Editorial

Wednesday, January 22, 2025
కథనాలుదసరా ప్రత్యేకం ~ శుభాల్ని చేకూర్చే విజయదశమి

దసరా ప్రత్యేకం ~ శుభాల్ని చేకూర్చే విజయదశమి

నవరాత్రుల తర్వాత విజయానికి ప్రతీకగా జరిపే పండుగ విజయదశమి. ఇది చాలా విశేషమైన రోజు. ఈ రోజు దుర్గామాతకు చాలా ప్రియమైంది కూడా. ‘దుర్గ’ అంటే దుర్గతులను నశింపజేసేది అని అర్థం.

వనిత విజయ్ కుమార్ ద్యాప   

ప్రపంచానికి మూలమైన పరమాత్మను తెలియజేసే శబ్ధం- ప్రణవం (ఓం కారం). దీనిలోని (అ, ఉ, మ) ఆద్యంతాక్షరాలే ‘అమ్మ’గా మారాయేమో! అ కారం పలుకగానే ఏర్పడే ‘నోరు మూసుకోవడం’ సృష్టిని తెలియజేస్తుంది. ‘మ’ కారం నోరు మూయమనే (ఓష్ఠ్యం) క్రియ ద్వారా సంపూర్తిని సూచిస్తుంది. ఈ రెంటి నడుమ ఉన్నదే స్థితి. అందుకే ‘అమ్మ’ సంపూర్ణ శబ్ధమైంది. ఓం కారమంత విలువైన మంత్రం ‘అమ్మ’.

అమ్మలం గన్నయమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ చాలం బె
ద్దమ్మ సురారులమ్మ కడుపాఱడి పుచ్చినయమ్మ దన్నులో
నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ దుర్గ మా
యమ్మ కృతాబ్ధియిచ్చుత మహత్త కవిత్వ పటుత్వ సంపదన్.

– అని ప్రార్థిస్తూ ఆ జగన్మాతను భక్తి శ్రద్ధలతో పూజించే పండుగే విజయదశమి. దుర్గాదేవి మహిషాసురుని సంహరించి లోకాన్ని రక్షించిన రోజు విజయదశమి.

పూజలు, పురస్కారాలు

దసరాని సంస్కృతంలో ‘దశహరా’ అని పిలుస్తారు. అంటే పది జన్మల పాపాలను నశింపచేస్తుందని అర్థం. అందుకే దేవీ ఉత్సవాలను దసరా ఉత్సవాలుగా దేశవ్యాప్తంగా ప్రజలు అత్యంత ఉత్సాహంతో జరుపుకుంటారు. చైత్ర మాసం మొదలుకొని భాద్రపద మాసాంతంలోని ఈ రుతువును వసంతుడని పుంలింగంలో వ్యవహరిస్తారు. అశ్వయుజం నుండి ఫాల్గుణ మాసాంతం వరకు ఆరు నెలల కాలం స్త్రీ రూపాత్మకమైంది. ఈ కాలంలో స్త్రీని అర్చించాలి. కనుక శ్రీ మహావిష్ణువు సోదరి నారాయణిని పూజిస్తారు. ఆమెయే దుర్గగా పిలువబడుతున్న పార్వతి. ప్రకృతి కూడా స్త్రీ రూపమే. ‘ప్ర’ అంటే సత్యగుణం. ‘కృ’ అంటే రజోగుణం, ‘తి’ అంటే తమోగుణం. ఇలా త్రిగుణాత్మకమైంది ప్రకృతి మాత.

దేవీ నవరాతృలలో శక్తి పూజ ప్రధానమైంది. ఈ తొమ్మిది రోజుల పూజలను సాత్వికం, రాజసం, తామసం అనే మూడు విధాలుగా ప్రాచీన హిందూ సంప్రదాయం విభజించింది.

దేవీ నవరాతృలలో శక్తి పూజ ప్రధానమైంది. ఈ తొమ్మిది రోజుల పూజలను సాత్వికం, రాజసం, తామసం అనే మూడు విధాలుగా ప్రాచీన హిందూ సంప్రదాయం విభజించింది. జ్ఞానమయమైన దేవిని మహాసరస్వతిగా ఆరాధించే విధానం మోక్షాన్ని ప్రసాదించే సాత్వికం. మహాకాళిని ఆరాధించడం లక్ష్యసిద్ధిని కలిగించే తామసం. మహాలక్ష్మి, దుర్గ, లలిత వంటి దేవతలను ఆరాధించడం రాజసం, దీని ప్రయోజనం కామ్యసిద్ధి. యోగులు, సాధకులు మోక్షసాధనకై సాత్విక పూజనే ఆచరిస్తారు. నవరాత్రుల తర్వాత విజయానికి ప్రతీకగా జరిపే పండుగ విజయదశమి. ఇది చాలా విశేషమైన రోజు. ఈ రోజు దుర్గామాతకు చాలా ప్రియమైంది కూడా. దుర్గ అంటే దుర్గతులను నశింపజేసేది అని అర్థం.

శరన్నవరాత్రులు

గాలి, నీరు. నిప్పు, నేల, నింగి- పంచ భూతాత్మకమైన ఈ ప్రకృతి మానవ సృష్టి కాదనీ, దీనికి హేతువు సర్వవ్యాపకమైన ఆ పరబ్రహ్మ తత్వమేననే సత్యం అందరికీ తెలిసిందే. ఈ సమస్త జగత్తును నడిపేది మానవాతీతమైన ఒక అద్భుత మహాశక్తి. ‘సర్వఖల్విద్వం బ్రహ్మ’ అని కూడా అంగీకరించక తప్పదు. ఆ మహాశక్తిని ఆదిపరాశక్తిగాను, జగజ్జననిగాను ఆరాధించే సంప్రదాయం విశ్వజనీనం. భారతీయ సంస్కృతి ఆర్ష సంప్రదాయంలో అశ్వయుజ మాసంలో హస్తా నక్షవూతంతో కూడిన శుద్ధపాడ్యమి నుండి నవమి వరకు తొమ్మిది రోజులు జగనాత్మను ఆదిపరాశక్తిని నవదుర్గులుగా లోకరక్షయిక శక్తులుగా ఒక్కొక్కరోజు ఒక్కొక్క రూపంలో ఆరాధిస్తాం. నిజానికి ఈ నవశక్తులు శివ స్వరూపాలే.

వర్షరుతువు తర్వాత వచ్చే శరధృతువులో ఈ మహోత్సవం వస్తుంది. కనుక దీనికి ‘శరన్నవరాత్రులు’ అని పేరు.

అందుకే వీరిని శివశక్తులు అని కూడా అంటాం. వర్షరుతువు తర్వాత వచ్చే శరధృతువులో ఈ మహోత్సవం వస్తుంది. కనుక దీనికి ‘శరన్నవరాత్రులు’ అని పేరు. అశ్వయుజ మాసపు శుక్లపక్షంలో పాడ్యమినాడు హస్తా నక్షత్రమున్నప్పుడు ఆ శుభదినాన శరన్నవరాత్రుల పూజ ప్రారంభించడం అత్యుత్తమ ఫలాన్నిస్తుందని మార్కండేయ పురాణం చెప్తోంది. తొమ్మిది రోజులలో మొదటి మూడు రోజులు సరస్వతి రూపాన్ని అరిషఢ్వర్గాలను జయించడానికి, సిరిసంపదలు పొందడానికి, విద్యాజ్ఞానం కోసం ఆరాధిస్తారు. ఆ జగన్మాత అశ్వయుజ శుద్ధ పాడ్యమి మొదలు నవమి వరకు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రాక్షసుని, ఒక్కొక్క రూపంలో వధించిన కారణంగా ఆ పరాశక్తి తొమ్మిది రూపాలలో పూజింపబడుతుంది. ఈ నవాంశ దేవీ పూజలు కుమారీపూజలుగా మొదట అగస్త్య మహర్షి భార్య లోపముద్ర చేసిందని పురాణాలు చెప్తున్నాయి. ఈ కుమారీ పూజలో రెండు సంవత్సరాల నుండి పది సంవత్సరాల వయసు గల బాలికలను ఒక్కొక్కరోజు ఒక్కొక్కరిని షోడశోపచార విధులతో పూజించడం అనుదానంగా వస్తున్న సంప్రదాయం.

రెండు సంవత్సరాలుగల కన్య ‘కుమారిక’ అని, మూడేళ్లు గలది ‘త్రిమూర్తి’ అని, నాలుగేండ్లు గలది ‘కల్యాణి’ అని, ఐదేండ్లు గలది ‘కాళిక’ అని, ఆరేండ్లు గలది ‘రోహిణి’ అని, ఏడేండ్లు గలది ‘చండిక’ అని, ఎనిమిదేండ్లు గలది ‘శాంభవి’ అని, తొమ్మిదేండ్లు గలది ‘దుర్గ’ అని, పదేండ్లు గలది ‘సుభద్ర’ అని పిలువబడుతోంది. కనుక, దేవిని ఈ నామాలతోనే విధిగా పూజించాలి.

దుర్గా పూజలు చేస్తే అహంకారం, దుర్గుణాలు, చెడు ఆలోచనలు, ఒకరికి కీడు తలపెట్టాలన్న ఆలోచన రాక నిర్మల మనస్సుగల వారవుతారు.

కుమారికను పూజించడం వల్ల దుఃఖ నాశనం, త్రిమూర్తి పూజవల్ల పుత్ర పౌత్రాభివృద్ధి, ధనధాన్య సమృద్ధి, కల్యాణిని అర్చించడం వల్ల ఇచ్ఛావృద్ధి, కాళికను పూజించడం వల్ల శతృనాశనం, రోహిణిని సేవించడం వల్ల రోగ నాశనం, చండికను అర్చించడం వల్ల ఐశ్వర్యవూపాప్తి, శాంభవి సేవా భాగ్యంతో శోక దారిద్య్ర నాశనం, దుర్గాదేవిని పూజించడంతో పరలోక సుఖం, సుభవూదను పూజించడం వల్ల వాంచితార్థ సిద్ధి కలుగుతాయని సాక్షాత్ వ్యాస మహాముని జనమేజయ మహారాజుకు తెలిపాడట. అమ్మవారి గుళ్ళల్లోనూ, కొంతమంది (దేవీ ఉపాసకులు) తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు చాలా నిష్టగా చేస్తారు. మరి కొందరు ఏడు రోజులు, అయిదు రోజులు చేస్తారు. ఇంట్లో మామూలుగా పూజలు చేసుకొనేవారు మూలా నక్షత్రం రోజు అంటే సరస్వతీ పూజ అయిన సప్తమి నాటి నుండి మూడు రోజులు చేస్తారు. దుర్గా పూజలు చేస్తే అహంకారం, దుర్గుణాలు, చెడు ఆలోచనలు, ఒకరికి కీడు తలపెట్టాలన్న ఆలోచన రాక నిర్మల మనస్సుగల వారవుతారు.

వేషాలకూ కారణం ఉంది!

ఈ శరత్కాలంలో రాత్రి పూట ఆకాశాన్ని జాగ్రత్తగా చూసినట్లయితే సింహరాశిపై కన్యారాశి స్పష్టంగా కనిపించి సింహ వాహనంపై ఆదిపరాశక్తి నిలిచి ఉన్నట్లు తన్మయ దృశ్యం కన్పిస్తుంది. ఈ ఖగోళ విన్యాసాన్ని సామాజిక పర్వంగా దేవ దేవీ సంబంధ ఉపాఖ్యానంగా సామాన్య ప్రజలకు అర్థమయ్యేటట్లు అనాటి ఆర్యరుషులు గ్రంథస్తం చేశారు. ఇదొక విశిష్ట, విలక్షణ సంప్రదాయం. ఇదే భారతీయ సంస్కృతిగా ప్రపంచ సంస్కృతుల మధ్య మణిమకుటమై ప్రపంచ మేధావుల గౌరవాన్ని పొందింది.

 ‘దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ’ అనే నీతి తప్పనిసరి అనే విషయాన్ని తెలిపేందుకు దేవతల వేషధారులు, రాక్షస వేషాలు ధరించిన వారిని, పులి వేషాలు ధరించిన వారిని సంహరించినట్లుగా చిన్నచిన్న ప్రదర్శనలుగా వీథులలో పగటి వేషగాళ్ళు ప్రదర్శిస్తూ ఉంటారు.

దశమి పండుగనాడు ఫ్యాక్టరీలలోని యంత్రాలను శుభ్రపరిచి పూజ చేస్తారు. ప్రతివారూ తమ వృత్తులకు సంబంధించిన పనిముట్లకు పూజలు చేస్తారు. వాహనదారులు తమ తమ వాహనాలను శుభ్రంగా కడిగి పూలదండలు వేసి అలంకరిస్తారు. విచిత్ర వేషధారులు శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, ఆంజనేయుడు, ఈశ్వరుడు, అమ్మవార్ల వంటివారి రూపాలతో పాటు రాక్షసులు, పులివేషాలు వేసుకొని డప్పుల మోతలకు అనుగుణంగా చిందులు వేస్తూ పౌరాణిక నాటకాలలోని పద్యాలు పాడుతూ ఇండ్ల వెంట, దుకాణాల వెంట తిరుగుతూ పురాణ విశేషాలను తెలియజేస్తూ ఉంటారు. ‘దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ’ అనే నీతి తప్పనిసరి అనే విషయాన్ని తెలిపేందుకు దేవతల వేషధారులు, రాక్షస వేషాలు ధరించిన వారిని, పులి వేషాలు ధరించిన వారిని సంహరించినట్లుగా చిన్నచిన్న ప్రదర్శనలుగా వీథులలో పగటి వేషగాళ్ళు ప్రదర్శిస్తూ ఉంటారు.

బొమ్మల కొలువు

ఇక దక్షిణ భారతంలో సంవత్సరం మొత్తంలో అతి పెద్ద పండుగ దసరా. తమిళనాడులో దుర్గ, లక్ష్మి, సరస్వతిలను తొమ్మిది రోజులు పూజిస్తారు. తమిళనాడు, ఆంధ్రవూపదేశ్‌లలో బొమ్మల కొలువు కూడా పెడతారు. మైసూరు దసరా ఉత్సవాలకు పెట్టింది పేరు. మైసూరు ప్యాలెస్‌ను అందంగా అలంకరిస్తారు. దసరానాడు రాజవంశీయుల నిర్వహణలో ఏనుగుల అంబారీలతో ఊరేగింపు కన్నులపండుగగా జరుగుతుంది. మన రాష్ట్రంలో కూడా దసరా చాలా పెద్దపండుగ. అన్ని పండుగలలో ఇది చాలా ముఖ్యమైంది. ఇల్లంతా శుభ్రం చేసుకొని కొత్త బట్టలు ధరించి పిండివంటలతో విందు చేసుకుంటారు. ఇక కూతుళ్లను, అల్లుళ్లను ఆహ్వానించి తగు మర్యాదలు చేసి, నూతన వస్త్రాలు ఇచ్చి ఆశీర్వదిస్తారు.

బొమ్మల కొలువుకు తొమ్మిది మెట్లు ఉంటాయి. ఈ తొమ్మిది మెట్లపై రకరకాల బొమ్మల్ని అమరుస్తారు. సాధారణంగా బొమ్మల కొలువు పెట్టడం మొదలు పెట్టాక సంవత్సరానికో మెట్టు చొప్పున తొమ్మిది మెట్ల వరకూ పెంచుతూ వెళ్తారు.

బొమ్మల కొలువుకు తొమ్మిది మెట్లు ఉంటాయి. ఈ తొమ్మిది మెట్లపై రకరకాల బొమ్మల్ని అమరుస్తారు. సాధారణంగా బొమ్మల కొలువు పెట్టడం మొదలు పెట్టాక సంవత్సరానికో మెట్టు చొప్పున తొమ్మిది మెట్ల వరకూ పెంచుతూ వెళ్తారు. అన్నిటికంటే పై మెట్టు మీద ఉంచే కలశం దేవి కరుణకు సూచనగా భావిస్తారు. ఆ తరువాత మెట్టుపై దేవుళ్ల బొమ్మలను ఉంచుతారు. ఈ బొమ్మలు సత్యగుణానికి ప్రతీకగా భావిస్తారు. కింద ఉన్న మెట్లపై ప్రాపంచిక జీవితానికి సంబంధించిన బొమ్మలు ఉంచుతారు. అవి తమ సుగుణాన్ని ప్రతిబింబిస్తాయంటారు. మధ్యభాగంలో క్షత్రియధర్మాన్ని తెలిపే రాజు, రాణి, యుద్ధవీరుల వంటి బొమ్మలుంచుతారు.

దాండియా

యువతీ యువకుల ఆనంద నృత్యకేళి దాండియా. రంగు రంగుల సంప్రదాయ వస్త్రాల్లో కన్నుల పండుగగా జరిగే ఆనంద నృత్యమిది. ఉల్లాసంగా, ఉత్సాహంగా కొనసాగే శోభాయమాన నృత్యం గర్భా. దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రతి రోజు దుర్గామాత మండపం వద్ద నిర్వహించే దాండియా, గర్భా నృత్యాలు సందర్శకులకు కనువిందు చేస్తాయి. ఉత్తర భారతీయ సంప్రదాయ నృత్యాలైన దాండియా, గర్భాలు నేడు దేశ, విదేశాల్లో పేరొందాయి. గుజరాతీ, రాజస్థానీ జానపద నృత్యాలుగా పేరు గాంచిన ఇవి ప్రతి ఏటా పండుగ వేడుకల్లో కనువిందు చేస్తాయి. ఉత్తర భారతీయులు అధికంగా నివసించే రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ప్రతి సంవత్సరం దసరా నవరాత్రి ఉత్సవాల్లో దుర్గామాత పూజ సందర్భంగా ఈ సంప్రదాయ నృత్యాలను కన్నుల పండువగా ప్రదర్శిస్తారు.

మహాలయ అమావాస్య నుండి 15 రోజుల పాటు అతి పవిత్రమైన దినాలుగా ‘దేవీ పక్షం’ పేరుతో కొన్ని వందల ఏళ్లుగా ఒకే కుటుంబీకులు నిర్వహిస్తూ ఉండటం విశేషం.

నేడు అమెరికాలో సైతం దాండియా, గర్భా నృత్యాలు ఎంతో పాపురాలిటీ సంపాదించాయి. అమెరికాలోని 20 యూనివర్సిటీలు ప్రతి యేటా రాస్ గర్భా దాండియా పోటీలు నిర్వహిస్తుండడం విశేషం. యూకెలో సైతం గర్భా నృత్యానికి విశేష ప్రాచుర్యం లభించింది. ఇంగ్లాండ్‌లోని చిస్‌విక్, నార్ట్‌హాల్డ్ ప్రాంతాల్లో గర్భా నృత్య ప్రదర్శనలను ప్రతి ఏటా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. వీటిని ఇంగ్లాండ్ వాసులు ఎంతో ఆసక్తిగా తిలకిస్తున్నారు. బెంగాల్ ప్రజలు ఈ దుర్గా పూజలు ఘనంగా నిర్వహిస్తారు. మహాలయ అమావాస్య నుండి 15 రోజుల పాటు అతి పవిత్రమైన దినాలుగా ‘దేవీ పక్షం’ పేరుతో కొన్ని వందల ఏళ్లుగా ఒకే కుటుంబీకులు నిర్వహిస్తూ ఉండటం విశేషం. దేవికి నేత్ర చిత్రణ జరిపే కార్యక్రమాన్ని ‘చక్షుదాన్’ అనే పేరుతో పిలుస్తారు. అశ్వీయుజ మాసంలో జిల్లేడు పూలతో శివుని పూజించే వారు మయూర ధ్వజంతో కూడిన విమానంలో శివపదానికి చేరుతారని నమ్మకం. నవరాత్రి పండుగ చెడుపైన మంచి గెలుపునకు చిహ్నం.

రామలీలా ఉత్సవం

ఇక చివరగా దుష్టశక్తులపై జగజ్జనని సాధించిన విజయానికి ప్రతీకగా విజయదశమిని లేదా దసరా పర్వాన్ని జరుపుకుంటాం. శ్రీరామచంవూదుడు రావణాసురుని వధించిన సందర్భం కూడా ఇదేనంటారు. అందుకే రామలీలా ఉత్సవం దేశంలో అనేక చోట్ల జరుపుకోవడం సంప్రదాయం.

చెడుపై మంచి విజయం సాధించిందనేందుకు సంకేతంగా, ఆనందంతో కేరింతలు కొడతారు.

పిల్లలు, పెద్దలు అందరూ ఉత్సాహంగా రావణుని బొమ్మ ఏర్పాటు చేసి దాన్ని దహనం చేస్తారు. చెడుపై మంచి విజయం సాధించిందనేందుకు సంకేతంగా, ఆనందంతో కేరింతలు కొడతారు.

దసరా రోజు ‘శమీ శమయితే పాపం శమీ శత్రు వినాశనం’ అన్న మంత్రంతో శమీ (జమ్మి) వృక్షాన్ని పూజిస్తారు. జమ్మి ఆకులను బంధువులకు, స్నేహితులకు ఇచ్చి సర్వమానవ సౌభ్రాతృత్వపు ఆలోచనలు మాలో సదా నెలకొనాలని చైతన్య ప్రతీక అయిన జగన్మాతను త్రికరణ శుద్ధిగా కోరుకుంటారు.

దసరా అంటే?

శ్రీరామచంవూదుడు విజయదశమి నాడు ఈ శమీపూజ చేసి లంకపై జైత్రయాత్ర ప్రారంభించడం వల్ల ఇది ‘విజయదశమి’ అయింది. నిజానికి దసరా అంటే ‘దస్+హరా’ అని అర్థం. సీతాపహరణం తర్వాత లోకకంటకుడైన రావణుని శ్రీరామచంద్రుడు యుద్ధంలో ఓడించి అతని పది తలలు నరికిన సందర్భంగా దసరా పండుగను విజయదశమిగా భారతదేశమంతటా జరుపుకుంటారు.

పాలపిట్ట

భక్తులు దసరా రోజున తొమ్మిది రంగుల పాలపిట్టను దర్శించడం ఆనవాయితీగా వస్తోంది. నవ అనుక్షిగహాలు కలగడానికి, దోషాలు తొలగిపోవడానికి ఇలా చేస్తారు.

‘విజయ’దశమి అనడం ఎందుకు?

విజయదశమి నాటి శ్రవణా నక్షత్రోదయ వేళ విజయం కనుక విజయదశమి నాడు ఆరంభించిన కార్యాలన్నీ సిద్ధిస్తాయనే నమ్మకం ప్రజలలో ఉంది. ఆ రోజే అనేక శుభకార్యాలు ప్రారంభించడానికి ఇదే కారణం.

దేవదానవులు క్షీరసాగరాన్ని మధించినప్పుడు అమృతం జనించిన శుభదినం కూడా విజయదశమి కావడం విశేషం.

దేవదానవులు క్షీరసాగరాన్ని మధించినప్పుడు అమృతం జనించిన శుభదినం కూడా విజయదశమి కావడం విశేషం. సర్వ మానవ సౌభ్రాతృత్వపు ఆలోచనలు మాలో సదా నెలకొనాలని చైతన్య ప్రతీక అయిన జగన్మాతను త్రికరణ శుద్ధిగా కోరుకుంటూ శమీవృక్షం ఆకులను సేకరించి ఇళ్ళకు తిరిగి వచ్చి పెద్దల పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం పొందుతారు. సమ వయస్కుల కిచ్చి ఒకరి కొకరు హత్తుకుంటారు. మహారాష్ట్రలో ఈ వృక్షాన్ని ‘ఆప్త’ అని అంటారు.

‘బంగారం’ అని ఎందుకు అంటం?

జమ్మిచెట్టు లేదా శమీవృక్షానికి సంస్కృతంలో శమీ, శివా, మాంగల్య, లక్ష్మీ, శుభదా, పవిత్ర, సురభి అనే పేర్లు వున్నాయి. శమీవృక్షం అగ్నికాంతికి ప్రతీక. ఏ పేరుతో పిలిచినా ఇవన్నీ శుభకరమైనవే. ఆయుర్వేద మందులలో శమీవృక్షం ఆకు, పువ్వులు, విత్తనాలు, చెట్టు బెరడు అన్నీ ఉపయోగిస్తారు. కొన్ని జమ్మి ఆకులు, కొంచెం చెట్టు బెరడు, రెండు మిరియాలు నూరి మాత్రలు చేసుకొని మజ్జిగతో వేసుకుంటే అతిసార వ్యాధి (నీళ్ళ విరేచనాలు) తగ్గుతాయి. జమ్మిపూలు నూరి కషాయం చేసుకొని నీళ్ళు, చక్కెర కలిపి స్త్రీలు తాగితే గర్భకోశానికి చెందిన రోగాలు నయమవుతాయి. జమ్మి ఆకులను మెత్తగా నూరి కురుపులపై, పుండ్లపై పెడితే అవి తగ్గిపోతాయి.

తోలులా ఎండిన జమీ పత్రాన్ని ‘సువర్ణంగా’ భావించి దసరా పండుగ నాడు పిల్లలు, పెద్దలు ‘బంగారం’ అంటూ ఒకరికి ఒకరు ఇచ్చుకుంటారు.

ఇలా వివిధరకాలుగా జమ్మిచెట్టు ఔషధంగానూ ఉపమోగపడుతుంది. అందుకే ఈ చెట్టుకు సురభి (బంగారం) అనే పేరు వచ్చింది. ఈ చెట్టులో ఔషధగుణాలు ఉన్నాయి. కనుకనే పూర్వీకులు విజయదశమి నాడు ఈ చెట్టును పూజించే వారేమో! అదే నేటికీ ఆచారంగా కొనసాగుతోంది. అందుకే తోలులా ఎండిన జమీ పత్రాన్ని ‘సువర్ణంగా’ భావించి దసరా పండుగ నాడు పిల్లలు, పెద్దలు ‘బంగారం’ అంటూ ఒకరికి ఒకరు ఇచ్చుకుంటారు. ఆ ఆకులను చాలా రోజులు దాచుకునేవారు కూడా ఉన్నారు.

ఆయుధ పూజ ఎందుకు?

విరాటరాజు కొలువులో అజ్ఞాతవాసం చేస్తున్నారు పాండవులు. ఆ కొలువులో చేరేముందు వారు తమ ఆయుధాలను వస్త్రంలో శవాకారంలో చుట్టి జమ్మిచెట్టుపై దాచారు. అవి ఎవరి కంటైనా పడితే చెట్టుమీద శవం ఉందని భ్రమపడతారని భావించారు. వారి అజ్ఞాతవాసం పూర్తికావచ్చింది. ఈలోగా ఉత్తరగోక్షిగహణ సమయం ఆసన్నమైంది. యుద్ధం చేయవలసిన పరిస్థితి ఏర్పడింది.

శత్రువులు నాశనమై విజయం చేకూరుతుందనే విశ్వాసంతో జమ్మిచెట్టును పూజిస్తున్నారు.

బృహన్నల రూపంలో వున్న అర్జునుడు విజయదశమి రోజున జమ్మిచెట్టుపై నుండి ఆయుధాలను తెచ్చి శత్రువులపై విజయం సాధించాడు. అప్పటి నుండి జమ్మిచెట్టును పవిత్ర వృక్షంగా భావించి విజయదశమి రోజు దానికి పూజ చేయడం తరతరాల నుంచి ఆచారంగా వస్తోంది.

శమీవృక్షాన్ని పూజించడం వల్ల పాపాలు పోతాయి. శత్రువులు నాశనమై విజయం చేకూరుతుందనే విశ్వాసంతో జమ్మిచెట్టును పూజిస్తున్నారు. విశ్వకర్మ ఆరాధనలో ఆయుధాలను, పనిముట్లను, యంత్రాలను, వాహనాలను పూజించే సంప్రదాయం కూడా దక్షిణపథాన కొనసాగుతోంది.

More articles

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article