Editorial

Monday, December 23, 2024
Songసంక్రాంతి ప్రత్యేకం : పెన్నా సౌమ్య గొబ్బిపాట

సంక్రాంతి ప్రత్యేకం : పెన్నా సౌమ్య గొబ్బిపాట

సంక్రాంతి సందర్భంగా ఈ గొబ్బిపాట మన జ్ఞాపకాల్లో సదా స్మరణకు వచ్చే గ్రామీణ జీవన మూల్యాంకనం.

“అలనాటి అక్కల్లారా… చంద్రగిరి భామల్లారా” అంటూ సాగే ఈ పాటలో మొక్కలు, పూలు, కాయలు, పండ్లు -వాటి చక్కదనపు పరిమళాలు పంచు. వింటూ ఉంటే అది అనేక జ్ఞాపకాలు తట్టు.

ఒక దృశ్యం వెంట ఇంకో దృశ్యం పరిచినట్లు సత్యవాణి గారు  రచించిన ఈ గీతం గాయని పెన్నా సౌమ్య గళంలో వినండి.

దుక్కులు దుక్కులు దున్నేరటా
ఏమి దుక్కులు దున్నేరటా
రాజావారి తోటలోను
జామి దుక్కులు దున్నేరటా
అలనాటి అక్కల్లార
చంద్రగిరి భామల్లార
భామలుగూడి గొబ్బిళ్ళూ
గొబ్బియళ్ళో గొబ్బియళ్ళూ

విత్తులు విత్తులు నాటేరటా
ఏమీ విత్తులు నాటేరటా
రాజావారి తోటలోను జామ విత్తులు నాటేరటా
అలనాటి అక్కల్లార
చంద్రగిరి భామల్లార
భామలు గూడి గొబ్బిళ్ళూ
గొబ్బియళ్ళో గొబ్బియళ్ళూ

మొక్కలు మొక్కలు మొలిచాయట
రాజావారి తోటలోన జామి మొక్కలు మొలిచేయటా
అలనాటి అక్కల్లార
చంద్రగిరి భామల్లార
భామలుగూడి గొబ్బిళ్ళూ
గొబ్బియళ్ళో గొబ్బీయళ్ళూ

పూవులు పూవులు పూసాయటా
ఏమిపువ్వులు పూశాయటా
రాజావారి తోటలోన
జామిపువ్వులు పుశాయటా
అలనాటి అక్కల్లార
చంద్రగిరి భామల్లార
భామలుగూడి గొబ్బిళ్ళుా
గొబ్బియళ్ళో గేబ్బియళ్ళూ

కాయలు కాయలు కాశాయటా
ఏమికాయలు కాశాయటా
రాజావారి తోటలోనా
జామీకాయలు కాశాయటా
అలనాటి అక్కల్లారా
చంద్రగిరి భామల్లార
భామలుగూడిగొబ్బియళ్ళో
గొబ్బియళ్ళూ

పండ్లూ పండ్లూ పండేయటా
ఏమి పండ్లూ పండాయటా
రాజావారి తోటలోనా
జిమిపండ్లూ పండేయటా
అలనాటి అక్కల్లారా
చంద్రగిరి భామల్లార
భామలుగూడి గొబ్బిళ్ళూ
గొబ్బియళ్ళో గొబ్బియళ్ళూ

పండ్లు పండ్లూ పంచారటా
ఏమిపండ్లూ పంచారటా
రాజావారి తోటలోనా
జామీ పండ్లూ పంచారటా
అలనాటి అక్కల్లార
చంద్రగిరి భామల్లార
భామగిరి గొబ్బిళ్ళూ
గొబ్బియళ్ళో గొబ్బీయళ్ళూ
గొబ్బియళ్ళో గొబ్బియళ్ళు
గొబ్బియళ్ళో గొబ్బియళ్ళూ

యూ ట్యూబ్ లో ఇతర తెలుపు పాటలు వినేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి

 

 

 

 

 

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article