Editorial

Wednesday, January 22, 2025
ఏడేళ్ళ తెలంగాణతెలంగాణకు దూరమైన "జయ జయహే తెలంగాణ"

తెలంగాణకు దూరమైన “జయ జయహే తెలంగాణ”

 

జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం
ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం
తరతరాల చరిత గల తల్లీ నీరాజనం
పది జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం

జై తెలంగాణ! జై జై తెలంగాణ!!

కందుకూరి రమేష్ బాబు 

తెలంగాణ రాష్ట్ర సాధన దాకా రాష్ట్ర గీతంగా సకల జనులూ అక్కున చేర్చుకున్న ఈ గీతం ఆ తర్వాత క్రమేణా ప్రజలకు దూరమైంది. అందుకు గల కారణాలేమైనా అందరూ మెచ్చిన ఆ గీతం ఈ ఏడేళ్ళలో రాష్ట్ర ప్రజనీకానికి దూరం కావడం ఒక చారిత్రక విషాదం.

ఇది ఆ పాటకే పరిమితమైన విషయం కాకుండా ప్రజలకు, ఉద్యమ నేతలకు, ముఖ్యమంత్రికీ మధ్య ఏర్పడిన ఒక దూరాన్ని, అగాథాన్నిఈ ఏడేళ్ళ తెలంగాణాలో అందరినీ కలిపిన కేంద్రం ఒకటి నీరుగారి, తిరిగి మూడు రాస్తాల తెలంగాణ ఒకటి నిశ్శబ్దంగా సాకరమైందని ఈ ఉదంతం చెప్పకనే చెబుతుంది.

మలి తెలంగాణ ఉద్యమం జోరందుకున్నాక, రాష్టావిర్భావం తర్వాత అనధికార తెలంగాణ రాష్ట్ర గీతంగా కొంతకాలం ప్రజల్లో ఈ గీతం చెలామణి ఐనప్పటికీ ఆ తర్వాత ఈ పాటపై అధికారిక నిషేధం ఏర్పాటు కావడం చూశాం కూడా.

పునరుజ్జీవన కాంక్షను సైతం రేకెత్తించే ఆ పాట వినకూడనిది కావడం ఏమిటి? ఇప్పటికీ ఆ పాట స్మృతిలోకి వస్తే ఎద పోగుతుంది. ఒక ఉత్తేజిత దృశ్యం ఒకటి వెనకాల ఒకటిగా కవాతు కడుతాయ్. ప్రతి చరణం చివర ‘జై తెలంగాణా…జై జై తెలంగాణ’ అంటుంటే ఒడలు పులకరిస్తుంది.

 

నిజానికి పదకొండు చరణాల ఈ గీతం గత, వర్తమనాలను బొమ్మకట్టి భవిశ్వత్తుపై అంతులేని విశ్వాసాన్ని ప్రకటించిన విషయం కాదనలేనిది. 2009 డిసెంబర్ 9 ప్రకటన వచ్చాక ఈ పాట కోటానుకోట్ల ప్రజల వద్దకు చేరింది. మాతృగీతంగా మారిపోయింది. ఆ తర్వాత అది పునరుజ్జీవన కాంక్షను రేకెత్తించే పాటగానూ ప్రశస్థినొందింది. మరి ఆ పాట వినకూడనిది కావడం ఏమిటి?

ఇప్పటికీ ఆ పాట స్మృతిలోకి వస్తే ఎద పోగుతుంది. ఒక ఉత్తేజిత దృశ్యం ఒకటి వెనకాల ఒకటిగా కవాతు కడుతాయ్. గడిచిన ఉద్యమాల చరిత్ర, పోరాట ఫలంతో స్వరాష్ట్రం స్వాంతన పొందే స్థితి దాకా వడివడిగా అనేక జ్ఞాపకాలు మననంలోకి వస్తాయి. ఆ పాట తెలంగాణా అశేష ప్రజావళి మానసాన్ని అలవోకగా సేద తీరుస్తుంది. ప్రతి చరణం చివర ‘జై తెలంగాణా…జై జై తెలంగాణ’ అంటుంటే ఒడలు పులకరిస్తుంది. కానీ, ఏమైంది ఆ పాట?

‘మాయమైపోతున్నడమ్మా మనిషన్న వాడు’ అన్న మరో ప్రసిద్ద పాట రాసిన అందెశ్రీ తీవ్ర అవమానానికి గురైనారనే చెప్పాలి. ఐతే, ఆయన కృంగి పోకుండా నిశ్శబ్దంగా తన పని తాను చేసుకుంటూ రావడం ఒక రకంగా అనివార్యమైంది. ఒంటరిగానే అయినా అది మంచిదే ఐంది.

andhesri

కొన్ని వందల ఆటా పాటగాళ్ళను సాంస్కృతిక సారథిగా ఏర్పరచి ఉద్యోగాలు, జీత భత్యాలు ఇవ్వవచ్చుగాక, కానీ ఉద్యమలో పుట్టి, ఉద్యమాన్ని లాలించి పాలించిన ఆ పాటను తిరిగి సృశించలేరు కదా! తరతరాల చరితగల తెలంగాణా తల్లికి అంతటి నీరాజనం పలకలేరు కదా?.

నిజానికి తెలంగాణ ఉద్యమ కాలంలో తొలి ప్రార్థనగా, ప్రజల ఉద్వేగాలను, ఆనందోత్సవాలను పట్టిచ్చిన ఈ పాట రాష్ట్రం ఏర్పాటయ్యాక కూడా పాఠశాలల్లో పాడిన ఉదంతాలూ ఉన్నాయి. కానీ, ఆ పాటకు తానే మెరుగులు దిద్దినట్టు చెప్ప్పుకున్న కేసీఆర్ ఆ తర్వాత ఆ పాటను, దాని రచయితను విస్మరించడమే కాకుండా, చివరకు అది దాన్ని రాష్ట్ర గీతంగా ప్రభుత్వం గుర్తించలేదని, రాసుకున్నప్పుడు దాని గురించి ప్రకటిస్తామని కూడా కేసేఅర్ యే స్వయంగా చెప్పేదాకా వెళ్ళడం తెలిసిందే. దీంతో ‘మాయమైపోతున్నడమ్మా మనిషన్న వాడు’ అన్న మరో ప్రసిద్ద పాట రాసిన అందెశ్రీ తీవ్ర అవమానానికి గురైనారనే చెప్పాలి. ఐతే, ఆయన కృంగి పోకుండా నిశ్శబ్దంగా తన పని తాను చేసుకుంటూ రావడం ఒక రకంగా అనివార్యమైంది. ఒంటరిగానే అయినా అది మంచిదే ఐంది.

ఐతే, ఆయన పొందిన ఆవమానం ఒక్కరికి చెందినది కాదనే అనాలి. ఇది కేవలం కవికి మాత్రమే పరిమితమైన విషయంగా కాకుండా, వ్యక్తిగతంగా కేసీఆర్ కి సంబంధించిన అంశంగానే చూడకుండా యావత్ తెలంగాణ ప్రజలకు సంబధించిన తీవ్రమైన అంశంగా చూడాలి. ఆ మేరకు ముఖ్యమంత్రి వైఖరి కారణంగా స్వరాష్ట్రం ఓక రకంగా భంగ పడిందని కూడా అంగీకరించాలి.

నిజానికి మహాతరమైన పాటను అప్రధానం చేసిన ఈ ఒక్క అంశం చూసినా స్వరాష్ట్రం లేదా ముఖ్యమంత్రి ఒంటెద్దు పోకడ ఎలా ఇమిడి ఉన్నదో తేలుతుంది. దీని ద్వారా ఏడేళ్ళ తెలంగాణ ఫలితాలను కూడా భేరీజు వేయవచ్చు.

kcr

అధికారం, అహంకారం, స్వప్రయోజనాలు- వీటికన్నా మిన్న ప్రజల ఆకాంక్షలు, ప్రజల అధికారం మిన్న అన్న సొయితో మెలగగవలసిన బాధ్యత కవికన్నా ‘రాజు’కు అధికం. అది ప్రజాస్వామ్యంలో అయినా. ఆ లెక్కన ప్రజలకు దీర్ఘకాలంలో మేలుగోరి, జరూరుగా ప్రాధాన్యం ఇచ్చి మసులుకోవడంలో ఇప్పటికైనా ముఖ్యమంత్రి ఉద్యమ కాలంలో ఎట్లయితే ఉమ్మడి ప్రయోజనాల కోసం విశాల దృష్టితో పనిచేశామో అలా తిరిగి అదే వైఖరిని ఆశ్రయించడం అవశ్యం. అది వెనుకబాటు కాదు, పురోగతి, అదే ప్రగతి భవన్ ఎంచుకోవలసిన మార్గం. కావున రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కేసీఆర్ పునరావలోనకం చేసుకుని, ప్రజల పాటను ప్రజల వద్దకు చేర్చడం అనివార్యమా కాదా అని వివేచించాలని సూచన.

నిజానికి మహాతరమైన పాటను అప్రధానం చేసిన ఈ ఒక్క అంశం చూసినా స్వరాష్ట్రం లేదా ముఖ్యమంత్రి ఒంటెద్దు పోకడ ఎలా ఇమిడి ఉన్నదో తేలుతుంది. దీని ద్వారా ఏడేళ్ళ తెలంగాణ ఫలితాలను కూడా భేరీజు వేయవచ్చు.

టీఆర్ ఎస్ జెండాపై అధికారం ఎవరిదీ అన్న అంశంలో ‘అది అందరిదీ’ అన్న ఈటెల రాజేందర్ నుంచి, నాడు జెండా రూపకల్పనలో ముఖ్యమైన ఉద్యమ నేత ఇన్నయ్య దాకా… అందరూ కేసేఆర్ దగ్గరి నుంచి దూరం కావడం ఒకటైతే, ఆ తర్వాత టీ ఆర్ ఎస్ పార్టీ ఇకనుంచి ఫక్తు రాజకీయ పార్టీ అని కేసీఆర్ ప్రకటించిన నాటి నుంచి ఉద్యమంలో ప్రజలు చీత్కరించుకున్న దానం నాగేందర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ వంటి నేతలకు కేసీఆర్ ప్రాధాన్యం ఇవ్వడం, అధికారంలో భాగస్వామ్యం కల్పించడం, ఇదంతా ‘తాను పాడిందే పాట’ అన్న చందానికి నిదర్శనమే.

ఈ పోకడే ప్రజలకూ ఉద్యమ నేతలకూ మధ్య దూరాన్నే కాదు, వారిద్దరికీ కేసేఆర్ మధ్యన పెరుగుతున్న దూరాన్ని చెబుతోంది. అందెశ్రీ కూడా ఇందులో ఒకరు. కానీ, వారి పాటను తిరిగి ప్రార్థనా గీతం చేయడం అంటే అది ఉమ్మడి అస్తిత్వానికి గౌరవం ఇవ్వడం. ఆత్మగౌరవానికి నిదర్శనం. ప్రజలకూ ప్రభుత్వానికీ మధ్య ఏర్పడిన దూరాన్ని తొలగించే ప్రయత్నం కూడా. ఇప్పటికైనా అందుకు పూనుకోవలసినది అధినేతనే. కొత్తగా చరిత్రను సృష్టించలేం. చరిత్రను వోన్ చేసుకోవడం తప్ప. ఈ విషయం గౌరవనీయ ముఖ్యమంత్రికి తెలియనిది కాదు. కానీ సందర్భం ఉన్నప్పుడు వాస్తవాన్ని ప్రజలు చెబుతారు. చెప్పాలి. ఈ వ్యాసం కూడా అట్లా ప్రజాభిప్రాయం. ప్రజల సంపాదకీయం. తెలుపు కర్తవ్యం.

telangana state log0

రాష్ట్రాన్ని తేవడంలో అద్వితీయ పాత్ర పోషించిన ముఖ్యమంత్రికి, రాష్ట్ర ప్రజలందరికీ స్వరాష్ట్ర ఆవిర్భావ శుభాకాంక్షలతో…

జై తెలంగాణా..జై జై తెలంగాణ

జయ జయ జయహే తెలంగాణ

More articles

3 COMMENTS

  1. సందర్భోచితంగా ఉంది…. తెలంగాణ ఆత్మ గౌరవ పతాకానికి పిడికిలెత్తి జై కొట్టే పాట… ఈ డిమాండ్ ను ముందు పెట్టుకొని మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టాలి…. #We stand for Jaya Jayahe Telangana

  2. అందెశ్రీ రాసిన పాటలో అవసరార్థం, తన అవగాహన నిమిత్తం కొన్ని మార్పులు చేశారు. అలా రెండు రకాలుగా పాడుకున్నారు. వందేమాతరం పాటలో చి కొద్దిగనే తీసుకున్నారు. ఈ పాటలో కూడ కొద్దిగనే తీసుకునే వారేమో. ప్రజలకు అంకితమయ్యాక ూడా అది నాది నాదే అనే ఆస్తి హక్కు భావన, అధికార భావన రెండూ వదులుకొని ప్రజలను పట్టించుకుని సర్దు కోవడమే సరైనది. వేమన పద్యాలు ఎన్నో పోకడలు పోయినవి. వేమన రాయనివి కూడ వేమన ఖాతాలో చేరాయి. జాన పదులు, ప్రజలు మార్పులు చేర్పులు చేసుకోవడం సహజం. ఇదంత గతంలో చెప్పి చూసినదే. . – బి ఎస్ రాములు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article