Editorial

Monday, December 23, 2024
Songచక్కదనాల చిన్నది...చామంతి ఓలె ఉన్నది ...

చక్కదనాల చిన్నది…చామంతి ఓలె ఉన్నది …

 

చక్కదనాల చిన్నది

ప్రసన్నా విజయ్ కుమార్ ఆలపించిన ఈ చక్కదనపు పాట వినసొంపైన లలిత గీతం. గొప్ప అనుభూతి. అనుభవానికి మీరు లోనవడం ఖాయం.

ఈ పాట రచన శ్రీమతి లక్ష్మీరావు గారు. వారు గృహిణి. హైదరాబాద్ లోని బీరంగూడ నివాసులు. అరవైకి పైగా భక్తి గీతాలు, పాతిక వరకు లలిత గీతాలు రాశారు.

ఇక ప్రసన్న గారు గురించి మరి రెండు మాటలు. పువ్వు పుట్టగానే పరిమళించినట్టు వారు బాల్యం నుంచే పాటలు పాడుతూ పలువురి ప్రశంసలు పొందారు. శ్రీ దొరవేటి చెన్నయ్య గారి వద్ద గానంలోనే కాదు, నృత్యంలోనూ శిక్షణ పొందడంతో ఆమె ప్రతిభ మరింత వన్నె తేలడం విశేషం.

వికారాబాద్ జిల్లా మన్నెగూడలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న ఈ గాయని స్వస్థలం అదే జిల్లా ముజాహిద్ పూర్. తెలుపు టివి కోసం మనల్ని తన పాటల తోటలో విహరింప జేయడం ఖాయం.

More articles

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article