రజితను చూస్తూనే ఇబ్బంది పడుతూ చాయ్ తీసుకున్నారు. ‘అమ్మా తుఫానంట గదా… ఇంకో రెండు మూడ్రోజులుంటదేమో… ఇంతకు ముందు వరదలొచ్చినప్పుడు గవర్నమెంటోళ్లు బళ్లో ఉంచారండి ఇప్పుడు కూడా ఆడికే బోతామమ్మ’ అన్నది చాయ్ కప్పులు కడుగుతూ.

లోపల భూపాల్ అన్న మాటలు విన్నారేమో అని ఒక్క క్షణం నొచ్చుకుంది రజిత. వెంటనే తేరుకొని ‘రేపటి వరకు వాన తగ్గుతది గావచ్చు, ఈ ఒక్కపూటకు ఏం తిరుగుతరు, ఈ రూములో ఉండండి’ అంది.

‘ఏమో అమ్మా ఈ వాన ఒక్కరోజులో పోయేటట్టు లేదు, మీకెందుకు ఇబ్బంది. ఉకుమ పెట్టి చాయ బోసిండ్రు, మీ కడుపు చల్లగుండా’ అని నెత్తిమీద బట్టల ముల్లె పెట్టుకొని బయల్దేరిండ్రు.

వాళ్లను చూసుకుంటూ జాలి పడి నిట్టూర్చుతూ లొపలికెల్లింది రజిత.

సమయం గడుస్తున్నా కొద్ది వాన ఇంకా పెరుగుతుంది. బీభత్సంగా శభ్దం చేస్తూ వీస్తున్న గాలి చప్పుడుని టీవీ సౌండ్ డామినేట్ చేస్తుంది. అలా టీవీ చూస్తూ గడుపుతున్న భూపాల్, రజితలకు మద్యాహ్నం రెండింటికి కరెంటు పోయి చార్జింగ్ లైట్ ఆన్ అవడంతో ఇల్లంతా నియాన్ లైట్ల వెలుతురు పోయి ఏదో గుడ్డి దీపం వెలుగుతున్నట్టుగా అయింది.

‘అనుకున్నా, ఇంకా కరెంటు పోవట్లేదేంటా అని, పోన్లు ఫుల్లు చార్జింగైతే ఉన్నయ్’ ఇంకేం ధీమా వద్దు అన్నట్టుగా అన్నాడు భూపాల్.

వెళ్తురు కోసం డోర్ ఓపెన్ చేసే సరికి నీటి మట్టం కడపను తాకుతున్నాయ్. ఒక్కసారిగా గుప్పుమని డ్రైనేజీ వాసన దూసుకొచ్చింది. ముక్కు మూసుకుంటూనే ‘వామ్మో ఏంటీ కంపు, దయ్యం వాన మోపైంది. ఎప్పుడు తగ్గుతుందో ఎమో. ఇంకాసేపైతే నీళ్లు ఇంట్లోకొచ్చేలాగ ఉన్నాయ్’ అంటుండగానే అక్కడికి వచ్కిన రజిత ఆ నీళ్లను చూసి చాలా భయపడింది.

‘ఏంటీ అసలు మనం ఇంట్లో ఉన్నామా, చెరువులో ఉన్నామా,’ అనుకుంటూ వెంటనే ఇంట్లోకి నడిచి ప్లోర్ పైన నానితే పాడయ్యే అన్ని వస్తువుల్ని పైన షెల్ఫుల్లోకి సర్దుతుంది, భూపాల్ని కూడా పెద్ద వస్తువులన్నింటిని పైన సజ్జపైన పెట్టమని పురమాయించింది.

‘నువు మరీ భయపడుతున్నావ్, ఏదో బాల్కనీలోకి నీళ్లోచ్చాయని ఇళ్లంతా మునిగిపోదు. మహా అయితే రేపటికల్లా వాన తగ్గిపోతుంది. అంతా మామూలైతుంది. అప్పుడు అటకెక్కించిన వీటిని మళ్ళీ కిందికి దించాలి, ముందు నాకు కొంచెం చాయ్ తే’ అని కసిరాడు.

‘ఏహే మరీ నీ కంగారు, నీళ్లు కడపను దాటి ఇంట్లోకొస్తాయా అన్నాడు.

‘ఏంటీ ఇంకా అర్థమవడం లేదా… మనిళ్లు నడి చెరువులో కట్టింది. రోడ్డుకు నాలుగు అడుగుల పైన ఉన్న కడప దాకా. వచ్చిన నీళ్లు ఇంకొక్క అడుగు పెరుగుతే చాలు ఇళ్లంతా నీళ్లలో మునిగిపోవడానికి’ అని తొందరపెట్టింది.

అలా హాలులోని వస్తువుల్ని సర్దుతూ బెడ్రూంలోని వస్తువులు సర్దుతున్నారు. సమయం తెలియడం లేదు, భూపాల్ కి ఆయాసం వస్తుంది ఒళ్ళంతా నొప్పులు పెట్టాయి. అసహనంతో రజితపై విరుచుకుపడ్డాడు. ‘నువు మరీ భయపడుతున్నావ్, ఏదో బాల్కనీలోకి నీళ్లోచ్చాయని ఇళ్లంతా మునిగిపోదు. మహా అయితే రేపటికల్లా వాన తగ్గిపోతుంది. అంతా మామూలైతుంది. అప్పుడు అటకెక్కించిన వీటిని మళ్ళీ కిందికి దించాలి, ముందు నాకు కొంచెం చాయ్ తే’ అని కసిరాడు.

ఇంకా కొంచెం అసహనం పెరిగితే భూపాల్ ఏం చేస్తాడో తెలుసుకాబట్టి ‘సరే, సరే ఇంకా కొన్నే ఉన్నాయ్ మీరు సర్దండి’ అంటూ చాయ్ చేయడానికి కిచెన్లోకి వెళ్ళింది రజిత. కొంచెం సేపటి తర్వాత హాళ్లో వెతుకుతున్నాడు భూపాల్. టీ కప్పులతో వచ్చిన రజిత ‘ఏంటీ వెతుకుతున్నావ్’ అని అడిగింది. ‘అదే రూం ప్రెష్నర్ ఎక్కడ ఉందా’ అని అన్నాడు. ‘రూం ప్రెష్నరా అదెక్కడిది ఎప్పుడో ఇంట్లో కొచ్చిన కొత్తలో రంగుల వాసన పోవాలని కొన్నాం, ఇంకా ఉంటుందా’ అంది. వాసన భరించలేక, గత్యంతరం లేక తన డియోడరెంట్ ని ఇల్లంతా కొట్టాడు భూపాల్ అయినా వాసన పోవడం లేదు. భరించలేక ఆరునెలల క్రితం వాడడం మానేసిన మాస్కుని తీసి తగిలించుకొన్నాడు.

అప్పటికే రాత్రయిపోతుంది. చార్జింగ్ లైట్ ఐపోవడానికి వస్తుంది కావచ్చు మిణుకు మిణుకు మంటూ వెలుగుతుంది. ఈ కాస్త లైట్ పోయేలోగా తినేసి పడుకుందామనుకొని తిని పడుకున్నారు.

భయంతో నిద్ర సరిగా రాక మధ్యలో లేచి ఎలా ఉందో చూద్దామని అనిపించి భూపాల్ని లేపడానికి ప్రయత్నించింది రజిత. నిద్రలో అటూ ఇటూ కదిలాడు కానీ లేచి రాలేదు భూపాల్. అలా తెల్లారిపోయింది, కొంచెం వెళుతురు రావడంతో లేచి వచ్చి చూస్తే హాలంతా నీళ్లు నిండిపోయాయి. మెల్ల మెల్లగా బెడ్రూంలోకి వస్తున్నాయి. భయట వాన మాత్రం తగ్గడం లేదు.

భూపాల్ తొలిసారి ఇంట్లో మురికినీళ్లను చూసి నిలువెల్లా వణికిపోయాడు. అప్పటివరకూ బింకంగా ఉన్న భూపాల్ బేలగా మారిపోయాడు. భయంగా ఉన్న రజిత భూపాల్ పరిస్థితిని చూసి ముందుగా తేరుకొని టీ పెట్టిచ్చింది. ఇంట్లో అత్యవసరంగా వాడాల్సిన వాటిని తీసి అందుబాటులో సర్దుకుంది. ముందు జాగ్రత్తగా అన్నీ తీసి సర్దుకున్నారు కాబట్టి పెద్ద నష్టం ఏం జరగలేదు. ఆ నీటిని తోడిపోయ్యడానికి ట్రైచేస్తున్నాడు

ఇళ్లంతా ఒకటే వాసన, రజితకు విసుగొచ్చి ఊరెళదాం అని పోరుపెడుతుంది, వెళ్దామనుకున్న వెళ్ళడానికి వీలులేని పరిస్థితులు.

బైటికి పోస్తున్న నీళ్లు మరింత కుళ్లయి ఇంట్లోకి వస్తున్నాయి. ఇంతలో బయట రోడ్డుపై కలకలం చెలరేగింది. బయటకి వెల్లి చూస్తే కాలనీ వాసులంతా ఉన్నారు. నీళ్లలో భయం భయంగా వెల్లారు ఇద్దరు.‘కార్పోరేటర్ దగ్గరికి వెల్దాం మొన్నట్నుంచి వానలో మునుగుతుంటే, ఎవరూ పట్టించుకోరా’ అని కోపంగా అంటున్నాడు యువకుడు. ఆడాళ్లు కొంత మంది వంత పాడారు. ‘కార్పోరేషన్ వాళ్లు ఎక్కడ చచ్చారు, ఒక్కరన్నా వచ్చి వాటర్ క్లియర్ చేయరా’ అని ఇంకొకరు అరిచారు. ‘ఫోన్ చేసామండి, ఫుడ్ పాకెట్లు పంపుతారంటా’ అన్నారు పెద్దాయన. ‘ఫుడ్ పాకెట్లు ఎవరిక్కావాలి, మనుషులు చస్తుంటే’ మరొకరి ఆక్రందన ‘ఎవరు మాత్రం ఏం చేస్తారు హైదరాబాద్ మొత్తం బీభత్సంగా వానలు, లోతట్టు ప్రాంతాలన్నీ మునిగాయట’ ‘మనది లోతట్టు కాదు లోచెరువు’ అన్నారు మరికొందరు.‘బొల్లారం హైస్కూళ్లో పునరావాసం సెంటర్ ఏర్పాటు చేసారంటా, అక్కడికి వెళ్లమన్నాడు కార్పోరేటర్’ అన్నాడు కాలనీ ప్రెసిడెంట్.

‘అదేంటండీ, ఇళ్లు, వాకిలీ వదిలి పునరావాసంకు పోవడానికి మనమేమన్నా శ్రీలంక శరణార్థులమా’ అన్నాడు అపోజిషన్ పార్టీ సింపథైజర్.

ఇలా ఎవరికి తోచింది వారు మాట్లాడుతున్నారు. ఇంతలో కొంచెం దూరంలో పాడుబడిన పాత ఇళ్లు అందరూ చూస్తుండగానే ఒక్కసారిగా కూలిపోయింది. అంతా హహాకారాలు పెడుతూ పరుగులు తీసారు. ఇంతలో ఆ కాలనీకి కొత్తగా వచ్చిన వ్యక్తి ఉరుకుతూ డ్రైనేజీ కోసం తీసిన గుంతలో పడిపోయాడు. అందరూ కలిసి అతికష్టం మీద అతన్ని బయటకు తీసి… జాగ్రత్తగా ఉండొద్దు, సహాయం చేయడానికి కూడా కాదు ఊరికే చూడడానికే ఎందుకంత ఆత్రం ఏం జరిగిందోనని తెలుసుకోవడానికి, అని కొప్పడ్డారు. బీహార్ నుండి పనికోసం వచ్చిన వాల్లు నిన్ననే ఖాళీ చేసి వెల్లడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అందరూ హహాకారాలు చేసారు. కానీ కక్కుర్తో, అవసరమో, చెరువు శిఖం కన్నా దారుణంగా చెరువుని పూడ్చేసి ఇళ్లు కట్టుకున్న మనల్ని మనం తిట్టుకోవాలి ముందు. పర్మిషన్ ఇచ్చిన వాన్ని, వానికి అండగా ఉన్నవాన్ని అంటూ గొణుక్కుంటూ వెళ్తున్నారు రిటైర్డ్ ఎంప్లాయీలు.

ఇంతలో కొంత మంది ఈ కంపు భరించలేక ఇళ్లకు తాళాలేసుకొని తెలిసిన బంధువులింటికి వెళ్తున్నారు గుడిసెల్లో ఉండేవారు. ఆ పక్కనే ఉన్న స్లమ్ ఏరియా వాళ్లు బొల్లారం సెంటర్కి వెళ్తున్నారు. చూద్దాం లే రెండు రోజులు అని ఇంట్లోకి వచ్చారు భూపాల్, రజితలు.

గాలి వాన పెట్టినప్పుడల్లా కరెంట్ తీగలపై పడ్డ కొమ్మల్ని సరిచేస్తూ రోజులో కొన్ని గంటలు కరెంటు ఇస్తున్నారు, ఏదో ఓ టైంలో కార్పోరేషన్ వాళ్ల ఫుడ్ పాకెట్ల వాన్ తిరిగిపోతుంది. వర్షం కొంచెం తెరిపిచ్చింది కానీ అప్పటికీ ఇంటిలోపలే పడవలతో తిరిగేన్ని నీళ్లు నిండిపోయాయి. ఊరెళ్దామంటే బస్సులు తిరగడం లేదని, రోడ్లన్నీ కొట్టుకుపోయాయని తెలియడం, హైదరాబాద్లో బంధువులు లేకపోవడం, తెలసిన వాళ్ల ఇంటికి వెల్లి ఇబ్బంది పెట్టడం ఎందుకని మరో రెండ్రోజులు అలాగే ఉన్నారు.

నరకంలో ఉన్నట్టే ఉంది, కరెంటు స్విచ్చులేయాలంటే భయం వేస్తుంది. గోడలన్నీ నానిపోయి ఉన్నాయి ఇద్దరూ షార్ట్ నిక్కర్లు వేసుకొని తిరుగుతున్నారు. కానీ ఇళ్లంతా ఒకటే వాసన, రజితకు విసుగొచ్చి ఊరెళదాం అని పోరుపెడుతుంది, వెళ్దామనుకున్న వెళ్ళడానికి వీలులేని పరిస్థితులు.

మరునాడు పునరావాస సెంటర్నుండి పాలపాకెట్టు, పండ్లు తీసుకొని పక్క గుడిసె బిల్డింగ్ పనిచేసే శీను తెచ్చిచ్చాడు. అతన్ని చూస్తూనే భూపాల్ కి సిగ్గనిపించింది. ‘అమ్మ ఇవిచ్చి రమ్మన్నారండి, ఇక్కడ ఏమైనా దొరుకుతున్నాయో లేదోనని’ అన్నాడు. రజిత వాటిని తీసుకుంటూ ‘అమ్మవాళ్లు ఎలా ఉన్నారు’ అని అడిగింది. ‘బాగున్నారండి అంటూ వెళ్తూనే, అక్కడ బాగానే ఉంది అమ్మగారూ, ఈ కంపులో ఉంటే ఏమైనా రోగాలొస్తాయోమో రండి’ అన్నాడు. ఆ మాటల్తో ఇగ ఆగలేకపోయిన రజిత ‘మీరు వస్తే రండి లేదంటే లేదు, నేను వెళ్తాను అని ఖరాఖండిగా చెప్పింది. కానీ పునరావాస సెంటర్లో ఇంతకంటే దరిద్రంగా ఉంటుందని ఇన్ని రోజులూ భయపెట్టిన భూపాల్కి ఇక వెల్లక తప్పలేదు, ఇద్దరూ రెండు జతల బట్టలు తీసుకొని బొల్లారంకు బయల్దేరారు.

ఒక్కొక్కరిది ఒక్కో భాద. కానీ ఎవరినీ నిందించడం లేదు. పనే దైవంగా బతికే మనుషులు కాబట్టి కుదురుకునే రోజుల కోసం ఎదురుచూస్తూ కాలక్షేపం కోసం తమ గాథల్ని వినిపిస్తున్నారు.

లోపలికెళ్తూనే వారూహించుకున్నదానికి భిన్నంగా అక్కడుంది. చెత్త చేదారం లేని పరిసరాలు. నీటుగా ఉన్న వంట గది, పది బెడ్లను ఒక్కో తరగతి గదిలో ఏర్పాటు చేసారు. ఓ వందమంది దాకా ఉన్నారు మొత్తం పది రూములున్నాయి. అందరూ దిగువ మధ్యతరగతి, పేద వాళ్లే. ప్రతీ ఒక్కరూ బాధ్యతగా ఉన్నారు. కొంచెం బాత్రూం పరిసరాల్లో నీరు నిండి బురద కన్పిస్తుంది కానీ గత రెండ్రోజులుగా ఇంట్లో పలుకరించే మానవులు లేక కుళ్లి కంపుకొడ్తున్న పరిసరాల్లో తినబుద్దవక ఉన్న దిగులు రజిత, భూపాల్లకు క్రమక్రమంగా పోయింది అక్కడున్నవాళ్లతో గడుపుతుంటే. ఎవరో కొందరు మాకు ఇది లేదు, అది లేదు అని తిన్నదరక్క గొడవ పడడం మినహా మిగతావాళ్లంతా భవిష్యత్ పై గంపెడాశతో ఉన్నారు.

ఒక్కొక్కరిది ఒక్కో భాద. కానీ ఎవరినీ నిందించడం లేదు. పనే దైవంగా బతికే మనుషులు కాబట్టి కుదురుకునే రోజుల కోసం ఎదురుచూస్తూ కాలక్షేపం కోసం తమ గాథల్ని వినిపిస్తున్నారు. కొందరు దేవుడు పగబట్టాడు అందుకే కుండపోతలు కురుస్తున్నాయి అన్నారు. మరి కొందరు మరైతే గప్పుడెప్పుడో ఓ సీఎం ఉన్నప్పుడు వర్షాలే పడక కరువొచ్చింది కదా… అప్పుడు దేవుడు పగబట్టలేదా అన్నారు కొంచెం రాజకీయాల మీద ఆసక్తి ఉన్నావాళ్లు. ఇలా తలా ఒక మాట మాట్లాడుతుంటే కొంచెం నిమ్మళమైతుంది అక్కడ అందరికీ.

నిజమైన ప్రపంచం ఏంటో కొంచెం కొంచెం అర్థమవుతుంది రజిత, భూపాల్ లకు. మొదటినుండి పదిమందికి సహాయం చేసే రజితే కాదు భూపాల్ కూడా అక్కడి వారికి ఆహారం అందించడం, ప్లేట్లు తీయడం, చుట్టుపక్కలను నీటుగా ఉంచడం వంటి పనులు చేస్తున్నాడు.

తిలా పాపం తలా పిడికెడు అన్నట్టు అందరిదీ తప్పే. అందుకే ఈ ఇక్కట్లు అని వారు మాట్లాడుతుంటే ఇంత సాత్వికంగా బతికే నైజం, కష్టాల్లోనూ సంతోషంగా ఉండడం తెలిసిన వీళ్లే నిజమైన అదృష్టవంతులు అనుకున్నారు రజిత, భూపాలు.

మిన్నువిరిగి మీదపడే వానకు ఎవరేం చేస్తారు. చెరువుల్ని కాపాడి, కాలువలను ఆక్రమించకపోతే ఎక్కడి నీళ్లు అక్కడే వెళ్లిపోయేవి కానీ ఎవరి స్వార్థానికి వారు అడ్డదిడ్డంగా ఆక్రమణలు చేసారు. తిలా పాపం తలా పిడికెడు అన్నట్టు అందరిదీ తప్పే. అందుకే ఈ ఇక్కట్లు అని వారు మాట్లాడుతుంటే ఇంత సాత్వికంగా బతికే నైజం, కష్టాల్లోనూ సంతోషంగా ఉండడం తెలిసిన వీళ్లే నిజమైన అదృష్టవంతులు అనుకున్నారు రజిత, భూపాలు.

మొత్తానికి మూడు రోజుల్లో వరద తగ్గి ఎవరింటికి వారిని పంపిస్తున్నారు. ఉన్న మూడ్రోజుల్లోనే వారందరూ తమకు ఆత్మబంధువులయ్యారు. అందరి దగ్గరా ఆప్యాయంగా సెలవు తీసుకొని, ఇంటికొచ్చాక బురదంతా ఎత్తిపోసి మామూలు స్థితికి చేరుకున్నారు. భూపాల్ ఆపీస్ కూడా స్టార్ట్ అవడంతో వెళ్ళాడు. సాయంత్రం వచ్చేటప్పుడు రెండు కూరగాయల సంచులు తెచ్చాడు, ఒకటి తీసుకెళ్లి పక్క గుడిసెలో ఉండే శీనుని పిలిచి ఇచ్చాడు, ఇవ్వడంలోని ఆనందాన్ని ముంపుతో తెలుసుకొన్నాడు భూపాల్.

ఆలోచనల్లో ఉన్న భూపాల్కి టీ కప్ అందిస్తూ ‘ఏంటండీ ఆలోచిస్తున్నారు’ అంది రజిత.

‘వర్షం తీరు చూస్తుంటే మళ్లీ ముంపు తప్పేలా లేదు’ అన్నాడు భూపాల్.

గతానుభవాన్ని గుర్తుతెచ్చుకుంటూ ‘భయపడ్తున్నారా’ అంది.

‘కానీ ఇప్పుడు మునిగే అవకాశం రాకపోవచ్చు, పోయినసారి వరదలప్పుడు తీసిన వరద కాలువ నీళ్లను తోడేస్తుందిలే’ అన్నాడు.

‘దాన్ని మించిన వానపడితే అదేం చేస్తుంది లేండి. ఏం చేస్తాం కక్కుర్తికి పరిష్కారం చేసుకోవాల్సిందేగా…. ఐనా మరో మంచి పాఠమేదో నేర్పుతుంది లేండి’ అంది.

ఇద్దరూ నవ్వుకున్నారు.

 

 

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article