రాజకీయ వ్యూహకర్తగా పీకే సక్సెస్ గ్రాఫ్ విషయంలో ఎవరికీ సందేహాలు లేవు. కాంగ్రెస్ పార్టీలో చేరాలన్న ఆసక్తిని ప్రదర్శిస్తున్నప్పటి నుంచీ ఆ పార్టీలో భిన్నాభిప్రాయాలు, ఊహాగానాలు,చర్చలు, కొందరి విముఖత, కొందరి సుముఖుత చూపడం వంటి పరిణామాలు కొనసాగాయి. చివరాఖరికి ఆయన ‘భగ్న రాజకీయ నాయకుని’గా మిగిలిపోవలసే వచ్చింది.
ఎస్.కె.జకీర్
రాజకీయాల్లో ‘షార్ట్ కట్ ‘లు ఉండవు. రాజకీయాలు నడపాలంటే, అందులో సక్సెస్ సాధించాలంటే ఎంతో ఓర్పు, నేర్పు, క్రమశిక్షణ ఉండాలి. రాజీ పడాలి. నాయకులకు దండాలు పెట్టుకోవాలి. ప్రాంతీయ పార్టీల సంగతి ఎట్లా ఉన్నా జాతీయపార్టీలలో పరిస్థితి ఇంకా భిన్నంగా ఉంటుంది. ఎన్నో నిచ్చెనలు. మరెన్నో దొంతరలు. వాటిని ఆకళింపు చేసుకోవాలి.
అదలా ఉంటే, ‘పార్ట్ టైమ్’ రాజకీయం చేయడాన్ని ప్రజలు హర్షించరు. మనం జనసేన పవన్ కళ్యాణ్ ను చూస్తున్నాం. పార్ట్ టైమ్ రాజకీయాలు నడిపినంత వరకు ఆయనది ఫెయిల్యూర్ స్టోరీ మాత్రమే. ప్రస్తుత పరిస్థితుల్లో పార్ట్ టైం వ్యవహారం అసలు ఆమోదయోగ్యం కూడా కాదు.
రాజకీయాలతో సంబంధం లేని వాళ్ళు ఆకస్మికంగా పదవులు చేబట్టాలనుకుంటే వీలు కానిది. ఈ ఉపోద్ఘాతమంతా ప్రశాంత్ కిశోర్ గురించి.
ఆయన ఆకాశానికి నిచ్చెన వేయాలనుకున్నారు. అతిగా ఆశపడ్డారు. కాంగ్రెస్ పార్టీలో ఎందుకు చేరాలనుకున్నారో ఎవరికీ అర్ధం కాని విషయం. చివరకు ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆఫర్ ను ఎందుకు తిరస్కరించారో ఇంకా అర్ధం కాని సంగతి. ”నా వినయపూర్వకమైన అభిప్రాయం ఏంటంటే నిర్మాణపరమైన సమస్యల్లో కూరుకుపోయిన కాంగ్రెస్ పార్టీకి నా అవసరం కంటే నాయకత్వం, సమష్టి సంకల్పం అవసరం” అని ప్రశాంత్ కిషోర్ మంగళవారం ట్వీట్ చేశారు.
కాంగ్రెస్ పార్టీలో ఆయన ఒక కార్యకర్త లాగా, నాయకునిలాగా చేరాలని అనుకోకపోవడం వల్ల సమస్య ముదిరింది.
రాజకీయ వ్యూహకర్తగా పీకే సక్సెస్ గ్రాఫ్ విషయంలో ఎవరికీ సందేహాలు లేవు. అయితే ఆయన ‘భగ్న రాజకీయ నాయకుని’గా మిగిలిపోయారు. కాంగ్రెస్ పార్టీలో చేరాలన్న ఆసక్తిని ప్రదర్శిస్తున్నప్పటి నుంచీ ఆ పార్టీలో భిన్నాభిప్రాయాలు, ఊహాగానాలు,చర్చలు, కొందరి విముఖత, కొందరి సుముఖుత చూపడం వంటి పరిణామాలు కొనసాగాయి. కాంగ్రెస్ పార్టీలో ఆయన ఒక కార్యకర్త లాగా, నాయకునిలాగా చేరాలని అనుకోకపోవడం వల్ల సమస్య ముదిరింది. పీకేకు రాజకీయ ఆకాంక్షలు అధికం. తనను తాను ఎక్కువగా అంచనా వేసుకుంటారని, అతి విశ్వాసంతో ఉంటారని విమర్శలు వస్తూనే ఉన్నవి. కాంగ్రెస్ పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇప్పటివరకు లేదు. అలాంటి పదవిని సృష్టించాలని పీకే సూచించారు. బహుశా తన కోసమే ఆ పదవిని సృష్టించాలని పట్టుబట్టి ఉండవచ్చునన్న ప్రచారమూ ఉన్నది. గతంలో ఒకసారి కాంగ్రెస్ అధిష్టానంతో పీకే చర్చలు విఫలమయ్యాయి.ఇది రెండో దశ.
పీకేను చేర్చుకునే వ్యవహారంలో పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ కొంత మొగ్గు చూపినా, రాహుల్ గాంధీ వ్యతిరేకంగా ఉన్నట్టు ఆ పార్టీ వర్గాల్లో ప్రచారం ఉన్నది. పీకే ఆశించిన పదవులు ఇవ్వడానికి కాంగ్రెస్ హైకమాండ్ సుముఖంగా లేనందున పీకే తన దుకాణం మూసేశారు. 2024 లోక్ సభ ఎన్నికల కోసం నియమించనున్న ‘సాధికారిక కమిటీ’లో చేరాలని ఇచ్చిన ఆహ్వానాన్ని ఆయన తిరస్కరించారు. అయన వర్కింగ్ కమిటీ సభ్యత్వమో లేదా వర్కింగ్ ప్రెసిడెంట్ పదవో ఆశించి భంగపడ్డారు. ఆయన గుంపులో గోవిందయ్యలా ఉండాలని కోరుకోవడం లేదు. తనకంటూ ప్రత్యేక గుర్తింపు, ప్రాధాన్యం కావాలని కోరుకున్నారు. ఆయన కోరికలు నెరవేరే అవకాశం లేనందున సోనియాగాంధీ ఆఫర్ ను తిరస్కరించారు.
అసలు ‘ఐ ప్యాక్’ ను మూసేస్తే, లేదా దాని కార్యకలాపాలు మూసేస్తే ఆయన ఏమి చేయాలి? కాంగ్రెస్ పార్టీకి చేయదలచుకున్న ‘భారీ మరమ్మతుల’కు యంత్రాంగం ఎక్కడి నుంచి తీసుకురావాలి?
కొంతకాలం ఆయన బీహార్ జేడీ (యూ) ఉపాధ్యక్షునిగా పనిచేశారు. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తో పొసగక బయటకు వచ్చేశారు. తన సొంత రాష్ట్రంలోనే ఒక రాజకీయపార్టీలో ఇమడలేనప్పుడు దేశవ్యాప్త రాజకీయాల్లో ఎట్లా కొనసాగాలనుకున్నారో, ఎట్లా ఎదగాలనుకున్నారో తెలియదు.
పీ.కే.కు ఒక సిద్ధాంతం లేదు. ఒక భావజాలం లేదు.’ఐ ప్యాక్’ పేరిట కన్సల్టెన్సీని నడిపిస్తూ వేల కోట్లు ఆర్జించారన్న ప్రచారం ఢిల్లీ రాజకీయవర్గాల్లో ఉన్నది. ఇలాంటి వ్యాపారాలన్నింటినీ తక్షణం మానివేయాలని, అప్పుడే తమ పార్టీలో పూర్తికాలపు నాయకునిగా చేర్చుకుంటామని కాంగ్రెస్ పార్టీ షరతు విధించడంతో పీకేకు మింగుడు పడలేదు. అసలు ‘ఐ ప్యాక్’ ను మూసేస్తే, లేదా దాని కార్యకలాపాలు మూసేస్తే ఆయన ఏమి చేయాలి? కాంగ్రెస్ పార్టీకి చేయదలచుకున్న ‘భారీ మరమ్మతుల’కు యంత్రాంగం ఎక్కడి నుంచి తీసుకురావాలి?
పీకే ఎపిసోడ్ లో ‘తెలంగాణ కనెక్షన్’!!
మొత్తానికి వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీలో చేరతారన్న ప్రచారానికి తెరపడింది. ‘తెలంగాణ కనెక్షన్’ కూడా ఈ వ్యవహారంలో ఇమిడి ఉండడం ప్రధానాంశం.”మీడియా కథనాల్లో వాస్తవం లేదు. పీకే.కాంగ్రెస్ పార్టీలో చేరరు” అని టిఆర్ఎస్ ముఖ్య నాయకుడొకరు ఆదివారమే ఒకరిద్దరితో చెప్పారని తెలియవచ్చింది. కాంగ్రెస్ లో పీకే చేరబోరన్న సంగతి ముందస్తుగానే టిఆర్ఎస్ నాయకులకు ఎట్లా తెలిసింది?
అయితే కేసీఆర్, పీకేల మధ్య రెండు రోజులపాటు జరిగిన ఎడతెగని మంతనాల గురించి ఇంకా చర్చ సాగుతూనే ఉన్నది. కేసీఆర్ చెప్పింది పీకే విన్నారా? పీకే చెప్పింది కేసీఆర్ విన్నారా అన్నది సస్పెన్సు.
మొత్తమ్మీద పీకే వ్యవహారం తెలంగాణలో కాక రేపడాన్ని చూసాం. కేసీఆర్ తో డీల్ తెగతెంపులు చేసుకోవడానికే వచ్చాడని ప్రచారం జరిగిన 48 గంటల్లో ఆయన కాంగ్రెస్ పార్టీతో తెగతెంపులు చేసుకోవడం ఆశ్చర్యాన్ని కలిగించిన ఘటన. అదే సమయంలో ‘ఐ ప్యాక్’ తో తమ ఒప్పందం కొనసాగడం లేదంటూ ఆంధ్రప్రదేశ్ లో అధికారపార్టీ వైసీపీ స్పష్టం చేయడం విశేషం. ప్రస్తుతం ఈ వాదనలన్నింటికీ తెరపడింది.
అయితే కేసీఆర్, పీకేల మధ్య రెండు రోజులపాటు జరిగిన ఎడతెగని మంతనాల గురించి ఇంకా చర్చ సాగుతూనే ఉన్నది. వాళ్లిద్దరూ ఏమి మాట్లాడుకొని ఉండవచ్చు, ఏయే అంశాలపై చర్చలు జరిపారన్న సంగతి మిస్టరీగా ఉన్నది. కేసీఆర్ చెప్పింది పీకే విన్నారా? పీకే చెప్పింది కేసీఆర్ విన్నారా అన్నది సస్పెన్సు. కేసీఆర్ కాంగ్రెస్ నాయకుల వలె డూ డూ బసవన్న కాదు.అనేక యుద్ధాల్లో గెలిచిన అనుభవం ఆయన సొంతం.రాజకీయ పాండిత్యం,పరిణతిలో ఆయనను మించిన వారు లేరు. కనుక కేసీఆర్ పాఠాలే పీకే విని ఉండవచ్చు. గోదావరి మధ్యలో పడవ మునిగి, నీళ్ళల్లో పడిపోయి చిన్న గడ్డిపోచ దొరికినా దాన్ని పట్టుకొని అవతలి ఒడ్డుకు చేరే అత్యంత దయనీయ పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉన్నందున ఆ పార్టీ హేమాహేమీలంతా ‘పీకే’ పాఠాలను శ్రద్ధగా విన్నారు.
దళితబంధు అమలు, ఉద్యోగాల భర్తీ వంటి కీలకమైన కొన్ని అంశాల్లో ‘వ్యతిరేకత ‘ఉందన్న సంగతి కేసీఆర్ కు తెలుసు. కానీ పీ.కే.లాంటి వ్యూహకర్తలను కూడా వినియోగించుకుంటే అదనపు ప్రయోజనం లభించవచ్చునని ముఖ్యమంత్రి అభిప్రాయపడుతూ ఉన్నట్టు తెలుస్తోంది.
కేసీఆర్ ఆ పరిస్థితిలో లేరు. తన బలం,బలహీనతలు కేసీఆర్ కు బాగా తెలుసు. తెలంగాణ భౌగోళిక పరిస్థితులు,ప్రజల ఆకాంక్షలు, గడచిన ఎనిమిదేండ్లలో తమ ప్రభుత్వం చేసిందేమిటో, చేయనిదేమిటో, ప్రజల్లో ఉన్న వ్యతిరేకతకు గల కారణాలేమిటో కేసీఆర్ కాచి వడబోశారు. అయితే దళితబంధు అమలు, ఉద్యోగాల భర్తీ వంటి కీలకమైన కొన్ని అంశాల్లో ‘వ్యతిరేకత ‘ఉందన్న సంగతి కేసీఆర్ కు తెలుసు. కానీ పీ.కే.లాంటి వ్యూహకర్తలను కూడా వినియోగించుకుంటే అదనపు ప్రయోజనం లభించవచ్చునని ముఖ్యమంత్రి అభిప్రాయపడుతూ ఉన్నట్టు తెలుస్తోంది. కాగా, టిఆర్‌ఎస్ ప్రభుత్వ వైఖరిపట్ల పలు నియోజకవర్గాల్లో అసంతృప్తి ఎక్కువగా ఉన్నట్టు కేసిఆర్‌తో పీకే చెప్పినట్లు ఒక సమాచారం బయటకు పొక్కింది. అయితే ఈ ‘సన్నివేశానికి’ తగిన ఆధారాలేమీ లేవు.
సీనియర్ పాత్రికేయులు ఎస్.కె.జకీర్ BUNKER NEWS ఎడిటర్