వెంగళ నాగరాజు కవి, గాయకుడు. రాజన్న సిరిసిల్ల జిల్లా మల్కపెట్ నివాసి. తాను కొన్ని వందల పాటలు రాశాడు. మరికొన్ని వందల జానపద గీతాలనూ సేకరించాడు. తాను పాడిన ఈ పక్షి పాట తెలుపుకి ప్రత్యేకం. అన్నట్టు, ఈ పాట విన్నాక అయినా ముందు అయినా దీని నేపథ్యం తప్పక చదవండి.
ఈ కవి దాదాపు పదిహేడేళ్ళ క్రితం బతుకు దెరువు కోసం దుబాయ్ పోయి పనిచేస్తున్నప్పుడు, అక్కడ అప్పుడే నిర్మాణమవుతున్న ‘బుర్జు ఖాలిఫా’ని ప్రతి రోజూ చూసేవాడు.
ప్రపంచంలో అత్యంత పొడవైన మానవ నిర్మాణం ఇది. అన్ని రకాల వస్తు సామాగ్రినీ వాడి దాన్ని అపురూపంగా నిర్మించారు. ఆకాశ హర్మ్యం అది. దాదాపు అరమైలు దూరం ఎత్తు దాకా ఉంటుంది. కట్టడం శైలి, భవన నిర్మాణ విభాగానికి సంభందించి దీన్ని ‘నియో ఫ్యూచరిజం’ అని పిలుస్తారట.
ఇక విషయానికి వస్తే, దీని నిర్మాణంకోసం ప్రపంచంలోని అత్యంత నిపుణులైన ఇంజినీర్లు రేయింబవళ్ళు పని చేసేవారట. రోజు రోజుకూ ఆవిష్కారం అవుతున్న ఆ అద్భుతాన్ని చూసి, ప్రతి ఒక్కరూ విస్మయానికి గురవుతుంటే ఈ కవికి తన గ్రామంలో బాయి కాడ గూడు పెట్టుకునే బండారి పక్షి గుర్తొచ్చింది. ఆ చిన్న పక్షి అమిత శ్రద్ధతో గూడు పెట్టుకునే విధానం, దాని నైపుణ్యం, శ్రమ, బాధ్యతా -అవన్నీ కళ్ళముందు రూపు గట్టంగ ఇక నాగరాజు శరవేగంగా బుర్జు ఖలీఫా నిర్మాణం కన్నా ముందుగా కవి గట్టిండు. ఈ పాటను పూర్తి చేసిండు.
తెలుపు టివి కోసం అద్భుతమైన ఆ పాటను, దాని వెనకాలి నేపథ్యాన్ని పంచుకున్న నాగరాజుకు కృతజ్ఞతలు. మరి, ఆ పాటను మీరు అవలోకించండి.
Wah …wah!! Awesome
రచన శైలి చాల బాగుంది.
భాండారి గాడా ,భాండారి గాడా.. బురుజు ఖాలిఫాను మించిన వాడా..