Editorial

Wednesday, January 22, 2025
ఆటలునువ్వా..నేనా : టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్లో ఉత్కంఠ పోరు

నువ్వా..నేనా : టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్లో ఉత్కంఠ పోరు

 

 

ఫేవరెట్ గా టీమ్ ఇండియా….ఆత్మవిశ్వాసంతో న్యూజిలాండ్

ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ ముందు ఇంగ్లండ్ ను 1-0తో మట్టికరిపించిన న్యూజిలాండ్‌ జట్టు ఉత్సాహంతో ఉంది. టీమ్‌ఇండియాతో పోరుకు ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతున్నది.

కెఎస్ఆర్

ఐసీసీ టోర్నీల్లో ఎన్నో జట్లను ఓడించిన భారత్‌కు న్యూజిలాండ్ జట్టు ఎప్పుడూ షాకిస్తూనే ఉంది. కివీస్‌ చేతిలో ఓటమిపాలు కావడం టీమ్ ఇండియాకు పరిపాటిగా మారింది. అందుకే తొలిసారి ప్రవేశపెట్టిన టెస్టు ఛాంపియన్‌షిప్‌ గెలవాలంటే కోహ్లీసేనకు కాస్త కంగారుగా ఉంది. కివీస్ బౌలింగ్ దాడిని సమర్థంగా ఎదుర్కుంటూ బోర్డుపై భారీ స్కోరు చేస్తే మనోళ్లు గెలిచినట్లే..

ఫైనల్లో కోహ్లీసేన ప్రధాన శత్రువు అంటే వారి బౌలింగ్ అటాక్. టెస్టు ఛాంపియన్‌షిప్‌లో టిమ్ సౌథీ సహా కివీస్ పేసర్లు వాగ్నర్, బౌల్ట్, మాథ్యూ హెన్సీ లాంటి భీకర పేస్ బౌలింగ్ దాడిని ఎదుర్కోవాల్సి ఉంది. తాజాగా టెస్టు మ్యాచ్ ల్లో కివీస్‌ విజయాలకు కారణం వారి భీకర బౌలింగే! అత్యంత వేగంతో పదునైన బంతులు విసిరే వీరి బౌలింగ్ అటాక్ పిచ్‌లతో సంబంధం లేకుండా రాణించగలదు. కివీస్ పేసర్ టిమ్ సౌథీ కి భారత్‌పై మంచి రికార్డుంది. 8 మ్యాచుల్లో 24.46 సగటుతో 39 వికెట్లు తీసుకున్నడు.

ఇంగ్లండ్ గడ్డపై 6 మ్యాచుల్లో 28.37 సగటుతో 27 వికెట్లు పడగొట్టాడు. ఈ గణాంకాలను బట్టి అతడి బౌలింగ్‌ను ఎదుర్కోవడం కోహ్లీసేనకు సులువేమీ కాదని అర్థమవుతోంది.

ఇక ఇంగ్లండ్ గడ్డపై 6 మ్యాచుల్లో 28.37 సగటుతో 27 వికెట్లు పడగొట్టాడు. ఈ గణాంకాలను బట్టి అతడి బౌలింగ్‌ను ఎదుర్కోవడం కోహ్లీసేనకు సులువేమీ కాదని అర్థమవుతోంది. మొన్నటి లార్డ్స్‌ మ్యాచులో 7 వికెట్లు తీసి హడలెత్తించాడు. అంతేకాదు భారత కెప్టెన్ కోహ్లీపై అతడిదే ఆధిపత్యం. ఇప్పటి వరకు 10సార్లు అతడిని ఔట్‌ చేశాడు. కివీస్‌ బౌలర్లలో సౌథీ, బౌల్ట్‌ అగ్ని అనుకుంటే ఆజ్యం మ్యాట్‌ హెన్రీ. దొరికిన అవకాశాలు తక్కువే ఐనా నిలకడగా ఆడుతూ టెస్టు క్రికెట్లో అదరగొడుతున్నాడు. ఇంగ్లండ్ తో ముగిసిన రెండో టెస్టులో 6 వికెట్లు తీసి మ్యాన్‌ ఆఫ్ ది మ్యాచ్‌ అందుకున్నాడు. అతను రాణించడంతోనే ఇంగ్లండ్ పై రెండో టెస్టులో నెగ్గి 1-0 తేడాతో కివీస్ జట్టు టెస్టు సిరీస్ కైవసం చేసుకుంది. సౌథీ, బౌల్ట్ ఓపెనింగ్ బౌలింగ్ దాడిని కాచుకుంటూ హెన్రీని జాగ్రత్తగా ఆడితేనే కొహ్లీ సేనకు విజయం దక్కుతుంది.

బ్యాటింగ్ లో వీరితో డేంజరే..

కివీస్‌ సారథి కేన్‌ విలియమ్సన్‌.. టీమ్‌ఇండియాపై 11 టెస్టుల్లో 36.40 సగటుతో 728 పరుగులు చేశాడు. 2 శతకాలు, 4 అర్ధశతకాలు ఉన్నాయి. భారత్‌పై చెలరేగడం అతడికి అలవాటే. ఫైనల్ జరిగే ఇంగ్లండ్ గడ్డపై 5 టెస్టుల్లో 26.10 సగటుతో 261 పరుగులే చేశాడు.

ఇంగ్లిష్‌ వాతావరణంలో పెద్దగా పరుగులు చేయకపోవడం టీమ్ ఇండియాకు సానుకూలాంశమే అయినా ఆదమరిస్తే ప్రమాదం తప్పదు.

ఇంగ్లిష్‌ వాతావరణంలో పెద్దగా పరుగులు చేయకపోవడం టీమ్ ఇండియాకు సానుకూలాంశమే అయినా ఆదమరిస్తే ప్రమాదం తప్పదు. కేన్ పేస్‌తో పాటు స్పిన్‌నూ సమర్థంగా ఎదుర్కోగలడు. అశ్విన్‌, బుమ్రా కేన్ ను క్రీజులో నిలవకుండా అడ్డుకోగలిగితే మన జట్టు విజయానికి పునాది పడినట్లే.. ఓపెనర్ డెన్వర్ కాన్వే.. అంతర్జాతీయ క్రికెట్లోకి కొత్తగా వచ్చానన్న బెరుకే కాన్వేలో కనిపించడం లేదు. ఇంగ్లాండ్‌తో 2 టెస్టుల సిరీసులో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. 4 ఇన్నింగ్స్‌ల్లో 76.50 సగటు, 54.84 స్ట్రైక్‌రేట్‌తో 306 పరుగులు చేశాడు. లార్డ్స్‌లో జరిగిన తొలిటెస్టులో ద్విశతకం చేసి తన అరంగేట్రాన్ని ఘనంగా చాటాడు. ఆడింది 3 వన్డేలే. 75 సగటు, 88.23 స్ట్రైక్‌రేట్‌తో 225 పరుగులు బాదేశాడు. 11 టీ20 ఇన్నింగ్సుల్లో 59.12 సగటుతో 473 పరుగులు సాధించాడు. క్రీజులో నిలదొక్కుకుంటే కాన్వేను ఔట్‌ చేయడం సులభం కాదు. వీరిద్దరూ అద్భుతమైన ఫాంతో కివీస్ జట్టులో పరుగుల వరద పారిస్తున్నారు. వీరిని త్వరగా ఔట్ చేయకపోతే భారత్ విజయం కష్టమే..

టీమ్ ఇండియాకే అవకాశం..

టెస్టు పగ్గాలు అందుకున్న విరాట్‌ కోహ్లీ ఒకవైపు పరుగులు.. మరోవైపు కెప్టెన్‌గా విజయాలు సాధిస్తూ అంతర్జాతీయ క్రికెట్లో దుమ్మురేపుతున్నాడు. అత్యుత్తమ టెస్టు కెప్టెన్‌గా ఎదిగాడు. తొలిసారిగా జరుగుతున్న టెస్టు ఛాంపియన్‌షిప్‌ అందుకోవాలని, ఐసీసీ గదను ముద్దాడాలన్న గొప్ప సంకల్పంతో కనిపిస్తున్నాడు. కివీస్ జరిగే ఫైనల్‌కు కొహ్లీ సేన కూడా మానసికంగా సన్నద్ధమైంది. నీల్‌ వాగ్నర్‌ విసిరే షార్ట్‌పిచ్‌ బంతులకు గోడ కట్టేందుకు నయావాల్‌ చెతేశ్వర్‌ పుజారా సిద్ధంగా ఉన్నాడు. వన్డేలకు దూరమైన అజింక్య రహానె టెస్టు చాంపియన్ షిప్ ట్రోఫీని ముద్దాడేందుకు, ఎలాంటి ఒత్తిడి ఎదురైనా రాణించేందుకు సిద్ధమే.

టెస్టు పగ్గాలు అందుకున్న విరాట్‌ కోహ్లీ ఒకవైపు పరుగులు.. మరోవైపు కెప్టెన్‌గా విజయాలు సాధిస్తూ అంతర్జాతీయ క్రికెట్లో దుమ్మురేపుతున్నాడు.

అంతేకాదు అవసరమైన సమయంలో కొహ్లీకి సలహాలు ఇవ్వగలడు. బ్యాటింగ్ లో విరాట్‌ విఫలమైన పరిస్థితి ఉంటే జట్టును కాపాడేందుకు బ్యాటింగ్ ను నిలబెట్టేందుకు రెడీ. పరిమిత ఓవర్ల ఫార్మాట్‌ కు ఎంపికవ్వని అశ్విన్ ..టెస్టు చాంపియన్ షిప్ లో సత్తా చాటేందుకు తహతహలాడుతున్నాడు. భీకరఫాంలో కనిపిస్తున్న విలియమ్సన్‌, రాస్‌టేలర్‌, హెన్రీ నికోల్స్‌ను తన అమ్ములపొదిలోని క్యారమ్‌ బాల్స్, ఆఫ్ స్పిన్ బంతులతో ఉచ్చులో పడేసి విజయం అందించేందుకు ప్రణాళికలు వేస్తున్నాడు. జట్టులోని సీనియర్‌ పేసర్ ఇషాంత్‌ శర్మ ఇంగ్లండ్ లోని స్వింగ్ కండిషన్స్ లో అద్భుతంగా రాణించగలడు. గతంలో చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ఇషాంత్ అద్భుత బౌలింగ్ చేశాడు. మరోసారి ఇదే పునరావృతం చేస్తే టెస్టు చాంపియన్ షిప్ లో టీమ్‌ఇండియాకు తిరుగుండదు.

పేసర్లకు అనుకూలించే ఇంగ్లండ్ గడ్డపై ఓపెనర్లు రోహిత్‌ శర్మ, శుభ్‌మన్‌ గిల్‌ రాణించడంపైనే జట్టు మిడిలార్డర్ ఆధారపడి ఉంది. ముఖ్యంగా రోహిత్ శర్మపై బాధ్యత ఎక్కువే ఉంటుంది. కొత్తబంతితో మాయచేసే ట్రెంట్‌బౌల్ట్‌, టిమ్‌ సౌథీ జోడీని ఓపెనర్లిద్దరూ సమర్థంగా ఎదుర్కుంటే సగం విజయం దక్కినట్లే . హిట్‌మ్యాన్‌ టెక్నిక్‌కు ఇంగ్లండ్ సిరీస్ కఠినపరీక్షే అయినా.. కివీస్ బౌలింగ్ అటాక్ ను నిలువరించే సత్తా ఉంది. అందరూ చెలరేగేందుకు సిద్ధంగా ఉండగా.. వరుస విజయాలతో ఊపుమీదున్న భారత్ ఫేవరెట్ గా టెస్టు చాంపియన్ షిప్ బరిలోకి దిగుతోంది.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article