Editorial

Monday, December 23, 2024
చారిత్రాత్మకంబలిప్రియా నమః - డా. ఆర్. కమల తెలుపు

బలిప్రియా నమః – డా. ఆర్. కమల తెలుపు

Photograph by SIDDARTHA

‘బోనం’ అంటే భోజనం. శక్తులు మహాకాళి, మహాలక్ష్మి, మహా సరస్వతిల రూపిణి అని లలితమ్మవారును పూజిస్తారు. అంతేకాక ‘రక్తవర్ణ మాంస నిష్టగూడాన్న ప్రీత మానన సమస్త భక్తి సుఖదా రూపిణి’ అని స్తోత్రం చేస్తారు.

డా.కమల

‘బలిప్రియా నమః’ అంటారు కనుకనే ప్రజలు ఆమెకు భక్తితో బెల్లపన్నం, కోడి, గొర్రె మేకను అలంకరించి మేళతాళాలతో బలిదానం చేస్తారు. కల్లుపోసి తృప్తి పరుస్తారు. వారికేమి ఇష్టమో అమ్మకు అవే ఇష్టమని భావిస్తారు. అంతేకాక మహాకాళి ‘పంచప్రేతాసనాసీనా పంచబ్రహ్మ స్వరూపిణీ పంచయజ్ఞప్రియా పంచప్రేత మంచాధాశాయినీ పంచమీ పంచభూతేశీ పంచ సంఖ్యోపచారిణీ’ అంటే పంచభూతాల్లో దేవి ఐదు రూపాలుగా విభజితమై పూజలందుకుంటోంది. ఆమెనే ఐదు రూపాలుగా మన వారు భావించి ఐదుగురు అక్కచెల్లెళ్లుగా ధ్యానించి బోనాల్లో పూజిస్తారు. మైసమ్మ, పోచమ్మ, ఎల్లమ్మ, మల్లమ్మ, ముత్యాలమ్మగా రూపొంది భక్తుల ధూపదీప నైవేద్యాలనందుకొని వారిని కాపాడుతున్నది.’

అన్ని దానముల కన్న అన్నదానము గొప్ప. కన్నవారికన్న ఘనులు లేరు’ అన్నట్లు ఆమెకు అన్నదానమంటే మహాప్రీతి,

‘అన్నదా వసుధా వృధా బ్రహ్మత్మైక స్వరూపిణీ
బృహతీ బ్రాహ్మణి బ్రాహ్మీ బ్రహ్మానంద బలిప్రియా’

అని స్తుతిస్తారు. కనుకనే కొత్త కుండ నిండా బోనం పోసి, పసుపు కుంకుమ అలంకరిస్తారు. మరో కుండను అలంకరించి నీళ్లు నింపి వేపకొమ్మలు వేసి పైన మట్టి మూకుట్లో దీపం పెట్టి శుచిగా, శ్రద్ధా భక్తులతో మేళతాళాలతో ఆనందంగా అమ్మ చెంతకు తీసుకొని వెళ్తారు.

‘శ్రద్ధయా పరయాకుర్యాత్పహస్రం పరివత్సరాన్
తత్పుణ్యం కోటి గుణితం భవేత్పుణ్యమనుత్తమమ్’

అన్నింటికన్నా ముఖ్యం ఏదో ఒక శక్తి మనల్ని కాపాడుతుందనే నమ్మకం. భక్తి, శ్రద్ధ చాలా ముఖ్యం.
ఆ ఏటి పూనగాన్ (రాగాన్) పుబ్బలో పుట్టి ముఖలో మాడిపోయే రకరకాల పురుగులు ఈ ఋతువులో భూమి నుండి పుడ్డాయి. అందుకే ఈ కాలాన్ని ‘ఈగ’ కాలం అంటారు పెద్దలు.

గాలి రోగాల నుంచి నివారణ

ఉసిళ్లు, గొంగడి పురుగులు, అప్పడాల గుర్రాలు, ఆరుద్ర పురుగులు ఈ కార్తెలో మాత్రమే కనిపిస్తాయి. పిల్లలకు, పెద్దలకు కళ్ల కలక, పసికలు, కక్కుడు, కారుడు, చలిజరాలు ఎక్కువగా వస్తాయి. మనుషులకే కాక కోళ్లకు, గొడ్లకు, బర్లకు, దుడ్డెలకు ‘గాలి’ రోగం పట్టుకుంటుంది. అవి ఎక్కడ పడితే అక్కడ సొమ్మసిల్లి సొంగకారుస్తూ పడి ఉంటాయి. పచ్చిగడ్డి మొలచి నవనవలాడుతున్నా తినవు. ఈగలు ముసురుతున్నా పట్టించుకోవు. లేగలను దగ్గరకు రానియ్యవు. ఈ జరాల బారిన పడిన పిల్లలైనా, పశువులైనా బతికి బయటపడటం అంత సులభం కాదు. ముఖానికి పోశమైనా, గత్తరైనా (విరోచనాలు) చల్లదాదులైనా, ఆటలమ్మ పోసినా ఏ వైద్యుడు ఏమీ చేయలేడు.

‘వేపాకులతో నెమ్మదిగా గోకి, పసుపునీళ్లు తాగిస్తే ఉపశమనమే తప్ప మందులు వాడితే తిప్పికొడుతుందని, ఎక్కువైతది రోగం.

‘వేపాకులతో నెమ్మదిగా గోకి, పసుపునీళ్లు తాగిస్తే ఉపశమనమే తప్ప మందులు వాడితే తిప్పికొడుతుందని, ఎక్కువైతది రోగం. ఏదో ఒక అద్భుత శక్తి మాత్రమే కాపాడగలదని’ ప్రజల ప్రగాఢ విశ్వాసం. అనారోగ్యాల బారిన పడకుండా కాపాడే భారం ఆ తల్లిదే కనుక ఆమెను మైసమ్మ, పోశమ్మ, ముత్యాలమ్మ, ఎల్లమ్మ పేర్లతో పూజిస్తారు.

పంటలు బాగా పండాలని, అమ్మవారి ఆకలి తీరిస్తేనే ఆమె మన ఆకలి తీరుస్తదని మేకలను, గొర్ర పొట్టేళ్లను, పసుపు పప్పు బియ్యం కలిపిన పులగాన్ని బోనం పోస్తరు.

ముందుగాల లష్కరు బోనాలు సికిందరాబాదులో మొదలైతయి. పూర్వం హిందూ ముస్లిం భేదం లేకుండా పాదుషాలు కూడా పాల్గొనేవారు. వీరి పండుగలను వారు, వారి వేడుకల్లో వీరు గౌరవించేవారు. దానికి నిదర్శనమే చార్మినారు గల్మల (కడపలో) ఉన్న కాళీమాతను హైదరాబాదు బోనాల్లో ఉత్సాహంగా ఊరేగిస్తారు. అదే తెలంగాణ ప్రత్యేకత.

భవిష్యవాణి

Photograph by Vidhyasagar Lakka

బోనాల పండుగ ముఖ్యంగా మూడు రోజులు జరుపుకుంటారు. రెండవ రోజు ‘రంగం’.
ఇంతటి ఆధునిక కాలంలో కూడా అమ్మ చూపే అద్భుతం ఈ రంగం.

పచ్చి కుండ (అంటే కాల్చని కుండ) – మీద ఎక్కి పూనకం వచ్చిన స్త్రీ. భవిష్యత్తెలా ఉంటుందో చెప్పే కార్యక్రమం రంగం, జనులంతా ఆసక్తిగా ఆ మనిషి చెప్పేది విని ముందు జాగ్రత్తగా తెలుసుకుంటారు.

వర్షాలెలా పడ్తాయి, పాడి పంటలెలా ఉంటాయి. దేశంలో ప్రజల జీవన విధానమెలా ఉంటది? మొదలైన విషయాలను ఆమె పిల్లలు పుణే, బాలారిష్టాలు లేకుండా బావుంటే తొట్టి కడ్డానని మొక్కుకున్నవారు 5 అంతరాల, 7 అంతరాల తొట్టెను వెదురు కర్రలతో రంగు కాగితాలతో తయారు చేసి అమ్మకు సమర్పించుకుంటారు.

రంగం చెప్పే మనిషి అనేక విషయాలు తెలిపి అలసి కూర్చున్నాక ఆమెకు మంగళహారతులిచ్చి శాంతింపజేసి దండాలు పెట్టుకుంటారు. అతివృష్టి, అనావృష్టి నుండి కాపాడమని మొక్కుకుంటారు. 8వ రోజు ఊరి బయట చెట్లకు ఉయ్యాలలు కట్టి తోటల్లో వండుకొని ఇంటిల్లిపాది కలిసి భోజనాలు చేసి ఉత్సాహంగా ఆ రోజంతా గడుపుతారు.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article