Editorial

Monday, December 23, 2024
సినిమాపా రంజిత్ సమరశీల పారంపరిక విన్యాసం : సార్పట్ట

పా రంజిత్ సమరశీల పారంపరిక విన్యాసం : సార్పట్ట

OTT ఫ్లాట్ ఫాం అమెజాన్ ప్రైమ్ లో నిన్న విడుదలైన సార్పట్ట ఒక సినిమా కాదు. భద్రలోకం ఆస్వాదించే వినోదామూ కాదు, వారు ఆకాంక్షించే వికాసమూ కాదు. అది జీవన సమరంలో ఉన్నవారి చెమటా నెత్తురు, పిడిగుద్దు.

సార్పట్ట. అదొక ఒక సంక్షుభిత నవల. విధ్వంస ఇతిహాసం. విషాద కావ్యం. అది అంటరాని వసంతం వంటి విప్లవ రచన. చూడటానికి ఒకరిని ఎదుర్కొన్న చరిత్ర ఉండాలి.

కందుకూరి రమేష్ బాబు

ఒకానొక కాలంలో నిస్సహాయ పరిస్థితులతో జీవితం చేసిన యుద్దానికి తలవంచిన ఆత్మగౌరవ దృశ్య రూపకం. పా రంజిత్ దాని దర్శకుడు. బాక్సింగ్ వీరుడు మహమ్మద్ అలికి నీరాజనం చెప్పిన భారతీయ అట్టడుగు కులాల నుంచి జనించిన ఒకానొక ముకుళిత నివాళి. ఆత్మగౌరవంతో పిడికిలి ముడిచి విసిరిన సుధ్రుడ పంచ్.

ఇది సినిమానే కాదు. మనిషి మరో మనిషితో చేసే అనివార్య ద్వంద యుద్ధపు నియమావళి. నీతి. పరువు, ప్రతిష్ట, ఓటమి విజయాల సమ్మిలిత గాథ. మధ్యలో బాధ. ఓర్చుకోలేనంతటి బాధ. యుద్ధం తమదా కదా అన్నది కాదు ప్రశ్న. యుద్ధం అన్నది తమని ఆక్రమించుకుని జీవితంలో సహజ భాగం కావడం అందలి గాథ. ఒకరి కోసం ఒకరు అందులో పాత్రలై గెలవడం ఒక వ్యధ. తప్పనిసరిగా లేచి నిలబడి నలుగురికోసం ఒక్కడుగా ప్రత్యర్థిని ఎదుర్కునే కథ. నిజానికి ఎవరూ ఉన్నా లేకున్నా ఒక్కడిగా ఎదుర్కోవలసిన వాస్తవికత తెలుపడం అసలు కథ ఉద్దేశ్యం. ఇది సినిమా కాదు. బ్రతుకు చీకట్లో దూరిన తెల్లవాడి కథ. ఎరుపెక్కిన నల్లవాడి కన్నుల ఆత్మకథ. పోరాటమే బ్రతుకుగా ఎంచుకోవాల్సిన నిర్భాగ్యుల గాథ. తల్లడిల్లే సున్నిత హృదయుల కమనీయ గాథ. ప్రేమానురాగాల మధురిమ.

ఒక అమ్మ కథ. ఒక బిడ్డ కథ. భర్తను కోల్పోఐన తల్లి గాథ. భర్తను యుద్దానికి సన్నద్ధం చేయక తప్పని భార్య కథ. తమ మానాన తాము జీవించలేని అసంఖ్యాక ప్రజానీకపు దీన గాథ. యుద్ధంలోనే స్వాంతన పొందాల్సిన పరాజితుల వీరోచిత గాథ.

సినిమా పొడవునా ఆవిష్కారమయ్యే దళిత జీవితంలోని వేదన, అణచివేత. అదే సమయంలో తమంతట తాము సన్నద్దమై చేసే పోరాటం. ఇదంతా సినిమా కాదు, నిత్య జీవన ద్వంద యుద్దానికి ప్రతీక.

సినిమా పొడవునా ఆవిష్కారమయ్యే దళిత జీవితంలోని వేదన, అణచివేత. అదే సమయంలో తమంతట తాము సన్నద్దమై చేసే పోరాటం. ఇదంతా సినిమా కాదు, నిత్య జీవన ద్వంద యుద్దానికి ప్రతీక.

ఒక పరంపరగా ఓడిపోతూ లేచి నిలబడుతూ అట్టడుగు కులాలు తమను తాము నిలుపుకోవడానికి సర్వ శక్తులూ ఒడ్డి బ్రతకాల్సిన దురవస్థకు నిదర్శనం ఈ చిత్రం.

ఏడుపు, వేదన, రోదన, కేక. పొలికేకలన్నీ కలిసిన పిడిగుద్దుల బాక్సింగ్ గాథ ఈ సినిమా. ప్రేమలూ ప్రణయాలూ యుద్దంలో విరామాల మధ్య మాత్రమే కానవచ్చే విషాద జీవన్నాటకం ఈ సినిమా.

మానవుడు తనని తాను చావ బాదుకునే రణ గాథ ఇది. ప్రాణపదమైన ఆత్మగౌరవమే మిన్నగా బతకడానికి చేసిన అసాధారణ ద్వంద యుద్ధమే ఈ చిత్రం. ఒక సృజనాత్మక మేధావిగా పా రంజిత్ సృష్టించిన అసాధారణమైన కల్పనాత్మక కల్లోలమే ఈ చిత్రం.

నిస్సహాయ స్థితి. అనివార్య పరిస్థితి. చీమూ నెత్తురూ ఆత్మా దేహాలతో నిరంతరం గాయపడుతూ పోరాడుతున్న సమూహాలకు దర్పణంగా అత్యంత శక్తివంతమైన ఉదాహరణగా ఒక ప్రతీకాత్మకమైన వేదనగా మలిచిన ఈ సినిమా వినోదం కాదు, వికాసం కాదు, ఫక్తు పరంపర. బతకడానికి పెనుగులాడే అదోజగత్ సహోదరుల మూలవాసం – సార్పట్ట.

ఇది ఒక ప్రత్యేక కాలానికి, ఒక నిర్దిష్ట సమూహానికి చిత్రక పడుతూ నిర్మించినదే అయినా అది అట్టడుగు జీవితాలను నిరంతరం కుదిపే ఘర్షణని, అందులోంచి క్రమంగా నిర్మాణమవుతున్న పోరాట శీలతను అంత్యంత విశ్వసనీయంగా అవిష్కరించిన విశాల ప్రజరాశుల సినిమా ఇది.

దళిత జీవితాలు చెమటా కన్నీరుతో నిర్వహించిన పాత్రోచిత నాటకానికి సన్నిహిత దృశ్య రూపం సార్పట్ట. ఇందులో ఎంత అందమైన తల్లి ఉంటుందో. ఎంత చక్కటి భార్య ఉంటుందో. దృడమైన కొడుకు సినిమా ఇది. ఆశక్తుడైనప్పుడు ఆ తల్లి గర్భంలోకే వెళ్ళాలన్న కొడుకు దుఖం ఈ సినిమా. తిరిగి తిరిగి మళ్ళీ యోధుడు కదలడం, శక్తిల్ని స్వాధీనం చేసుకొని పరంపరను నిలబెట్టడం ఈ సినిమాలో మరో అంకం. అదీ సినిమా.

ఈ సినిమాలో అద్భుతమైన పాత్ర Dancing Rose. ఆ ఒక్క పాత్ర – అతడి నడక, నడత, నృత్యం, వేగం, వొడుపు – చెప్పనలవి కాని సంవిధానం – ఆ బాక్సర్ పాత్ర మనల్ని వెంటాడుతుంది.

తల్లి, తండ్రి, ఆలి, గురువు, స్నేహితులు, కుల బంధువులు, ఊరూ వాడా, గ్రామం, పట్టణం, తమ జాతికి స్ఫూర్తి దాతలైన వారి పటాలు, విగ్రహాలు, అంతా మూర్తిమత్వం వహించి మూడు గంటల్లో తరతరాల వేదనని మనలో రగిల్చి ఇలా కదా జీవితాలు అస్తవ్యస్తం అవుతున్నాయని, ఇలానే కదా సత్తువ తెచ్చుకొని ఒకరొకరు లేచి నిలబడుతూ యుద్దానికి తలపడుతూ జీవితాలను అర్పించుకుంటున్నారని కన్నీళ్ళ పర్యతం అయ్యేలా చేసే సినిమా ఇది. ఆవేశానికి లోను చేసి కర్తవ్యాన్ని నిర్దేశించే సినిమా ఇది.

ఈ కథ కేవలం ఒక నాయకా నాయకుల గాథ కాదు, నాయకులు, ప్రతి నాయకులు అంతా ఇంటివారే అని చాటుతూ నిరంతరం మనసు శరీరం ఆత్మా అన్నిటిని సన్నద్ధం చేసుకుని పోరాడే స్థితిని, మన వ్యవస్థని నిజాన్ని అత్యంత వాస్తవికంగా అడుగడుగునా కరుణ రసాత్మకంగా సమరశీలంగా ఆవిష్కరించిన మహత్తర సినిమా సార్పట్ట.

ఒక్క మాటలో చరిత్ర నుంచి చరిత్రను మలుపు తిప్పడానికి ఒక అసాధారణ దర్శకుడు చేసిన అనివార్య ద్వంద యుద్ధం ఈ సినిమా. పా రంజిత్ కు అభివాదాలు.

ఈ సినిమాలో అద్భుతమైన పాత్ర Dancing Rose. ఆ ఒక్క పాత్ర – అతడి నడక, నడత, నృత్యం, వేగం, వొడుపు – చెప్పనలవి కాని సంవిధానం – ఆ బాక్సర్ పాత్ర మనల్ని వెంటాడుతుంది. అతడితో పోరాడి గెలవాల్సిన నాయకుడి అనివార్యత, అంతా కూడా కలవర పరుస్తుంది. సినిమాను బాక్సింగ్ నేపథ్యంలో చెప్పడానికి, జీవితం యుద్ధం అని గుర్తు చేయడానికి, నక్కజిత్తుల మాయని ఎదుర్కోక తప్పని విధానాన్ని అలవోకగా ఆవిష్కరించదానికి కారణం దర్శకుడు చూపెట్టదల్చుకున్న యుద్ధం. దాని బోలుతనం.

ఒక్క మాటలో చరిత్ర నుంచి చరిత్రను మలుపు తిప్పడానికి ఒక అసాధారణ దర్శకుడు చేసిన అనివార్య ద్వంద యుద్ధం ఈ సినిమా. పా రంజిత్ కు అభివాదాలు.

కథ, వివరాలు చెప్పడం కంటే కేవల స్పిరిట్ ని పంచడం ఎందుకూ అంటే మీరూ ఆ కథని, పాత్రలను ఈ రాత్రే కలుసుకుంటారని.

 

More articles

2 COMMENTS

  1. I am surprised Ramesh with the praise and perspectives shared in the column are quiet irrelevant and the movie will never allow to identify with any you referred.

    A promisingly appearing movie with story depicting canvas on roots of boxing in south India, as its background, in the era of Emergency is highly appreciative. After that, the story never takes off and entirely gets derailed and goes rouge, only to falter as a low commercial movie.

    Other than Pasupathy as Coach, every one were poorly etched and are wasted in the narrative. I am still surprised by your review.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article