Editorial

Wednesday, January 22, 2025
ఆటలురెడ్ స్టార్ VS వైట్ స్టార్ : కుర్సీపే చర్చ?

రెడ్ స్టార్ VS వైట్ స్టార్ : కుర్సీపే చర్చ?

both

స్ప్లిట్ కెప్టెన్సీ… దీనిపై గత కొంతకాలం చర్చలు జరుగుతూనే ఉన్నాయి. సీనియర్ ప్లేయర్స్ దగ్గర నుంచి మాజీల వరకు అందరూ తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. ఒక్కో ఫార్మాట్‌కు ఒక్కో కెప్టెన్ ఉంటే తప్పేంటని కొందరు అంటుంటే మరికొందరు దీనిని వ్యతిరేకిస్తున్నారు. 

kohly

కెఎస్ఆర్

మచ్చలపులి మొహం ముందర గాండ్రిస్తే ఎట్టుంతాదో తెల్సా? అన్న ఫేమస్ సినిమా డైలాగ్ ను తలపించేలా కింగ్ కొహ్లీ బ్యాటింగ్ ఉంటుందంటారు బౌలర్లు. ఫార్మాట్ ఏదైనా.. మైదానం ఎలాగున్నా.. బౌలర్ ఎవరైనా.. పరిస్థితి ఎలాంటిదైనా.. ఒత్తిడి గిత్తిడి అతనికి జాన్తానై..

అతను క్రీజులో ఉంటే పరుగులు నదీ ప్రవాహంలా కొనసాగుతూనే ఉంటాయి. అతని స్టైల్.. ఆటపట్ల అతని కమిట్ మెంట్ అవెసమ్.. మూడు ఫార్మాట్లలో భారత క్రికెట్ జట్టు కెప్టెన్ గా కొనసాగుతున్న కొహ్లీకి ఎదురులేదు. కానీ అతని కెప్టెన్సీకి పరిమితులు ఉండాల్సిందేనంటున్నారు. రెడ్ బాల్ క్రికెట్ కు అతన్ని కెప్టెన్ గా చేసి.. వైట్ బాల్ క్రికెట్ కు అతన్ని తప్పించాలన్న డిమాండ్స్ వస్తున్నాయి. ముఖ్యంగా ఐపీఎల్ లో అతని వైఫల్యం వైట్ బాల్ క్రికెట్ లో అతనికి మైనస్ గా మారుతోంది. సారథిగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టును అతను చాంపియన్ గా నిలుపలేకపోవడమే కాదు. ఐసీసీ టోర్నీల్లో అతని సారథ్యంలో భారత్ పరాజయం పాలు కావడం కూడా కొహ్లీపై విమర్శల దాడి పెరిగింది. టెస్టు ఫార్మాట్ లో సారథిగా తిరుగులేకుండా ఉన్నా అంతటి బ్యాటర్ కూడా వైట్ బాల్ క్రికెట్ లో తేలిపోతున్నట్లుగా కనిపిస్తోంది. టీ20 ప్రపంచకప్, ఐసీసీ వన్డే ప్రపంచకప్ లో అతని సారథ్యంలోని టీమ్ ఇండియా విఫలమైంది. దీంతో అతన్ని టెస్టు సారథిగా చేస్తూ వైట్ బాల్ క్రికెట్ జట్టు సారథిగా తప్పించాలన్న డిమాండ్ ఊపందుకుంది.

 

rohitరో’హిట్ మ్యాన్‘ అని ముద్దుగా పిలుచుకుంటారు. వైట్ బాల్ క్రికెట్ లో సాటి లేని మొనగాడు. సిక్సర్లు బాదడంలో సిద్ధహస్తుడు. సుతారంగా వీణను మీటినట్లుగా అతని పుల్ షాట్ అనిపిస్తే, క్రీజులో వేగంగా కదులుతూ అతను సంధించే హుక్ షాట్ చూస్తే సూపర్ పాస్ట్ బౌలర్ వేస్తున్నా.. ఈ బౌలింగ్ ఇంత స్లోగా ఉందా అనిపించేలా ఉంటుంది. అతన్ని 20 పరుగులు లేదంటే 10 ఓవర్లలోపు ఔట్ చేయకపోతే అంతే సంగతులు. వన్డే, టీ20 ఫార్మాట్ లో పరుగుల సునామీ సృష్టిస్తాడని దిగ్గజాల మాట. వన్డేల్లో ఎవరికీ సాధ్యం కానట్లుగా 264 పరుగుల అత్యధిక స్కోరు సాధించాడు. వన్డేల్లో 3 డబుల్ సెంచరీలు కొట్టాడు. ఇక ఐపీఎల్ లో అతనికి తిరుగేలేదు. సారథిగా 5 సార్లు ముంబై ఇండియన్స్ జట్టును చాంపియన్ గా నిలిపాడు. ఐపీఎల్ లనూ తిరుగులేని రికార్డుతో పరుగుల వరద పారించాడు. అంతేకాదు కొహ్లీ గైర్హాజరీలో నిదహాస్ ట్రోఫీతో పాటు ఆసియా కప్ లోనూ భారత్ ను చాంపియన్ గా నిలిపాడు. దీంతో వైట్ బాట్ క్రికెట్ సారథిగా రోహిత్ ను నియమించాలన్న డిమాండ్స్ మరింతగా పెరిగాయి..

captaincyఇప్పటికే రోహిత్, కొహ్లీ మధ్య నెలకొన్న విభేదాలు సద్దుమణుగుతున్నాయి. ఈ సమయంలో జట్టులో రెండో అధికార కేంద్రం అంటే సమస్యలకు స్వాగతం పలికినట్లే.

ఫార్మాట్ కో కెప్టెన్ టీమ్ ఇండియాకు సూట్ అవుతుందా?

స్ప్లిట్ కెప్టెన్సీ.. దీనిపై గత కొంతకాలం చర్చలు జరుగుతూనే ఉన్నాయి. సీనియర్ ప్లేయర్స్ దగ్గర నుంచి మాజీల వరకు అందరూ తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. ఒక్కో ఫార్మాట్‌కు ఒక్కో కెప్టెన్ ఉంటే తప్పేంటని కొందరు అంటుంటే మరికొందరు దీనిని వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికే ఆస్ట్రేలియా టెస్టు జట్టు కెప్టెన్ గా టిమ్ పైన్ ను నియమించగా వైట్ బాల్ క్రికెట్ జట్టు కెప్టెన్ గా ఆరోన్ ఫించ్ ను కొనసాగిస్తున్నారు. అలాగే ఇంగ్లండ్ జట్టు కూడా టెస్టు కెప్టెన్ గా జో రూట్ ను నియమించగా వన్డే, టీ20 సారథిగా ఇయాన్ మోర్గాన్ ఉన్నాడు. మరి మన విషయానికి వస్తే మూడు ఫార్మాట్లకు కెప్టెన్ గా కొహ్లీ కొనసాగుతున్నాడు. విదేశీ జట్లలో మనకు ఉన్న ఇగో క్లాషెస్ కానరావు. ఫార్మాట్ కో కెప్టెన్ అన్నా క్రికెటర్లు పెద్దగా పట్టించుకోరు. అసలే మన జట్టులో ఉన్న విరాట్ కొహ్లీకి దూకుడెక్కువ. టెస్టు ఆడే సమయంలో విరాట్ చుట్టు మూగే సభ్యులు.. వన్డే, టీ20 సమయంలో రోహిత్ శర్మకు ప్రాధాన్యం ఇవ్వడం అతనికి నచ్చదు. పైగా ఆస్ట్రేలియా టెస్టు జట్టులో ఫించ్, ఇంగ్లండ్ టెస్టు జట్టులో ఇయాన్ మోర్గాన్ రెగ్యులర్ గా ఉండే అవకాశం లేదు. ఒకవేళ ఆడినా వాళ్లకు అంత ఇబ్బంది ఉండదు. ఇప్పటికే రోహిత్, కొహ్లీ మధ్య నెలకొన్న విభేదాలు సద్దుమణుగుతున్నాయి. ఈ సమయంలో జట్టులో రెండో అధికార కేంద్రం అంటే సమస్యలకు స్వాగతం పలికినట్లే. రోహిత్ శర్మ కాస్త కామ్ గా జట్టు సభ్యులను తనకు కావలసినట్లుగా ఆడిస్తాడు. కొహ్లీనేమో తాను దూకుడుగా ఉంటూ ఆటగాళ్లనూ అలాగే అటాకింగ్ మోడ్ లో నడిపిస్తాడు. అందుకే కోచ్ గా కుంబ్లే కొనసాగుతున్న సమయంలో కొహ్లీ అతనితో సరిగా నడుచుకోలేకపోయాడు. మరీ కోచ్ అంటే స్కూల్ హెడ్ మాస్టర్ లా ఉండకూడదంటూ రవిశాస్త్రి వైపు మొగ్గు చూపాడు. మూడు ఫార్మాట్లలో కీలక ఆటగాడిగా ఉన్న కొహ్లీని కెప్టెన్సీ నుంచి తప్పిస్తే అతని ఆటతీరు గాడి తప్పే అవకాశం జట్టులో గ్రూపుల ఏర్పడే పరిస్థితి ఉత్పన్నం అవుతుంది.

అభిమానులు మధ్య కూడా కెప్టెన్సీ మార్పుపై రసవత్తర చర్చ నడుస్తుండడంతో రాబోయే రోజుల్లో కెప్టెన్సీ మార్పుపై మరింత ఉత్కంఠ కొనసాగడం ఖాయం.

ఇప్పటికే టీ20 ప్రపంచకప్ దగ్గర పడడం కూడా రోహిత్ కు వైట్ బాల్ కెప్టెన్సీ పై ప్రభావం పడనుంది. తనకు కావలసిన ఆటగాళ్లను ఎంచుకుని వారితో జట్టును, ఫైనల్ ఎలెవన్ ను తయారు చేసేందుకు రోహిత్ కు సమయం సరిపోదు. పైగా కొహ్లీ జట్టును సమర్థంగా నడిపిస్తున్నాడు. కొన్ని లోపాలు ఉన్నా కొహ్లీ జట్టుపై చెరగని ముద్ర వేసాడు. టెస్టుల్లో జట్టును నంబర్ వన్ గా నిలిపాడు. వన్డేల్లోనూ అద్భత రికార్డు కొనసాగిస్తున్నాడు. కెప్టెన్సీ మార్పు అంటే కనీసం టీ20 ప్రపంచకప్ వరకైనా ఆగితే మంచిది. ప్రశాంత చిత్తంగా కొనసాగే రోహిత్, ఆస్ట్రేలియాలో చరిత్రాత్మక టెస్టు సిరీస్ విజయం అందించిన రహానే స్ఫూర్తివంతంగా కనిపించినా.. కొహ్లీని కొనసాగిస్తేనే దీర్ఘకాలికంగా టీమ్ ఇండియాకు మేలు చేస్తుంది.

 

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article