“కనవయ్య కనవయ్యా ఈశ్వరా … మనిషి గతి చూడయ్య ఈశ్వరా”…అంటూ పెన్నా సౌమ్య ఆర్ద్రంగా ఆలపించిన ఈ పాట- మనిషి గతి, స్థితి సుఖమయం అయ్యేలా చూడమంటూ ఎంతో తాత్వికంగా సాగుతుంది. ఆయురారోగ్యాలు, ఆనందం ఒసగమని ఆ గురువరుడికి హృదయ పూర్వక నివేదనగా సాగుతుంది.
ఒక ప్రార్థనగా, జీవుడి వేదనగా మనల్ని హత్తుకునే ఈ పాటను రాసింది నరేద్దుల రాజారెడ్డి. వారు వృత్తి రీత్యా వ్యవసాయదారులు. ప్రవృత్తి ఎలక్ట్రీషియన్. పలు కవితలు, బాల గేయాలే కాక టెలి ఫిల్మ్స్ కి, కొన్ని చిత్రాలకు కూడా పాటలు రాశారు.
ఇక, గాయని పెన్నా సౌమ్య, గృహిణి. హైదరాబాద్ నివాసులు. వారికి గానం ఇష్టమైన అభిరుచి. స్వరం వరంగా భావించే తాను తెలుపు టివి కోసం ఇలాంటి చక్కటి పాటలు పాడి పంపిస్తున్నారు. గాయనికి, రచయితకు ధన్యవాదాలు తెలుపు.