Editorial

Wednesday, January 22, 2025
సినిమాBheemla Nayak : ఇద్దరు – ముగ్గురు - ‘అప్పట్లో ఒకడుండేవాడు’

Bheemla Nayak : ఇద్దరు – ముగ్గురు – ‘అప్పట్లో ఒకడుండేవాడు’

అయ్యప్పన్ కోషియమ్ అన్న మలయాళ సినిమాను తెలుగులో బీమ్లా నాయక్ పేరుతో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. రేపు ఆ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా ఈ సినిమా దర్శకత్వం బాధ్యతను యువ దర్శకుడైన సాగర్ కె చంద్రకు ఇవ్వడం వెనుకాల కారణం, అతడి ప్రత్యేకత ఏమిటో తెలుపు కథనం ఇది .

కందుకూరి రమేష్ బాబు

అయ్యప్పన్ కోషియమ్. ఈ సినిమా కథ వస్తువు చిన్నది. ఇద్దరు వ్యక్తుల మధ్య ఇగో క్లాష్. ఆదిపత్యం, అహంకార ప్రేరేపిత పోరాటం. కోపం, అసహనం -ఇత్యాది ఎమోషన్స్ ప్రభల శీలంగా ఆవిష్కరించే కేరెక్టర్స్. థ్రిల్లర్ జెనర్ సినిమా.

యశ్వంత్ ఆలూరు అన్న బ్లాగర్ అంటారు. “ఈ సినిమా ఆరంభం చాలా బాగా జరిగింది కానీ క్రమంగా కథనం చప్పగా మారిపోయింది” అని. “అయితే, ‘డ్రైవింగ్ లైసెన్స్’ లాగ ప్రేక్షకుడు ఎవరి పక్కన నిలబడాలో అయోమయం అవసరం లేదు. ఈ సినిమాలో నేను ‘అయ్యప్ప నాయర్’ (మొదటి పాత్ర) వైపే నిలబడ్డాను” అంటారు. అందుకు కారణం అతడి కోపంలో న్యాయం ఉంది. ‘కోషీ’ ( మరో పాత్ర) కోపంలో అహంకారం తప్ప మరేమీ కనబడలేదు. వారిద్దరూ కూర్చొని అయిదు నిమిషాలు మాట్లాడుకుంటే సమస్య సెటిల్ అయిపోయే అనేక సందర్భాలను వదిలేసి, దర్శకుడు కావాలని రెండు గంటల నలభై నిమిషాలు కథనాన్ని లాగి, వీరిద్దరి మధ్య ఎలాగూ ఓ ఫైటు ఉండాలి కాబట్టి దానితోనే సినిమా ముగించాలన్న తాపత్రయమే ఎక్కువగా కనబడింది” అని విశ్లేషించారు.

ఐతే, సగం సినిమా అయ్యాక పృథ్వీరాజుని దాటేసి బిజూ మీనన్ పూర్తిగా సినిమాను తన వైపు తిప్పేసుకున్నాడని కూడా అంటారాయన.

ఈ సినిమాను తెలుగులో మల్టీస్టారర్ సినిమాలా చేయాలనుకుంటే మాత్రం చాలా జాగ్రత్తగా చేయాలి. అసలు ఈ సినిమా రీమేక్ చేసే ఆలోచనను విరమించడం ఉత్తమమం అని కూడా అయన అభిప్రాయ పడ్డారు.

ఇది వారి ఒక్కరి మాటే కాదు, చాలా మందికి ఆ సినియా నచ్చి భావించిన నిచ్చితాభిప్రాయం.

“కథావస్తువు చిన్నదిగా ఉండి కేవలం పాత్రల instincts మీద నడిచే సినిమాలను తెలుగులో సరిగ్గా డీల్ చేయకపోతే పరాజయం చవిచూసిన సందర్భాలు అనేకం” అని ఆయన చక్కగా అంచనా వేశారు కూడా.

ఐతే, విషయానికి వస్తే, నిజానికి కమర్షియల్ గా సూపర్ హిట్టైన ఈ సినిమాను అయన చెప్పినట్టే తెలుగులో చేయడం ‘ప్రమాదకరం’. ‘కత్తి మీద సామే’.

Instincts, conflict ప్రధానంగా ఉన్న ఈ సినిమా దర్శకత్వ బాధ్యతలను సాగర్ కె చంద్రకు అప్పగించడానికి కారణం అయన ‘అప్పట్లో ఒకడుండేవాడు’ సినిమాలో ఇలాటి ఇద్దరి పాత్రలను సమర్థవంతంగా డీల్ చేయడమే అని తెలిసింది.

కాగా, బీమ్లా నాయక్ పేరుతో రీమేక్ అవుతున్న ఆ సినిమాలోని ఆ ఇగోను పోషిస్తోన్న ‘ఇద్దరు’గా పవన్ కళ్యాణ్, రాణాలు నటిస్తోన్న విషయం తెలిసిందే. ఐతే ఆ ఇద్దరిలో సినిమా పవన్ కళ్యాన్ వైపే ఒరుగుతుందేమో అని ఎవరైనా అనుకుంటారు, కారణం పవన్ కల్యాణ్ అభిమానులే. వాళ్లకు తమ హీరో పై చేయిగా లేకపోతే ఒప్పుకోరని తెలిసిందే.

కాగా, Instincts, conflict ప్రధానంగా ఉన్న ఈ సినిమా దర్శకత్వ బాధ్యతలను సాగర్ కె చంద్రకు అప్పగించడానికి కారణం అయన ‘అప్పట్లో ఒకడుండేవాడు’ సినిమాలో ఇలాటి ఇద్దరి పాత్రలను సమర్థవంతంగా డీల్ చేయడమే అని తెలిసింది.

నల్లగొండకు చెందిన సాగర్ సినిమాలకు రాక మునుపు కళా సాగర్. అతడు ఓయూలో ఇంజీనీరింగ్ చదివాడు. అమెరికాలోని ఇల్లినాయిస్ యూనివర్సిటీలో మాస్టర్ చేశారు. అక్కడే ఫిలిం మేకింగ్ కోర్సు కూడా పూర్తి చేశారు. సినిమా నిర్మాణంపై మంచి అవగాహన ఉన్న ఈ దర్శకుడి వైపు బీమ్లా నాయక్ సినిమా నిర్మాతలు మొగ్గు చూపడం వెనుక, పవర్ స్టార్ పవన్ కళ్యాన్ ఈ డైనమిక్ యువకుడి పనితీరు మెచ్చడానికి అసలు కారణం ‘ఇద్దరి’నీ అద్భుతంగా డీల్ చేయగల సమర్థత ఉండడమే. ‘అప్పట్లో ఒకడుండేవాడు’లో సాగర్ ఒక క్రికెటర్ ని, పోలీస్ ఆఫీసర్ ని – ఆ ఇద్దరిని వాళ్ళ ఈగోలతో గొప్పగా ఎస్టాబ్లిష్ చేయగలగడమే ఈ సినిమా అవకాశం పొందడం అని తెలిసింది.

భారీ బడ్జెట్ తో నిర్మాణమవుతున్న ఇంత పెద్ద సినిమా సాగర్ కి రావడానికి కారణం అదే ఐతే నిజంగానే సాగర్ లక్కీ. ఇది తన ప్రతిభకు లభించిన సదవకాశం అనే చెప్పాలి. ఈ సినిమాతో తాను మరో మెట్టు ఎక్కాలని మిత్రులందరి ఆశ. ఇప్పటికే ఒకటి కాదు, రెండు పాటలు మంచి ఆదరణ పొందడం తెలిసిందే.

అన్నట్టు. సాగర్ కె చంద్ర ఇద్దరినే కాదు, మూడో వ్యక్తిని కూడా సమర్థవంతంగా డీల్ చేసే పరిస్థితే ఉంది. ఆ మూడో వ్యక్తి తెలుగు ప్రేక్షకుల కోసం ఈ మలయాళ కథ, మాటలు, స్క్రీన్ ప్లేలో కీలకంగా వ్యవహరిస్తున్న త్రివిక్రమ్.

అంతేకాదు, నిజానికి ఈ సినిమాలో నిత్య మీనన్ కూడా నటిస్తోంది. ఆమె కూడా తనదైన అహం, వ్యక్తిత్వం ఉన్న మనిషి. ఇట్లా – తెరపై- తెర బయటా ఈ మొత్తం నలుగురిని డీల్ చేయగల అవకాశం రావడం తనకు సవాల్ అనే చెప్పాలి.

మరి, ఈ సినిమా భారాన్ని సునాయాసంగా మోసి, అందరి మెప్పు పొందుతాడని  ఆశిస్తూ, ఆల్ ది బెస్ట్ సాగర్.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article