గోరింటాకు పాట : ప్రసన్నా విజయ్ కుమార్
ఆషాడం పాట ఇది.
ఉపాధ్యాయురాలు శ్రీమతి ప్రసన్నా విజయ్ కుమార్ తెలుపు కోసం పాడి పంపించిన గోరింటాకు పాట ఇది. రచన విజయలక్ష్మీ జోషి.
చిట్టి చేతుల్లో పూచే గోరింట
చిన్నారి చేతుల్లో మందారాలంట
చెట్టాపట్టాలేసి చెట్టూ చేమా తిరిగి
లీలా…బాలా… నీలా…సుశీలా…
శ్రీ గౌరి చేతుల్లో పూచినా గోరింట… శ్రీలక్ష్మి చేతుల్లో మెరిసే గోరింట…నవ వధువు చేతిలో విరిసిన గోరింట…సిమంతపు శుభవేళ అలరిన గోరింట…పెద్ద ముత్తయిదువు చేతులు గోరింట…దేవతలే మనకిచ్చిన ఎర్రని గోరింట…
వినండి. వినిపించండి