తెలుగు సమాజానికి వీక్షణం వంటి ఆలోచనాస్ఫోరక పత్రిక చాలా అవసరమని, ప్రస్తుత సంక్షోభ స్థితిలో ఆ అవసరం మరింత పెరుగుతున్నదని, పత్రికను ఎట్టి పరిస్థితిలోనూ ఆపగూడదని భావిస్తూ అందరికీ తెలుపు వినమ్ర విజ్ఞప్తి.
సమాజంలో ఒక అత్యవసరమైన ఈ ప్రయత్నానికి మీ వంతు చేయూత ఇవ్వండి. పాఠకులలో ప్రతి ఒక్కరూ మరొకరికి వీక్షణం పత్రికను పరిచయం చేయండి. మీరు ఇవ్వగలిగిన విరాళం ఎంతైనా సరే, వీక్షణం మనుగడకు ఉపయోగపడుతుందని గమనించగలరని మనవి.
ఎన్ వేణుగోపాల్
మిత్రులారా…తాజా వీక్షణం సంచిక ఎనిమిది పేజీలు చిక్కిపోయిందని గుర్తించి ఉంటారు. ఖర్చు తగ్గింపులో ఒక భాగం ఇది. క్షీణిస్తున్న ఆర్థిక పరిస్థితితో, నానాటికీ పెరిగిపోతున్న అప్పులతో, నిర్వహణా సమస్యలతో వీక్షణంను కొనసాగించాలంటే ఖర్చు తగ్గింపు కార్యక్రమం ఉధృతంగా అమలు జరపక తప్పడం లేదు. ఐదారు నెలలుగా సిబ్బంది తగ్గింపు, సిబ్బంది జీతాల తగ్గింపు, కార్యాలయ ఖర్చుల తగ్గింపులతో పాటుగా ఇప్పుడు పేజీలను కూడ తగ్గించక తప్పలేదు. ప్రభుత్వ ప్రకటనలు ఆగిపోవడం, కరోనా వల్ల న్యూస్ స్టాల్స్ లో పత్రికల అమ్మకాలు తగ్గిపోవడం, సభలు జరగకపోవడంతో పుస్తకాల అమ్మకాలు లేకపోవడం, అయిపోయిన చందాల పునరుద్ధరణ, కొత్త చందాల చేర్పు లేకపోవడం వంటి అనేక కారణాల వల్ల వీక్షణం ఆదాయం నానాటికీ తగ్గిపోతున్నది. నెలకు యాబై వేల రూపాయల లోటుతో, అప్పులతో వీక్షణం అనుభవిస్తున్న ప్రమాదకరమైన ఆర్థిక స్థితి గురించి ఎప్పటికప్పుడు పాఠకులతో పంచుకుంటూనే ఉన్నాం. ఈ స్థితిలో పత్రికను ఎంతకాలం కొనసాగించగలమో తెలియడం లేదు. మరొకవైపు తెలుగు సమాజానికి ఇటువంటి ఆలోచనాస్ఫోరక పత్రిక చాల అవసరమని, ప్రస్తుత సంక్షోభ స్థితిలో ఆ అవసరం మరింత పెరుగుతున్నదని, పత్రికను ఎట్టి పరిస్థితిలోనూ ఆపగూడదని పాఠకులు, మిత్రులు, అభిమానులు కోరుతున్నారు.
ప్రతి చందాదారూ మరొక చందా చేర్పించండి. మీరు ఇవ్వగలిగిన విరాళం ఎంతైనా సరే, వీక్షణం మనుగడకు అది ఉపయోగపడుతుందని గ్రహించండి.
పందొమ్మిదిన్నర సంవత్సరాలలో, 245 సంచికలలో, నాలుగున్నర వేల వ్యాసాలతో వీక్షణం ప్రాంతీయ, దేశీయ, అంతర్జాతీయ పరిణామాలెన్నిటినో విశ్లేషించి పాఠకుల అవగాహనలు పెరగడానికి తోడ్పడింది. ఆ మహత్తర కృషి ఆగిపోగూడదని మిత్రులు కోరుతున్నారు.
పత్రిక నిర్వహణ వ్యయం తగ్గించుకోవడంలో భాగంగా ఈ నెల నుంచి ఎనిమిది పేజీలు తగ్గుతున్నాయి. ఇరుగు-పొరుగు, ఈనేల శీర్షికలు ఇక నుంచి ఉండవు. కనీసం రెండు వ్యాసాలు తక్కువ వస్తాయి. ఇది దృష్టిలో పెట్టుకుని రచయితలు కూడ వీలైనంత క్లుప్తత పాటించాలనీ, వ్యాసం నిడివి మూడు పేజీలకు మించగూడదని కోరుతున్నాం.
ఈ గడ్డు కాలాన్ని అధిగమించడానికి అవసరమైన ఆదాయ వనరుల కోసం మరొకసారి మీదగ్గరికి రాక తప్పడం లేదు. పాఠకులలో ప్రతి ఒక్కరూ మరొకరికి పత్రికను పరిచయం చేయండి. ప్రతి చందాదారూ మరొక చందా చేర్పించండి. మీరు ఇవ్వగలిగిన విరాళం ఎంతైనా సరే, వీక్షణం మనుగడకు అది ఉపయోగపడుతుంది. తెలుగు సమాజంలో ఒక అత్యవసరమైన ఈ ప్రయత్నానికి మీ వంతు చేయూత ఇవ్వండి. మీ వీలును బట్టి, మీ శక్తిని బట్టి మీ విరాళం ఎంత స్వల్పమైనా, ఎంత భూరి విరాళమైనా సరే. వీక్షణం మనుగడకు మీ చేయూతనివ్వండి. వీక్షణం చిరకాలం జీవించేందుకు తోడ్పడండి.
‘Save Veekshanam’ | ‘వీక్షణం’కు చేయూతనివ్వండి!
విరాళాలు పంపడానికి వివరాలు
చెక్/డిడి ద్వారా…
వీక్షణం, జి1, మైత్రీ రెసిడెన్సీ, 3-6-394, స్ట్రీట్ నం. 3, హిమాయత్ నగర్, హైదరాబాద్ 500029
ఎలక్ట్రానిక్ ట్రాన్స్ ఫర్ ద్వారా…
Veekshanam, Account No. 013911011002175, Union Bank of India, agan Mahal Brach, Hyderabad. IFSC Code: UBIN0801399
గూగుల్ పే, పేటిఎం, ఫోన్ పేల ద్వారా 9848577028 కు పంపవచ్చు
ఎన్. వేణుగోపాల్ కవి, రచయితా విమర్శకులు. వీక్షణం సంపాదకులు.