కవయిత్రి, బతుకమ్మ పాటల పరిశోధకురాలు శ్రీమతి బండారు సుజాతా శేఖర్ ది పరిచయం అక్కరలేని గళం. తన తల్లి దగ్గర నేర్చుకున్న అనేక పాటల్లో మానవ పరిణామ క్రమాన్ని దశావతారాల రూపంలో పిల్లలకు చెప్పే ఈ పాటని ‘తెలుపు’ కోసం వారు ప్రత్యేకంగా పాడి పంపించారు.
‘లాలియో లాలి యానవే’ అంటూ సాగే ఈ పాట – స్తీల పాట, తల్లుల పాట. వినండి. రోజంతా అది ఆలాపనగా మెమ్మల్ని వెంటాడుతుందో లేదో మీరే చూడండి.
మత్స, కూర్మ, వరాహ, నరసింహ, వామన, పరుశ, రామ, కృష్ణ, బుద్ధ రూపాలతో పాటు కలియుగ వెంకటేశ్వర స్వామీ రూపాలను సంభాషణ రూపంలో చెప్పుకుంటూ లయబద్దంగా సాగే ఈ పాట అలంకరణ పట్ల పిల్లలకు ఉన్న కోరికలను సైతం అలవోకగా వ్యక్తం చేస్తుండటం విశేషం.