Editorial

Wednesday, January 22, 2025
Opinionతెలంగాణ ఏర్పాటుపై మోడీ విద్వేషం : ఆ వ్యాఖ్యలేమిటి? - ఎస్ కె జకీర్ అడుగు

తెలంగాణ ఏర్పాటుపై మోడీ విద్వేషం : ఆ వ్యాఖ్యలేమిటి? – ఎస్ కె జకీర్ అడుగు

https://www.facebook.com/sk.zakeer.37/videos/283587133871629/

ఆంధ్రప్రదేశ్ పునర్విభజన అంశంలో రెండు రాష్ట్రాలు నష్టపోవడం సంగతి అన్న అంశం పక్కన పెడితే కాంగ్రెస్ హయంలో ఏర్పాటైన తెలంగాణా రాష్ట్రం పట్ల ప్రస్తుత బిజెపి ప్రధాని మోడీ పలుసార్లు బాహాటంగా అసహనాన్ని వ్యక్తం చేయడం తీవ్రంగా ఆక్షేపించాలి. అది ఖండనీయం.

ఎస్ కె జకీర్ 

భారత ప్రధాని మోడీ తెలంగాణా ప్రజల్ని మరోసారి కించపరిచారు. రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదం తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా మోడీ ప్రసంగిస్తూ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన అంశంలో రెండు రాష్ట్రాలు నష్టపోయాయని అంటూ అందుకు కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా విమర్శించ్చారు. అయితే, ఆ విమర్శల వెనుకాల వారి వ్యాఖ్యల్లో తెలంగాణ పట్ల తీవ్ర విద్వేషం ప్రస్పుటంగా ఉందని, అందుకు రాష్ట్ర బిజెపి నేతలు తప్పక సమాధానం ఇవ్వవలసిందే అని తెలంగాణకు చెందిన సీనియర్ పాత్రికేయులు జకీర్ సూటిగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం విశేషం.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తల్లిని చంపి బిడ్డను బతికించినట్లు ఉందని ప్రధాని రెండో సారి వ్యాఖ్యానించడాన్ని అయన నొక్కి చెబుతూ తాజాగా పెప్పర్ స్ప్రే ఉదంతాన్ని కూడా పేర్కొనడం, ఈ వ్యాఖ్యలు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి సంభంచించిన వ్యవహరంగా కాకుండా అది యావత్ తెలంగాణా సమాజాన్ని కించ పరచడంగా చూడాలని అయన అభిప్రాయ పడటం, ఈ వివక్షా పూరిత వ్యాఖ్యలు సరైనవి కావని హెచ్చరించడం గమనార్హం.

 

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article